ప్రధాన మంత్రి కార్యాలయం
మయన్మార్ యొక్క స్టేట్ కౌన్స్ లర్ దావ్ ఆంగ్ సాన్ సూ కీ కి మరియు ప్రధాన మంత్రి కి మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
Posted On:
30 APR 2020 3:50PM by PIB Hyderabad
మయన్మార్ యొక్క స్టేట్ కౌన్స్ లర్ దావ్ ఆంగ్ సాన్ సూ కీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ న టెలిఫోన్ లో మాట్లాడారు.
ఉభయ నేత లు వారి వారి దేశాల లో మరియు ప్రాంతీయ స్థాయి లో కోవిడ్-19 మహమ్మారి కారణం గా తలెత్తిన పరిస్థితుల ను గురించి చర్చించారు; ఈ ప్రపంచవ్యాప్త వ్యాధి యొక్క వ్యాప్తి ని నియంత్రించడం కోసం తీసుకొంటున్న తాజా చర్యల ను ఈ సందర్భం లో ఒకరి దృష్టి కి మరొకరు తీసుకువచ్చారు.
భారతదేశం అవలంబిస్తున్న ‘నేబర్ హుడ్ ఫస్ట్ పాలిసి’లో ఒక అత్యంత మహత్వపూర్ణ స్తంభం రూపం లో మయన్మార్ పోషిస్తున్నటువంటి పాత్ర ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, ఆరోగ్యం మరియు ఆర్థిక రంగాల పై కోవిడ్-19 యొక్క ప్రభావాన్ని తగ్గించడం లో మయన్మార్ కు వీలయిన అన్ని విధాలు గా సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధం గా ఉందని తెలిపారు.
భారతదేశం లో ఉంటున్న మయన్మార్ పౌరుల కు భారత ప్రభుత్వం పక్షాన సాధ్యమైన అన్ని విధాలు గాను మద్దతు ను ఇవ్వగలమంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హామీ ని ఇచ్చారు; అంతేకాక, మయన్మార్ లోని భారతీయ పౌరుల కు మయన్మార్ అధికారి వర్గం అందిస్తున్న సహకారానికి గాను స్టేట్ కౌన్స్ లర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కోవిడ్-19 తో ఎదురవుతున్న వర్తమాన సవాళ్లు మరియు భవిష్యత్తు కాలం లో కూడా ఆ విశ్వమారి రువ్వబోయే సవాళ్ల ను పరిష్కరించుకోవడం కోసం ఇరు పక్షాలు కలసికట్టుగా కృషి చేయాలని, పరస్పరం సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలన్న అంశాల లో ఇద్దరు నేత లు వారి యొక్క సమ్మతి ని వ్యక్తం చేశారు.
***
(Release ID: 1619708)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam