నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
కోవిడ్ అనంతర నైపుణ్య శిక్షణలో మార్పు
Posted On:
18 SEP 2020 12:39PM by PIB Hyderabad
నైపుణ్య శిక్షణ, వ్యాపారాభివృద్ది మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ కోవిడ్ సంక్షోభ నేపథ్యంలో ఈ-స్కిల్ ఇండియా వేదికమీద ఆన్ లైన్ నైపుణ్య శిక్షణ అందిస్తోంది. అదే విధంగా హోమ్ వ్యవహారాల మంత్రిత్వశాఖ భౌతికంగా నైపుణ్య శిక్ష కార్యక్రమాలు 2020 సెప్టెంబర్ 21 నుంచి నిర్వహించుకోవటానికి అనుమతించింది. అందుకు అనుగుణంగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ శిక్షణ పునః ప్రారంభించటానికి అనుసరించవలసిన పద్ధతులమీద ప్రామాణిక అనుసరణీయ విధానాలు జారీచేసింది.
పిఎం కెవై లో భాగంగా 17.03.2020 నాటికి స్వల్పకాల శిక్షణ 42.02 లక్షలమంది శిక్షణ పొందగా 33.66 లక్షలమంది అభ్యర్థులు ధ్రువపత్రాలు పొందారు. ధ్రువపత్రాలు పొందినవారిలో 17.54 లక్షలమందికి ఉద్యోగాలు లభించాయి. మరో 49.12 లక్షలందికి నైపుణ్యాలు ఉన్నప్పటికీ వాళ్లకి లాంఛనమైన ధ్రువపత్రాలు లేవు. గత అభ్యసనపు గుర్తింపు కింద వారికి కొద్దిపాటి శిక్షణ అనంతర ధ్రువపత్రాలు ఇచ్చారు.
ధ్రువపత్రాలు పొందినవారి ఉద్యోగావకాశాలు పెంచటానికి రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. అందులో కొన్ని:
శిక్షణ ఇచ్చేవారు/శిక్షణ కేంద్రాలు సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ సహాయంతో రోజ్ గార్ మేళాలు ఏర్పాటు చేయాలి
ధ్రువపత్రాలు పొందినవారికి ఉద్యోగం వచ్చిన తరువాతనే శిక్షణ భాగస్వాములకు/ శిక్షణాకేంద్రాలకు ఆఖరి విడత చెల్లింపు( అంటే మొత్తం శిక్షణ నిధులలో 20%)
కనీస స్థాయికి మించి ఉద్యోగాలు కల్పించిన శిక్షణ భాగస్వాములకు/ శిక్షణాకేంద్రాలకు అదనపు ప్రోత్సాహకాలు
ఉద్యోగాల కల్పనలో కనబరచిన ప్రతిభ ఆధారంగా శిక్షణ భాగస్వాములకు/ శిక్షణాకేంద్రాలకు కొత్త లక్ష్యాల నిర్దేశం
నైపుణ్య శిక్షణ, వ్యాపారాభివృద్ది శాఖ సహాయమంత్రి శ్రీ ఆర్ కె సింగ్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు
***
(Release ID: 1656131)
Visitor Counter : 193