రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్ 19 వ్యాధికి సంబంధించి క్రిమిసంహార‌క ప్ర‌క్రియ‌కు వీలుగా రెండు కొత్త ఉత్ప‌త్తుల‌ను ప్ర‌వేశ‌పెట్టిన డిఆర్‌డిఒ

Posted On: 17 APR 2020 3:07PM by PIB Hyderabad

డిఫెన్స్ రిసెర్చ్ ,డ‌వ‌ల‌ప్ మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డిఆర్‌డిఒ) కోవిడ్ -19పై పోరాటంలో భాగంగా నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లను అందించడంలో త‌న వంతు పాత్ర‌గా, ప్ర‌స్తుతం త‌న వ‌ద్ద‌గ‌ల సాంకేతిక ప‌రిజ్ఞానం, అనుభ‌వాల అమ్ముల పొదినుంచి ప‌లు ప‌రిష్కారాల‌ను అభివృద్ధి చేసి అందిస్తూ వ‌స్తోంది. ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు అనుగుణంగా కొత్త ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేయ‌డం, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు ఇందులో ఉన్నాయి. డిఆర్‌డిఒ ఈరోజు ఇందుకు సంబంధించి రెండు కొత్త  ఉత్ప‌త్తుల‌ను ప‌రిచ‌యం చేసింది. ఇవి క‌రోనా మ‌హ‌మ్మారి కాలంలో   బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో కార్య‌క‌లాపాల స్థాయిని పెంచ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

 శానిటైజ‌ర్ వెద‌జ‌ల్లే ఆటోమేటిక్‌ యూనిట్

ఢిల్లీలోని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్స్‌,ఎన్విరాన్ మెంట్ సేఫ్టీ (CFEES) సంస్థ‌, మంట‌ల‌ను ఆర్పేందుకు పొగమంచు సాంకేతిక పరిజ్ఞానం ఉప‌యోగించ‌డంలో  తనకున్న‌ నైపుణ్యాన్ని ఉపయోగించి, ఆటోమేటిక్ పొగ‌మంచు ఆధారిత శానిటైజర్ వెద‌జ‌ల్లే యూనిట్‌ను అభివృద్ధి చేసింది. ఇది చేతుల‌తో తాక‌న‌వ‌స‌రం లేని శానిటైజర్ వెద‌జ‌ల్లే ప‌రిక‌రం, ఇది భవనాలు , కార్యాలయ సముదాయాలలోకి ప్రవేశించేటప్పుడు వారి చేతులను ప‌రిశుభ్రం చేసి  వైర‌స్ ర‌హితం చేయ‌డంకోసం ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ రబ్ శానిటైజర్ ద్రావణాన్ని పిచికారీ చేస్తుంది. ఇది నీటి పొగమంచు ఎరేటర్ టెక్నాలజీపై ఆధారపడి ప‌నిచేస్తుంది.  నీటిని పొదుపు చేసేందుకు  దీనిని రూపొందించారు.

 

 


 
 ఈ యూనిట్ ను తాక‌న‌వ‌స‌రం  లేకుండా పనిచేస్తుంది  అల్ట్రాసోనిక్ సెన్సార్ ద్వారా దీనిని ప‌నిచేయించ‌వ‌చ్చు .  చేతుల‌ను క‌డిగేందుకు అవ‌స‌ర‌మైన శానిటైజ‌ర్‌ను వెద‌జ‌ల్ల‌డానికి , ఎరేటెడ్ పొగమంచును ఉత్పత్తి చేయడానికి తక్కువ ప్రవాహ రేటు కలిగిన ఒకే ద్రవ నాజిల్ ను అది  ఉపయోగించుకుంటుంది. ఇది కనీస నీటి వృధాతో చేతులను శుభ్రపరుచుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. వాతావ‌ర‌ణాన్ని ఉపయోగించి, ఒక సారి కేవలం 5-6 మి.లీ శానిటైజర్ 12 సెకన్ల పాటు విడుదల అవుతుంది  ఇది రెండు అరచేతులపై పూర్తి స్ప్రే చేస్తుంది. తద్వారా చేతులు  క్రిమిసంహారకంతో ప‌రిశుభ్ర‌మౌతాయి.
ఇది చాలా చ‌క్క‌టి ప‌రిక‌రం. ఎక్కువ మొత్తం నింప‌డానికి ఇది అనువుగా ఉండ‌డంవ‌ల్ల  ఆర్ధికంగా పొదుపుతో కూడుకున్న‌ది. దీర్ఘ‌కాలిక మ‌న్నిక క‌లిగిన‌దిగా  చెప్పుకోవ‌చ్చు.. దీనిని గోడ‌కు లేదా ఏదైనా ప్లాట్‌ఫాంపై అమర్చ‌డం సుల‌భం.. ఇందులో స్ప్రే ప‌నిచేస్తున్నందుకు సూచ‌న‌గా ఒక ఎల్‌.ఇ.డి బ‌ల్బు వెలుగుతూ క‌నిపిస్తుంది.

నోయిడా లోని  మెస్స‌ర్స్‌ రియోట్ లాబ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ సహాయంతో ఈ యూనిట్ ను  తయారు చేశారు. డిఆర్డి భవన్ వద్ద ఒక యూనిట్ ను  ఏర్పాటు చేశారు. ఆసుపత్రులు, మాల్స్, కార్యాలయ భవనాలు, నివాస భవనాలు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు , కీల‌క సంస్థ‌ల‌ ప్రవేశం  నిష్క్రమణ  ద్వారాల‌వద్ద చేతుల శానిటైజేషన్ కోసం దీనిని ఉపయోగించవచ్చు. ఐసోలేషన్ , క్వారంటైన్ కేంద్రాల ప్రవేశం,నిష్క్రమణ ద్వారాల వ‌ద్ద‌ కూడా ఇది  చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

 యువి శానిటైజేష‌న్ బాక్స్‌, చేతిలో ఇమిడే యువి ప‌రిక‌రం:
ధిల్లీలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ ,అలైడ్ సైన్సెస్ (డిఐపిఎఎస్) , ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ , అలైడ్ సైన్సెస్ (INMAS),  డిఆర్ డి ఒ ప్రయోగశాలలు అతినీలలోహిత సి లైట్ ఆధారిత శానిటైజేషన్ బాక్స్ , చేతిలో ఇమిడే UV-C  ప‌రిక‌రాల‌ను( అతినీలలోహిత కాంతి, 254 నానోమీటర్ల త‌రంగ దైర్ఘ్యంతో) రూపకల్పన చేసి అభివృద్ధి చేశాయి.

యువి-సి త‌క్కువ  కాంతి ,  శక్తివంతమైన తరంగదైర్ఘ్యాన్ని కలిగి ఉంటుంది. కోవిడ్ -19 లోని జన్యు పదార్థాన్ని నాశనం చేయడంలో ఇది చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  వైర‌స్ ఆర్‌.ఎన్‌.ఎ నిర్మాణాన్ని రేడియేషన్చిత్తు చేస్తుంది,  వైరల్ కణాలు తమకు తాము ఎక్కువ న‌క‌ళ్లు రూపొందించుకోకుండా ఇది నిరోధిస్తుంది. యువి-సి,సూక్ష్మజీవులను త్వరగా చంపుతుంది. య‌వి-సి కాంతిని ఉపయోగించడం వ‌ల్ల‌ వస్తువుల శానిటైజేషన్ కోసం ర‌సాయ‌నాలు ఉప‌యోగించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అందువ‌ల్ల రసాయనాల హానికరమైన దుష్ప్ర‌భావాలు ప‌డ‌వు. ఇది పర్యావరణ అనుకూలమైనది . చేతితో తాక‌న‌వ‌స‌రంలేని శానిటైజేషన్ పద్ధతి.

మొబైల్ ఫోన్, టాబ్లెట్లు, పర్స్, కరెన్సీ, ఆఫీసు ఫైళ్ళ కవర్ వంటి వ్యక్తిగత వస్తువులను క్రిమిర‌హితం  చేయడానికి యువి-సి బాక్స్ రూపొందించారు..బాక్స్‌లో  యువి-సి దీపాన్ని ఉప‌యోగించి ఒక నిమిషంలో కోవిడ్ -19 వైర‌స్‌ను నిర్వీర్యం చేయ‌వ‌చ్చు., ఇది ఓజోన్‌ను  ఉత్పత్తి చేస్తుంది . పెట్టెలో ఉంచిన వస్తువుల ఉపరితలాలను ప‌రిర‌క్షించ‌గ‌ల‌దు.

ఎనిమిది వాట్ల యువి-సి దీపం కలిగిన, చేతిలో ఇమిడే ఈ  పరికరం రెండు అంగుళాల కన్నా తక్కువ దూరంలో ఉంచిన 100 ఎంజె,సిఎం2  ఇరాడియన్స్ వద్ద 45 సెకన్ల పాటు  కుర్చీలు, ఫైళ్ళు, పోస్టల్ డెలివరీ చేసిన వస్తువులు , ఆహార ప్యాకెట్ల వంటి వాటిపై కాంతిని ప్ర‌స‌రింప‌చేస్తే ఆ వస్తువులు  క్రిమిర‌హితం అవుతాయి .  ఆఫీసులు, ప‌బ్లిక్‌ప్ర‌దేశాలు, ప‌ని ప్ర‌దేశాల‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

 

 (Release ID: 1615402) Visitor Counter : 163