పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ యోజన (పిఎంజికెవై) కింద పిఎంయువై లబ్ధిదారులకు ఇప్పటివరకు 1.51 కోట్లకు పైగా ఉచిత ఎల్పిజి సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయి
శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఎల్పిజి డెలివరీ అబ్బాయిల చిత్తశుద్ధిని మరియు కృషిని అభినందిస్తున్నాడు, వారిని ఫ్రంట్లైన్ సైనికులు అని పిలుస్తారు
Posted On:
16 APR 2020 7:29PM by PIB Hyderabad
ప్రధానమంత్రి ఉజ్వల యోజన ( పిఎంయువై) కింద ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులకు ఇంతవరకూ ఒక కోటీ యాభై ఒక లక్షల ఉచిత ఎల్ పి జి సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ నెలలోనే ఈ పంపిణీ జరిగింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ( పిఎం జి కె వై) కింద ఈ పంపిణీ చేశారు.పేద ప్రజల సంక్షేమం కోసం పిఎంకె జి వై కింద కేంద్ర ప్రభుత్వం పలు సహాయక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. వీటిలో ముఖ్యమైనది ఏప్రిల్ నుంచి జూన్ 2020 వరకూ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద 8 కోట్ల మంది లబ్ధి దారులకు ఒక్కొక్కరికి మూడు ఎల్ పి జి సిలిండర్లను ( ఒక్కొక్కటి 14. 2 కేజీలు) అందజేయాలని నిర్ణయించడం.
ఈ పథకం ఎలాంటి ఒడిదుడుకులు లకుండా కొనసాగడానికిగాను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. పిఎంయు వై వినియోగదారురుల అకౌంట్లోకి డబ్బు జమ చేయడం జరుగుతుంది. దాంతో వారు రీ పిల్ గ్యాస్ సిలిండర్‌ను తీసుకోవచ్చు. ప్రతి రోజూ దేశవ్యాప్తంగా 50 నుంచి 60 లక్షల సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. ఇందులో 18 లక్షల సిలిండర్లు పిఎం యు వై లబ్ధిదారులవే.
దీనికి సంబంధించి ఈ రోజు పెట్రోలియం శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలో ఒక వెబినార్ నిర్వహించారు. ఇందులో ఎల్ పి జి సిలిండర్లను పంపిణీ చేసే బాయ్స్ 800 మంది వరకూ పాల్గొన్నారు. వీరితోపాటు పెట్రోలియం శాఖ కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ముందువరసలో నిలబడుకొని కరోనాపై యుద్ధం చేస్తున్నవారిలో ఎల్ పిజి సిలిండర్ డెలివరీ బాయ్స్ కూడా వున్నారని వారిని మంత్రి ప్రశంసించారు. దేశం యావత్తూ వారి సేవలను గుర్తు పెట్టుకుంటుందని ఆయన అన్నారు. విధులపట్ల అంకితభావంతో పని చేస్తూ కరోనా వైరస్ అంటే ఎలాంటి భయం లేకుండా వారు దేశానికి చిత్తశుద్దితో సేవలందిస్తున్నారని ప్రతి రోజూ 60 లక్షల సిలిండర్లను ప్రజలకు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. తమ విధి నిర్వహణలో భాగంగా వారు కరోనా నిరోధం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తూ ప్రజల గౌరవం, అభిమానం పొందారని అన్నారు.
ఈ సందర్భంగా పలువురు సిలిండర్ డెలివరీ బాయ్స్ తమ అనుభవాలను మంత్రితో పంచుకున్నారు. తమ కంపెనీలు తమకు సబ్బు, శానిటైజర్, మాస్క్, గ్లోవ్స్ ను అందించాయని అన్నారు. తాము వినియోగదారులకు అందిస్తున్న సిలిండర్ ను పరిశుభ్రం చేసిన తర్వాతనే వినియోగదారులకు అందిస్తున్నామని చెప్పారు. అలాగే పంపిణీ సమయంలో సామాజిక దూరం ప్రాధాన్యతను వివరిస్తున్నామని అన్నారు. అలాగే కరోనా వైరస్ విషయంలో వినియోగదారులకు తగిన చైతన్యం కలిగిస్తున్నామని ఆరోగ్య సేతు యాప్ ను డౌన్లోడ్ చేసుకోమని చెబుతున్నట్టు చెప్పారు. డబ్బు చెల్లింపులను డిజిటల్ పద్ధతిలో చేయాలని సూచిస్తున్నామని అన్నారు. బాయ్స్ లో కొంత మంది తాము పిఎం కేర్స్ నిధికి విరాళాలు కూడా పంపామని మంత్రికి తెలిపారు. అలాగే తమ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో అక్కడి పేదలకు కూడా సాయం చేస్తున్నామని వారు మంత్రికి తెలిపారు.
*****
(Release ID: 1615214)
Visitor Counter : 235
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada