హోం మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ పరిస్థితిపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించిన - హోంమంత్రిత్వశాఖ.
Posted On:
29 APR 2020 9:37PM by PIB Hyderabad
లాక్ డౌన్ పరిస్థితిపై దేశీయ వ్యవహారాలశాఖ (ఎమ్.హెచ్.ఏ.) ఈ రోజు ఒక సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించింది.
లాక్ డౌన్ వల్ల ఈ రోజు వరకు పరిస్థితిలో అద్భుతమైన ప్రయోజనం, మెరుగుదల గుర్తించడం జరిగింది. లాక్ డౌన్ వల్ల ఇంత వరకు కలిగిన ప్రయోజనాలు దూరం కాకుండా ఉండాలంటే, మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలుచేయాలి. కోవిడ్-19 పై పోరుకు కొత్త మార్గదర్శకాలు మే 4వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. వీటిలో చాలా జిల్లాలకు గణనీయమైన సడలింపులు ఉన్నాయి.
వీటి గురించిన వివరాలు రానున్న రోజుల్లో తెలియజేయడం జరుగుతుంది.
*****
(Release ID: 1619437)
Visitor Counter : 169
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Kannada