ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
Posted On:
17 APR 2020 5:59PM by PIB Hyderabad
కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా అత్యధిక స్థాయిలో సమీక్షించడంతో పాటు పర్యవేక్షిస్తున్నారు.
కోవిడ్ -19పై మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) 12వ సమావేశం నిర్మాణ్ భవన్ లో జరిగింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ అధ్యక్షతన లాక్ డౌన్ ప్రభావం మరియు రోడ్ మ్యాప్ రూపకల్పనపై మంత్రుల బృందం వివరణాత్మక చర్చను నిర్వహించింది. రోగ నిర్ధారణ, టీకాలు, మందులు, ఆసుపత్రి పరికరాలు, ఉపకరణాలు మరియు సాధారణ ఆరోగ్యవంతులు కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి శాస్త్ర సాంకేతిక సంస్థలు చేసిన ప్రయత్నాలను కూడా మంత్రుల బృందం సమీక్షించింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, బయో టెక్నాలజీ విభాగం, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సి.ఎస్.ఐ.ఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ.సి.ఎం.ఆర్) మరియు అటామిక్ ఎనర్జీ విభాగం (డి.ఈ.ఏ) మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కలిసి పని చేస్తున్నాయి.
· 30 నిముషాల్లో ఫలితాలను ఇవ్వగల కొత్త వేగవంతమైన మరియు కచ్చితమైన విశ్లేషణను తయారు చేయడం
· వారి 30 ప్రయోగ శాలల ద్వారా ఆగ్మెంట్ పరీక్ష సామర్థ్యం
· పరీక్షించగలిగే వ్యక్తుల సంఖ్యను పెంచడానికి వినూత్న పూలింగ్ వ్యూహాల అభివృద్ధి
· దేశీయ టెస్ట్ కిట్ ఉత్పత్తిని పరిమితం చేసే క్లిష్టమైన భాగాల స్వదేశీ సంశ్లేషణ
· ఎపిడెమియాలజీకి సహాయపడే మరియు ముఖ్యమైన ఉత్పరివర్తనాలకు గుర్తించగల వైరల్ సీక్వెన్సింగ్ పెంచడం.
క్రియారహిత వైరస్ వ్యాక్సిన అభివృద్ధి, ప్రధాన యాంటిజెన్లకు ప్రతిరోధకాలు, మోనోక్లోనల్ మరియు ఆర్.ఎన్.ఏ. ఆధారిత వ్యాక్సిన్లల పై కూడా పురోగతి నివేదించబడింది. కొన్ని చోట్ల కన్వాల్సెంట్ ప్లాస్మా థెరఫీ కూడా ప్రారంభించబడింది.
సమర్థవంతమైన వ్యాక్సిన్ల అభివృద్ధి మరియు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రపంచ స్థాయి భాగస్వాములతో కలిసి పని చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సాలిడటరీ ట్రైల్ లో భారతదేశం పాల్గొంటుంది. దీని ద్వారా ఈ చికిత్సల ప్రభావం నిర్ణయించబడుతుంది. కోవిడ్ -19 విషయంలో శాస్త్రీయ టాస్క్ ఫోర్స్ ఇప్పటికే ఉన్న ఆమోదించిన ఔషధాలను అంచనా వేస్తోంది. ఉమిఫెనోవిర్, ఫావిపిరవిర్ వంటి మల్టిపుల్ ప్రామిసింగ్ యాంటీ వైరల్ మాలిక్యూల్స్ స్వదేశీ సంశ్లేషణగా సి.ఎస్.ఐ.ఆర్. అభివృద్ధి చేసింది. ఆయుష్ మంత్రిత్వ శాఖతో పాటు సంప్రదాయ వైద్య విధానాల నుంచి ఫైటో ఫార్మా స్యూటికల్స్ మరియు లీడ్స్ కోసం సమాంతర అన్వేషణ సాగుతోంది.
వ్యక్తిగత రక్షణ పరికరాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, వెంటిలేటర్లు వంటి సహాయ పరికరాలను శ్రీ చిత్ర తిరుమలై ఇనిస్టిట్యట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి) స్వదేశీ డిజైన్లతో సి.ఎస్.ఐ.ఆర్. ఇంజనీరింగ్ ల్యాబ్ లు డి.ఎస్.టి కింద అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్టీ-పి.సి.ఆర్. కిట్ల స్వదేశీ తయారీ ప్రారంభమైంది. 2020 మే నుంచి నెలకు 10 లక్షల కిట్లను ఉత్పత్తి చేయనున్నారు. రాపిడ్ యాంటీ బాడీ డిటెక్షన్ కిట్లు కూడా 2020 మే నాటికి నెలకు 10 లక్షల కిట్లు ఉత్పత్తి కానున్నాయి. అధిక కేసుల ఆధారంగా వివిధ రాష్ట్రాల్లోని జిల్లాల్లో 5 లక్షల రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్లు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం నెలకు 6 వేల వెంటిలేటర్ల తయారీ సామర్థ్యం ఉంది. డయాగ్నస్టిక్స్, థెరఫ్యూటిక్స్ మరియు వ్యాక్సిన్ రంగాల్లో అవసరమైన ప్రయత్నాలను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యుద్ధ ప్రాతిపదికన పర్యవేక్షిస్తోంది.
అదనంగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కేస్ లోడ్ ల అంచనా ఆధారంగా కోవిడ్ కు సంబంధించిన వివిధ మౌలిక సదుపాయాల ప్రణాళిక కోసం రాష్ట్రాలు, జిల్లా నిర్వాహకులతో అంచనా సాధనాలను పంచుకుంది.
మొత్తంగా కోవిడ్ -19 కోసం అచ్చంగా అంకితమైన ఆస్పత్రులు కేంద్ర మరియు రాష్ట్రాల స్థాయిల్లో గుర్తించబడ్డాయి.
· 672 డెడికేటెడ్ కోవిడ్ హాస్పిటల్స్ (డి.సి.హెచ్), ( 107830 ఐసోలేషన్ పడకలు మరియు 14742 ఐ.సి.యూ పడకలతో)
· 1247 డెడికేటెడ్ కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు (డి.సి.హెచ్.సి) (మొత్తం 65,916 ఐసోలేషన్ పడకలు మరియు 7,064 ఐ.సి.యు. పడకలతో)
వీటితో కలిపి 1,73,746 ఐసోలేషన్ పడకలు మరియు 21,806 ఐ.సి.యు. పడకలు కలిగిన మొత్తం 1919 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
లాక్ డౌన్ కు ముందు భారతదేశంలో 3 రోజులకు ఓ సారి రెట్టింపు రేటు నమోదు అయ్యేది. ప్రస్తుతం ఇది 6.2 రోజులకు పెరిగింది. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (కేరళ, ఉత్తరాఖండ్, హర్యానా, లడఖ్, హిమాచల్, చండీగఢ్, పుదుచ్చేరి, బీహార్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, అస్సాం, త్రిపుర) రెట్టింపు రేటు జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. ఇది వివిధ ప్రాంతాల్లో పెరుగుదల రేటు కొంతవరకూ తగ్గిన విషయాన్ని తెలియజేస్తుంది.
మార్చి 15 నుంచి మార్చి 31 వరకూ గడచిన రెండు వారాల్లో ఉన్న 2.1 పెరుగుదలతో పోలిస్తే 2020 ఏప్రిల్ 1 నుంచి 1.2 శాతం వృద్ధి చెందుతోంది. అంటే 40 శాతం క్షీణత కనిపిస్తోంది.
నిన్నటి నుంచి 1007 కొత్త కేసులు మరియు 23 కొత్త మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం 13,387 కోవిడ్ -19 కేసులు నిర్థారించబడ్డాయి. మొత్తం 1749 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
కోవిడ్ -19 సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాదారులతో పాటు ప్రామాణిక, నూతన సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ ను సందర్శించండి.
కోవిడ్ -19 సాంకేతిక సందేహాల కోసం technicalquery.covid19[at]gov[dot]in మరియు ఇతర సందేహాల కోసం ncov2019[at]gov[dot]in కు ఈ మెయిల్ చేయవచ్చు.
కోవిడ్ -19 కు సంబంధించి ఇతర సందేహాలు ఉంటే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ నంబర్ +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ నంబర్లు)కు కాల్ చేయవచ్చు. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల కోవిడ్ -19 హెల్ప్ లైన్ నంబర్లు https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf లింక్ లో అందుబాటులో ఉన్నాయి.
--
(Release ID: 1615441)
Visitor Counter : 351
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam