సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దూరదర్శన్-ఆకాశవాణిద్వారా పాఠ్యాంశ/ప్రత్యక్ష తరగతుల ప్రసారం
Posted On:
16 APR 2020 10:02PM by PIB Hyderabad
ప్రస్తుత దిగ్బంధం నడుమ విద్యార్థుల చదువు కొనసాగేందుకు భారత ప్రభుత్వ ప్రసార సంస్థ తనవంతు తోడ్పాటునిస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో దూరదర్శన్, ఆకాశవాణి మాధ్యమాలు తమ ప్రాంతీయ టీవీ, రేడియో, యూట్యూబ్ చానళ్లద్వారా దేశవ్యాప్తంగా పాఠ్యాంశాలను, ప్రత్యక్ష తరగతులను ప్రసారం చేస్తున్నాయి. విద్యాసంస్థలన్నీ మూతపడిన నేపథ్యంలో లక్షలాది విద్యార్థులకు... ప్ర్యతేకించి 10, 12 తరగతుల బోర్డు, పోటీ పరీక్షలకు సిద్ధం కావడంలో ఈ ప్రత్యక్ష తరగతులు ఇతోధికంగా తోడ్పడుతున్నాయి.
సారాంశం
ఈ ప్రత్యక్ష విద్యాభ్యాసంలో భాగంగా దూరదర్శన్, ఆకాశవాణిద్వారా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు పాఠ్యాంశ ఆధారిత తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలతోపాటు నమూనా ప్రశ్నపత్రాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇంజనీరింగ్, మెడికల్ ప్రవేశపరీక్షలకు సిద్ధమయ్యేవారికీ ఈ తరగతులు తోడ్పడుతున్నాయి. ప్రత్యక్ష తరగతులను ఆసక్తికరంగా రూపొందించే దిశగా కొన్ని రాష్ట్రాల్లో ప్రసిద్ధులతో కథలు చెప్పించడం, క్విజ్ షో వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
దూరదర్శన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, జమ్ముకశ్మీర్‌లలో దూరదర్శన్ కేంద్రాలు ఇప్పటికే ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తున్నాయి.
ఆకాశవాణి
ఆకాశవాణి కేంద్రాలు- విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, తిరుచిరాపల్లి, కోయంబత్తూర్, పుదుచ్చేరి, మదురై, త్రివేండ్రం, తిరునల్వేలి, పణజి, జల్‌గావ్, రత్నగిరి, సంగ్లీ, పర్భణి, ఔరంగాబాద్, పుణె, నాగ్‌పూర్, ముంబై, గ్యాంగ్‌టక్, గువహటి, బికనేర్, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, జైపూర్‌ల నుంచి ప్రత్యక్ష తరగతుల ప్రసారం కొనసాగుతోంది. మరోవైపు భోపాల్, చెన్నై, కోళికోడ్, త్రిస్సూర్ కేంద్రాలు పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నాయి. సగటున ప్రతి దూరదర్శన్ చానల్ నిత్యం 2.5 గంటలు, ఆకాశవాణి కేంద్రాలు 30 నిమిషాలపాటు విద్యా సంబంధ సారాంశాన్ని ప్రసారం చేస్తున్నాయి. ఈ మేరకు దూరదర్శన్ నెట్‌వర్క్ ద్వారా రోజుకు 17 గంటలు, ఆకాశవాణి నెట్‌వర్క్ ద్వారా 11 గంటల మేర విద్యా ప్రసారాలు సాగుతున్నాయి. ఈ విద్యాసంబంధ కార్యక్రమాల సమగ్ర వివరాలు కిందివిధంగా ఉన్నాయి:
దూరదర్శన్ ద్వారా ప్రసారమయ్యే విద్యా కార్యక్రమాల వివరాలు
వ.
|
స్టేషన్ పేరు
|
కార్యక్రమ వివరాలు
|
ఎప్పుడు
|
వ్యవధి
|
సంబంధిత విద్యాసంస్థ
|
1
|
బెంగళూరు
|
12వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ తరగతులు; కామన్ ఇంజనీరింగ్ టెస్టులు
|
నిత్యం
|
3 గంటలు
|
|
2
|
విజయవాడ
|
10, 12 తరగతులకు పాఠ్యాంశాల బోధన
|
నిత్యం
|
2 గంటలు
|
రాష్ట్ర సెకండరీ విద్యా విభాగం
|
3
|
జమ్ముకశ్మీర్
|
10, 12 తరగతులకు పాఠ్యాంశాల బోధన
|
నిత్యం
|
1 గంట
|
పాఠశాల విద్య డైరెక్టరేట్
|
4
|
హైదరాబాద్
|
10, 12 తరగతులకు పాఠ్యాంశాల బోధన
|
నిత్యం
|
2 గంటలు
|
రాష్ట్ర సెకండరీ విద్యా విభాగం
|
5
|
అహ్మదాబాద్
|
ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పాఠ్యాంశాల తరగతులు
|
నిత్యం
|
2 గంటలు
|
గుజరాత్ ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ
|
6
|
చెన్నై
|
స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ పాఠ్యాంశాలు, 10వ తరగతి విద్యార్థులకు నమూనా ప్రశ్నపత్రాలు
|
నిత్యం
|
1 గంట
|
తమిళనాడు విద్యా విభాగం
|
7
|
త్రివేండ్రం
|
12వ తరగతి విద్యార్థులకు స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ పాఠ్యాంశాలు
క్విజ్ షో
|
నిత్యం
వారాంతాల్లో
|
3 గంటలు
|
స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ
|
8
|
పణజి
|
క్విజ్ షో
|
ప్రతి వారం
|
30 నిమిషాలు
|
ఇన్-హౌజ్
|
9
|
జలంధర్
|
|
|
|
త్వరలో ప్రారంభం
|
10
|
లక్నో
|
|
|
|
త్వరలో ప్రారంభం
|
11
|
వారణాసి
|
|
|
|
ప్రాథమిక విద్య అధికారుల సంప్రదింపులు, ప్రతిపాదనలు రావాల్సి ఉంది
|
12
|
సిమ్లా
|
|
|
|
డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ప్రతిపాదనలు త్వరలో ప్రారంభం
|
13
|
పట్నా
|
|
|
|
రాష్ట్ర విద్యాశాఖతో డీడీ బీహార్ సంప్రదింపులు
|
ఆకాశవాణి స్టేషన్ల ద్వారా ప్రసారమయ్యే విద్యా కార్యక్రమాల వివరాలు
వ.
|
స్టేషన్ పేరు
|
కార్యక్రమ వివరాలు
|
ఎప్పుడు
|
వ్యవధి
|
సంబంధిత విద్యాసంస్థ
|
1
|
భోపాల్
|
రేడియో స్కూల్ (ప్రసిద్ధులతో కథలు)
|
వారానికి
6 రోజులు
|
1 గంట
|
రాజ్య శిక్షణా కేంద్ర, భోపాల్
|
2
|
హైదరాబాద్
|
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్
|
నిత్యం
|
15 ని॥
|
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్
|
3
|
విజయవాడ
|
విందాం... నేర్చుకుందాం
|
సోమ నుంచి శుక్రవారం
|
30 ని॥
|
సమగ్ర శిక్షా అభియాన్- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
|
4
|
చెన్నై
|
10వ తరగతి (తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతంలోని అన్ని రేడియో స్టేషన్ల కోసం ఏఐఆర్ చెన్నై రూపకల్పన
|
ఆదివారాల్లో
మధ్యాహ్నం
2:30 గం॥
|
15 ని॥
|
|
5
|
తిరువనంతపురం
|
|
బుధ, గురు శుక్రవారాల్లో
|
14 ని॥
|
ప్రస్తుతం విద్యాసంస్థలతో సంబంధం లేదు
|
6
|
కోళికోడ్
|
|
సోమవారం
|
14 ని॥
|
ప్రస్తుతం విద్యాసంస్థలతో సంబంధం లేదు
|
7
|
త్రిస్సూరు
|
|
మంగళ
|
14 ని॥
|
ప్రస్తుతం విద్యాసంస్థలతో సంబంధం లేదు
|
8
|
జైపూర్, జోధ్‌పూర్, బికనేర్, ఉదయ్‌పూర్
|
విద్యాలయ ప్రసారణ్,
80 బుక్స్ లెసన్స్,
28 ఎగ్జామినేషన్ లెసన్స్,
60 గైర్ పత్యక్రిమ్ లెసన్
|
స్కూలున్న ప్రతిరోజూ (జూలైనుంచి మార్చిదాకా)
|
20 ని॥
|
రాజస్థాన్ రాజ్య శైక్షిక్ అనుసంధాన్ ఏవమ్ ప్రశిక్షాన్ పరిషత్, ఉదయ్‌పూర్, రాజస్థాన్
|
9
|
గువహటి
|
విశ్వ-విద్య
|
ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో
|
15 ని॥
|
రాష్ట్ర విద్యా-పరిశోధన- శిక్షణ మండలి, ఎస్‌ఎస్‌ఏ సహకారంతో
|
10
|
లేహ్
|
|
|
ఉదయం 60 ని॥ (ప్రతిపాదన మేరకు)
|
చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం, లేహ్
|
11
|
శ్రీనగర్
|
రోజుకు 4 ఉపన్యాసాలు
|
|
30 ని॥
|
డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్
|
12
|
గ్యాంగ్‌టక్
|
|
సోమ-శని
ఏప్రిల్ 16న తరగతులు ప్రారంభం
|
|
విద్యాశాఖ,
సిక్కిం ప్రభుత్వం
|
13
|
ముంబై
|
ఖులా ఆకాష్
|
స్కూలున్న
రోజుల్లో
|
25 ని॥
|
|
14
|
పుణె
|
ఖులా ఆకాష్
|
స్కూలున్న
రోజుల్లో
|
25 ని॥
|
|
15
|
నాగ్‌పూర్
|
ఖులా ఆకాష్
|
స్కూలున్న
రోజుల్లో
|
25 ని॥
|
|
16
|
ఔరంగాబాద్
|
ఖులా ఆకాష్
|
స్కూలున్న
రోజుల్లో
|
25 ని॥
|
|
*****
(Release ID: 1615260)
Visitor Counter : 287