ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మానసిక అనారోగ్య కేసులలో మహమ్మారి సంబంధిత పెరుగుదల
Posted On:
20 SEP 2020 8:17PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి సమయంలో మానసిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఆయా కార్యక్రమాలు ఇలా ఉన్నాయి:
మానసిక ఆరోగ్య నిపుణులచే మొత్తం బాధిత జనాభాకు, మానసిక సహాయాన్ని అందించడానికి గాను 24/7 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయడమైంది. బాధిత జనాభాను పిల్లలు, వయోజనులు, వృద్ధులు, మహిళలు మరియు ఆరోగ్య కార్యకర్తల సమూహాలుగా విభజించబడింది. సమాజంలో వివిధ విభాగాలకు అనుగుణంగా మానసిక ఆరోగ్య సమస్యల నిర్వహణపై తగిన మార్గదర్శకాలు / సలహాలు జారీ చేయడమైంది. ఒత్తిడి మరియు ఆందోళనలను నిర్వహించడం మరియు అందరికీ మద్దతు మరియు సంరక్షణ వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు గాను.. సృజనాత్మక మరియు ఆడియో-విజువల్‌ల రూపంలో వివిధ మీడియా వేదికల ద్వారా తెలియపరచడమైంది.
బెంగళూరకు కేంద్రంగా ఉన్న 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్' (నిమ్హాన్స్) వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది. " కోవిడ్-19 మహమ్మారి కాలంలో మానసిక ఆరోగ్యం - సాధారణ వైద్య మరియు ప్రత్యేక మానసిక ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లకు మార్గదర్శకత్వం" అనే అంశంతో వివరణాత్మక మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. అన్ని రకాల మార్గదర్శకాలు, సలహాలు మరియు సంబంధిత సమాచారంతో కూడిన విషయాలను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో (https://www.mohfw.gov.in/) “బిహేవియరల్ హెల్త్ - సైకోసోషియల్ హెల్ప్‌లైన్” అనే శీర్షిక కింద పొందవచ్చు. మానసిక సామాజిక మద్దతు మరియు శిక్షణను అందించేలా (ఐగాట్)-దీక్షా ప్లాట్‌ఫామ్ ద్వారా నిమ్హాన్స్ ఆరోగ్య కార్యకర్తలకు ఆన్‌లైన్ సామర్థ్యం పెంపు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే ఈ రోజు ఇక్కడ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
****
(Release ID: 1657151)
Visitor Counter : 240