సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

పునరావృత వినియోగానికి 25 ఔషధాలు/ఔషధ ప్రయోగాలను గుర్తించిన సిఎస్ఐఆర్

ఫావిపిరవిర్ వైరల్ ఆర్‌ఎన్‌ఏ పాలిమరేస్ యొక్క విస్తృత స్పెక్ట్రం నిరోధకం అత్యంత ఆశాజనక .ఔషధాలలో ఒకటిగా వెలువడింది



హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సిఎస్ఐఆర్-ఐఐసిటి, ఫావిపిరవీర్ కోసం అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడిన సింథటిక్ ప్రక్రియను అభివృద్ధి చేస్తుంది

Posted On: 30 APR 2020 3:56PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా సిఎస్ఐఆర్ బహుళ రంగాలలో నేతృత్వం వహిస్తుందిపునరావృత వినియోగ ఔషధాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతోదాదాపు ఒక దశాబ్దం వరకు అభివృద్ధికి  అవసరమయ్యే కొత్త ఔషధాలకు విరుద్ధంగా వాటిని త్వరగా చికిత్స కోసం వినియోగించవచ్చు. కోవిడ్-19 తుదముట్టించేందుకు సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మందులను కరోనావైరస్ రోగులపై క్లినికల్ ట్రైల్స్ చేస్తున్నారు. 

భారతదేశంలో కరోనావైరస్ రోగులకు మందులు అందించే దిశగా,  పునర్వినియోగానికి ఎంతవరకు ఆస్కారం ఉంటాయో ప్రయోగించడానికి  సిఎస్ఐఆర్ మొదటి 25 ఔషధాలను గుర్తించింది. ఈ 25 ఔషధాలలో ఫావిపిరవిర్ వైరల్ ఆర్‌ఎన్‌ఏ పాలిమరేస్ విస్తృత స్పెక్ట్రం నిరోధకంఅత్యంత ఆశాజనక ఔషధాలలో ఒకటిగా వెలువడింది. ఫావిపిరవిర్‌ను ఫుజిఫిల్మ్ తోయామా కెమికల్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఇది సాధారణ ఇన్ఫ్లుఎంజాకు ఆమోదం పొందిన చికిత్స. రష్యాచైనాజపాన్లలో విక్రయించబడుతుంది.
 

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సిఎస్ఐఆర్-ఐఐసిటిఫావిపిరవీర్ కోసం అనుకూలమైనతక్కువ ఖర్చుతో కూడిన సింథటిక్ ప్రక్రియను అభివృద్ధి చేసింది. పరిశ్రమతో కలిసి పనిచేసే దిశగాసిఎస్ఐఆర్-ఐఐసిటి మొత్తం ప్రక్రియనుఫావిపిరవిర్ ఫార్మా గ్రేడ్ ఏపిఐ గణనీయమైన పరిమాణాలను ప్రముఖ ఔషధ సంస్థ సిప్లాకు బదిలీ చేసింది. భారతదేశంలో కోవిడ్ -19 కు వ్యతిరేకంగా ఈ ఔషధాన్ని ప్రయోగించే ముందు సిప్లా పరీక్షలు నిర్వహించనుంది. భారతదేశంలో ప్రారంభించబోయే ఫావిపిరవీర్‌కు అనుమతి కోసం సిప్లారెగ్యులేటరీ అథారిటీ డిసిజిఐని సంప్రదించింది. ఫావిపిరవిర్ ఒక సాధారణ ఔషధంఇది ఇప్పటికే ఇన్ఫ్లుఎంజా చికిత్స కోసం ఉపయోగించబడుతోంది.  చైనాజపాన్ఇటలీ వంటి అనేక దేశాలలో కోవిడ్ -19 పై  క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. ఐసిఎంఆర్ ఆధ్వర్యంలోసిప్లెన్జాగా ఉత్పత్తిని మార్కెటింగ్ చేయడానికి ముందు సిప్లా తగిన పరిమితపరీక్షను నిర్వహిస్తుంది.

సిఎస్ఐఆర్సిప్లా భారతదేశంలోప్రపంచవ్యాప్తంగా సరసమైన ధరలకు ఔషధాలు అందించే లక్ష్యంగా కలిసి పనిచేసిన సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నాయి. హెచ్‌ఐవి జనరిక్ ఔషధాల కోసం అనేక సాంకేతిక పరిజ్ఞానాలు సిఎస్‌ఐఆర్ ల్యాబ్‌లలో నిర్ధారితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవి రోగులకు సరసమైన చికిత్సను అందించడంలో సిప్లా విజయవంతమైందిఇది మిలియన్ల మంది ప్రాణాలను కాపాడటానికి దారితీసింది. అలాగే ఫావిర్‌పిరవీర్ కోసం కూడా తాము కృషి చేస్తామని వారు ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.

 

#CSIRFightsCovid19

****


(Release ID: 1619710) Visitor Counter : 243