రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్-19పై పోరాటంలో కంటోన్మెంట్ బోర్డులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్

Posted On: 16 APR 2020 4:55PM by PIB Hyderabad

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డులు తీసుకుంటున్న చర్యలను రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఈ రోజు సమీక్షించారు. బోర్డులన్నీ ఈ దిశగా నిబద్ధతతో పని చేస్తున్నాయని డిఫెన్స్ ఎస్టేట్స్ డైరెక్టర్ జనరల్ (డిజిడిఈ) శ్రీమతి దీప బాజ్వా తెలియజేసారు. 

పారిశుధ్యంఅవసరమైన సేవల నిర్వహణవైద్య సేవలునీటి సరఫరాలో కొనసాగుతున్న చర్యల గురించి శ్రీమతి బాజ్వా రక్షణ మంత్రికి నివేదించారు. కంటోన్మెంట్ బోర్డుల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు జిల్లాల యంత్రాంగంతోనుస్థానిక మిలిటరీ అధికారులతోను సమన్వయము చేసుకుంటూ అందరు సామజిక దూరం పాటించేలాఅందరికి ఆహరంఇతర నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె వివరించారు.

రాష్ట్ర విపత్తు నివారణ నిర్వహణ నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్) నుండి కంటోన్మెంట్ బోర్డులకు నిధుల విడుదల చేయాలని రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ ఈ సమీక్షలో రక్షణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ప్రశంసించిన శ్రీ రాజనాథ్ సింగ్కంటోన్మెంట్ బోర్డులు జనాభా అధికంగా ఉన్న పౌర ప్రాంతాలలో పారిశుధ్యంపరిశుభ్రత విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని నొక్కిచెప్పారు. వలసదారులు / రోజువారీ కూలీలు బలహీన వర్గాలకు ఆహారంఆశ్రయం కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. 

****


(Release ID: 1615156) Visitor Counter : 226