భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

కోవిడ్‌తో వ్య‌వ‌హ‌రించ‌డంలో ప్రధాన మంత్రి నాయకత్వాన్ని ప్రశంసించిన ఆటోమొబైల్ పరిశ్రమ దిగ్గ‌జాలు

- ఆటోమొబైల్ రంగాన్ని పునరుద్ధరించడానికి చర్యలు, జీవనోపాధి మరియు వనరుల సమీకరణ అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రిగింది: శ్రీ ప్రకాష్ జవదేకర్

Posted On: 30 APR 2020 4:32PM by PIB Hyderabad

భారతీయ ఆటోమొబైల్ రంగంపై కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ప్రభావాన్ని తెలుసుకోవడానికి, దానిని క‌నిష్ఠీక‌రించేందుకు గాను అవ‌స‌ర‌మైన విధాన ప‌ర‌మైన జోక్యం విష‌య‌మై పరిశ్రమ వ‌ర్గాల వారి సూచనలను వినేందుకు గాను కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థల శాఖ‌ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ఈ రోజు భారత ఆటోమొబైల్ పరిశ్రమ యొక్క ఎంపిక చేసిన సీఈఓలతో సమావేశ‌మ‌య్యారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఆటోమొబైల్ రంగాన్ని పునరుద్ధరించడం, జీవనోపాధి మరియు వనరులను సమీకరించడం వంటి అంశాల‌పై సూచనలు వచ్చాయి. ఈ స‌మావేశంలో ఆటోమొబైల్ ప‌రిశ్ర‌మ వ‌ర్గాల వారీ నుంచి డిమాండ్లు వెల్లువెత్త‌డంతో పాటు స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సంబంధించి దృఢ‌మైన సూచ‌న‌లు కూడా తెర‌పైకి వచ్చాయని కేంద్ర మంత్రి చెప్పారు. పనిలో చేరడానికి ముందు కార్మికులకు బ్యాచ్ టెస్టింగ్, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఆపై సెల్లింగ్ పాయింట్ల వ‌ద్ద పరిశుభ్రత, ఇద్దరు కార్మికుల మధ్య భౌతిక విభజన వంటి మంచి సూచనలు సమావేశంలో ఇవ్వబడ్డాయ‌ని మంత్రి శ్రీ జవదేకర్ అన్నారు.
మొత్తం ఆటోమోటివ్ ఇండస్ట్రీ వాల్యూ చైన్ తిరిగి తెరవడానికి సంబంధించిన కొన్ని సూచనలతో చేసింది. పరిశ్రమ కీలక సమస్యలను హైలైట్ చేసింది; డీలర్‌షిప్‌లకు మద్దతు; ఉపాధి మద్దతు జోక్యం; డిమాండ్ పెంచడం ఆర్థిక సహాయం అందించ‌డాని‌కి సంబంధించిన వివిధ సూచ‌న‌లు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు లేవ‌నెత్తిన సూచనలు మరియు డిమాండ్లన్నింటినీ రవాణా మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు సంబంధిత ఇతర మంత్రిత్వ శాఖలతో చర్చిస్తామని పరిశ్రమల అధినేత‌ల‌కు హామీ ఇచ్చారు. కోవిడ్-19 మ‌హ‌మ్మారితో వ్యవహరించడంలో ప్రధాని చూపుతున్న నాయకత్వాన్ని పరిశ్రమ దిగ్గ‌జాలు ప్రశంసించాయి. "కోవిడ్ నియంత్రణ విష‌యంలో భారతదేశం నిజంగా చాలా బాగా ప‌నిచేసింది.. మ‌నం విలువైన ప్రాణాలను కాపాడ‌గ‌లిగాము, ఇక ఇప్పుడు మనం జీవనోపాధిపై దృష్టి పెట్టాల్సి ఉంది" అని భారీ పరిశ్రమల మంత్రి నొక్కి చెప్పారు. ఈ చర్చలలో భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థల శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘవాల్ మరియు
భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ కార్య‌ద‌ర్శి అరుణ్గోయల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఓఈఎంలు
మరియు ఆటో కాంపోనెంట్ రంగంపు ప్ర‌తినిధులు పాలు పంచుకున్నారు. ప‌రిశ్ర‌మ బృందానికి
సియామ్ ప్రెసిడెంట్  రాజన్ వాధేరా, ఏసీఎంఏ ప్రెసిడెంట్  దీపక్ జైన్ లు సహ నాయకత్వం వహించారు. ఈ స‌మావేశంలో పాల్గొన్న వారిలో ఆర్ సి భార్గవ; పవన్ ముంజాల్; విక్ర‌మ్‌ కిర్లోస్కర్ మరియు డాక్టర్ పవన్ గోయెంకాతో పాటు ఇతర సీనియర్ సీఈఓలు పాల్గొన్నారు. 

 



(Release ID: 1619725) Visitor Counter : 144