రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
లాక్‌డౌన్ సమయంలో సామాన్యుడికి సాయపడుతున్న రోడ్డు రవాణా రంగం
Posted On:
17 APR 2020 5:30PM by PIB Hyderabad
కోవిడ్ -19 వల్ల దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు సహాయం చేసే సామాజిక బాధ్యతను రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టింది. గత నెల 24 న ప్రధాని లాక్‌డౌన్‌ను ప్రకటించిన వెంటనే, దేశవ్యాప్తంగా రోడ్డు రవాణా మంత్రిత్వశాఖకుగల ఫీల్డ్ యూనిట్లను తమ కార్మికులు ,శ‌్రామికులు సామాన్య ప్రజానీకానికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా కోరారు.
రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన అన్ని ఫీల్డ్ యూనిట్లు , కార్యాలయాలు, అనుబంధ సంస్థలు ఎన్.హెచ్.ఎ.ఐ,, ఎన్.హెచ్ ఐడిసిఎల్ ప్రజల ఇబ్బందులను తగ్గించడానికి, వారకి సహాయపడటానికి ముందుకు వచ్చాయి. ప్రజలకు వీరు ఎంత గొప్పగా సహాయపడ్డారనే దానిపై దేశంలోని అనేక ప్రాంతాల నుండి నిరంతరం సమాచారం వస్తోంది.
ఈ వారాంతంలో మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, తమ స్వస్థలమైన రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ప్రస్తుత ఎండలలో పిల్లలు కుటుంబ సభ్యులతో కలసి వెళుతున్నప్పుడు, వారికి థానే యూనిట్ ద్వారా ఆహారం , తాగు నీరు అందించారు . ‘సమతావిచార్ ప్రసారక్ సంస్థ’ సహకారంతో ఆహార పదార్థాల పంపిణీ చేపట్టారు.
అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో, లాక్ డౌన్ కారణంగా చాలా మంది కార్మికులు ట్రక్ డ్రైవర్లు హైవేలపై చిక్కుకున్నారు. వారు ఆహారం ,మంచి నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటువంటి స్థితిలో, వారని ఆదుకునే బాధ్యతను ప్రాజెక్ట్ డైరెక్టరేట్ అధికారులు, సిబ్బంది స్వయంగా చేపట్టి వారికి తగిన సహాయం అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా నుంచి ఇలాంటి కథనాలే వచ్చాయి, ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు , ట్రక్ డ్రైవర్లు చిక్కుకుపోయారు. రోడ్ పక్క విక్రయించే తినుబండారాల దుకాణాలూ మూసివేయడం వల్ల వీరికి ఆహారం లభించలేదు. దీనితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆహారం , మంచి నీటిని అందించేందుకు స్థానిక ఫీల్డ్ కార్యాలయం ముందుకు వచ్చింది
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ ఎ ఐ) గస్తీ బృందం జాతీయ రహదారి నంబర్ 45 లోని పాలూర్ వద్ద ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న ఐదుగురిని కనుగొంది. వారికి వెంటనే ఆహారం , మంచినీటిని అందించారు. కరోనానుంచి రక్షణకు వారికి ఫేస్ మాస్క్‌లు అందించారు. అనంతరం వారిని సమీపంలోని షెల్టర్ కు తీసుకువెళ్లి వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
మహారాష్ట్రలోని వార్ధా వద్ద ఉన్న ఎన్.హెచ్.ఎ.ఐ కన్సెషనెయిర్ ప్రాంగణం, లాక్-డౌన్ ప్రారంభమైనప్పటి నుండి సుమారు 50 మందికి ఆశ్రయం ఇస్తోంది. రోడ్‌సైడ్ రెస్టారెంట్లు మూసివేయడం వల్ల, అత్యవసర సేవల్లో ఉన్న డ్రైవర్లు, ప్రయాణికులు ఆహారం మంచి నీటి సదుపాయానికి ఇబ్బందులు పడుతున్నారు. దీనితో సామాజిక దూరం , పారిశుద్ధ్యాన్ని జాగ్రత్తగా పాటిస్తూనే, ఇలాంటి వారికి రోజూ ఆహారం, నీరు, హ్యాండ్ వాష్ సదుపాయాలు కల్పిస్తున్నారు.
***
(Release ID: 1615433)
Visitor Counter : 182