ఆర్థిక మంత్రిత్వ శాఖ

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్) యొక్క అంతర్జాతీయ ద్రవ్య మరియు ఆర్థిక కమిటీ (ఐ.ఎం.ఎస్.సి) ప్లీనరీ సమావేశానికి హాజరైన శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 16 APR 2020 7:40PM by PIB Hyderabad

 

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్  అంతర్జాతీయ ద్రవ్య నిధి మంత్రుల స్థాయి కమిటీ యొక్క అంతర్జాతీయ ద్రవ్య మరియు ఆర్థిక కమిటీ ప్లీనరీ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

అసాధారణమైన సమయాల్లో – ఆసాధారణమైన చర్యలు అనే అంశం మీద ఐ.ఎం.ఎఫ్. మేనేజింగ్ డైరక్టర్ల గ్లోబల్ పాలసీ అజెండాకు సంబంధించి ఈ చర్చలు జరిగాయి. కోవిడ్ -19ను ఎదుర్కోవడానికి సభ్య దేశాలు తీసుకున్న చర్యలను ఐ.ఎం.ఎఫ్.సి. సభ్యులు తెలియజేశారు. దానితో పాటు ప్రపంచ ద్రవ్యత మరియు సభ్యుల ఫైనాన్సింగ్ అవసరాలు తీర్చేందుకు ఐ.ఎం.ఎఫ్. సంక్షోభ ప్రతిస్పందన ప్యాకేజీ గురించి చర్చించారు.

ఈ సమావేశంలో మాట్లాడిన శ్రీమతి నిర్మలా సీతారామన్, ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, కోవిడ్ -19 ప్రభావాన్ని తగ్గించేందుకు భారతదేశంలో తీసుకున్న వివిధ చర్యలను సమావేశంలో వివరించారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం 2 బిలియన్ డాలర్లు (15000 కోట్లు) కేటాయించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.  పేదలు మరియు బలహీన వర్గాలు సంక్షేమం కోసం 23 బిలియన్ డాలర్లు (రూ. 1.70 లక్షల కోట్ల) ప్యాకేజీతో సామాజిక మద్దతు చర్యల పథకాన్ని ప్రకటించడం గురించి వివరించారు. వీటితో పాటు చట్టబద్ధమైన మరియు నియంత్రణ సమ్మతి విషయాల్లో సంస్థలకు ఉపశమనం కల్పించడం, ఆర్బీఐ ద్వారా ద్రవ్య విధానాన్ని సడలించడం, రుణాల వాయిదాల పై మూడు నెలల తాత్కాలిక నిషేధం, ఇతర దేశాలకు క్లిష్టమైన ఔషధాలను అందించడం ద్వారా ప్రపంచ సమాజంలో బాధ్యతాయుతమైన సభ్యుడిగా ఐ.ఎం.ఎఫ్.సి.లో బాధ్యతాయుతమైన సభ్యుడిగా భారతదేశ పాత్ర గురించి ఆర్థిక మంత్రి వివరించారు. సార్క్ దేశాల కోసం కోవిడ్ -19 అత్యవసర నిధిని రూపొందించడానికి సార్క్ నాయకుల వీడియో సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ చొరవ గురించి ఆమె ప్రస్తావించారు.

కోవిడ్ -19 సంక్షోభ సమయయంలో సభ్యదేశాలకు ఐఎం.ఎఫ్. మద్దతు మాధ్యమానికి ప్రతిస్పందనగా, అంతర్జాతీయ ద్రవ్య మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఎప్పుడూ ఐ.ఎం.ఎఫ్. ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రపంచ ఆర్థిక నిర్మాణానికి దన్ను అందించేందుకు దీన్ని మున్ముందు కొనసాగించాలని నిర్మలా సీతారామన్ తెలిపారు.

అక్టోబర్ లో ఫండ్ బ్యాంక్ వార్షిక సమావేశాలకు మళ్ళీ ఏప్రిల్ లో జరిగే సమావేశాల సందర్భంగా ఐ.ఎం.ఎఫ్.సి. ఏడాదికి రెండుసార్లు కలుస్తుంది. ఈ కమిటీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే సాధారణ సమస్యలను చర్చిస్తుంది. మరియు సూచనలు అందిస్తుంది. ఈ ఏడాది కోవిడ్ -19 కారణంగా ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది.

--


(Release ID: 1615220) Visitor Counter : 218