వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

సగటు కన్నా రెట్టింపు ఆహార ధాన్యాలను లాక్ డౌన్ సందర్బంగా దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన ఎఫ్ సి ఐ

Posted On: 16 APR 2020 7:23PM by PIB Hyderabad

ప్రస్తుత పరీక్షా సమయంలో భారత ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ) లాక్ డౌన్ ని ఒక సవాలుగా తీసుకుంది. అతి పెద్ద ఆహార ధాన్యాల గొలుసు వ్యవస్థను కలిగి ఉన్న ఎఫ్ సి ఐ మొత్తం సిబ్బంది గత 22 రోజులుగా అలుపెరగకుండా తమ విధులను నిర్వహిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఎఫ్ సి ఐ లాక్ డౌన్ సమయంలో 1335 రైళ్ల లోడ్ ద్వారా 3.74 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలను తరలించింది. అంటే సగటున రోజుకు 1.7 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తరలించినట్టు. సాధారణంగా ఎఫ్ సి ఐ సగటున 0.8 లక్షల మెట్రిక్ టన్నులను తరలిస్తేప్రస్తుత సమయంలో అది రెట్టింపు అయింది. లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) కింద ఆహారధాన్యాల అవసరాలున్న వినియోగదారుల కోసం వివిధ రాష్ట్రాలకు 3.34 మిలియన్ లక్షల టన్నుల నిల్వలను చేరవేశారు. 

          ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద మూడు నెలల పాటు నెలకు కిలోల ఆహార ధాన్యాలు జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) పరిథి కింద వచ్చే ప్రతి పేద లబ్ధిదారునికి ఇచ్చేలా ఏర్పాట్లు జరిగాయి. దీని కింద ఇప్పటికే 2.56 మిలియన్ మెట్రిక్ టన్నులు మంజూరు అయ్యాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) పథకాలుఇతర సంక్షేమ పథకాల కింద దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కాలంలో 3.98 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీకి సిద్ధం అయ్యాయి. ఈ రెంటిని కలుపుకుంటే లాక్ డౌన్ 22 రోజుల్లో 6.54 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు దేశవ్యాప్తంగా పంపిణీ అవుతున్నాయి. సగటున రోజుకు 3.27 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయి. ఈ నిల్వలను అన్ని రాష్ట్రాలకు కేటాయించడం జరిగింది. ఆహార భద్రతా చట్టం పరిథిలో లబ్దిదారులందరికి తగిన స్థాయిలో ఆహారధాన్యాలను అందజేయవచ్చు.

జాతీయ ఆహార భద్రత చట్టం పరిథిలో రాని ఇతర రేషన్ కార్డులు ఉన్న వారి కోసం గోదుమలైతే కిలో రూ.21/-, బియ్యం కిలో రూ.22/-కి నిల్వల నుండి రాష్ట్రాలు పొందవచ్చు. ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వేలంతో సంబంధం లేకుండానే ఎఫ్ సి ఐ నుండి నేరుగా బియ్యాన్ని కిలో రూ.22.50/-కి తన అదనపు అవసరాల కోసం తీసుకోవచ్చు. బహిరంగ మార్కెట్ లో ధరలపై నిఘా పెడుతూ గోధుమ పిండ తగినంత అందుబాటులో లభ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్ సి ఐ నుండి నేరుగా బహిరంగ మార్కెట్ విక్రయ ధరలకే పొందేలా అధికారాలు ఇచ్చారు. వికేంద్రీకరణ రీతిలో జిల్లా కలెక్టర్లు ఈ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవచ్చు. సాధారణ బహిరంగ మార్కెట్ విక్రయాలకు అనుసరించే వేలం పాటలకు అతీతంగా బియ్యంగోధుముల సేకరణకు పై చర్యలు తీసుకోవడం జరిగింది. మర్చి 24వ తేదీ నుండి ఇప్పటి వరకు పైన పేర్కొన్న పథకాల కింద 3.74 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను వినియోగించుకున్నారు. 

ప్రస్తుత ఆపద కాలంలో పేదలకుప్రభుత్వేతర సంస్థలుసంక్షేమ స్వచ్ఛంద సంఘాలు ఆదుకునే ఒక పెద్ద మహత్కార్యంలో ఉన్నాయి కాబట్టి వారు దేశంలో ఎక్కడి ఎఫ్ సి ఐ డిపో నుండైనా పరిమితి లేకుండానే ఎంతైనా బియ్యాన్ని కిలో రూ.22/-కిగోధుమలను కిలో రూ.21/-కి పొందే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పటికే మహారాష్ట్రకర్ణాటకలో వివిధ సంస్థలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నాయి. లాక్ డౌన్ సమయంలో అన్నార్తులను ఆదుకోడానికి వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న సహాయ శిబిరాలకుసేవ కార్యక్రమాలకు ఈ పథకం కీలక సహాయకారిగా ఉంటుంది. రైల్వేస్గిడ్డంగుల కార్పొరేషన్లు వంటి కేంద్ర ఏజెన్సీల భాగస్వామ్యంఎఫ్ సి ఐ ఉద్యోగులుకార్మికుల పూర్తి సహకారంతో ఈ కఠిన సమయంలో ఎఫ్ సి ఐ ఆహార ధాన్యాలను దేశవ్యాప్తంగా నిరంతరాయంగా సరఫరా చేయగలిగింది. 

****



(Release ID: 1615264) Visitor Counter : 166