గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 హాట్-స్పాట్‌లను జీఐఎస్‌ డాష్‌బోర్డ్ వినియోగంతో పర్యవేక్షిస్తున్న ఆగ్రా స్మార్ట్‌సిటీ

Posted On: 30 APR 2020 1:58PM by PIB Hyderabad

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో ఆగ్రా స్మార్ట్‌సిటీ జీఐఎస్ ఆధారిత డాష్‌బోర్డ్ ఒక దానిని రూపొందించింది. వివిధ హాట్‌స్పాట్‌లు, హీట్ మ్యాప్, పాజిటివ్ కేసులు, కోలుకున్న కేసులు మొదలైన‌ స‌మాచారం తాజాగా అందుబాటులో ఉండేలా దీనిని రూపొందించారు. రోజువారీ ప్రాతిప‌దిక‌న ఈ డాష్‌బోర్డ్‌ను న‌వీకర‌ణ (అప్‌డేట్) చేస్తున్నారు. http://covidsgligis.com/agra అనే లింక్ నుండి ఈ డాష్‌బోర్డును యాక్సెస్ చేసుకోవ‌చ్చు. ఈ డాష్ ‌బోర్డ్‌ను ఐజీఎస్ ప్లాట్‌ఫామ్‌లో అభివృద్ధి చేయబడింది. జీఐఎస్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఫోటోగ్రామెట్రీ మరియు క్యాడ్‌ల‌ను ఒకే వేదిక పైకి తెస్తూ స‌మ‌గ్ర స‌మాచారం అందించేలా ఈ డాష్‌బోర్డును రూపొందించారు. ఐజీఎస్ ఆధారిత వేదిక ద్వారా‌ వ్యవసాయం, రక్షణ, అటవీ, విపత్తు నిర్వహణ, భూ సమాచారానికి, మైనింగ్‌ల‌కు సంబంధించిన అంశాల‌కు అవ‌స‌ర‌మైన ప‌రిష్కారాలు సూచించే విధంగా రూపొందించారు. దీనికి తోడు మైనింగ్, విద్యుత్‌, స్మార్ట్ సిటీ, అర్బన్ ప్లానింగ్, యుటిలిటీస్‌తో పాటు లోకేష‌న్‌ ఆధారిత సేవ‌ల‌ను అందించేందుకు కూడా ఇది తోడ్ప‌డ‌నుంది. ఈ డాష్‌బోర్డు వ‌ల్ల అందుబాటులో ఉండే వివిధ సేవ‌లు ఇలా ఉన్నాయిః
ఉష్టోగ్ర‌త మ్యాపింగ్‌, తేదీలు మ‌రియు జోన్‌ల వారీగా విశ్లేష‌ణ‌లు, ఇన్ఫెక్షన్ / రికవరీ ట్రెండ్స్

 (Release ID: 1619549) Visitor Counter : 141