వ్యవసాయ మంత్రిత్వ శాఖ

లాక్ డౌన్ సమయంలో ఆహార ధాన్యాలు, త్వరగా పాడై పోయే వస్తువుల రవాణాకు వీలుకల్పించే "కిసాన్ రథ్" యాప్ ను ప్రారంభించిన వ్యవసాయశాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్.

వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో కిసాన్ రథ్ ఒక ముఖ్యమైన ఘట్టం : శ్రీ తోమర్

Posted On: 17 APR 2020 3:51PM by PIB Hyderabad

నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్.ఐ.సి.) రూపొందించిన " కిసాన్ రథ్" అనే రైతులకు ఉపయోగపడే మొబైల్ అప్లికేషన్ యాప్ ను వ్యవసాయం, రైతు సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈరోజు కృషి భవన్ లో ఈ రోజు ఆవిష్కరించారు.  వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తుల ప్రాధమిక, ద్వితీయ స్థాయి రవాణాకు అవసరమైన రవాణా వాహనాలను రైతులకువ్యాపారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ యాప్ తోడ్పడుతుంది.  ప్రాధమిక రవాణా అంటే పొలం నుండి మండీలకు, ఎఫ్.పి.ఓ. సేకరణ కేంద్రాల నుండి గిడ్డంగుల వరకు అలాగే, ద్వితీయ స్థాయి రవాణా అంటే మండీల నుండి  రాష్ట్రంలోని ఇతర మండీలకు, ఇతర రాష్ట్రాల్లోని మండేలాకు, ప్రాసెసింగ్ యూనిట్లకురైల్వే స్టేషన్లకు, గిడ్డంగులకు, టోకు విక్రేతలకు వ్యవసాయ వస్తువులను రవాణా చేయవచ్చు 

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తోమర్ మాట్లాడుతూ, లాక్ డౌన్ పరిస్థితుల్లో కూడా వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగవలసిన అవసరం ఉందని అన్నారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆదేశాల మేరకు వ్యవసాయరంగానికి లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపులిచ్చారని ఆయన తెలిపారు. పంట కోత మరియు విత్తే పనులు కొనసాగుతున్నందున, కిసాన్ రథ్ యాప్ వల్ల రవాణా కూడా అందుబాటులోకి వచినట్లయిందని అన్నారు.  ఈ యాప్ వల్ల రైతులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను తమ వ్యవసాయ క్షేత్రాలనుండి మండీలకు, అదేవిధంగా మండీల నుండి దేశవ్యాప్తంగా ఉన్న మండీలకు రవాణా చేయడానికి అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.  ప్రస్తుతం దేశం కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టే దిశగా లాక్ డౌన్ విధించిన సమయంలో రైతులు, ఎఫ్.పి.ఓ.లు, సహకార సంఘాలకు తమ ఉత్పత్తులను వ్యవసాయ క్షేత్రాలనుండి మార్కెట్లకు రవాణా చేయడానికి "కిసాన్ రథ్యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు

రైతులువ్యాపారులు తమ వ్యవసాయ ఉత్పత్తులు ఆహారధాన్యాలు (తృణ ధాన్యాలు, పప్పులు), పండ్లు, కూరగాయలు, నూనె గింజలు, సుగంధ ద్రవ్యాలు, పీచు పంటలు, పువ్వులు, కొబ్బరి కాయలు, వెదురు కర్రలతో పాటు వివిధ కర్ర దుంగలుదూలాలు మొదలైన వివిధ రకాల వస్తువులకు అనువైన రవాణా వాహనాలను గుర్తించి, ఎంపిక చేసుకోడానికి "కిసాన్ రథ్యాప్ వెసులుబాటు కల్పిస్తుంది.   తొందరగా పాడైపోయే వస్తువులను అతిశీతల వాహనాల్లో రవాణా చేయడానికి కూడా వ్యాపారులకు ఈ యాప్ సౌకర్యంగా ఉంటుంది

వ్యవసాయ ఉత్పత్తుల రవాణా అనేది చాలా క్లిష్టమైన, అనివార్యమైన ప్రక్రియ.  ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ వంటి అసాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో,  రైతులుగిడ్డంగులు, ఎఫ్.పి.ఎమ్.సి. మండీల మధ్య అనుసంధానం, సమన్వయం కలుగజేసి, ఆహార పదార్ధాలు పాడై పోకుండా సకాలంలో రవాణా సేవలందించడానికి "కిసాన్ రథ్సేవలను సమర్ధంగా వినియోగించుకోవచ్చు.  తొందరగా పాడైపోయే వస్తువులకు మంచి ధర పలకడానికి ఈ సౌకర్యం ఎంతగానో దోహదపడుతుంది

సరకులు పంపించే వ్యక్తి (రైతు, ఎఫ్.పి.ఓ.లు, కొనుగోలు దారుడు/ వ్యాపారి) ఈ యాప్ ద్వారా తన వస్తువుల రవాణా అవసరాలను తెలియజేస్తాడు. అక్కడ నుండి ఆ సమాచారం మార్కెట్ లో ఉన్న వివిధ రవాణా వాహనాల యజమానులకు చేరుతుంది. అందులో అవకాశం ఉన్న వారు తమ ధరలను, రవాణా వాహనాల వివరాలను  తెలియజేస్తారు. ఆ తర్వాత,  చర్చలుసంప్రదింపుల అనంతరం అనువైన రవాణా వాహనాన్ని ఖరారు చేసుకుంటారువస్తువులను రవాణా చేసిన అనంతరం, ఆ సేవతో ఎంత వరకు సంతృప్తి చెందినదీ తెలియజేస్తే, తదుపరి ఆ సేవలు వినియోగించుకునే వారికి, సేవలు అందించే వారికి ఉపయుక్తంగా ఉంటుందిభవిష్యత్తులో పరస్పరం ఉత్తమ సేవలు పొందడానికి వీలుగా ఉత్తమ రవాణా సంస్థ / వాహనం ఎంపిక చేసుకోడానికి కూడా ఇది సహాయపడుతుంది

ఈ సందర్భగా శ్రీ తోమర్ మాట్లాడుతూ,  దేశంలో మండీల మధ్య, రాష్ట్రాల మధ్య వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తుల రవాణా పెంపొందించుకునేందుకు "కిసాన్ రథ్యాప్ మరింతగా తోడ్పాటుతుందని పేర్కొన్నారు.  "కిసాన్ కా అప్నా వాహన్" అనే సందేశంతో రూపొందించిన ఈ యాప్, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో ఒక ముఖ్యమైన ఘట్టమని కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి వ్యాఖ్యానించారు. 

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ మొబైల్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో - కేంద్ర వ్యవసాయం, కుటుంబ సంక్షేమం శాఖ సహాయ మంత్రులు శ్రీ పురుషోత్తం రూపాలా, శ్రీ కైలాష్ చౌదరి; కార్యదర్శి (ఏ.సి.&.ఎఫ్.డబ్ల్యూ) శ్రీ సంజయ్ అగర్వాల్; కార్యదర్శి (ఎలక్ట్రానిక్స్ & ఐ.టి.) శ్రీ అజయ్ ప్రకాష్ సాహ్నే; ఎన్.ఐ.సి., డైరెక్టర్ జనరల్ డాక్టర్ నీతా వర్మ తో పాటు వ్యవసాయ మంత్రిత్వశాఖ కు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 

ఈ మొబైల్ యాప్ ఎనిమిది భాషల్లో ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వెర్షన్ లో అందుబాటులో ఉంది; త్వరలో పాన్-ఇండియా పై కూడా సిద్ధమౌతుంది.   

*****


(Release ID: 1615436) Visitor Counter : 296