మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

పాఠశాలల కోసం ప్రత్యామ్నాయ ఎన్.సి.ఈ.ఆర్.టి. అకాడమింక్ కాలెండర్ ను విడుదల చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి

ఒకటి నుంచి 12 తరతుల వరకూ అన్ని అంశాలు, సబ్జెక్టులు ఈ క్యాలెండర్ పరిధిలోకి వస్తాయన్న కేంద్ర మంత్రి

Posted On: 16 APR 2020 4:31PM by PIB Hyderabad

కోవిడ్ -19 కారణంగా విద్యార్థులు ఇంటికే పరిమితమై ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులకు సమయం సదుపయోగం చేసుకునే విధంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్గదర్శకత్వంలో ఎన్.సి.ఈ.ఆర్.టి. ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ ను అభివృద్ధి చేసింది. ఈ క్యాలెండర్ ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్ ఈ రోజు న్యూఢిల్లీలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు ఆహ్లాదకరమైన మరియు ఆసక్తికరమైన మార్గాల్లో విద్యను అందించేందుకు అందుబాటులో ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు మరియు సోషల్ మీడియా సాధనాలపై మార్గదర్శకాలను అందిస్తుందని, విద్యార్థులు ఇంట్లో ఉంటూనే నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఏదేమైనా, మొబైల్, రేడియో, టెలివిజన్, ఎస్.ఎం.ఎస్ మరియు వివిధ సోషల్ మీడియా సాధనాలను వివిధ స్థాయిల్లో ఇది పరిగణలోకి తీసుకుంటుందని, అదే విధంగా చాలా మందికి ఇంటర్నెట్ సదుపాయం ఉండదని, అలాంటి వారు వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ లాంటివి వినియోగించుకునే పరిస్థితి లేదని, అలాంటి పరిస్థితుల్లోనూ ఈ కాలెండర్ ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేస్తుందని, మొబైల్ ఫోన్లలో మొబైల్ కాల్ లేదా ఎస్.ఎం.ఎస్. లాంటి సౌకర్యాలతో దీన్ని వినియోగించుకోవచ్చని, ఈ కాలెండర్ అమలుకు ప్రాథమిక దశలో విద్యార్థుల తల్లిదండ్రులు సహాయం చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

1 నుంచి 12 వరకూ అన్ని తరగతులు ఈ క్యాలెండర్ పరిధిలోకి వస్తాయని, ఆడియో పుస్తకాల లింక్ లు, రేడియో కార్యక్రమాలు, వీడియో కార్యక్రమాలతో ఇది దివ్యాంగులైన విద్యార్థులు సహా అందరి అవసరాలను తీరుస్తుందని తెలిపారు. ఈ సిలబస్ ఆసక్తికరమైన అంశాలతో వారం వారీ ప్రణాళిక కలిగి ఉంటుందన, మరీ ముఖ్యంగా ఇది ఇతివృత్తాలను అభ్యాస ఫలితాలతో చూపిస్తుందని, దీని ద్వారా సులభంగా పిల్లల పురోగతిని అంచనా వేయవచ్చని, ఈ పురోగతి పాఠ్యపుస్తకాల స్థాయిని దాటి ఉంటుందని శ్రీ ఫోఖ్రియాల్ తెలిపారు.

ఆర్ట్స్ ఎడ్యుకేషన్, శారీరక వ్యాయామాలు, యోగా, పూర్వవృత్తి నైపుణ్యాలు వంటి అనుభవ పూర్వక అభ్యాస కార్యకలాపాలు కూడా ఈ కాలెండర్ లో భాగంగా ఉంటాన్న కేంద్ర మంత్రి, ఇందులో తరగతి వారీగా మరియు విషయ వారీగా కార్యకలాపాలు పట్టిక రూపాల్లో ఉంటాయని తెలిపారు ఈ కాలెండర్ లో హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ మరియు సంస్కృతం సహా నాలుగు భాషలకు సంబంధించిన కార్యకలాపాలు ఉన్నాయని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల ఒత్తిడిని తగ్గించే విధంగా ఇవి ఉంటాయని పేర్కొన్నారు. అధ్యాయాల వారీగా ఈ – కంటెంట్ కోసం ఈ కాలెండర్ లింక్ ను కలిగి ఉందని, ప్రభుత్వం యొక్క ఈ –పాఠశాల, ఎన్.ఆర్.ఓ.ఈ.ఆర్, దీక్షా పోర్టల్ లో ఇవి అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

ఇందులో ఇచ్చిన కార్యకలాపాలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయని, వీటిలో బలవంతగా రుద్దేది ఏమీ లేదని, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సందర్భోచింతగా విధ్యార్థుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని వీటి మీద దృష్టి పెట్టవచ్చని కేంద్రమంత్రి తెలిపారు.

ఈ కాలెండర్ డి.టి.హెచ్. ఛానల్స్ ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఎస్.సి.ఈ.ఆర్.టి, డైరక్టరేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ సమితి, సి.బి.ఎస్.ఈ, స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డులు మొదలైన వాటితో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహిస్తుంది.

ఆన్ లైన్ బోధన, అభ్యాస వనరును ఉపయోగించి కోవిడ్ -19 ఎదుర్కోవడానికి సానుకూల మార్గాలను తెలుసుకోవడానికి ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు తల్లిదండ్రులను శక్తివంతం చేస్తుందని, ఇంట్లో ఉంటూ పాఠశాల విద్యను పొందడంలో వారి అభ్యాస ఫలితాలను మెరుగు పరుస్తుందని శ్రీ ఫోఖ్రియాల్ తెలిపారు.

 
***


(Release ID: 1615159) Visitor Counter : 265