రైల్వే మంత్రిత్వ శాఖ
ఉచిత భోజన పంపిణీలో భారతీయ రైల్వే ,ఈరోజు 30 లక్షల మార్కును దాటింది.
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో రైల్వే సుమారు 300 ప్రాంతాలలో భోజనం పంపిణీ చేసింది
వండిన వేడి భోజనానాన్ని అందించేందుకు భారతీయ రైల్వే సంస్థలు బృందంగా ఏర్పడ్డాయి.
ఇది రోజూ వేలాది మందికి అండగా నిలిచింది.
Posted On:
30 APR 2020 4:18PM by PIB Hyderabad
కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో భారతీయ రైల్వే ఉచిత వండిన వేడి భోజన పంపిణీలో ఈరోజు 30 లక్షల మార్కును దాటింది. 2020 ఏప్రిల్ 20 న, భారత రైల్వే ఉచిత భోజన పంపిణీలో 20 లక్షల మార్కుకు చేరుకోగా, గత 10 రోజులలో, ఉచిత భోజన పంపిణీలో ఇది మరో పదిల లక్షలమిలియన్ మార్కును సాధించింది
ప్రపంచవ్యాప్తంగా విస్తరించని కోవిడ్ మమమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆకలి బారిన పడే పరిస్థితి ఏర్పడింది. ఈ వైరస్,లాక్ డౌన్ కారణంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో , వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వారు, రోజువారి పనులకు వెళ్లేవారు, వలసవచ్చిన వారు, పిల్లలు, కూలీలు, నిరాశ్రయులు, పేదలు, ఎంతో మంది అటూ ఇటూ తిరిగే ప్రజలు ఉన్నారు.
కోవిడ్ -19 కారణంగా లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత ,పేద ప్రజలకు వేడి వండిన భోజనం అందించడానికి 2020 మార్చి 28 నుండి అనేక రైల్వే సంస్థల కు చెందిన భారత రైల్వే సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఐఆర్‌సిటిసి బేస్ కిచెన్‌లు, ఆర్‌పిఎఫ్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సహకారం ద్వారా మధ్యాహ్న భోజనాన్ని కాగితపు ప్లేట్లలో , రాత్రి భోజనాన్ని ప్యాకెట్లలో భారతీయ రైల్వే అందిస్తోంది.. నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నప్పుడు, సామాజిక దూరం , పరిశుభ్రత పాటించడం జరుగుతోంది.
రైల్వే స్టేషన్ల పరిసరాలే కాక, రైల్వే స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాలలో ఉంటున్న నిరుపేద ప్రజల కు ఆహారం అందించడానికి ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి, ఆయా జోన్ల వాణిజ్య విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పాలనా యంత్రాంగాలు, స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఆహార పంపిణీ చేపడుతున్నారు.
ఉత్తర, పశ్చిమ, తూర్పు ,దక్షిణ, దక్షిణమధ్య రైల్వేకి చెందిన ఢిల్లీ, బెంగళూరు, హుబ్లి, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, భూసావల్, హౌరా, పాట్నా, గయా, రాంచీ, కతిహార్, దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్, బాలసోర్, విజయవాడ, ఖుర్దా, కాట్పాడి, తిరుచిరాపల్లి,ధన్‌బాద్, గువహతి, సమస్తిపూర్, ప్రయాగ్ రాజ్, ఇటార్సీ, విశాఖపట్నం, చెంగల్పట్టు, పూణే, హాజీపూర్, రాయ్‌పూర్, టాటానగర్లలో ఐఆర్‌సిటిసి బేస్ కిచెన్‌ల సహకారంతో 30 లక్షలకు పైగా వండిన భోజనం ఈ రోజు- ఏప్రిల్ 30, 2020 వరకు పంపిణీ చేయడం జరిగింది.
వీటిలో, సుమారు 17.17 లక్షల వండిన భోజనాలను ఐఆర్‌సిటిసి సమకూర్చగా, సుమారు 5.18 లక్షల భోజనాలను ఆర్‌పిఎఫ్ తన సొంత వనరుల నుండి అందించింది, సుమారు 2.53 లక్షల భోజనాలను వాణిజ్య విభాగం, రైల్వేలోని ఇతర విభాగాలు అందించాయి . దాదాపు 5.60 లక్షల భోజనాలను రైల్వే సంస్థలతో కలిసి పనిచేసే ఎన్జీఓలు విరాళంగా సమకూర్చాయి.
ఐఆర్‌సిటిసి, ఇతర రైల్వే విభాగాలు, ఎన్జిఓలు ,ఆయా స్వంత వంటశాలల నుండి తయారుచేసిన ఆహారాన్ని నిరుపేదలకు పంపిణీ చేయడంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పిఎఫ్) ప్రధాన పాత్ర పోషించింది. 2020 మార్చి 28న ఆర్‌పిఎఫ్, 74 కు పైగా ప్రాంతాలలో 5419 మంది పేదలకు ఆహారం పంపిణీ చేయడం మొదలుపెట్టి, ఆహార పంపిణీని రోజు రోజుకూ పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 300 ప్రదేశాలలో రోజుకు సగటున 50000 మందికి ఆర్‌పిఎఫ్ భోజనం అందిస్తోంది.
****
(Release ID: 1619602)
Visitor Counter : 220
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam