గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్ర గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమం శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన అన్ని ప్రధాన పథకాలపై సవివరమైన సమీక్ష జరిపారు
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ పథకం 'నరేగా ' కింద రూ . 7300 కోట్లు విడుదల చేశారు. ఈ సొమ్మును 2019-20 ఆర్ధిక సంవత్సరం పెండింగ్ బకాయిలను, 2020-21 ఆర్ధిక సంవత్సరం ప్రధమ పక్షం బకాయిలను తీర్చడానికి ఈ నిధులు విడుదల చేశారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) కింద రెండవ, మూడవ విడత నిధులు అందిన 40 లక్షల లబ్ధిదారుల ఇళ్లను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని శ్రీ తోమార్ సలహా ఇచ్చారు
Posted On:
16 APR 2020 6:58PM by PIB Hyderabad
కేంద్ర గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమం శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమార్ గ్రామీణ అభివృద్ధిమంత్రిత్వ శాఖకు చెందిన ప్రధాన పథకాలపై గురువారం జరిపిన సవివరమైన సమీక్షలో సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి , గ్రామీణ అభివృద్హి శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ మరియు మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 'నరేగా ' కింద రూ .7300 కోట్లు విడుదల చేసిన సొమ్మును 2019-20 ఆర్ధిక సంవత్సరంలో పెండింగ్ బకాయిలను, 2020-21 ఆర్ధిక సంవత్సరం ప్రధమ పక్షం బకాయిలను తీర్చడానికి వాడటం ప్రశంసనీయమని అన్నారు. కరోనా కట్టడి లేని ప్రాంతాలలో సామాజిక దూరం పాటిస్తూ నరేగా పనులను ప్రారంభించాలని ఆయన అభిలషించారు. అదే విధంగా నీటిపారుదల, జల సంరక్షణ మరియు భూమి కోత నివారణకు చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని అన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 93000 మంది స్వయం సహాయక బృందాలకు చెందిన సభ్యులు మాస్కులు, శానిటైజర్లు ఉత్పత్తి చేస్తున్నారని, నిరుపేదలు, దుర్భలుల కోసం వంటలు చేస్తూ వారి ఆకలి తీరుస్తున్నారని మంత్రి అభినందించారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి, ద్రవ్య నిల్వలు పెంచడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు సఖి , పశు సఖిల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకోవడంపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు.
దీన్ దయాళ్ గ్రామీణ కౌశల్ యోజన కోసం ఈ -కంటెంట్ అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్ ) కింద రాష్ట్రాలకు రూ . 800. 63 కోట్లు విడుదల చేయడం జరిగిందని మన్తర్హి వెల్లడించారు. రెండవ, మూడవ విడత నిధులు పొందిన 40 లక్షల మంది లభిదారుల ఇళ్లను సత్వరం పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. .
లాక్ డౌన్ సమయాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకొని 'దిశ' కమిటీల సమావేశాలను క్రమబద్ధం చేయాలని , దిశ కమిటీల సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలు అమలు జరిగేలా దిశ వేదికను అర్ధవంతంగా మార్చాలని అన్నారు.
(Release ID: 1615211)
Visitor Counter : 202