ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 అప్‌డేట్స్‌

Posted On: 30 APR 2020 5:37PM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వం, కోవిడ్ -19 సంక్షోభ తీవ్ర‌త‌కు అనుగుణంగా , ముంద‌స్తు చ‌ర్య‌లు, సానుకూల వైఖ‌రి ద్వారా రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాలతో క‌ల‌సి సమిష్టి కృషితో వైర‌స్‌ నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్న‌త‌ స్థాయిలో సమీక్షిస్తున్నారు.

 కోవిడ్ -19 తోసంబంధం లేని ఆరోగ్య సేవ‌లు అందేలా చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిందిగా కేంద్ర ఆరోగ్య  , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష వ‌ర్ధ‌న్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రుల‌కు లేఖ‌ రాశారు. అలాగే ర‌క్త సంబంధిత స‌మ‌స్య‌లుగ‌ల త‌ల‌సేమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ ఆనీమియా వంటి పేషెంట్ల‌కోసం ర‌క్త‌దానం, ర‌క్త‌మార్పిడి సేవ‌లు నిరంత‌రాయంగా కొన‌సాగాలని ఆయ‌న కోరారు.

ఇలాంటి పేషెంట్ల కోసం అన్ని ఆరోగ్య సేవ‌లు అందుబాటులోఉండే చూడాల‌ని , ప్ర‌త్యేకించి ప్రైవేటు రంగంలో ఇటువంటి సేవ‌లు అందించేవి ప‌నిచేసేలా చూడాల‌ని, ఇలాంటి అత్యావ‌శ్య‌క‌సేవ‌లు అవ‌స‌ర‌మైన ఇలాంటి పేషెంట్లు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా చూడాల‌ని ఆయ‌న రాష్ట్రాల‌కు సూచించారు.ప్రైవేటు రంగంలోని చాలా ఆస్పత్రులు అత్యావ‌శ్య‌క సేవ‌లైన డ‌యాల‌సిస్‌, ర‌క్త‌మార్పిడి, కీమో థెర‌పి, సంస్థాగ‌త సేవ‌ల‌ను త‌మ పేషెంట్లకు క‌ల్పించ‌డానికి వెనుకాడుతున్న‌ట్టు గ‌మ‌నించ‌డం జ‌రిగింద‌ని, ఇది ఆమోద‌యోగ్యం కాద‌ని డాక్ట‌ర్ హ‌ర్ష వ‌ర్ద‌న్ అన్నారు.

2020 ఏప్రిల్ 15న కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ జారీచేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఆరోగ్య సేవ‌ల‌న్నీ లాక్‌డౌన్ కాలంలో ప‌నిచేయాల‌ని   రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలకు ఆయ‌న సూచించారు. ప్రైవేటు రంగంలో సేవ‌లు అందిస్తున్న‌వారు వెళ్ల‌డానికి వీలు క‌ల్పించాల‌న్నారు.డ‌యాల‌సిస్ కు సంబంధించి కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ డ‌యాల‌సిస్ పేషెంట్ల కోసం ప్రమాణీకృత నిర్వ‌హ‌ణా ప్ర‌క్రియ ( ఎస్‌.ఒ.పి)ని, అలాగే ర‌క్త దానం, ర‌క్త మార్పిడికి సంబంధించి న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను9  ఏప్రి‌ల్ ,2020 న జారీచేసిన‌ట్టు డాక్ట‌ర్ హ‌ర్ష వ‌ర్ద‌న్ తెలిపారు.ఇవి https://www.mohfw.gov.in/  వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయ‌న్నారు.

కోవిడ్ -19 వ్యాప్తి సమయంలో అవసరమైన ఆరోగ్య సేవలను అందించడానికి 2020 ఏప్రిల్ 20 న ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  మార్గదర్శక సూచ‌న‌లు జారీ చేసింది. పునరుత్పత్తి , పిల్లల ఆరోగ్యం (ఆర్‌సిహెచ్), రోగనిరోధకత, టిబి, కుష్టు వ్యాధి  వెక్టర్ ద్వారా కలిగే వ్యాధులు, అలాగే క్యాన్సర్  డయాలసిస్ వంటి సాంక్ర‌మికం కాని  వ్యాధులకు అవసరమైన సేవలను అందించడానికి సంబంధించిన సూచ‌న‌లు ఇందులో ఉన్నాయి.

 ఐసిఎంఆర్ 2020 ఏప్రిల్ 17 న జారీ చేసిన కోవిడ్ -19 పరీక్షకు సంబంధించిన మార్గదర్శకాలను అనుసరించాలని రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు సూచించ‌డం జ‌రిగింది.  ఆరోగ్య సంరక్షణ సేవా సంస్థలలో  ప్రోటోకాల్ గురించి విస్తృతంగా తెలియ‌జేయాలి. కోవిడ్ -19  పరీక్ష ప్రోటోకాల్ ప్రకారం జ‌ర‌గాలి.. ఆరోగ్య సంరక్షణ సేవా సంస్థలు వ్యక్తిగత రక్షణ కోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య మంత్రిత్వ శాఖ  2020 మార్చి 24 న జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం పిపిఇని హేతుబద్ధత‌తో ఉపయోగించాలి.  వ్యాధి సంక్రమణ నివారణ , ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో వ్యాధి నియంత్రణ కోసం మార్గదర్శకాలను ప్రభుత్వ , ప్రైవేట్ ఆరోగ్య సంస్థలలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని తెలియ‌జేయ‌డం జ‌రిగింది.

కోవిడ్  వ్యాధి చికిత్స‌తో సంబంధం లేని ఆరోగ్య సదుపాయంలో అనుమానాస్పద లేదా ధృవీకరించబడిన కోవిడ్ -19 కేసు క‌నుగొంటే  తీసుకోవలసిన చర్యలకు సంబంధించి, ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2020 ఏప్రిల్ 20 న మార్గదర్శకాలను జారీ చేసింది.

అత్యావ‌శ్య‌క ఆరోగ్య‌ సేవలను తిరస్కరించడం, ప్రత్యేకించి టెస్టింగ్‌కు సంబంధించి వ‌చ్చే ఫిర్యాదులను శీఘ్రంగా పరిష్కరించాల‌ని, రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల‌కు సూచించ‌డం జ‌రిగింది.  ఈ విష‌యంలో ఆరోగ్య రంగంలోని వారితో చ‌ర్చించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. తద్వారా  అనిశ్చితి తగ్గుతుంద‌ని. క్లినిక్‌లు  ఆసుపత్రులు పనిచేస్తాయ‌ని అన్నారు.

ఇప్పటివరకు దేశంలో  మొత్తం 8,324 మంది వైర‌స్‌నుంచి కోలుకున్నారు. ఇది  మొత్తం రికవరీ రేటును 25.19% కి  చేర్చింది. నిర్ధారిత మొత్తం  కోవిడ్  కేసుల సంఖ్య ప్ర‌స్తుతం 33,050. నిన్నటి నుండి, దేశంలో కొవిడ్ -19 నిర్ధారిత‌ కేసుల సంఖ్య 1718  పెరిగిన‌ట్టు గుర్తించారు.

ఇప్పటివరకు జ‌రిగిన కొవిడ్ మరణాలను విశ్లేషించినప్పుడు,  మరణాల రేటు 3.2% గా ఉంది.  అందులో 65శాతం మంది పురుషులు కాగా  35 శాతం మంది స్త్రీలు ఉన్ఆరు. వయస్సు ల‌వారీగా  చూస్తే, 45 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారు 14శాతం; 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సువారు 34.8 శాతం, 51.2 శాతం  మంది 60 ఏళ్ళకు పై వర్గంలోకి వస్తారు, అయితే 42శాతం మంది 60-75 సంవత్సరాల వయస్సు గలవారున్నారు 9.2శాతంమంది 75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గలవారు. ఇత‌ర అనారోగ్యస‌మ‌స్య‌లు ఉన్నవారు 78 శాతం వ‌ర‌కు ఉన్నారు.

దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రెట్టింపున‌కు సంబంధించిన గ‌ణాంకాల‌ను విశ్లేషించిన‌పుడు, జాతీయ స‌గ‌టు ప్ర‌స్తుతం 11 రోజులు ఉండ‌గా, లాక్ డౌన్ కుముందు ఇది 3.4 రోజులుగా ఉండేది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కేసుల రెట్టింపు  రేటు జాతీయ స‌గ‌టు కంటే మెరుగుగా ఉన్న వాటి జాబితా కింది విధంగా ఉంది. కేసుల రెట్టింపు రేటు 11 నుంచి 20 రోజుల మ‌ధ్య గ‌ల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, జ‌మ్ము కాశ్మీర్,ఒడిషా, రాజ‌స్థాన్ , త‌మిళ‌నాడు, పంజాబ్ ఉన్నాయి. కేసుల రెట్టింపు రేటు 20 నుంచి 40 రోజులున్న రాష్ట్రాల‌లో క‌ర్ణాట‌క‌, ల‌ద్దాక్‌, హ‌ర్యానా, ఉత్త‌రాఖండ్‌, కేర‌ళ ఉన్నాయి. అస్సాం, తెలంగానా, చ‌త్తీస్‌ఘ‌డ్‌,, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల కేసుల రెట్టింపు రేటు కాల  వ్య‌వ‌ధి 40 రోజుల‌కు పైనే ఉంది.

కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత స‌మాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు, ఇత‌ర సూచ‌న‌ల కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా గ‌మ‌నించండి : https://www.mohfw.gov.in/.

కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాల‌పై త‌మ ప్ర‌శ్న‌ల‌ను technicalquery.covid19[at]gov[dot]in  ఈమెయిల్‌కు పంపవ‌చ్చు. ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను ncov2019[at]gov[dot]in .కు పంప‌వచ్చు.

కోవిడ్ -19పై ఏవైనా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ హెల్ప్‌లైన్ నెంబ‌ర్ :  +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయ‌వ‌చ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 

*****



(Release ID: 1619747) Visitor Counter : 183