ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకి, జోర్డాన్ రాజు కి మధ్య టెలిఫోన్ సంభాషణ
प्रविष्टि तिथि:
16 APR 2020 7:52PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ ఈరోజు జోర్డాన్ రాజు అబ్దుల్లా -2 కు మధ్య ఈరోజు టెలిఫోన్ సంభాషణ జరిగింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోర్డాన్ రాజుకు, జోర్డాన్ ప్రజలకు రానున్న పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఇరువురు నాయకులూ,కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తలెత్తిన సవాళ్లను చర్చించారు. కోవిడ్ ప్రభావాన్ని తగ్గించేందుకు తమ తమ దేశాలలో తీసుకున్న చర్యలగురించి వారు చర్చించారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉభయ దేశాలూ ఒకరి కృషికి మరొకరు వీలైనంత వరకూ సమాచారాన్ని, అమలుచేస్తున్న పద్ధతుల గురించి, పరస్పరం సమాచారం తోడ్పాటు నందించుకుంటూ అవసరమైన సరఫరాలకు వీలుకల్పించాలని నిర్ణయించారు.
జోర్డాన్‌లోని భారతీయు పౌరులకు అందించిన సాయానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
కోవిడ్ -19 కు సంబంధించి, అలాగే ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ బృందాలు ఎప్పటికప్పుడు సంబంధాలు కలిగి ఉండడానికి ఇరువురు నాయకులూ అంగీకరించారు.
(रिलीज़ आईडी: 1615207)
आगंतुक पटल : 217
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam