ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు లో వ్యవసాయ సంబంధిత బిల్లులకు ఆమోదముద్ర లభించడం తో రైతులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
20 SEP 2020 4:10PM by PIB Hyderabad
వ్యవసాయ సంబంధిత బిల్లులు పార్లమెంటు ఆమోదాన్ని పొందడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతుల కు శుభాకాంక్షలు తెలిపారు; ఇది భారతీయ వ్యవసాయ చరిత్రలో ఒక గొప్ప ఘడియ అని ఆయన అభివర్ణించారు.
‘‘భారతీయ వ్యవసాయ చరిత్రలో ఒక గొప్ప ఘడియ ఇది! కీలక బిల్లులకు పార్లమెంటు లో ఆమోదం లభించిన వేళ లో, కష్టపడి పనిచేసే మన రైతులకు ఇవే శుభాకాంక్షలు. దీనితో వ్యవసాయ రంగం రూపురేఖలు పూర్తి గా మారడమే కాకుండా, కోట్లాది రైతులకు సాధికారత కల్పన ఖాయం.’’
‘‘దశాబ్దాలుగా భారతీయ రైతుకు ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కోక తప్పడం లేదు; దళారుల చేత వేధింపులకు గురవుతున్నాడు. పార్లమెంటు ఆమోదించిన బిల్లులు అలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి రైతులను విముక్తం చేస్తాయి. ఈ బిల్లులు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రయత్నాలకు జోరును అందిస్తాయి; అంతే కాదు, వారికి మరింత సమృద్ధిని అందించి తీరుతాయి.’’
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మన వ్యవసాయ రంగానికి ఎంతయినా అవసరం, అది చెమటోడ్చే మన రైతులకు సహాయం చేసేదిగా ఉండాలి. ప్రస్తుతం, ఈ బిల్లులకు ఆమోదముద్ర పడడంతో, భవిష్యత్తు కాలంలో రూపుదిద్దుకొనే సాంకేతికత మన రైతుల కు ఇక సులభంగానే అందుబాటులోకి వస్తుంది. దీనితో ఉత్పత్తి కి ప్రోత్సాహం లభించి, ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇది స్వాగతించదగ్గ ముందడుగు.’’
నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు మరో సారి చెప్తున్నాను:
‘‘కనీస మద్దతు ధర (ఎమ్ఎస్ పి) వ్యవస్థ అమల్లో ఉంటుంది. ప్రభుత్వ కొనుగోళ్లు కొనసాగుతాయి. మేము ఇక్కడ ఉన్నది మన రైతులకు సేవ చేయడానికే. వారికి సాయపడేందుకు, వారి భావి తరాలకు మెరుగైన జీవనాన్ని ఇచ్చేందుకు పూచీ పడటానికి మేము చేతనైన ప్రతి ప్రయత్నాన్ని తప్పక చేస్తాం.’’ అని ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో స్పష్టం చేశారు.
***
(Release ID: 1657149)
Visitor Counter : 247
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam