PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 21 SEP 2020 6:28PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • కోవిడ్ నయమైనవారి సంఖ్యరీత్యా భారత్‌లో జాతీయ సగటు గణనీయంగా పెరిగి 80 శాతానికి చేరిక.
  • వరుసగా మూడోరోజు 90,000 మందికిపైగా కోలుకోగా, 24 గంటల్లో 93,356 మంది డిశ్చార్జి.
  • ప్రపంచంలో కోవిడ్ నయమైనవారితో పోలిస్తే భారత్‌లో కోలుకున్నవారి సగటు 19 శాతంగా నమోదు.
  • దేశవ్యాప్తంగా 24 గంటల్లో 86,961 కొత్త కేసులు నమోదు; నిర్ధారిత కేసులలో 76 శాతం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోనివే.
  • టాటా గ్రూప్, సీఎస్ఐఆర్-ఐజీఐబీలు రూపొందించిన దేశంలోనే తొలి ‘సీఆర్ఐఎస్పీఆర్’ కోవిడ్-19 పరీక్ష విధానం అమలుకు ఆమోదం
  • పీఎంజీకేవై కింద ఇప్పటిదాకా పీఎంయూవై లబ్ధిదారులకు 13.57కోట్ల ఉచిత వంటగ్యాస్ సరఫరా.

దేశంలో వరుసగా 3వ రోజు 90,000 మందికిపైగా కోలుకోగా- 43 లక్షలకు చేరువగా వ్యాధి నయమైనవారి సంఖ్య; ప్రపంచంలోనే అత్యధికంగా 80 శాతం మైలురాయి దాటిన కోలుకునేవారి జాతీయ సగటు

భారతదేశం 80 శాతం కోలుకునేవారి జాతీయ సగటుతో మరో ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది. కోలుకునేవారి సంఖ్య నిరంతరం పెరుగుతుండటంతో వరుసగా 3వ రోజు కూడా 90,000 మందికన్నా ఎక్కువగా నమోదయ్యారు. దీంతో గత 24 గంటల్లో 93,356 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. కాగా, 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కోలుకునేవారి సగటు జాతీయస్థాయిని మించి నమోదైంది. ఇక తాజాగా కోలుకున్న కేసులలో 79 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోనివే కావడం గమనార్హం. మొత్తంమీద ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య  నేడు 44 లక్షలకు (43,96,399) చేరువలో ఉంది. అంతర్జాతీయ స్థాయిలో కోలుకుంటున్నవారి సగటు రీత్యా భారత్‌ 19 శాతంతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657191

నిర్ధారిత కేసులలో 76 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత  ప్రాంతాల్లోనే నమోదు

దేశంలో గత 24 గంటల్లో మొత్తం 86,961 కొత్త కేసులు నమోదవగా వీటిలో 76 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే కావడం గమనార్హం. వీటిలో ఒక్క మహారాష్ట్రలోనే 20,000కుపైనా నమోదవగా, దాదాపు 8వేలకుపైగా కేసులతో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానంలో ఉంది. ఇక గత 24 గంటల్లో 1,130 మరణాలు సంభవించగా వీటిలో 86 శాతం 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనివే. మృతులలో 455 మంది మహారాష్ట్ర కోవిడ్‌ రోగులు కాగా- కర్ణాటకలో 101 మంది, ఉత్తర ప్రదేశ్‌ వాసులు 94 మంది ఉన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657294

బీహార్‌లో రూ.14,000 కోట్లతో 9 ప్రధాన రహదారి పథకాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బీహార్‌లో తొమ్మిది ప్రధాన రహదారి పథకాలకు శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ అనుసంధానం కల్పించే ‘ప్రతి గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్’ వేసే పనులను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- బీహార్‌లో మౌలిక వసతుల అభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాల వేగవంతం దిశగా ఇవాళ ఒక ముఖ్యమైన రోజని పేర్కన్నారు. కాగా, ఇవాళ్టి కార్యక్రమంలో భాగంగా ఆయన శ్రీకారం చుట్టిన పథకాలన్నీ రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలను కలిపేవి కావడం గమనార్హం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657251

బీహార్‌లో మౌలిక వసతుల పథకాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657261

కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఉచిత వంటగ్యాస్‌ సరఫరా

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో భాగంగా 01.04.2020 నుంచి మూడు నెలలపాటు పీఎంయూవై లబ్ధిదారులకు వంటగ్యాస్‌ ఉచిత సరఫరా పథకం అమలు చేయబడింది. ఈ నేపథ్యంలో సిలిండర్లు తీసుకోవడం కోసం ముందస్తుగా సొమ్ము చెల్లించి 2020 జూన్ 30నాటికి పొందలేకపోయినవారి కోసం ఈ పథకాన్ని 2020 సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. తదనుగుణంగా 16.09.2020 నాటికి లబ్ధిదారులకు 13.57 కోట్ల సిలిండర్లు సరఫరా అయ్యాయి. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం-సహజవాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ ఒక ప్రశ్నకు రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657443   

‘పిఎం స్వనిధి పథకానికి రూ.600 కోట్లు; హామీరహిత ఉచిత నిర్వహణ మూలధనంగా రూ.10,000దాకా రుణసదుపాయం

కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ 2020 జూన్ 1న “ప్రధానమంత్రి వీధివర్తక స్వయం సమృద్ధి పథకం” (పీఎం-స్వనిధి) ప్రారంభించింది. దీనికింద దేశంలోని 50 లక్షల మంది వీధివర్తకులకు ఏడాదిపాటు అమలులో ఉండేవిధంగా రూ.10,000దాకా నిర్వహణ మూలధనం కింద హామీరహిత రుణసౌలభ్యం కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.600 కోట్లు కేటాయించింది. ఈ మేరకు గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఇవాళ రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657259

వ్యవసాయ బిల్లులకు ఆమోదంతో రైతులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

పార్లమెంటులో వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ద్వారా సందేశమిస్తూ- భారత వ్యవసాయ రంగంలో ఇదొక చారిత్రక మలుపని ఆయన పేర్కొన్నారు. “భారత వ్యవసాయ చరిత్రలో ఇదొక చరిత్మాత్మక మలుపు! పార్లమెంటులో కీలక బిల్లులకు ఆమోదం లభించడంపై శ్రమజీవులైన దేశంలోని రైతులందరికీ అభినందనలు. దీంతో వ్యవసాయ రంగంలో పరివర్తనాత్మక మార్పు తేవడంసహా కోటిమంది రైతులను శక్తిమంతం చేస్తుంది. పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లులు దశాబ్దాలుగా దేశంలోని కర్షకులు అనుభవిస్తున్న కష్టాల నుంచి వారిని విముక్తం చేస్తాయి” అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657149

కోవిడ్‌-19 ప్రత్యేక ఆస్పత్రులలో ఇతర వ్యాధులకు చికిత్స సదుపాయాలు

దేశంలో కోవిడ్‌-19 కేసుల సముచిత నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు వివిధ రాష్ట్రాల్లో మూడు స్థాయిలలో ప్రత్యేక ఆస్పత్రులు, వైద్యశాలల సదుపాయాలు, ఆరోగ్య రక్షణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటిలో చికిత్స పొందే రోగుల నుంచి వ్యాధి వ్యాప్తి నిరోధం లక్ష్యంగా ఇతరత్రా వ్యాధులకు చికిత్సల కోసం ఈ ఆస్పత్రులలో చేరేవారి కోసం ఈ పడకలను కేటాయించరాదని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. ఈ మేరకు ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే నిన్న రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657156

కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో వైద్య వ్యర్థాల నిర్వహణ

ప్రస్తుత కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ   (సీపీసీబీ) సూచన ప్రకారం- ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సాధారణ ప్రజలు ధరించే వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ)సహా జీవ వ్యర్థాల నిర్మూలన ఒక సవాలుగా మారింది. అయితే, వీటి నిర్మూలనకు సంబంధించి సీపీసీబీ ప్రత్యేక మార్గదర్శకాలను కూడా జారీచేసింది. అంతేకాకుండా వ్యర్థాల నిర్వహణను పర్యవేక్షించేందుకు “COVID19BWM” పేరిట ఒక అనువర్తనాన్ని కూడా రూపొందించింది. ఈ మేరకు ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే నిన్న రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657157

బాలల రోగనిరోధక టీకా కార్యక్రమాలపై కోవిడ్‌-19 ప్రభావం

దేశంలో కోవిడ్‌-19 మహమ్మారి పరిస్థితుల నడుమ ముఖ్యంగా బాలలకు సంబంధించి  2020 ఏప్రిల్‌ నెలలో రోగనిరోధకత పెంపు సేవల వినియోగం మందగించింది. అయితే, ప్రభుత్వం వరుస చర్యలు తీసుకోవడంతోపాటు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు తగు మార్గదర్శకాలు కూడా జారీచేసింది. తదనుగుణంగా అనేక చర్యలు చేపట్టడంతో ఏప్రిల్‌-జూన్‌ నెలల మధ్యన గ్రామీణ ప్రాంతాల్లో 37,49,939 మంది బాలలు పూర్తి రోగనిరోధక శక్తిని పొందగలిగారు. కాగా, నిరుడు ఇదే కాలంలో 46,75,437 మందికి ఈ సేవలు అందాయి. ఈ మేరకు ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే నిన్న రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656131

గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సేవలపై కోవిడ్‌-19 ప్రభావం

దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ‘కోవిడ్‌-19 అత్యవసర ప్రతిస్పందన-ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత ప్యాకేజీ’ కింద కేంద్ర ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించింది. అంతేకాకుండా ఆ నిధులను సందర్భం-ప్రాధాన్యతల ప్రాతిపదికన వాడుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఆ మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10.09.2020 నాటికి రూ.4256.81 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే నిన్న రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656296

ప్రపంచ మహమ్మారి సంబంధిత మానసిక కేసులలో పెరుగుదల

కోవిడ్‌-19 పరిస్థితులలో ప్రజలకు మానసిక-సామాజిక మద్దతునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మానసిక అస్వస్థతకు గురైనవారిని వివిధ లక్ష్య సమూహాలుగా విభజించి సంబంధిత ఆరోగ్య నిపుణులతో సేవలందించింది. బెంగళూరులోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్’ (నిమ్హాన్స్) ద్వారా మార్గదర్శకాలు కూడా జారీచేయించింది. ఈ మేరకు ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి శ్రీ అశ్వనీకుమార్‌ చౌబే నిన్న రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657151

సండే సంవాద్‌-2లో భాగంగా సామాజిక మాధ్యమ వినియోగదారులతో ముచ్చటించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిన్న ‘సండే సంవాద్‌-2’ వేదిక నిర్వహణలో భాగంగా సామాజిక మాధ్యమాల వినియోగదారుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. దేశంలో ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితులకు మాత్రమేగాక దీనికి సంబంధించి  ప్రభుత్వ విధానం, శాస్త్ర-సాంకేతిక రంగంలో భారత్‌ ప్రగతి తదితర అంశాలపైనా ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656944

కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో కోవిడ్‌-19 కేసులు

కోవిడ్‌-19 బారినపడిన కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది కోసం ప్రభుత్వం కోవిడ్‌ ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు, ఆస్పత్రులను ఏర్పాటు చేయడంతోపాటు వారికి తగువిధంగా మద్దతునిచ్చింది. అంతేకాకుండా వ్యాధిబారిన పడి మరణించిన సిబ్బందికి సాధారణ ప్రయోజనాలతోపాటు వారి వారసులకు ‘భారత వీరుల’ నిధినుంచి రూ.15 లక్షల వంతున ఆర్థిక సహాయం కూడా అందించింది. ఈ మేరకు దేశీయాంగశాఖ సహాయమంత్రి శ్రీ నిత్యానందరాయ్‌ నిన్న లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657078

భారతీయ వైద్య వ్యవస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ చర్యలు

ప్రపంచమంతటా భారతీయ వైద్య వ్యవస్థలుసహా ఆయుర్వేద వైద్యవిద్యను ప్రోత్సహించే దిశగా విదేశీ విశ్వవిద్యాలయాలు/సంస్థలలో ‘ఆయుష్ విద్యాపీఠాల’ ఏర్పాటు కోసం కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ మొత్తం 13 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. తదనుగుణంగా ఆయా ప్రముఖ విశ్వవిద్యాయాలు/సంస్థలలో బోధనతోపాటు శిక్షణ/పరిశోధన కార్యకలాపాలు చేపట్టేందుకు ఆయుష్‌ వైద్య వ్యవస్థల్లో నిపుణులను మంత్రిత్వశాఖ పంపుతుంది. ఈ మేరకు ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ శ్రీ హర్షవర్ధన్‌ నిన్న లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656379

కోవిడ్‌-19 చికిత్సకు ఆయుర్వేద ఔషధాలు, విధివిధానాలు

‘సార్స్‌ సీవోవీ-2 (SARS CoV-2) సంక్రమణ, కోవిడ్‌-19 వ్యాధికి సంబంధించి సవరించిన ‘అదనపు మ్యూరల్ రీసెర్చ్ (EMR) పథకం కింద ఆయుర్వేద వైద్యవిధానాలపై మొత్తం 247 ప్రతిపాదనలు అందాయి. కాగా, సంబంధిత అధికార స్థానం నుంచి వీటిపై అందిన సిఫారసుల మేరకు 21 పరిశోధన ప్రతిపాదనల కోసం నిధుల మంజూరుకు ఆమోదం లభించిన నేపథ్యంలో సదరు అధ్యయనాలన్నీ వివిధ నిర్వహణ దశల్లో ఉన్నాయి. ఈ మేరకు ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ శ్రీ హర్షవర్ధన్‌ నిన్న లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656577

వ్యవసాయ రంగంపై మహమ్మారి ప్రభావం

దేశంలో దిగ్బంధం కొనసాగుతున్న సమయంలోనూ వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా సాగిపోయాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సకాలంలో తగిన చర్యలు చేపట్టడంద్వారా రైతాంగానికి అండగా నిలిచి, పంటల సాగుకు అంతరాయం లేకుండా చేసింది. ఆ మేరకు అవసరమైన మినహాయింపులు కల్పించి అన్నదాతలు ఆటంకాలు లేకుండా పొలంపనులు చేసుకునే వీలు కల్పించింది. ఈ నేపథ్యంలో కేంద్రీయ గణాంక కార్యాలయం (సీఎస్‌వో)తోపాటు గణాంక-కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ 2019-20 జాతీయ ఆదాయ తాత్కాలిక అంచనాలను 2020 ఆగస్టు 31న విడుదల చేసింది. దీని ప్రకారం- వ్యవసాయం, అనుబంధ రంగాల వాస్తవ స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధి 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 3.4 శాతంగా నమోదైంది. ఈ మేరకు వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ నిన్న లోక్‌సభలో ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657530

ఆక్సిజన్‌ లభ్యత-వినియోగంసహా కోవిడ్ నిర్వహణపై 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి సమీక్ష

కోవిడ్‌-19 మహమ్మారి సమర్థ నియంత్రణ, నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరించిన సమన్వయ వ్యూహంలో భాగంగా శనివారం మంత్రిమండలి కార్యదర్శి తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు సహా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. కాగా, దేశంలో 80 శాతం కోవిడ్‌ కేసులు ఈ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ లభ్యత-వినియోగంపై  కేంద్ర వాణిజ్య-పరిశ్రమలశాఖ మంత్రి సమీక్షించారు. జిల్లా, ఆరోగ్య సదుపాయాల స్థాయిని,  స్థితిని విశ్లేషించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అలాగే ఆక్సిజన్ లభ్యతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సమర్థ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656837

జమ్ముకశ్మీర్‌లో కోవిడ్‌-19 పరిస్థితిపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్ష; కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర బృందం జమ్మూడివిజన్‌ సందర్శన

కోవిడ్‌-19 నుంచి కోలుకునేవారి సంఖ్యరీత్యా కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌ దేశంలోనే అత్యల్పంగా కేవలం 43 శాతం మాత్రమే నమోదు చేయడంపై కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శనివారం విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు జమ్మూడివిజన్‌ ప్రాంతంలో కోవిడ్‌ పరిస్థితిపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అలాగే ఈ ప్రాంతంలో కేసుల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ పర్యటిస్తున్న కేంద్ర బృందం నుంచి కూడా కొన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెరుగుతున్న కోవిడ్ -19 కేసులను మెరుగైన ఆస్పత్రుల నిర్వహణ-నియంత్రణ వ్యూహం ద్వారా సమర్థంగా పరిష్కరిస్తామని డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు హామీ ఇచ్చారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656855

ఉత్తరప్రదేశ్‌లో 50 అంబులెన్స్‌ల కొనుగోలుకు ఎన్‌సీఎల్‌ రూ.5 కోట్ల విరాళం

ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్-19పై పోరుకు మద్దతుగా జాతీయ బొగ్గు గనుల సంస్థ శాఖ ‘నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్’ (ఎన్‌సీఎల్) 50 అంబులెన్స్‌ల కొనుగోలు కోసం రూ.5కోట్ల విరాళమిచ్చింది. ఈ మేరకు సంస్థ సీఎండీ శ్రీ ప్రభాత్ కుమార్ సిన్హాతోపాటు డైరెక్టర్ (పర్సనల్) శ్రీ బిమ్లేందుకుమార్ సెప్టెంబర్ 18న లక్నోలోని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌కు అందజేశారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=166396

టాటా గ్రూప్, సీఎస్ఐఆర్-ఐజీఐబీలు రూపొందించిన దేశంలోనే తొలి ‘సీఆర్ఐఎస్పీఆర్’ కోవిడ్-19 పరీక్ష విధానం అమలుకు ఆమోదం

టాటా గ్రూప్, సీఎస్ఐఆర్-ఐజీఐబీలు రూపొందించిన దేశంలోనే తొలి ‘సీఆర్ఐఎస్పీఆర్’ కోవిడ్-19 పరీక్ష విధానం అమలుకు, వాణిజ్యపరంగా విడుదలకు శనివారం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి నియంత్రణ సంబంధిత అనుమతులు లభించాయి. ఇది భారత శాస్త్రవేత్తల సమాజం సాధించిన గణనీయ విజయానికి సంకేతంగా నిలిచింది. ఆ మేరకు పరిశోధన-అభివృద్ధి దశనుంచి 100 రోజుల్లోగా అత్యధిక కచ్చితత్వం, విశ్వసనీయతగల పరీక్ష స్థాయికి చేరడం విశేషం.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656834

‘ఖేలో ఇండియా ఫిర్‌సే’ పేరిట ‘ఎస్‌ఏఐ’ శిక్షణ కేంద్రాల్లో క్రీడా కార్యకలాపాల పునఃప్రారంభానికి ప్రామాణిక ప్రక్రియల విధానం జారీ: శ్రీ కిరణ్‌ రిజిజు

కోవిడ్‌-19 నేపథ్యంలో దేశవ్యాప్తంగాగల అన్ని భారత క్రీడా ప్రాధికార సంస్థ (SAI) కేంద్రాల్లో వివిధ క్రీడా ప్రోత్సాహక పథకాల కింద నిర్వహిస్తున్న సంప్రదాయ శిక్షణ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతోపాటు భారత అథ్లెట్ల విదేశీ శిక్షణపైనా నియంత్రణ విధించబడింది. అయితే, ఆ తర్వాత దేశీయాంగ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం శిక్షణ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమ్యాయి. ఈ మేరకు “ఖేలో ఇండియా-ఫిర్‌సే” పేరిట శిక్షణ కేంద్రాల్లో క్రీడా కార్యకలాపాల పునఃప్రారంభానికి ప్రామాణిక ప్రక్రియల విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడలశాఖ మంత్రి (ఇన్‌చార్జి) శ్రీ కిరెన్ రిజిజు శనివారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంద్వారా వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656836

కోవిడ్‌-19 నేపథ్య ఆర్థిక వ్యవస్థ మందగమనం పరిష్కారానికి ఆర్థిక-ద్రవ్య విధానాలు

కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడిన నేపథ్యంలో ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఆర్థిక-ద్రవ్య విధానాలను సమపాళ్లలో జోడించి, అమలు చేసింది. ఇందులో భాగంగా 2020 మే 12న ప్రభుత్వం ‘స్వయం సమృద్ధ భారతం’ పేరిట రూ.20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక-సమగ్ర ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల గురించి కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ నిన్న రాజ్యసభలో ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657022

ఐసీడీఎస్ ప్రోగ్రాం కింద కొనసాగుతున్న పోషకాహార కార్యక్రమాలతో ఆయుష్ వ్యవస్థలను జోడించడానికి మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వశాఖల మధ్య అవగాహన ఒప్పందం

దేశంలో ఆందోళనకరంగా మారుతున్న పౌష్టికాహార సమస్య పరిష్కారం దిశగా ఐసీడీఎస్ కార్యక్రమం కింద కొనసాగుతున్న పోషకాహార కార్యక్రమాలతో ఆయుష్ వ్యవస్థలను జోడించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖతో మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పోషకాహార లోపాన్ని నిర్మూలించే ప్రయత్నాలలో రెండు మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందాన్ని మహిళా-శిభు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఒక మైలురాయిగా అభివర్ణించారు.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1656966

కోవిడ్-19 నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అనుభవాల ఆదానప్రదానానికి ఏకమైన ప్రపంచవ్యాప్త ప్రజాస్వామ్య దేశాలు

ప్రపంచ ఎన్నికల సంస్థల సమాఖ్య (A-WEB) చైర్మన్ హోదాలో భారత ఎన్నికల కమిషన్‌ పదవీకాలం పూర్తయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇవాళ “కోవిడ్‌-19 వేళ ఎన్నికల నిర్వహణ సంబంధిత అంశాలు-సవాళ్లు, విధివిధానాలు; మీ దేశ అనుభవాల కలబోత”పై అంతర్జాతీయ వెబినార్‌ను నిర్వహించింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై అనుభవాల ఆదానప్రదానానికి ప్రపంచవ్యాప్తంగాగల ప్రజాస్వామ్య దేశాలకు ఇది ఒక వేదికగా మారింది. ఇందులో 45 దేశాల నుంచి 120 మంది ప్రతినిధులతోపాటు 4 అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొన్నాయి.

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1657316

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • పంజాబ్: కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాలకు అనుగుణంగా పంజాబ్‌ ప్రభుత్వం దిగ్బంధ విముక్తి-4.0 మార్గదర్శకాలను పాక్షికంగా సవరించింది. ఈ మేరకు నియంత్రణ జోన్ల వెలుపలగల పాఠశాలల్లో చదివే 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు తమ ఉపాధ్యాయుల నుంచి మార్గదర్శనం కోసం స్వచ్ఛంద ప్రాతిపదికన హాజరుకావచ్చునని పేర్కొంది.
  • హర్యానా: రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌-19 రోగుల ఏకాంత గృహవాస సంరక్షణ బలోపేతానికి హర్యానా ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలను జారీచేసింది, ఇందులో భాగంగా ‘జిల్లా ఏకాంతగృహవాస పర్యవేక్షణ బృందం’ రోజువిడిచి రోజు వ్యక్తిగతంగా పరిశీలనకు వెళ్లవచ్చునని పేర్కొంది. కాగా, కరోనా సోకినవారిలో 60 నుండి 70 శాతం ఏకాంత గృహవాస పర్యవేక్షణలో ఉన్నారని ఆరోగ్య శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి తెలిపారు. వీరందరికీ తగిన సంరక్షణ, చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని నియంత్రణ జోన్ల వెలుపగల పాఠశాలలకు చెందిన 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మార్గనిర్దేశాల కోసం స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే పాఠశాలలకు వెళ్లవచ్చునని అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం సూచించింది. అయితే, ఇందుకు వారి తల్లిదండ్రులు/ సంరక్షకులనుంచి లిఖితపూర్వక అనుమతితో రావాలని స్పష్టం చేసింది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 135 కొత్త కేసులు నమోదయ్యాయి.
  • అసోం: అసోంలో నిన్న 1,795 మంది డిశ్చార్జ్ కాగా, 19,318 పరీక్షలకుగాను 6.35 శాతంతో 1,227 మందికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. మరోవైపు ఇప్పటిదాకా 1,27,335 మంది వ్యాధినుంచి కోలుకోగా, ప్రస్తుతం క్రియాశీల రోగుల సంఖ్య 28,780గా ఉంది.
  • మణిపూర్: రాష్ట్రంలో 170 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 8,894కు చేరాయి. ఇక మణిపూర్‌లో కోలుకునేవారి సగటు 76 శాతం కాగా, ప్రస్తుతం 2070 క్రియాశీల కేసులున్నాయి. తాజాగా ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య  57కు పెరిగింది.
  • మేఘాలయ: రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 2,111 కాగా, వీరిలో బీఎస్‌ఎఫ్‌, సాయుధ దళాల సిబ్బంది 345 మంది ఉన్నారు. మొత్తం కేసులు 1,766 కాగా, ఇప్పటిదాకా 2,513 మంది కోలుకున్నారు.
  • మిజోరం: రాష్ట్రంలో నిన్న 7 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసులు 1,585కు చేరగా, క్రియాశీల కేసులు 583గా ఉన్నాయి.
  • నాగాలాండ్: రాష్ట్రంలోని పాఠశాలలు నేటినుంచి స్వచ్ఛంద ప్రాతిపదికన తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం 59 కొత్త కేసులు నమోదవగా వీటిలో 45 దిమాపూర్, 14 కొహిమా పరిధిలో ఉన్నాయి.
  • సిక్కిం: రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల తరువాత సరిహద్దులు తిరిగి తెరవడానికి సన్నద్ధమవుతోంది. ఈ మేరకు అక్టోబర్ 10నుంచి అంతర్జాతీయ పర్యాటకులను అనుమతిస్తారు. సిక్కింలో ఆదివారం 49 కొత్త కేసులు నమోదవగా, క్రియాశీల కేసుల సంఖ్య 469కి చేరింది. కాగా, మొత్తం 2,391 కేసులకుగాను ఇప్పటిదాకా 1,894 మంది కోలుకున్నారు.
  • కేరళ: రాష్ట్ర రాజధానిలో కోవిడ్-19 పరిస్థితి తీవ్రత కొనసాగుతోంది, ఈ మేరకు నిత్యం 800కుపైగా కేసులు నమోదవుతున్నాయి. కంటోన్మెంట్ విభాగంలో ఇవాళ ఏసీపీసహా మొత్తం 20మంది పోలీసులకు కోవిడ్‌ నిర్ధారణ అయింది. కాగా, తన భద్రతాధికారికి కోవిడ్ సోకడంతో నగర పోలీస్ కమిషనర్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తిరువనంతపురంలో మరో మరణంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 536కు పెరిగింది. కేరళలో నిన్న 4,696 కొత్త కేసులు నమోదవగా వివిధ జిల్లాల్లో 39,415 మంది చికిత్స పొందుతున్నారు... 2,22,179 మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కోవిడ్-19 నివారణ దిశగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థనుంచి ప్రజల సామాజిక-ఆర్థిక గణాంకాలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, తమిళనాడులో కోవిడ్-19 తక్షణ, మధ్యకాలిక ప్రభావంపై అంచనాలు రూపొందించిన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. కాగా, రాష్ట్రంలో ఆదివారం 5,516 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసులు 5,41,993కు పెరిగాయి. మరోవైపు 5,206మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటిదాకా కోలుకున్న రోగుల సంఖ్య  4,86,479కి చేరింది. రాష్ట్రంలో మరణాల సంఖ్య 8811గా ఉంది.
  • కర్ణాటక: రాష్ట్రంలో కోవిడ్-19 నుంచి కోలుకున్నవారిపై దీర్ఘకాలిక ప్రభావాల పరిశోధనకు వైద్య నిపుణులతో కూడిన ప్రత్యేక సాంకేతిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇక కర్ణాటకలోని కోర్టులు సెప్టెంబర్ 28 నుంచి దశలవారీగా తిరిగి ప్రారంభం కానున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో తాజా కోవిడ్-19 కేసుల నమోదుతో పోలిస్తే గత రెండు వారాలుగా కోలుకునే వారి సంఖ్య  అధికంగా ఉంది. ఈ మేరకు ఆదివారందాకా కోలుకున్నవారి సంఖ్య  5,41,319కి చేరగా, క్రియాశీల కేసుల సంఖ్య 78,836కు తగ్గింది. కాగా, 50 లక్షలకు పైగా కోవిడ్-19 పరీక్షల నిర్వహణద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఐదో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో నిర్ధారిత కేసుల సగటు 12.27 శాతం కాగా, మహారాష్ట్ర, చండీగఢ్‌ల తర్వాత మూడో అత్యధిక స్థాయి నమోదు చేసింది.
  • తెలంగాణ: రాష్ట్రంలో గత 24 గంటల్లో 1302 కొత్త కేసులు, 9 మరణాలు నమోదవగా, 2230మంది కోలుకున్నారు. కొత్త  కేసులలో 266 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు: 1,72,608; క్రియాశీల కేసులు: 29,636; మరణాలు: 1042; డిశ్చార్జి: 1,41,930గా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఖతార్, యూఏఈలకు విమాన ప్రయాణం తిరిగి ప్రారంభం కానుంది. ఇక సీసీఎంబీ 2000 సార్స్‌-సీవోవీ-2 జన్యుక్రమాన్ని రూపొందించింది. అయితే, వీటిలో ఏ ఒక్క రకం కూడా మరింత తీవ్రమైన రూపంతోగానీ, మరణాలకు కారణం కాగలిగేంత ప్రమాదకరం కాదని పరిశోధనలు స్పష్టం చేశాయి.
  • మహారాష్ట్ర: కోవిడ్-19 చికిత్సకు బీమా కల్పించాలని మహారాష్ట్రలోని ఉపాధ్యాయ సంఘాలు విద్యా శాఖను అభ్యర్థించాయి. రాష్ట్రంలో సుమారు 3.5 లక్షల మంది ఉపాధ్యాయులు ఏప్రిల్-ఆగస్టు నెలల మధ్య కోవిడ్ సంబంధిత విధుల్లో పనిచేశారు. ముంబై సమీపంలోని డోంబివిలీలో 106 ఏళ్ల వృద్ధురాలు కరోనావైరస్‌పై విజయం సాధించి ఆదివారం ఆస్పత్రి నుంచి ఇల్లుచేరింది. మహారాష్ట్రలో కోలుకున్నవారి సంఖ్య 8.84లక్షలకు చేరినా ఇంకా 2.91 లక్షలమంది చికిత్స పొందుతున్నారు.
  • గుజరాత్: గుజరాత్‌ శాసనసభ ఐదురోజుల వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం అవుతాయనగా, ఆదివారం ముగ్గురు కాంగ్రెస్, ఒక బీజేపీ ఎమ్మెల్యేలకు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, ఇప్పటిదాకా 56 మంది కాంగ్రెస్, 80 మంది బీజేపీ ఎమ్మెల్యేలు పరీక్షలు చేయించుకున్నారు.
  • రాజస్థాన్: రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా, రాజధాన్ ప్రభుత్వం రాజధాని జైపూర్, జోధ్‌పూర్‌, ఉదయపూర్, కోటాసహా 11 జిల్లా ప్రధాన కార్యాలయాలలో సెక్షన్ 144 విధించింది. మరోవైపు అక్టోబర్ 31దాకా  ఎలాంటి సామాజిక, మత కార్యక్రమాలను నిర్వహించరాదని ఆదేశాలు జారీచేసింది. కోవిడ్‌ రోగులు-వారి కుటుంబసభ్యుల సమస్యల పరిష్కారం దిశగా రేపటినుంచి 24 గంటల రాష్ట్రస్థాయి సహాయ కేంద్రం ఫోన్‌ నంబరు 181ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతుండటంతో సుమారు 10 జిల్లాల్లోని స్థానిక పాలన యంత్రాంగాలు ఆయా ప్రాంతాల్లో దిగ్బంధం విధించాలని నిర్ణయించాయి. మరోవైపు బిలాస్‌పూర్, బలోదాబజార్, జాష్‌పూర్, బలోద్, సూరజ్‌పూర్, ధమ్‌తారి జిల్లాల్లో సెప్టెంబర్ 22 నుంచి దిగ్బంధం అమలులోకి రానుంది. రాయ్‌గఢ్‌ జిల్లాలో సెప్టెంబర్ 24 నుండి 30దాకా విధిస్తారు.
  • గోవా: దక్షిణ గోఆ జిల్లా ఆసుపత్రిని 150 పడకల ప్రారంభ సామర్థ్యంతో కోవిడ్‌ ప్రత్యేక చికిత్స కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఇప్పటివరకూ రాష్ట్రంలోని రోగులు మార్గోవా (దక్షిణ గోవా) లోని ఈఎస్‌ఐ ఆస్పత్రి, పణజి (ఉత్తర గోవా) సమీపంలోని గోవా వైద్య కళాశాల-ఆస్పత్రి, పోండాలోని ఉప జిల్లా ఆసుపత్రి (దక్షిణ గోవా)లో చికిత్స పొందుతున్నారు.

FACT CHECK

*******



(Release ID: 1657547) Visitor Counter : 229