ఆర్థిక మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు కోశ, ద్రవ్య విధానపరమైన చర్యలు
Posted On:
20 SEP 2020 2:06PM by PIB Hyderabad
ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ -19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతోజాగ్రత్తతో కోశ, ద్రవ్య పరమైన విధానాలను అమలు చేసంది. 2020 మే 12న ప్రభుత్వం దేశ 10శాతం జిడిపితో సమానమైన 20 లక్షల కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకే్ జ్(ఎ.ఎన్.బి.పి) ని ప్రకటించింది. ఇది ప్రత్యేక ఆర్థిక, సమగ్ర ప్యాకేజ్. ఇది వ్యాపారాలను ప్రోత్సహించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు నిర్దేశించినదని కేంద్ర ఆర్ధిక , కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఈరోజు రాజ్యసభకు ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
ఎ.ఎన్.బి.పి కింద ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. అవి:-
వివిధ కుటుంబాల వారికి ఆహారం, వంట గ్యాస్, సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగుల ఖాతాలకు , మహిళా జన్ ధన్ ఖాతాదారులకు, రైతులకు నగదు బదిలీ, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నవర్కర్లకు ఇన్సూరెన్సు కవరేజి, ఎం.జి.ఎన్. ఆర్.ఇ.జి.ఎ కింద కార్మికుల వేతనాలు పెంపు, భవన, నిర్మాణ రంగ కార్మికులకు మద్దతు, స్వయం సహాయక బృందాలకు కొలేటరల్ ఉచిత రుణాలు, ఇపిఎఫ్ కంట్రిబ్యూషన్ల తగ్గింపు, వలసకార్మికులకు ఉపాధి అవకాశాల కల్పన (ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్‌కింద)
ఎం.ఎస్.ఎం.ఇలకు నూరుశాతం రుణ గ్యారంటీతో కొలేటరల్ ఉచిత రుణ కార్యక్రమం కింద ఉపశమన చర్యలు, ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఎం.ఎస్.ఎం.ఇలకు పాక్షిక గ్యారంటీతో సబార్డినేట్ రుణం, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు మైక్రో ఫైనాన్సు సంస్థల రుణాలపై, ప్రభుత్వరంగ బ్యాంకులకు పాక్షిక రుణ గ్యారంటీ పథకం, ఎం.ఎస్.ఎం.ఇలలలో ఈక్విటీ పెంపునకు ఫండ్ ఆఫ్ ఫండ్స్, రాయితీ రుణాల ద్వారా రైతులకు అదనపు మద్దతు, అలాగే వీధి వ్యాపారులకు రుణసదుపాయం (పిఎం స్వనిధి) వంటివి ఉన్నాయి.
రెగ్యులేటరీ, అమలుచర్యలు : టాక్స్‌ఫైలింగ్, ఇతర పాటించాల్సిన గడువులను వాయిదా వేశారు. జిఎస్‌టి బకాయిలకు సంబంధించి ఫైలింగ్‌పైపెనాల్టీ వడ్డీరేటు ను తగ్గించారు. ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్ నిబంధనలను మార్చారు. ఎంఎస్.ఎం.ఇ బకాయిలను సత్వర చెల్లింపులు, ఎంఎస్ఎం ఇలకు ఐబిసి సబంధిత మినహాయింపులు వంటివి ఉన్నాయి.
ఎఎన్‌బిపి కింద నిర్మాణాత్మక సంస్కరణలను ప్రకటించారు. అందులో వ్యవసాయరంగాన్ని నియంత్రణలనుంచి తొలగించారు, ఎం.ఎస్.ఎం.ఇల నిర్వచనంలో మార్పు తీసుకువచ్చారు.కొత్త పి.ఎస్.ఇ విధానాన్ని తీసుకువచ్చారు. బొగ్గు గనుల తవ్వకాన్ని వాణిజ్యీకరించారు.రక్షణ, అంతరిక్ష రంగాలలో ఎఫ్.డి.ఐ పరిమితులను పెంచారు. పారిశ్రామిక భూముల అభివృద్ధి, ల్యాండ్ బ్యాంక్, పారిశ్రామిక సమాచార వ్యవస్థ అభివృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు వయబిలిటి గ్యాప్ ఫండింగ్ ను మెరుగుపరచడం, కొత్త పవర్ టారిఫ్ విధానం, వివిధ రంగాలలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు రాష్ట్రాలకు ప్రోత్సాహం ఉన్నాయి.
ఇక ద్రవ్య రంగంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్.బి.ఐ), కోవిడ్ -19 కారణంగా వ్యతిరేక ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సంప్రదాయ, సంప్రదాయేతర ద్రవ్య, లిక్విడిటీ చర్యలను తీసుకుంది. పాలసీ రేట్లను గణనీయంఆ తగ్గించింది. సుమారు 9.57 లక్షల కోట్లు లేదా జిడిపిలో 4.7 శాతం. దేశ ఆర్థిక వ్యవస్థలోకి రుణ సరఫరాను పెంచేందుకు 2020 ఫిబ్రవరి నుంచి ఆర్ధిక వ్యవస్థలోకి పంపినట్టు మంత్రి తెలిపారు.
కోవిడ్ -19 అంతరాయాల కారణంగా ఏర్పడిన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ఫైనాన్షియల్ మార్కెట్‌లకు లిక్విడిటీ మద్దతు పెంచేందుకు పలు అభివృద్ధి రెగ్యులేటరీ విధాన నిర్ణయాలను ఆర్.బి.ఐ ప్రకటించినట్టు శ్రీ ఠాకూర్ తెలిపారు. రుణ క్రమశిక్షణను బలోపేతం చేయడంతోపాటు, రుణ సరఫరాను పెంచడం, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింతగా అమలు చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నవకల్పనలకు అవకాశం కల్పించడం వంటివి ఆర్.బి.ఐ చేపట్టింది.
2020 మార్చి 1 వతదీ నాటికి ఉన్న టరమ్ లోన్ల కు సంబంధించి ఆర్.బి.ఐ పలు రెగ్యులేటరీ చర్యలను ప్రకటించింది. ( వ్యవసాయ టరమ్ లోన్లు, రిటైల్, పంట రుణాలు) 2020 మార్చి 1 అలాగే 2020 ఆగస్టు 31 నాటికి ఉన్న అన్ని వాయిదాల బకాయిలపై ఆరువారాల మారటోరియం విధించేందుకు అన్ని నియంత్రిత రుణ సంస్థలకు ఆర్.బి.ఐ అనుమతినిచ్చింది. ఫలితంగా యాజమాన్యమర్పులేకుండా, వ్యక్తిగత రుణాలకు సంబంధించి అర్హతగల కార్పొరేట్ రుణాల విషయంలో రెజల్యూషన్ ప్రణాళికనుఅమలుచేసేందుకు ఒక ఫ్రేమ్ వర్క్‌నురూపొందించింది.
ఈప్యాకేజ్ అమలును ఎప్పటికప్పుడు సమీక్షించి,పర్యవేక్షిస్తారు. ఇందుకు సంబంధించి సాధించిన కొన్నివిజయాలు ఇలా ఉన్నాయి.:
1. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్ (పిఎంజికెపి) కింద 42 కోట్ల మంది 2020 సెప్టెంబర్ 7 వ తేదీ నాటికి 68,820 కోట్లరూపాయలను సుమారు 42 కోట్ల మంది అందుకున్నారు.
2.ఎం.ఎస్.ఎం.ఇలతోపాటు వ్యాపారాలకోసం 3 లక్షల కోట్ల రూపాయలు కొల్లేటరల్ ఫ్రీ ఆటోమేటిక్‌రుణాలు , ఎన్.బి.ఎఫ్.సి లకు 45,000కోట్ల రూపాయల పాక్షిక రుణ గ్యారంటీ పథకం 2.0 కల్పించడం జరుగుతోంది.
3. ఎన్.బి.ఎఫ్.సిలు, హెచ్ఎఫ్సిలు, ఎం.ఎఫ్.సిలు ఎం.ఎఫ్.ఐల కింద 30,000 కోట్ల రూపాయల ప్రత్యేక లిక్విడిటీ పథకం మంజూరు చేయడం జరిగింది.
4. నాబార్డ్ ద్వారా రైతులకు అదనపు అత్యవసర వర్కింగ్ కాపిటల్ ఫండింగ్‌ను కల్పించడం జరుగుతోంది.
5. 2020-21 సంవత్సరానికి రుణసేకరణ పరిమితిని రాష్ట్రప్రభుత్వాలకు 3 శాతం నుంచి 5 శాతానికి పెంచడం జరిగింది.
టిడిఎస్, టిసిఎస్ రేటు తగ్గింపు ద్వారా 50,000 కోట్ల రూపాయలు లిక్విడిటీ కల్పించడం జరిగింది. లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయడం, ప్రభుత్వం ప్రకటించిన వివిధ మద్దతు చర్యల ఫలితంగా జూలై ,ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింత ఎక్కువ కార్యకలాపాలు జరిగాయి. ఇది పిఎంఐ తయారీ ఇండెక్స్‌లొ పురోగతి, 8 కీలక పరిశ్రమల సూచీలో పెరుగుదల,ఈ వే బిల్లులు, ఖరీఫ్‌పంట సాగు,విద్యుత్ వినియోగం, రైల్వేసరకు రవాణా, పాసింజర్ వాహనాల అమ్మకాలలో పెరుగుదలలో ప్రతిఫలించింది.
***
(Release ID: 1657022)
Visitor Counter : 292