PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 17 APR 2020 6:38PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 

 

 • దేశంలో నిన్నటి నుంచి 1,007 కొత్త కోవిడ్‌-19 కేసులు, 23 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,387కు చేరింది
 • దిగ్బంధానికి ముందు కేసుల సంఖ్య రెట్టింపునకు 3 రోజులు పట్టగా- గడచిన వారానికిగాను 6.2 రోజులు పట్టింది.
 • ఆర్థిక సుస్థిరత పరిరక్షణకు రిజర్వు బ్యాంకు రెండోవిడత చర్యలు; అవసరాల్లో ఉన్నవారికి... నిస్సహాయులకు నగదు లభ్యతే లక్ష్యం; కోవిడ్‌-19 నిర్వహణ కోసం రాష్ట్రాలకు మరింత రుణం పొందే వీలు
 • వలస కార్మికులకు ఆశ్రయం, ఆహారం, భద్రతలకు భరోసా ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి లేఖ
 • సూక్ష్మ అటవీ ఉత్పత్తులు, వనాలు, ఎన్‌బీఎఫ్‌సీలు, సహకార రుణపరపతి సంఘాలు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలు వంటివాటికి దిగ్బంధం ఆంక్షలను సడలిస్తున్నట్లు దేశీయాంగ శాఖ ప్రకటన
 • పీఎంజీకేవై కింద ఇప్పటివరకూ పీఎంయూవై లబ్ధిదారులకు 1.51 కోట్ల ఉచిత సిలిండర్ల పంపిణీ

 

కోవిడ్‌-19పై ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తాజా సమాచారం

దేశంలో నిన్నటినుంచీ 1,007 కొత్త కోవిడ్‌-19 కేసులు, 23 మరణాలు నమోదయ్యాయి.   కాగా, మొత్తం కేసుల సంఖ్య 13,387కి చేరింది. వైరస్‌ బారినపడి కోలుకున్న/పూర్తిగా నయమైన 1,749 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. దిగ్బంధం విధించకముందు దేశం కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి సగటున 3 రోజులు పట్టగా గడచిన వారానికిగాను 6.2 రోజులు పట్టింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,919 కేంద్రాల్లో 1,73,746 ఏకాంత చికిత్స- 21,806 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615441

కోవిడ్‌-19 నిర్వహణ చర్యలు, ప్రస్తుత స్థితిపై మంత్రిమండలి ఉపసంఘం సమీక్ష

కోవిడ్‌-19 నియంత్రణ, నిర్వహణ చర్యలపై మంత్రిమండలి ఉపసంఘం సమగ్రంగా చర్చించింది. ఇప్పటిదాకా చేపట్టిన చర్యలపైన, వ్యాధి వ్యాప్తి నివారణ దిశగా తీసుకున్న కఠిన చర్యల్లో భాగంగా కేంద్ర-రాష్ట్రాలు అమలు చేస్తున్న సామాజిక దూరం నిబంధన అమలు ప్రస్తుత స్థితిని సమీక్షించింది. దీంతోపాటు కోవిడ్‌-19 ప్రత్యేక ఆస్పత్రులు, వైద్య సంస్థలకు వ్యక్తిగత రక్షణ సామగ్రిసహా వెంటిలేటర్లు ఇతర అత్యవసర సరంజామా సరఫరా వగైరాల కల్పనలో రాష్ట్రాల సామర్థ్యం బలోపేతం చేసే చర్యలు తదితరాలపై లోతుగా చర్చించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615543

ఆర్థిక సుస్థిరత పరిరక్షణకు రిజర్వు బ్యాంకు రెండోవిడత చర్యలు; అవసరాల్లో ఉన్నవారికి... నిస్సహాయులకు నగదు లభ్యతే లక్ష్యం; కోవిడ్‌-19 నిర్వహణ కోసం రాష్ట్రాలకు మరింత రుణం పొందే వీలు

ప్రస్తుత ఆరోగ్య సంక్షోభంవల్ల ఒడుదొడుకులలో చిక్కుకున్న దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజమిచ్చే 9 రకాల చర్యలను రిజర్వు బ్యాంకు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇవాళ ప్రకటించారు. ఇంతకుముందు 2020 మార్చి 27న కొన్ని చర్యలను ప్రకటించిన నేపథ్యంలో వీటిని రెండోవిడత చర్యలుగా పేర్కొనవచ్చు. కోవిడ్‌-19 సంబంధిత స్థానభ్రంశాల నడుమ వ్యవస్థలో... దాని విభాగాలలో సముచిత ద్రవ్య లభ్యత నిర్వహణ; బ్యాంకులకు రుణ ప్రవాహ సౌలభ్యం, ప్రోత్సాహం; ఆర్థిక ఒత్తిడి నుంచి ఊరట కల్పన; విపణులు సాధారణ స్థాయిలో పనిచేసేలా చూడటం వంటివి ఈ చర్యల ప్రధాన లక్ష్యమని ఆర్బీఐ గవర్నర్‌ తెలిపారు. కరోనా వైరస్‌ మహమ్మారి విసిరిన కఠిన సవాళ్లను ఎదుర్కొనడంలో కేంద్ర బ్యాంకు తనవద్దగల అన్నిరకాల ఉపకరణాలనూ వినియోగిస్తుందని గవర్నర్‌ చెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615447

రిజర్వు బ్యాంకు ప్రకటించిన చర్యలపై ప్రధానమంత్రి హర్షం; దీనివల్ల ద్రవ్యలభ్యత పెరుగుతుందని, రుణ సరఫరా మెరుగుపడుతుందని వ్యాఖ్య

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615364

వలస కార్మికులకు ఆశ్రయం, ఆహారం, భద్రతలకు భరోసా ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి లేఖ

దేశంలో  కోవిడ్ -19 నియంత్ర‌ణలో భాగంగా అమ‌లు చేస్తున్న దిగ్బంధం వల్ల వలస కార్మికులతోపాటు ప‌లు ప్రాంతాల‌లో చిక్కుకున్న వారి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యమిస్తోంది. ఈ మేరకు వ‌ల‌స కార్మికులకు ఆశ్రయం, ఆహారం, భ‌ద్ర‌త‌ల విషయంలో దేశీయాంగ శాఖ జారీచేసిన సమగ్ర మార్గదర్శకాలను సమర్థంగా అమలు చేయాలని కోరుతూ

కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల‌కు లేఖ రాశారు. తదనుగుణంగా ప్రస్తుత స్థితిగతులపై తక్షణం సమీక్షించాలని అన్ని జిల్లాల‌ కలెక్టర్లనూ  ఆదేశించాలని రాష్ట్రాల‌ను కోరారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615217

సూక్ష్మ అటవీ ఉత్పత్తులు, వనాలు, ఎన్‌బీఎఫ్‌సీలు, సహకార రుణపరపతి సంఘాలు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలు వంటివాటికి దిగ్బంధం ఆంక్షలను సడలిస్తున్నట్లు దేశీయాంగ శాఖ ప్రకటన

కోవిడ్‌-19 పోరులో భాగంగా విధించిన దిగ్బంధం ఆంక్షల అమలుకు సంబంధించి అన్ని మంత్రిత్వశాఖలు/విభాగాలకు జారీచేసిన ఏకీకృత, సవరించిన మార్గదర్శకాల కింద నిర్దేశిత కార్యకలాపాలను మినహాయించాలని దేశీయాంగ శాఖ ఇవాళ ఆదేశాలిచ్చింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615156

అంతర్జాతీయ ద్రవ్యనిధి, దాని పరిధిలోని అంతర్జాతీయ ద్రవ్య-ఆర్థిక కమిటీ ప్లీనరీ సమావేశానికి దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా శ్రీమతి నిర్మలా సీతారామన్ హాజరు

కేంద్ర ఆర్థిక-కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా అంతర్జాతీయ ద్రవ్యనిధి, దాని పరిధిలోని మంత్రుల స్థాయి కమిటీ, అంతర్జాతీయ ద్రవ్య-ఆర్థిక కమిటీల ప్లీనరీ సమావేశంలో పాల్గొన్నారు. ‘అసాధారణ సందర్భాల్లో-అసాధారణ చర్యలు’ ఇతివృత్తంగాగల అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరక్టర్‌  ప్రపంచ విధాన కార్యక్రమానికి అనుగుణంగా ఈ సమావేశంలో చర్చలు సాగాయి. కోవిడ్-19పై పోరులో సభ్యదేశాలు తీసుకున్న చర్యల గురించి సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ ద్రవ్య లభ్యత, సభ్యదేశాల ఆర్థిక అవసరాలు తీర్చేదిశగా ఐఎంఎఫ్‌ సంక్షోభ ప్రతిస్పందన ప్యాకేజీపైనా వారు చర్చించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615220

పీఎంజీకేవై కింద ఇప్పటివరకూ పీఎంయూవై లబ్ధిదారులకు 1.51 కోట్ల ఉచిత సిలిండర్ల పంపిణీ

ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న (పీఎంజీకేవై) కింద ఈ నెలలో ఇప్పటిదాకా పీఎంయూవై లబ్ధిదారులకు 1.51 కోట్లకుపైగా ఉచిత వంటగ్యాస్‌ సిలిండర్లు పంపిణీ అయ్యాయి. కాగా, పీఎంజీకేవై కింద పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్ర‌భుత్వం అనేక సహాయ చర్యలు చేపట్టింది. వీటిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కూ 3 నెలలపాటు 8 కోట్లమందికిపైగా పీఎంయూవై ల‌బ్ధిదారుల‌కు 3 వంటగ్యాస్‌ (14.2కిలోల) సిలిండర్లను అంద‌జేయాల‌న్నది ప్రధాన నిర్ణయం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615214

భారత-భూటాన్‌ ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్‌ ద్వారా భూటాన్‌ ప్రధానమంత్రి గౌరవనీయులైన డాక్టర్‌ లోతే షేరింగ్‌తో సంభాషించారు. కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రాంతీయంగా ఏర్పడిన పరిస్థితులపై ప్రధాన మంత్రులిద్దరూ చర్చించారు. ఈ వైరస్‌ నియంత్రణ, దాని ప్రభావాలకు ఉపశమనం దిశగా తీసుకున్న చర్యల గురించి తాజా అంశాలను పరస్పరం తెలియజేసుకున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615207

దిగ్బంధం నేప‌థ్యంలో ఆహార ధాన్యాలు, న‌శ్వ‌ర వ‌స్తువుల స‌త్వ‌ర ర‌వాణా కోసం కేంద్ర వ్య‌వ‌సాయశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమ‌ర్ చేతులమీదుగా  ‘కిసాన్ ర‌థ్’ యాప్‌కు శ్రీ‌కారం

కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఇవాళ రైతుహిత మొబైల్‌ యాప్‌ ‘కిసాన్‌ రథ్‌’కు శ్రీకారం చుట్టారు. నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ దీన్ని రూపొందించింది. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల తరలింపు నిమిత్తం ప్రాథమిక, మాధ్యమిక రవాణా సదుపాయాలను అన్వేషించేందుకు రైతులు, వ్యాపారులు ఈ యాప్‌ను వాడుకోవచ్చు. ప్రాథమిక రవాణా అంటే- పొలం నుంచి మండీలకు తరలింపు కాగా... రాష్ట్రంలో లేదా రాష్ట్రాల మధ్య, ఆహార ఉత్పత్తి యూనిట్లకు, రైల్వేస్టేషన్‌కు, గిడ్డంగులకు, టోకు వ్యాపారులవద్దకు తరలించే సదుపాయాలు మాధ్యమిక రవాణాలో భాగంగా ఉంటాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615436

దిగ్బంధం సమయంలో దేశవ్యాప్తంగా 418 టన్నుల వైద్య సరఫరాల్లో పాలుపంచుకున్న 247 లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు

దిగ్బంధం సమయంలో ఎయిరిండియా, అలయెన్స్‌ ఎయిర్‌, ఐఏఎఫ్‌, ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ఇప్పటివరకూ 247 లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలను నడిపాయి. వీటిలో 154 విమానాలు 418 టన్నుల వైద్య సరఫరాలను రవాణా చేశాయి. ఈ మేరకు మొత్తం 2.45 లక్షల కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615216

దిగ్బంధం సమయంలో దేశవ్యాప్తంగా సగటు కన్నా రెట్టింపు పరిమాణంలో ఆహార ధాన్యాలను రవాణా చేసిన ఎఫ్‌సీఐ

ప్రస్తుత దిగ్బంధ స‌మ‌యంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రికార్డు స్థాయిలో 1335 రైళ్ల ద్వారా రోజుకు సగటున 1.7 లక్షల టన్నుల వంతున 3.74 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను తరలించింది. ఎఫ్‌సీఐ లోగడ సగటున రోజుకు 0.8 లక్షల టన్నులు రవాణా చేస్తుండగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది రెట్టింపుకన్నా ఎక్కువ. కాగా, లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఆహారధాన్యాల అవసరాలున్న వినియోగదారుల కోసం వివిధ రాష్ట్రాలు 3.3 మిలియన్ టన్నుల నిల్వలను స్వీకరించాయి. 

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615264

పీఎంజీకేవై ప్యాకేజీ కింద 15 రోజుల్లో 3.31 లక్షల కోవిడ్‌-19 అభ్యర్థనలను పరిష్కరించిన ఈపీఎఫ్‌వో

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కేవలం 15 రోజుల్లోనే 3.31 లక్షల కోవిడ్‌-19 సంబంధిత అభ్యర్థనలను పరిష్కరించి భవిష్యనిధి చందాదారులకు రూ.946.49 కోట్లు పంపిణీ చేసింది. మరోవైపు మినహాయింపుగల భవిష్యనిధి ట్రస్టులు ఇదే పథకం కింద రూ.284 కోట్లు పంపిణీ చేయగా, టీసీఎస్‌ కంపెనీ అన్నిటికన్నా ముందంజలో ఉంది. కాగా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త నిబంధన మేరకు- 3 నెలల మూలవేతనం, కరవుభత్యం మొత్తానికి సమానంగా తిరిగి చెల్లించే అవసరంలేని విధంగా లేదా భవిష్యనిధి ఖాతాలో చందాదారు వాటాలోని మొత్తంలో 75 శాతం... ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని సభ్యులు తీసుకోవచ్చు. చందాదారులు ఇంతకన్నా తక్కువ మొత్తం కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615170

విద్యార్థుల

కోవిడ్‌-19

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615159

కోవిడ్‌-19 నియంత్రణలో సాయుధ దళ వైద్యసేవల తీరుపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్ష

కోవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణలో సాయుధ దళ వైద్యసేవలతోపాటు పౌర అధికారులకు వారు సహకరిస్తున్న తీరును రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇవాళ సమీక్షించారు. ప్రస్తుత ఆరోగ్య సంక్షోభ సమయంలో ఆయా దళాల వైద్యసేవా సంస్థలు కల్పించిన మౌలిక వసతులను, సిబ్బంది సేవలను, పౌర అధికార యంత్రాంగాలకు తాము సహకరిస్తున్న తీరును అధికారులు ఈ సందర్భంగా రక్షణ మంత్రికి వివరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615366

కోవిడ్-19 వ్యాధి సంబంధిత రోగ‌కార‌క నిర్మూల‌న‌కు రెండు కొత్త ఉత్ప‌త్తుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన డీఆర్‌డీవో

కోవిడ్ -19పై పోరాటంలో త‌న వంతు పాత్ర‌గా ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న‌-అభివృద్ధి సంస్థ కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల కోసం నిత్యం ప‌రిత‌పిస్తోంది. ఈ మేర‌కు త‌నవ‌ద్ద‌గ‌ల సాంకేతిక ప‌రిజ్ఞానం, అనుభ‌వాల అమ్ముల పొదినుంచి అనేక ప‌రిష్కారాల‌ను రూపొందించింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడగల అనేక ఆవిష్కరణలు వీటిలో ఉన్నాయి. ఈ కృషిలో భాగంగా ఇవాళ రెండు కొత్త  ఉత్ప‌త్తుల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇవి బహిరంగ ప్రదేశాల్లో క‌రోనా మ‌హ‌మ్మారి నియంత్ర‌ణ‌కు ఇతోధికంగా తోడ్ప‌డ‌తాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615402

భారత సాఫ్ట్‌వేర్‌ పార్కుల (ఎస్టీపీఐ) కేంద్రాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఐటీ కంపెనీలకు 4 నెలల అద్దె రద్దు

భారత సాఫ్ట్‌వేర్‌ పార్కుల (ఎస్టీపీఐ)లో కార్యకలాపాలు నిర్వహించే చిన్న ఐటీ కంపెనీలకు అద్దె చెల్లింపునుంచి ఊరట కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిలో అధికశాతం సాంకేతిక సూక్ష్మ-చిన్న-మధ్యతరహా సంస్థలు, అంకుర సంస్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌-ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వీటికి 01.03.2020 నుంచి 30.06.2020 వరకు... అంటే- నాలుగు నెలల అద్దెను రద్దుచేయాలని నిర్ణయించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615052

గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ప్రతిష్టాత్మక పథకాలపై శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ సమగ్ర సమీక్ష

దేశంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ) పథకం కింద రెండో, మూడో వాయిదా నిధులు పొందిన సుమారు 40 లక్షల మంది లబ్ధిదారులు సత్వరమే ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకునేందుక సహాయపడాలని శ్రీ తోమర్‌ అధికారులను ఆదేశించారు. కాగా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2019-20 ఆర్థిక సంవత్సరం బకాయిలతోపాటు 2020-21 తొలి పక్షం వేతన బకాయిల చెల్లింపు నిమిత్తం వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం రూ.7,300 కోట్లు విడుదల చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615211

దూరదర్శన్‌-ఆకాశవాణిద్వారా పాఠ్యాంశ/ప్రత్యక్ష తరగతుల ప్రసారం

ప్రస్తుత దిగ్బంధం నడుమ విద్యార్థుల చదువు కొనసాగేందుకు భారత ప్రభుత్వ ప్రసార సంస్థ తనవంతు తోడ్పాటునిస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో దూరదర్శన్‌, ఆకాశవాణి మాధ్యమాలు తమ ప్రాంతీయ టీవీ, రేడియో, యూట్యూబ్‌ చానళ్లద్వారా దేశవ్యాప్తంగా పాఠ్యాంశాలను, ప్రత్యక్ష తరగతులను ప్రసారం చేస్తున్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615260

దిగ్బంధం వేళ సామాన్యుడికి స‌హాయ‌ప‌డుతున్న రోడ్డు ర‌వాణా రంగం

కోవిడ్ -19 కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా దిగ్బంధం కొన‌సాగుతున్న ప్ర‌స్తుత‌ స‌మ‌యంలో సామాన్యుడికి స‌హాయ‌ప‌డే సామాజిక బాధ్య‌త‌ను కేంద్ర రోడ్డుర‌వాణా-జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ‌శాఖ స‌మ‌ర్థంగా నిర్వ‌ర్తిస్తోంది.  ఈ మేరకు గతనెల 24న ప్రధానమంత్రి ప్రకటన చేయగానే- మంత్రిత్వశాఖ పరిధిలో దేశమంతటాగల క్షేత్రస్థాయి యూనిట్లలో కార్మికులకు/కూలీలకు సహాయసహకారాలు అందించాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615433

‘చిత్ర జీనీల్యాంప్‌-ఎన్‌’తో పరీక్షద్వారా రెండు గంటల్లో కోవిడ్‌-19 నిర్ధారణ

సార్స్‌-కరోనావైరస్‌2లోని ‘ఎన్‌’ జన్యువును గుర్తించగల ఆర్‌టి-ఎల్‌ఏఎంపి (రివర్స్‌ ట్రాన్స్‌ స్క్రిప్టేజ్‌ లూప్‌-మీడియేటెడ్‌ యాంప్లిఫికేషన్‌ ఆఫ్‌ వైరల్‌ న్యూక్లిక్‌ యాసిడ్‌) పరీక్ష పద్ధతి అందుబాటులోకి రానుంది. ప్రపంచంలో ఇంతవేగంగా నిర్ధారణ ఫలితం వెల్లడించగల తొలి పద్ధతులలో ఇది ఒకటి లేదా ఏకైక విధానం కావచ్చు.  

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1615210

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

 • అరుణాచల్‌ ప్రదేశ్‌: రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో చిక్కుకుపోయిన రోగులు రాష్ట్రంలోని తమ సొంత జిల్లాలకు వెళ్లడం కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.
 • అసోం: దేశంలోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న అసోం వాసుల కోసం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రానికి 4 లక్షలకుపైగా కుటుంబాల నుంచి కాల్స్‌ వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు.
 • మేఘాలయ: రాష్ట్రంలో నిర్వహించ తలపెట్టిన సైనిక నియామక ప్రక్రియ కోవిడ్‌-19 పరిస్థితుల దృష్ట్యా అక్టోబరు 5-8 తేదీలకు వాయిదాపడింది.
 • మణిపూర్‌: రాష్ట్రంలోని తమెంగ్‌లాంగ్‌ జిల్లాలో నిత్యావసరాల దుకాణాలను మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:30 గంటలవరకు తెరిచేందుకు డిప్యూటీ కమిషనర్‌ అనుమతించారు.
 • నాగాలాండ్‌: రాష్ట్రంలో తొలి కోవిడ్‌-19 రోగితో సంబంధమున్న 140 మంది నమూనాల పరీక్ష అనంతరం 100 మందికి వైరస్‌ సోకలేదని తేలింది. మిగిలిన 40 మంది నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.
 • త్రిపుర: రాష్ట్రంలో దిగ్బంధం సమయాన 25,025 మందికి 19 రోజులపాటు ఆర్థిక మద్దతు కోసం ప్రభుత్వం రూ.2.85 కోట్లు కేటాయించింది.
 • కేరళ: రాష్ట్రంలోని కుట్టనాడ్‌, చవారా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను దిగ్బంధ సమయంలో నిర్వహించే అవకాశం లేదని ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ప్రధానాధికారి చెప్పారు. త్రివేండ్రంలోని శ్రీచిత్ర ఇన్‌స్టిట్యూట్‌ సత్వర పరీక్ష కిట్లను రూపొందించింది. దీనికి ఐసీఎంఆర్‌ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఇక రాష్ట్రంలో నిన్న 7 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 394కు చేరింది. కోలుకున్నవారి సంఖ్య 245 కాగా, యాక్టివ్‌ కేసులు 147గా ఉన్నాయి.
 • తమిళనాడు: రాష్ట్రంలోని తిరుచ్చిలోగల ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రిలో 32 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. కాగా, రాష్ట్రానికి 24,000 సత్వర పరీక్ష కిట్లు అందాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్వహణ త్వరలో పునఃప్రారంభం కానుంది. ఇక ఈ ఉత్పాతం నుంచి బయటపడే వ్యూహం రూపకల్పన కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం కేసులు 1,267 కాగా, మరణాలు 15గానూ, డిశ్చార్జి అయినవారి సంఖ్య 180గానూ నమోదైంది.
 • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 38 కేసులు నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 353కు చేరింది. కొత్త కేసులలో మైసూర్‌ 12, మాండ్య 3, బళ్లారి 7, బెంగళూరు 9, దక్షిణ కానడ 1, చిక్కబళ్లాపూర్‌ 3, బీదర్‌ 1, విజయపుర 2 వంతున నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 13కు చేరగా, 82 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 353గా ఉంది.
 • ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 572కు చేరింది. కోలుకుని ఇళ్లకు వెళ్లినవారు 35 మందికాగా, మరణాలు 14గా ఉన్నాయి. కాగా, దక్షిణ కొరియానుంచి లక్ష సత్వర పరీక్ష కిట్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటితో నియంత్రణ మండళ్లలో విస్తృత పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలవారీగా అత్యధిక కేసుల రీత్యా గుంటూరు 126, కర్నూలు 126, నెల్లూరు 64, కృష్ణా 52 వంతున తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
 • తెలంగాణ: రాష్ట్రంలోని నిజామాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి కోవిడ్‌-19తో సౌదీ అరేబియాలో మరణించాడు. కాగా, సూర్యాపేటలో మరో 5 కేసులు నమోదయ్యాయి. మరో 600 నమూనాల పరీక్ష ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్‌ చికిత్స కోసం ప్లాస్మా పద్ధతి వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్‌ అనుమతి కోరింది.
 • మహారాష్ట్ర: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నానికి 34 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,236కు చేరింది. ఒకవైపు వ్యాధిబారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతుండగా, కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. ఈ మేరకు 295 మంది కోలుకోగా వారిలో ముంబైకి చెందినవారు 166 మంది ఉండటం గమనార్హం. అయితే, దేశంలో సంభవించిన కోవిడ్‌ మరణాల్లో 40 శాతం... అంటే- 194 మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.
 • గుజరాత్‌: రాష్ట్రంలో ఈ ఉదయం వేళకు 92 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,021కి చేరింది. కొత్త కేసులలో అహ్మదాబాద్‌ 45, సూరత్‌ 14, వడోదరలో 9 వంతున నమోదయ్యాయి. రాష్ట్రంలో మరణాల సంఖ్య 38కి చేరింది. రాష్ట్రంలో ప్లాస్మా చికిత్స ప్రక్రియ వినియోగం కోసం ప్రభుత్వం ఐసీఎంఆర్‌ అనుమతి కోరింది.
 • రాజస్థాన్‌: రాష్ట్రంలో ఇవాళ 34 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,169కి చేరింది. కొత్త కేసులలో 18 ఒక్క జోధ్‌పూర్‌లోనే నమోదయ్యాయి. మరోవైపు ఇప్పటిదాకా రాష్ట్రంలో 16 మరణాలు నమోదయ్యాయి.
 • మధ్యప్రదేశ్‌: రాష్ట్రంలో మరో 226 మందికి వ్యాధి నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,164కు చేరింది. మొత్తంమీద ఇప్పుడు 52 జిల్లాలకుగాను 26 జిల్లాల్లో వైరస్‌ విస్తరించింది. అత్యధికంగా ఇండోర్‌లో 707 కేసులున్నాయి. కాగా, గడచిన 24 గంటల్లో 163 కొత్త కేసులు నమోదయ్యాయి.
 • చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని పౌరులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పాలనాధికారి ఆదేశించారు. కాగా, కేంద్రపాలిత ప్రాంత పాఠశాలల్లో మధ్యాహ్నభోజన కేంద్రాల్లో ఆహార పొట్లాల తయారీ ప్రారంభించారు.
 • పంజాబ్‌: దిగ్బంధ సమయంలో వైద్య, మానసిక ఒత్తిడి సంబంధిత కేసుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం 1800 180 4104 నంబరుతో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీనిద్వారా ప్రజలు  సీనియర్‌ డాక్టర్ల నెట్‌వర్క్‌తో సంప్రదించి వైద్య సలహాలు పొందవచ్చు.
#కోవిడ్ -19 లో వాస్తవ తనిఖీ

 

https://pbs.twimg.com/profile_banners/231033118/1584354869/1500x500

Daily Social Media Report (PIB) for 17.4.2020

Twitter

*****

 (Release ID: 1615576) Visitor Counter : 225