PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 30 APR 2020 6:20PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • దేశంలో కోవిడ్‌-19 కేసుల సంఖ్య 33,050.. వీరిలో 8,324 మందికి నయంకాగా- కోలుకున్నవారి శాతం 25.19కు పెరిగింది. కేసుల రెట్టింపు వ్యవధి 11 రోజుల స్థాయికి మెరుగుపడగా నిన్నటినుంచి 1,748 కేసులు నమోదయ్యాయి.
  • రాష్ట్రాల్లోని ఆస్పత్రులన్నీ... ప్రత్యేకించి ప్రైవేటు ఆరోగ్య సదుపాయాలు పనిచేయడంసహా కీలక సేవలు అందించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సూచన.
  • భారతదేశంలో పెట్టుబడులకు ఉత్తేజమిచ్చే వ్యూహాలపై చర్చకు సమగ్ర సమావేశం నిర్వహించిన ప్రధానమంత్రి.
  • కోవిడ్‌-19పై పోరుకు మే 4నుంచి కొత్త మార్గదర్శకాలు; పలు జిల్లాలకు గణనీయ సడలింపు: దేశీయాంగ శాఖ
  • కోవిడ్‌-19.. దిగ్బంధం దృష్ట్యా పరీక్షలు-విద్యా కేలండర్‌పై వర్సిటీలకు యూజీసీ మార్గదర్శకాలు
  • దిగ్బంధంలోనూ వ్యవసాయరంగానికి అగ్ర ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం: వ్యవసాయశాఖ మంత్రి

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తాజా సమాచారం

దేశంలో కోవిడ్‌-19 బారినపడి నయమైన వారి సంఖ్య 8,324కు చేరడంతో కోలుకున్నవారి శాతం 25.19కు పెరిగింది. దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్‌-19 నిర్ధారిత కేసుల సంఖ్య 33,050 కాగా, నిన్నటి నుంచి 1,718 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక దిగ్బంధానికి ముందు కేసులు రెట్టింపయ్యే వ్యవధి 3.4 రోజులుండగా, ప్రస్తుత విశ్లేషణల ప్రకారం జాతీయ సగటు వ్యవధి ఇప్పుడు 11 రోజులకు పెరిగింది. మరోవైపు మరణాలు 3.2 శాతం కాగా, వీరిలో పురుషులు 65 శాతం, మహిళలు 35 శాతంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు.. ప్రత్యేకించి ప్రైవేటు ఆస్పత్రులన్నీ పనిచేయడంతోపాటు కీలక వైద్యసేవలు అందించేలా చూడాలని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులకు లేఖ రాశారు. ముఖ్యంగా రక్తసంబంధ వ్యాధులతో బాధపడేవారి కోసం రక్తదానం, రక్తమార్పిడి సేవలు సవ్యంగా సాగేలా చూడాలన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619747

భారత్‌లో పెట్టుబడులకు ఉత్తేజమిచ్చే వ్యూహాలపై చర్చకు సమగ్ర సమావేశం నిర్వహించిన ప్రధానమంత్రి

కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం దిశగా  దేశంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయంగా పెట్టుబడులను ప్రోత్సహించడంపై వ్యూహరచన దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమగ్ర సమావేశం నిర్వహించారు. దేశంలో ప్రస్తుతం అందుబాటులోగల పారిశ్రామిక భూములు/ప్లాట్లు/ఎస్టేట్లలో తక్షణ వినియోగ మౌలిక సదుపాయాల కల్పనను ప్రోత్సహించడంతోపాటు తగిన ఆర్థిక సహాయం అందించడంపై ఒక పథకాన్ని రూపొందించడంపై ఈ సమావేశం చర్చించింది. పెట్టుబడిదారులకు చేయూతనిచ్చేలా వారి సమస్యల పరిశీలన, కేంద్ర-రాష్ట్ర స్థాయులలో అవసరమైన అనుమతులు సకాలంలో లభించేలా చూడటం వంటి చురుకైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి ఆదేశించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619735

కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో దిగ్బంధంపై దేశీయాంగ శాఖ సమగ్ర సమీక్ష

జాతీయ దిగ్బంధంపై దేశీయాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇవాళ సమగ్ర సమీక్ష నిర్వహించింది. దిగ్బంధం విధింపువల్ల ఇప్పటిదాకా అద్భుత ప్రయోజనాలు కలగడంసహా పరిస్థితి ఎంతో మెరుగుపడిందని ఈ సందర్భంగా సమావేశం అభిప్రాయపడింది. దిగ్బంధంవల్ల సిద్ధించిన ప్రయోజనాలు వృథాకాకుండా మే 3వ తేదీదాకా ఆ నిబంధనలను తప్పక పాటించాలని నిర్ణయించింది. అటుపైన మే 4నుంచి అనేక జిల్లాలకు మరిన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలు అమలులోకి వస్తాయని పేర్కొంది. దీనికి సంబంధించి త్వరలోనే వివరాలను వెల్లడిస్తామని దేశీయాంగ శాఖ తెలిపింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619437

పౌర సామాజిక సంఘాలు/స్వచ్ఛంద సంస్థలతో డాక్టర్‌ హర్షవర్ధన్‌ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం

సమాజంలోని వివిధ వర్గాలకు ఆహారం, ఇతర అవసరాలు తీర్చడంలో విశేష, నిస్వార్థ సేవలందించిన దేశంలోని 92,000 స్వచ్ఛంద సంస్థలకు ప్రధానమంత్రి తరఫున, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ తరఫున మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌-19 పరిస్థితుల నిర్వహణలో ఈ సంస్థల పాత్ర ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. అంతేగాక ఈ సంస్థల సేవలనుంచి పొందిన స్ఫూర్తితో ఇతరులు కూడా తమవంతు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619796

కోవిడ్‌-19.. దిగ్బంధం దృష్ట్యా పరీక్షలు-విద్యా కేలండర్‌పై విశ్వవిద్యాలయాలకు మార్గదర్శకాలు జారీచేసిన విశ్వవిద్యాలయ అనుమతుల సంఘం (UGC)

1. మధ్యంతర సెమిస్టర్ల విద్యార్థులు: ప్రస్తుత, మునుపటి సెమిస్టర్లలో ప్రతిభ అంచనాల ఆధారంగా తదుపరి సెమిస్టర్‌కు ప్రమోషన్‌. కోవిడ్‌-19 పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చిన రాష్ట్రాల్లో మాత్రం జూలైలో పరీక్షల నిర్వహణ

2. తుది సెమిస్టర్‌ విద్యార్థులు: జూలైలో పరీక్షల నిర్వహణ

3. పరీక్షలు-విద్యా కేలండర్‌ సమస్యల పరిష్కారం కోసం ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక కోవిడ్‌-19 సెల్‌ ఏర్పాటు

4. సత్వర నిర్ణయాలదిశగా విశ్వవిద్యాలయ అనుమతుల సంఘంలోనూ కోవిడ్‌-19 సెల్‌

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619507

భారత, బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాజాగా గణతంత్ర బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి గౌరవనీయ షేక్‌ హసీనాతో టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రాంతీయంగా నెలకొన్న పరిస్థితులపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. దీని ప్రభావ ఉపశమనం దిశగా తమతమ దేశాల్లో చేపట్టిన చర్యలను పరస్పరం తెలియజేసుకున్నారు. సార్క్‌ కోవిడ్‌ అత్యవసర నిధికి 1.5 మిలియన్‌ అమెరికా డాలర్ల విరాళం ఇచ్చినందుకుగాను ప్రధాని మోదీ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో కోవిడ్‌-19పై పోరుకు భారత్‌ నాయకత్వం వహించడంసహా బంగ్లాదేశ్‌లో మానవ వనరుల బలోపేతానికి సహకారంతోపాటు వైద్య సరఫరాలు చేసినందుకు ప్రధాని హసీనా ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619427

భారత, బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రుల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాజాగా గణతంత్ర బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి గౌరవనీయ షేక్‌ హసీనాతో టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రాంతీయంగా నెలకొన్న పరిస్థితులపై దేశాధినేతలిద్దరూ చర్చించారు. దీని ప్రభావ ఉపశమనం దిశగా తమతమ దేశాల్లో చేపట్టిన చర్యలను పరస్పరం తెలియజేసుకున్నారు. సార్క్‌ కోవిడ్‌ అత్యవసర నిధికి 1.5 మిలియన్‌ అమెరికా డాలర్ల విరాళం ఇచ్చినందుకుగాను ప్రధాని మోదీ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో కోవిడ్‌-19పై పోరుకు భారత్‌ నాయకత్వం వహించడంసహా బంగ్లాదేశ్‌లో మానవ వనరుల బలోపేతానికి సహకారంతోపాటు వైద్య సరఫరాలు చేసినందుకు ప్రధాని హసీనా ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619427

ప్రధానమంత్రి, మయన్మార్‌ ప్రభుత్వ సలహాదారు అంగ్‌సాన్‌ సూచీల మధ్య టెలిఫోన్‌ సంభాషణ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా మయన్మార్‌ జాతీయ ప్రభుత్వ సలహాదారు గౌరవనీయ అంగ్‌సాన్‌ సూకీతో టెలిఫోన్‌ద్వారా సంభాషించారు. కోవిడ్‌-19 నేపథ్యంలో దేశీయంగా, ప్రాంతీయంగా నెలకొన్న పరిస్థితులపై వారిద్దరూ చర్చించారు. అలాగే ప్రపంచ మహమ్మారి నియంత్రణ దిశగా తమ దేశాల్లో చేపట్టిన చర్యలను పరస్పరం తెలియజేసుకున్నారు. భారత్‌ అనుసరిస్తున్న ‘పొరుగుకు ప్రాధాన్యం’ విధానంలో మయన్మార్‌ ఓ కీలక స్తంభమని ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఆమెకు గుర్తుచేశారు. తదనుగుణంగా కోవిడ్‌-19 ప్రభావిత ఆర్థిక, ఆరోగ్య సంక్షోభ ఉపశమనం కోసం ఆ దేశానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619708

దిగ్బంధంలో పారిశ్రామిక-వాణిజ్య సమస్యల పరిశీలనసహా భాగస్వాముల ఇబ్బందుల పరిష్కారంలో డీపీఐఐటీ కంట్రోల్‌ రూమ్‌ కీలకపాత్ర

కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని పారిశ్రామిక-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(DPIIT) 26.03.2020న ఒక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది. పారిశ్రామిక-వాణిజ్య రంగాల సమస్యల పర్యవేక్షణతోపాటు ఆయా రాష్ట్ర/జిల్లా/పోలీసు తదితర సంబంధిత అధికార స్థానాలకు వాటి నివేదన బాధ్యతను ఇది నిర్వర్తిస్తుంది. దీనిద్వారా ఇప్పటివరకూ 89 శాతం ఫిర్యాదులకు ముగింపు/పరిష్కారం లభించింది. మంత్రి, కార్యదర్శి, సీనియర్ అధికారుల నిరంతర పర్యవేక్షణ-సమీక్షలతో సత్వర పరిష్కారాల లభ్యత. కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నం.011-2306 2487; ఈ-మెయిల్‌: controlroom-dpiit[at]gov[dot]in

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619553

జాతీయ దిగ్బంధంలోనూ వ్యవసాయరంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చిన కేంద్ర ప్రభుత్వం: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి

జాతీయ దిగ్బంధం కొనసాగుతున్న సమయంలోనూ దేశ వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్నారు. అందుకే దేశంలో ఎక్కడా ఆహారధాన్యాలు, పప్పుదినుసులకు కొరత రాలేదని గుర్తుచేశారు. అంతేకాకుండా ప్రజలకు కూరగాయలు, పాలువంటి నిత్యావసరాల లభ్యత దిశగానూ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619517

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001G7O1.jpg

కోవిడ్-19పై పోరాటం బలోపేతం దిశగా నిత్యావసరాలు, వైద్య సామగ్రిని రవాణా చేసిన 411 లైఫ్‌లైన్‌ ఉడాన్‌ విమానాలు

‘లైఫ్‌లైన్‌ ఉడాన్‌’ కింద ఎయిరిండియా, అలయెన్స్‌ ఎయిర్‌, ఐఏఎఫ్‌, ఇతర ప్రైవేటు విమానయాన సంస్థలు ఇప్పటిదాకా 411 విమానాలను నడిపాయి. తద్వారా 4,04,224 కిలోమీటర్ల మేర నడిచిన విమానాలు దాదాపు 776.73 టన్నుల సామగ్రిని రవాణా చేశాయి.

కోవిడ్‌-19పై భారత్‌ పోరాటానికి మద్దతుగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు నిత్యావసరాలు, అత్యవసర వైద్య సామగ్రిని చేరవేయడం కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ దేశీయ రంగంలో ‘లైఫ్‌లైన్‌ ఉడాన్‌’ విమానాలను నడుపుతోంది. ఇక జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, ద్వీప ప్రాదేశికాలు, ఈశాన్య భారత ప్రాంతంలోని మారుమూల ప్రదేశాలకు పవన్‌హన్స్‌ లిమిటెడ్‌ సంస్థసహా పలు హెలికాప్టర్‌ సర్వీసులు వైద్య సామగ్రితోపాటు కోవిడ్‌-19 రోగులను కూడా తీసుకెళ్లాయి. కాగా, 2020 ఏప్రిల్‌ 28వరకూ పవన్‌హన్స్‌ సంస్థ హెలికాప్టర్లు 7,257 కిలోమీటర్లు ప్రయాణించి 2.0 టన్నుల సామగ్రిని రవాణా చేశాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619434

దేశవ్యాప్తంగా 8 కోట్ల మొబైల్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ అయిన ‘ఆరోగ్యసేతు’ యాప్‌

భారత్‌లోని ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నడుమ వినూత్న అవకాశాల అన్వేషణద్వారా దేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రపంచ కూడలిగా మార్చాలని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ రంగానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతికశాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ సంఘాలు, సంస్థలు, పరిశ్రమలోని ఇతర ప్రముఖ భాగస్వాములతో ఆయన సమావేశం నిర్వహించారు. అందుబాటులోగల అవకాశాలతోపాటు తమ శాఖ ప్రకటించిన కొత్త పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. తద్వారా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడంసహా ఎలక్ట్రానిక్‌ పరిశ్రమ రంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. ముఖ్యంగా పూర్తిస్థాయి మార్పులకు లోనవుతున్న వైద్యపరమైన ఎలక్ట్రానిక్స్ పరికరాల పరిశ్రమకుగల కీలకపాత్ర గురించి ఆయన నొక్కిచెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619518

ఎంఎస్‌ఎంఈలపై పథకాలు, ఆలోచనలు, ఆవిష్కరణలు-పరిశోధనల నిధి సంబంధిత పోర్టల్‌ను ప్రారంభించిన శ్రీ గడ్కరీ

కేంద్ర-రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అమలుచేస్తున్న అన్ని పథకాలూ ఈ పోర్టల్‌ (http://ideas.msme.gov.in/) ద్వారా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఈ రంగానికి సంబంధించి ఆలోచనలు, ఆవిష్కరణలు, పరిశోధనల ఆదానప్రదానానికీ అవకాశం ఉంది. ఇందులో జనాలోచనల సమీకరణతోపాటు వాటి మూల్యాంకనం-రేటింగ్‌కూ వీలుంటుంది. అలాగే వెంచర్‌ కేపిటల్‌, విదేశీ సహకారం తదితరాల ప్రవాహానికీ వీలు కల్పిస్తుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619710

ఉచిత భోజ‌న‌ పంపిణీలో 30ల‌క్ష‌ల స్థాయిని అధిగ‌మించిన భార‌త రైల్వేశాఖ

కోవిడ్ -19 దిగ్బంధం నేప‌థ్యంలో భారత రైల్వేశాఖ దాదాపు 300 ప్రాంతాల్లో అన్నార్తుల‌కు ఉచిత భోజ‌న పంపిణీ చేసింది. ఇందుకోసం రైల్వేశాఖ పరిధిలోని వివిధ సంస్థలు సమష్టిగా నిత్యం వేలాది మందికి ఉచిత భోజనంతోపాటు రేపటి భవిష్యత్తుపై ఆశలకు ఊపిరిపోస్తున్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619602

కోవిడ్‌-19 నియంత్రణ, నిర్వహణలో ప్రధానమంత్రి నాయకత్వ పటిమకు ఆటోమొబైల్‌ పరిశ్రమ దిగ్గజాల ప్రశంస

భారత ఆటోమొబైల్‌ రంగంపై కోవిడ్‌-19 ప్రభావాన్ని అంచనా వేసే దిశగా కేంద్ర భారీ పరిశ్రమల-ప్రభుత్వరంగ సంస్థల శాఖ మంత్రి శ్రీ ప్రకాష్‌ జావడేకర్‌ ఇవాళ భారత ఆటోమొబైల్‌ పరిశ్రమకు చెందిన కొందరు దిగ్గజాలతో సమావేశం నిర్వహించారు. ఈ దుష్ర్పభావాలను ఉపశమింపజేసేందుకు చేపట్టాల్సిన విధానపరమైన చర్యలపై ఈ సందర్భంగా వారి సలహాలు, సూచనలను స్వీకరించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619725

గృహ కొనుగోలుదారుల/స్థిరాస్తిరంగ ప‌రిశ్ర‌మ భాగ‌స్వాముల ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ దిశ‌గా ప్ర‌త్యేక చ‌ర్య‌ల‌పై త్వ‌ర‌లో స‌ల‌హాప‌త్రం జారీ చేయ‌నున్న కేంద్ర గృహ నిర్మాణ-ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల‌ మంత్రిత్వ శాఖ

స్థిరాస్తి రంగ నియంత్ర‌ణ చ‌ట్టం (RERA) కింద ఏర్పాటైన కేంద్రీయ‌ సలహా మండలి (సీఏసీ) అత్యవసరంగా సమావేశమైంది. వెబినార్ రూపేణ నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల శాఖ (స్వతంత్ర బాధ్యతగ‌ల‌) మంత్రి శ్రీ హర్దీప్‌ సింగ్‌ పూరి  అధ్యక్షత వ‌హించారు. స్థిరాస్తి రంగంపై ప్ర‌పంచ మ‌హ‌మ్మారి కోవిడ్‌-19, జాతీయ దిగ్బంధం ప్ర‌భావం, పర్యవసానాలతోపాటు చ‌ట్ట నిబంధ‌న‌ల మేర‌‌కు దీన్ని ‘అనివార్య ప‌రిస్థితి’గా పరిగణించడంపైనా ఈ సంద‌ర్భంగా చ‌ర్చించారు. అన్ని అంశాలపైనా సమగ్రంగా చర్చించిన అనంతరం- ఈ రంగంలోని భాగస్వాములందరి ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. తదనుగుణంగా గృహ కొనుగోలుదారుల /స్థిరాస్తిరంగ ప‌రిశ్ర‌మ భాగ‌స్వాముల ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ దిశ‌గా చేపట్టే ప్ర‌త్యేక చ‌ర్య‌ల‌పై ఈ చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్ర గృహ నిర్మాణ-ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల‌ మంత్రిత్వ శాఖ త్వ‌ర‌లో  స‌ల‌హాప‌త్రం జారీ చేస్తుందని తెలిపారు.

మరిన్ని వివరాలకు...  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619505

‘జనౌషధి సుగమ్‌’తో 3,25,000 మంది ప్రజలకు జనౌషధి కేంద్రాల అందుబాటు

కోవిడ్‌-19 సంక్షోభం నడుమ దేశంలోని వివిధ ప్రాంతాల్లోగల ‘ప్రధానమంత్రి జనౌషధి కేంద్రా (PMJAK)లను తెలుసుకునేందుకు ‘జనౌషధి సుగమ్‌’ యాప్‌ ఎంతగానో తోడ్పడుతోంది. తద్వారా అందుబాటు ధరలో జనరిక్‌ ఔషధాలు ప్రజలకు లభ్యమవుతున్నాయి. ఈ మొబైల్‌ యాప్‌ద్వారా 3.25 లక్షలమంది పీఎంజేఏకే ప్రయోజనాలను పొందగలుగుతున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619522

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/IMG-20200429-WA00367VX1.jpg

 

 

జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, ఈశాన్య భారత ప్రాంతాల్లో కోవిడ్‌ పరిస్థితులపై సైనిక, వాయుసేన మాజీ అధిపతులతో కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్రసింగ్‌ దృశ్య-శ్రవణ మాధ్యమ సమీక్ష

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619395

ఉపాధి సృష్టి, గ్రామీణ గృహనిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి బలోపేతం సంబంధిత గ్రామీణాభివృద్ధి పథకాలు అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలను కోరిన కేంద్ర గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్‌శాఖ మంత్రి

కేంద్ర గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్‌శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జలసంరక్షణ, భూగర్భ జల సంవృద్ధి, నీటిపారుదల పనులపై ప్రధానంగా దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అలాగే పీఎంజీఎస్‌వై కింద ఇప్పటికే మంజూరైన రహదారుల నిర్మాణ సంబంధిత పనులను సత్వరం కేటాయించడంతోపాటు అసంపూర్తి పనులను త్వరగా ముగించాలని సూచించారు. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ) పథకం కింద దేశవ్యాప్తంగా మంజూరుచేసిన 2.21 కోట్ల ఇళ్లకుగాను ఇప్పటికే 1.86 కోట్ల గృహాల నిర్మాణం పూర్తయిందని మంత్రి వెల్లడించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619504

దేశవ్యాప్తంగాగల సీఎస్‌ఐఆర్‌ ప్రయోగశాలల ద్వారా నిరుపేదలకు సహాయం; ఆయా ప్రాంతాల్లో ఆహారం, పరిశుభ్రత ద్రవాలు, మాస్కులు వగైరాల ఉచిత పంపిణీ

శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి (CSIR) పరిధిలోని ‘CFTRI- మైసూర్‌, IHBT- పాలంపూర్‌, IMMT- భువనేశ్వర్‌, CIMFR- ధన్‌బాద్‌, IIP- డెహ్రాడూన్‌’ వంటి ప్రయోగశాలలు తమ పరిధిలోని వలస కార్మికులు, రోగులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులుసహా అనేకమందికి ఆహారం తదితరాలను పంపిణీ చేశాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619719

జీఐఎస్‌ డ్యాష్‌బోర్డు వినియోగంద్వారా కోవిడ్‌-19 హాట్‌స్పాట్‌లను పర్యవేక్షణిస్తున్న ఆగ్రా స్మార్ట్‌ సిటీ

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1619549

 

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్: ఈ కేంద్ర‌పాలిత ప్రాంతంలో క‌రోనాబారిన ‌ప‌డుతున్నవారి సంఖ్య నిరంతరం పెరుగుతుండ‌టంపై న‌గ‌ర పాల‌నాధికారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో బాపూధామ్ కాలనీ, సెక్టార్ 30-బి, కాచి కాలనీ వంటి తీవ్ర ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌రిశీల‌న‌-ప‌రీక్ష‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆయన ఆదేశించారు. బాపూధామ్ కాలనీ ప‌రిధిని విస్త‌రించి మ‌రో 2,500 మందిని చేరుస్తామ‌ని, త‌ద్వారా మ‌రింత ప్ర‌భావ‌వంతంగా కరోనా నియంత్ర‌ణ సాధ్యంకాగ‌ల‌ద‌ని పేర్కొన్నారు.
  • పంజాబ్: రాష్ట్రంలో మే 3వ తేదీ త‌ర్వాత క‌ర్ఫ్యూను మ‌రో రెండు వారాలు పొడిగిస్తామ‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. అలాగే కోవిడ్ -19 భద్రత విధివిధానాల‌ను కఠినంగా పాటిస్తూ- నియంత్రణేత‌ర‌, రెడ్‌జోన్‌లో లేని ప్రాంతాల్లో దిగ్బంధం నిబంధ‌న‌ల‌ పరిమిత స‌డ‌లింపు దిశ‌గా చేప‌ట్టే చ‌ర్య‌ల‌ను వివ‌రించారు.  మే 3 తర్వాత రాష్ట్రంలో కర్ఫ్యూను పొడిగించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, రాష్ట్రంలోని దుకాణాల్లో పారిశుధ్యంస‌హా దుకాణ‌దారులు, ప‌నిచేసే సిబ్బంది వ్యక్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌పై రాష్ట్ర ఆరోగ్య‌-కుటుంబ సంక్షేమ‌శాఖ తాజా సలహాప‌త్రం జారీచేసింది. ప్ర‌భుత్వం జారీచేసిన ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అంద‌రూ క‌ఠినంగా పాటించాల‌ని, తెరిచే అనుమ‌తిగ‌ల దుకాణాలు త‌ద‌నుగుణ ప్రామాణిక నిర్వ‌హ‌ణ ప్ర‌క్రియ‌ల‌ను తూచా త‌ప్ప‌కుండా అనుస‌రించాల‌ని స్ప‌ష్టం చేసింది.
  • హర్యానా: రాష్ట్రంలో ఏప్రిల్ నెలకు సంబంధించి ఉద్యోగుల జీతాల తాత్కాలిక నిలిపివేత‌పై ఆర్థికశాఖ ఎలాంటి సర్క్యులర్ జారీ చేయలేదని, దీనిపై సామాజిక మాధ్య‌మాల‌లో వ‌స్తున్న క‌థ‌నాల‌ను విశ్వ‌సించ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి సంక్షోభ ప‌రిస్థితుల న‌డుమ కూడా అవ‌స‌ర‌మైన చోట ఉద్యోగ ఖాళీల భ‌ర్తీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉన్న‌ద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే 12,500 ఖాళీలకు నియామక ప్రక్రియ కొన‌సాగుతున్న‌ద‌ని పేర్కొన్నారు. త‌ద‌నుగుణంగా రాతపరీక్ష నిర్వ‌హించి, దిగ్బంధం ముగిశాక‌ ఫలితాల‌ను ప్రకటిస్తామని ఆయన వెల్ల‌డించారు.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల‌ను స‌జావుగా నడ‌పడం కోసం ముడిస‌ర‌కుల నిరంత‌ర స‌ర‌ఫ‌రాస‌హా పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగానూ ప్ర‌భుత్వం సహాయ‌పడుతుంద‌ని ముఖ్యమంత్రి అన్నారు. అయితే, పారిశ్రామికవేత్తలు తమ కర్మాగారాల్లో సామాజిక దూరం నిబంధ‌న‌ను సమర్థంగా అమ‌లు చేయాల‌ని ఆయ‌న కోరారు. కాగా- రెవెన్యూ లోటు, జీఎస్టీ న‌ష్ట ప‌రిహారం, కేంద్ర పన్నుల్లో హిమాచల్ ప్ర‌దేశ్ వాటా, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం నిధులు, జాతీయ ఆరోగ్య మిష‌న్ నిధులు, విపత్తు ఉపశమన సాయం, ఆర్థిక స‌హాయ ప్యాకేజీస‌హా అన్నివిధాలా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,899 కోట్లు విడుద‌ల చేసింద‌ని వెల్ల‌డించారు. అంతేకాకుండా కోవిడ్‌-19 నేప‌థ్యంలో రాష్ట్రాల‌ తాత్కాలిక నిధుల స‌మీక‌ర‌ణ ప‌రిమితిని 60 శాతం పెంచింద‌ని తెలిపారు. దీనివ‌ల్ల హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ పోరాటం స‌మ‌ర్థంగా సాగుతున్న‌ద‌ని చెప్పారు.
  • కేరళ: రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో కొన్ని కేసులు నిర్ధారణ కావడంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడంతోపాటు నగరంలోని రెండు ప్రాంతాల్లోగల మూడు ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందిని వైద్య పర్యవేక్షణలో ఉంచింది. కాగా, పాలక్కాడ్‌ జిల్లాలో ఐదుగురికి వ్యాధి నయమై ఇళ్లకు వెళ్లారు. మరోవైపు గల్ఫ్‌లోని కువైట్‌, అబుధాబిలలో ఇద్దరేసి వంతున నలుగురు కేరళీయులు కోవిడ్‌-19తో మరణించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపు వాయిదా ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ ఇవాళ సంతకం చేశారు. కాగా, ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, పోలీసుల బలగాలకు మాత్రం 1వ తేదీన జీతాలు చెల్లిస్తారు. రాష్ట్రంలో నిన్నటిదాకా మొత్తం కేసుల సంఖ్య 495 కాగా, యాక్టివ్‌ కేసులు 123, డిశ్చార్జి అయిన కేసులు 369, మరణాలు 4గా నమోదయ్యాయి.
  • తమిళనాడు: రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో రోగకారకాల నిర్మూలన విధుల్లోగల ముగ్గురు అగ్నిమాపక-రక్షణ సిబ్బందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా, హాట్‌స్పాట్‌ జాబితాలోగల విల్లుపురం నుంచి వచ్చి గ్రీన్‌జోన్‌లోని కృష్ణగిరిలో విధుల్లో చేరిన ప్రభుత్వ వైద్యుడొకరికి వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో విల్లుపురం, కృష్ణగిరిలలో ఆయన సంచరించిన ప్రాంతాలను నియంత్రణ ప్రదేశాలుగా ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు కోవడ్‌-19 అనంతరం రాష్ట్రంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ప్రభుత్వం ఒక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసింది. నిన్నటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య: 2,162. యాక్టివ్‌ కేసులు 922, మరణాలు 27, డిశ్చార్జి అయినవారు 1,210, చెన్నైలో గరిష్ఠ కేసుల సంఖ్య 768.
  • కర్ణాటక: రాష్ట్రంలో ఇవాళ 22 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో బెళగావి 14, బెంగళూరు 3, విజయపుర 2, దావణగేరెతోపాటు దక్షిణ కన్నడ, తుమ్‌కూరు జిల్లాల్లో ఒక్కొక్కటి వంతున ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య: 557కు పెరిగింది. ఇప్పటిదాకా 21 మంది మరణించగా, 223 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కొన్ని ఆంక్షలను సడలించడంపై మే 3 తర్వాత కేంద్ర నిర్ణయించే విధానం అనుసరించాలని, అలాగే ఆ తేదీ తర్వాత రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగించాలని మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది.
  • ఆంధ్రప్రదేశ్‌: రాష్ట్రంలో సుమారు  21.55 లక్షల కుటుంబాలకు ఉచిత రేషన్ లభిస్తుంది. దిగ్బంధం ముగిశాక కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్ణ‌యం మేరకు తిరుమ‌ల‌లో టీటీడీ భక్తులకు దర్శనం క‌ల్పించ‌నుంది.  గడ‌చిన 24 గంటల్లో 71 కొత్త కేసులు న‌మోద‌వ‌గా, 34మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 6,497 నమూనాలను పరీక్షించిన నేప‌థ్యంలో మొత్తం కేసుల సంఖ్య 1,403కు చేరింది. యాక్టివ్ కేసులు 1,051, కోలుకున్నవారు: 321 మంది, మరణాలు: 31. కాగా, ప‌రీక్ష‌ల సంఖ్య పెరిగిన కార‌ణంగానే కేసుల పెరుగుద‌ల క‌నిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక కేసుల సంఖ్య రీత్యా కర్నూలు (386), గుంటూరు (287), కృష్ణా (246), నెల్లూరు (84), చిత్తూరు (80) అగ్ర‌స్థానాల్లో ఉన్నాయి.
  • తెలంగాణ: దిగ్బంధం కారణంగా రాష్ట్రంలో రవాణా రంగ సంక్షోభం నెల‌కొన‌డంతో హైదరాబాద్‌స‌హా తెలంగాణ అంత‌టా నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రాపై ప్రభావం ప‌డుతోంది. స‌త్వ‌ర ప‌రీక్ష కిట్ల రూప‌క‌ల్ప‌న‌పై రాజ‌ధానిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టిఐఎఫ్ఆర్)తోపాటు ఇఎస్ఐసి హాస్పిటల్, వైద్య క‌ళాశాల మ‌ధ్య అవ‌గాహ‌న ఒప్పందం కుదిరింది. కాగా, తెలంగాణ నుంచి 2 లక్షల వ్యక్తిగ‌త ర‌క్ష‌ణ సామ‌గ్రి పంపాల‌ని పుదుచ్చేరి  ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి చేసింది. రాష్ట్రంలో నిన్నటిదాకా న‌మోదైన మొత్తం కేసులు 1016 కాగా, యాక్టివ్ కేసులు 582, కోలుకున్న‌వారు 409 మంది, మరణాలు 25గా ఉన్నాయి.
  • అరుణాచల్ ప్రదేశ్: ఇటానగర్‌లో చిక్కుకున్న 300 మంది ఇతర జిల్లాలకు చెందిన అరుణాచల్ ప్ర‌దేశ్ వాసులు త‌మ స్వ‌స్థ‌లాల‌కు వెళ్లేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తించింది. అయితే, దిగ్బంధం నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వారు బస్సులలో వెళ్ల‌నున్నారు.
  • అసోం: రాష్ట్రంలోని బొంగైగావ్ జిల్లాలో మరో 4 కోవిడ్‌-19 కేసులు నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆరోగ్య‌శాఖ మంత్రి శ్రీ హిమంత బిశ్వ‌శర్మ ట్వీట్ చేశారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41కి పెరిగింది.
  • మేఘాలయ: షిల్లాంగ్‌లోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్ద‌రు రోగుల‌కు వ్యాధి న‌య‌మైన‌ట్లు ప‌రీక్ష‌ల్లో తేలింది. అయితే, వారు పూర్తిగా కోలుకున్న‌ట్లు ప్ర‌క‌టించాలంటే నిబంధ‌న‌ల ప్ర‌కారం 24 గంటల తర్వాత మ‌రోసారి పరీక్ష నిర్వ‌హించాల్సి ఉంటుంది.
  • మణిపూర్: రాష్ట్రం వెలుపల చిక్కుకుపోయిన మ‌ణిపూర్ వాసులు తిరిగిరానున్న నేప‌థ్యంలో వారికోసం నిర్బంధ వైద్య ప‌రిశీల‌న కేంద్రాలు, ఇతర సౌకర్యాల సంసిద్ధతపై రాష్ట్రంలోని అంద‌రు డిప్యూటీ కమిషనర్లతో ముఖ్య‌మంత్రి దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మ స‌మావేశంద్వారా స‌మీక్షించారు.
  • మిజోరం: రాష్ట్రంలో పీఎం కిసాన్ పథకం కింద 92,201 మంది రైతులు అర్హ‌త పొందారు. వీరిలో 66,108 మందికి పైగా దిగ్బంధం కొన‌సాగుతుండ‌గానే ప్రత్యేక ఆర్థిక సహాయం పొందడం విశేషం.
  • నాగాలాండ్: కోహిమాలో కరోనా వైర‌స్ వ్యాప్తివ‌ల్ల 10, 12 త‌ర‌గ‌తుల‌ పరీక్షల ఫలితాలు ఆలస్యమ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌చ్చేనెల చివ‌రినాటికి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.
  • సిక్కిం: కేంద్ర హోంశాఖ జారీచేసిన కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికను సమీక్షించ‌డానికి నిర్వ‌హించిన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశానికి ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించారు.
  • త్రిపుర: ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇవ్వ‌డంతోపాటు కోవిడ్‌-19 మహమ్మారి సంక్షోభం న‌డుమ అగ‌ర్త‌ల నగరంలో పరిశుభ్రత నిర్వ‌హించ‌డంలో విశేష సేవ‌లందించిన న‌గ‌ర‌పాల‌క సిబ్బందికి ముఖ్య‌మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో 597 కొత్త కేసుల న‌మోదుతో కోవిడ్-19 మొత్తం కేసుల సంఖ్య 9,915కి పెరిగింది. ఇప్ప‌టిదాకా 1,539 మందికి వ్యాధి న‌యంకాగా, మరణాల సంఖ్య 432గా ఉంది. ఇక ముంబైలో అత్యధికంగా 3,096 కేసులు నమోదయ్యాయి. మ‌రోవైపు నాసిక్ జిల్లాలోని మాలేగావ్ కొత్త కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా మారింది.
  • గుజరాత్: రాష్ట్రంలో 308 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 4,082కు చేరింది. ఇప్పటిదాకా 527 మంది కోలుకోగా, 18 మరణాలు నమోదయ్యాయి. వలస కార్మికుల ప్ర‌యాణానికి కేంద్రం అనుమతి నేప‌థ్యంలో కఠిన వైద్య‌ప‌ర‌మైన విధివిధానాల న‌డుమ  లక్షలాది కార్మికులు సొంత రాష్ట్రాల‌కు వెళ్ల‌డానికి సిద్ధమవుతున్నారు.
  • రాజస్థాన్: రాష్ట్రంలో 86 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదవ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 2,524కు చేరింది. ఇప్పటివరకు 57 మరణాలు సంభవించ‌గా, 827 మంది కోలుకున్నారు. కరోనా సంక్షోభం మధ్య జోధ్‌పూర్ జిల్లాలో ఒక వ్య‌క్తి ఔదార్యం వెలుగుచూసింది. ఈ మేర‌కు ఉమ్మేద్ న‌గ‌ర్ వాసి రామ్‌నివాస్ మందా నేటిదాకా త‌న జీవిత‌కాలంలో కూడ‌బెట్టిన రూ.50 ల‌క్ష‌ల సొమ్మును పేదలు, అన్నార్తుల ఆకలి తీర్చ‌డం కోసం విరాళంగా ఇచ్చాడు. రాష్ట్రంలోని 83 పంచాయతీలలో 8,500కుపైగా కుటుంబాలకు ఆయ‌న రేషన్ స‌రుకుల సంచులు అందించాడు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 2,561కి చేరింది. వీరిలో 461 మంది కోలుకోగా, 129 మంది మరణించారు.
  • ఛత్తీస్‌గ‌ఢ్‌: రాష్ట్రంలో ప్ర‌స్తుతం 4 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకు నమోదైన 38 కేసుల‌కుగాను 34మందికి వ్యాధి న‌య‌మై ఇళ్ల‌కు వెళ్లిపోయారు.
  • గోవా: మొత్తం 7 కేసులు న‌మోదైన గోవాలో ప్ర‌స్తుతం కోవిడ్‌-19 రోగి ఒక్క‌రు కూడా లేరు.

***

 



(Release ID: 1619804) Visitor Counter : 295