ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశంలో వరుసగా 3 వ రోజు 90,000 రికవరీలు నమోదయ్యాయి.
మొత్తం కోలుకున్న కేసులు ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో 43 లక్షలకు దగ్గరగా నమోదయ్యాయి.
భారతదేశంలో రికవరీ రేటు 80 శాతం మైలురాయిని దాటింది
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2020 11:33AM by PIB Hyderabad
భారతదేశ జాతీయ రికవరీ రేటు 80 శాతం కంటే ఎక్కువగా ముఖ్యమైన మైలురాయిని దాటింది.
అధిక రికవరీలతో నిరంతరాయంగా కొనసాగుతున్న భారతదేశంలో వరుసగా మూడవ రోజు 90,000 కంటే ఎక్కువగా రికవరీలు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో 93,356 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు.

12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే ఎక్కువగా రికవరీ రేటును నమోదు చేశాయి.

కొత్తగా కోలుకున్న కేసులలో 79 శాతం కేసులు, 10 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల నుండి నమోదయ్యాయి.
మొత్తం కోలుకున్న కేసులు ఈ రోజు 44 లక్షలకు దగ్గరగా (43,96,399) నమోదయ్యాయి. మొత్తం రికవరీలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఇది ప్రపంచ మొత్తంలో 19 శాతం కంటే ఎక్కువగా ఉంది.
*****
(రిలీజ్ ఐడి: 1657191)
సందర్శకుల సూచీ సంఖ్య : : 281
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam