ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 నిర్వహణ చర్యలు తాజా స్థితిగతులపై జిఓఎం సమీక్ష
సకాలంలో అవసరాలను అందుబాటులో ఉంచడమే కీలకం : జిఓఎం
కోవిడ్-19 కి సంబంధించిన తక్షణ పరిష్కారాలు అవసరమని నొక్కి చెప్పిన డాక్టర్ హర్ష వర్ధన్; తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించడంపై ప్రత్యేక శ్రద్ధ
Posted On:
17 APR 2020 5:30PM by PIB Hyderabad
కోవిడ్-19 పై మంత్రుల బృందం (జిఓఎం) 12 వ సమావేశం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షతన ఈ రోజు నిర్మాణ్ భవన్లో జరిగింది . పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్, హోంశాఖ సహాయ మంత్రి ఎస్. నిత్యానంద రాయ్, షిప్పింగ్, రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వినోద్ కె. పాల్, రక్షణ దళాల చీఫ్ శ్రీ బిపిన్ రావత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కోవిడ్-19 నియంత్రణ, నిర్వహణపై మంత్రుల బృందం (జిఓఎం) వివరణాత్మక చర్చ జరిపింది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, నివారణ వ్యూహంగా సామాజిక దూరం చర్యల ప్రస్తుత స్థితి కోవిడ్-19 వ్యాప్తిని కలిగి ఉండటానికి కేంద్రం, రాష్ట్రాలు తీసుకున్న కఠినమైన చర్యలపై కూడా బృందం చర్చించింది. అన్ని జిల్లాలు కోవిడ్-19ని ఎదుర్కోడానికి ఆపత్కాల కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోమని ఆదేశాలు ఇచ్చినట్టు అధికారులు మంత్రుల బృందానికి వివరించారు.
ఈ దిశగా రాష్ట్రాలు సామర్ధ్యాన్ని పెంచుకోవడం, కోవిడ్ -19 కోసం ప్రత్యేకంగా ఆస్పత్రులను ఏర్పాటు చేయడం, పీపీఈలు, వెంటిలేటర్లు, ఇతర అత్యవసర పరికరాలు అందుబాటులో ఉండడంపై కూడా చర్చించారు.
ప్రస్తుతం మరణాల రేటు 3% ఉండగా, వ్యాధి నుండి బయటపడ్డ వారి రేటు 12% ఉన్నట్టు సమావేశంలో వెల్లడించారు. సకారాత్మకంగా ఆలోచిస్తే మిగిలిన దేశాలకన్నా మన దేశంలోనే పరిస్థితి మెరుగ్గా ఉందని సమావేశం అభిప్రాయపడింది. అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్ల సంఖ్య, క్లస్టర్ల నిర్వహణ, హాట్ స్పాట్లు తదితర వివరాలను సమీక్షించింది. మొత్తం 170 జిల్లాలు రెడ్ జోన్ (హాట్ స్పాట్) పరిధిలో ఉన్నాయని, వీటిలో 123 జిల్లాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని, మరో 47 జిల్లాల్లో క్లస్టర్లు గా ఉన్నాయని సమావేశంలో వివరించారు. 207 హాట్ స్పాట్ కాని జిల్లాలు కాగా వ్యాధి సోకని 353 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి. గత 14 రోజులలో ఎటువంటి కేసు నమోదు కాకపోతే రెడ్ జోన్ జిల్లాను నారింజ జోన్ కింద ఉంచుతారు, వచ్చే 14 రోజుల్లో ఎటువంటి కేసులు నమోదు కాకపోతే ఆ జిల్లా గ్రీన్ జోన్ పరిధిలోకి వస్తుంది.
పిపిఇల ఉత్పత్తికి దేశీయ తయారీదారులను గుర్తించామని, ఆర్డర్లు ఉంచామని జివోఎంకి అధికారులు వివరించారు. ల్యాబ్‌ల నెట్‌వర్క్ ద్వారా ప్రతిరోజూ నిర్వహిస్తున్న పరీక్షల సంఖ్యతో పాటు ప్రస్తుతం కోవిడ్-19 కోసం పరీక్షిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్‌ల సంఖ్య గురించి జిఓఎం సమీక్షించింది.
శాస్త్ర సాంకేతిక విభాగం (డిఎస్టి), బయో-టెక్నాలజీ విభాగం (డిబిటి), కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) కోవిడ్-19 కి సంబంధించిన రోగ నిర్ధారణ, మందులు, వ్యాక్సిన్ అభివృద్ధిపై ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో నివేదిక ఇచ్చాయి. ఈ సంస్థలు ఐసిఎంఆర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలతో పాటు కోవిడ్ -19 నిర్వహణకు పరిష్కారాలు కనుగొనడానికి కలిసి పనిచేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రి ఇటీవల సిఎస్‌ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి. మాండే, ఇతర సిఎస్ఐఆర్ ల్యాబ్ డైరెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. సి.ఎస్.ఐ.ఆర్, దాని 38 ప్రయోగశాలలు చేపట్టిన చర్యలను సమీక్షించారు. దేశంలో కోవిడ్-19 వ్యాప్తి నిరోధంపై సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు, సకాలంలో పరిష్కారాల లభ్యత ముఖ్యమని జిఓఎం సభ్యలు అభిప్రాయపడ్డారు.
పరికరాల తయారీలో ఎటువంటి నాణ్యత ప్రమాణాల లోపం జరగకుండా చూడాలని డాక్టర్ హర్ష్ వర్ధన్ సూచించారు. వీటిలో ఏ మాత్రం ఏమరుపాటు చూపినా అటువంటి తయారీదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. మాస్కులు, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) ఎటువంటివి ఎవరు ధరించాలి అనే విషయాలను మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో స్పష్టంగా పేర్కొనాలని మంత్రి ఆదేశించారు. సామజిక దూరం, ఐసొలేషన్ కోవిడ్-19 కి పరమఔషధాలని, ఈ మేరకు లోక్ డౌన్ తగు విధంగా ప్రోటోకాల్, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంత్రి అన్నారు.
వైద్య ఆరోగ్య సంక్షేమ కార్యదర్శి శ్రీమతి ప్రీతి సుడాన్, జౌళి శాఖ కార్యదర్శి శ్రీ రవి కపూర్, పౌర విమానయాన కార్యదర్శి శ్రీ ప్రదీప్ సింగ్ కరోలా, ఫార్మస్యూటికల్స్ కార్యదర్శి శ్రీ పి.డి.వాఘేలా, బయో టెక్నాలోజి కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్, శాస్త్ర సాంకేతిక కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి. మండే, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ సంజీవ కుమార్, అదనపు కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్, ఐటీబీపీ డీజీ శ్రీ ఆనంద స్వరూప్, డిజిఎహ్ఎస్ డాక్టర్ రాజీవ్ గార్గ్, అంటువ్యాధుల విభాగాధిపతి డాక్టర్ రామం ఆర్ గంగాఖేద్కర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తదితర అధికారులు పాల్గొన్నారు. కోవిడ్-19 కి సంబంధించిన సందేహాలు, ఇతర వివరాలకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
హెల్ప్ లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ); వెబ్ సైట్: https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf
***
(Release ID: 1615543)
Visitor Counter : 217
Read this release in:
English
,
Gujarati
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam