ఆయుష్

కోవిడ్-19కి ఆయుర్వేద ఔషధాలు, నియమావళి

Posted On: 18 SEP 2020 7:09PM by PIB Hyderabad

సార్స్ కోవ్-2గా వ్యవహరిస్తున్న ఇన్ఫెక్షన్లు,  కోవిడ్-19 వ్యాధి నివారణకు సవరించిన ఎక్ర్టా మూరల్ రీసెర్చ్ (ఇఎంఆర్) పథకం కింద 247 ఆయుర్వేద ఔషధాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఆయుష్ మంత్రిత్వ శాఖకు చేరాయి. సార్స్ /  కోవిడ్ కేసుల చికిత్స కోసం వాటిలో 21 పరిశోధన ప్రతిపాదనలకు నిధులు అందించేందుకు సంబంధిత ఆయుర్వేద యంత్రాంగం సిఫారసు చేసింది. 

ఆయుష్ మంత్రిత్వ శాఖ వివిధ విభాగాల భాగస్వామ్యంతో ఆయుష్ ఆర్ అండ్ డి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ దేశంలో ప్రతిష్ఠాత్మకమైన సంస్థల నిపుణులను సంప్రదించి, సమగ్రంగా సమీక్షించి రోగనిరోధక అధ్యయనాల కోసం ఇతర ఔషధాలతో పాటుగా కోవిడ్-19 పాజిటివ్ రోగులకు ఇచ్చి క్లినికల్ పరిశోధనలు నిర్వహించేందుకు నిబంధనావళిని రూపొందించింది. వాటిలో అశ్వగంథ, యష్టిమధు, గుడుచి, పిప్పలి అనే నాలుగు ఆయుర్వేద ఔషధాలతో పాటుగా వాటి  మిశ్రమంతో రూపొందించిన పాలీ హెర్బల్ ఫార్ములేషన్ (ఆయుష్-64) ఉంది. 5 లక్షల మంది జనాభాపై ప్రయోగించేందుకు అనుమతించిన ఆయుష్ ఔషధాల వినియోగం, వాటి ప్రభావంపై గణాంకాలు రూపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ సంజీవని యాప్ ను కూడా అభివృద్ధి చేసింది. ఈ అధ్యయనాలన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. 

లోక్ సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సమాచారం అందించారు.

***



(Release ID: 1656577) Visitor Counter : 194