సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జమ్ము & కాశ్మీర్, లడఖ్ & ఎన్.ఈ. రీజియన్లలో కోవిడ్ పరిస్థితిపై మాజీ ఆర్మీ జనరల్స్ మరియు ఎయిర్ మార్షల్స్ తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 29 APR 2020 7:11PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంతం, జమ్మూ & కాశ్మీర్ మరియు లడఖ్ మాజీ ఆర్మీ జనరల్స్ మరియు ఎయిర్ మార్షల్స్ నుంచి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు కోవిడ్ సంబంధిత సమాచారాన్ని సేకరించారు.

వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో నిర్వహించిన సమావేశం ద్వారా అభిప్రాయాలను అందించిన వారిలో ప్రముఖులు ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వి.పి.మాలిక్, ఎయిర్ చీఫ్ మార్షల్ అరుప్ రాహా, భారత వైమానిక దళ మాజీ ఎయిర్ స్టాఫ్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్, మాజీ వైస్ చీఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ దీపేంద్ర సింగ్ హుడా, మాజీ జి.ఓ.సి. నార్తర్న్ కమాండ్, లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్, మాజీ జి.ఓ.సి. నార్తర్న కమాండ్, లెఫ్టినెంట్ జనరల్ రాకేశ్ శర్మ,  మాజీ డి.జి.ఓ.ఎల్ మరియు మాజీ చీఫ్ ఆఫ్ స్టాప్ నార్తర్న్ కమాండ్ మేజర్ జనరల్ ఎస్కె శర్మ ఉన్నారు.

తన పరిచయ వ్యాఖ్యల్లో, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, మాజీ సీనియర్ జనరల్స్ మరియు ఎయిర్ మార్షల్స్ చాలా మందికి జమ్మూ కాశ్మీర్ మరియు ఈశాన్య రీజియన్ భూభాగాల్లోని విలక్షణమైన పరిస్థితులు కొత్తేమీ కాదని, కానీ పౌర ప్రముఖ సభ్యులుగా, సమాజం మరియు ప్రము పౌరుల పర్యవేక్ష తర్వాత  వారు అభిప్రాయకర్తలు విశిష్టమైన పాత్ర వహించారని తెలిపారు. కరోనాకు వ్యతిరేకంగా సాగిస్తున్న ఈ పోరాటంలో తమ ప్రయత్నాలను మెరుగు పరచడానికి వారి సలహాలు, సూచనలు విలువైనవని, అవే కాకుండా వారి సొంత దృక్కోణం నుంచి వారు చూసే కొన్ని అంశాల యొక్క స్వీయ దృక్కోణం కూడా విలువైన సలహాలను అందిస్తుందని తెలిపారు.

 

ఈశాన్య ప్రాంతంలోని 8 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలు ఇప్పటికే కరోనా రహితంగా మారాయని, మిగిలిన 3 రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు లేవని, అంటే త్వరలోనే ఈ ప్రాంతం మొత్తం కరోనా రహితంగా మారవచ్చని డాక్టర్ జితేంద్ర సింగ్ సీనియర్ డిఫెన్స్ సిబ్బందికి తెలియజేశారు. అదే విధంగా జమ్మూ & కాశ్మీ గురించి సమాచారం తెలియజేస్తూ, మొత్తం జమ్మూ ప్రాంతంలో కేవలం 15 కరోనా కేసులు మాత్రమే మిగిలి ఉన్నాయని, కాశఅమీర్ లోయలో బండిపోరా వంటి కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉన్నాయని, దాని నుంచి క్రమంగా బయట పడతామని తెలిపారు.

కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం సమర్థవంతంగా నాయకత్వం వహించిన విధానాన్ని ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా ముక్తకంఠంతో ప్రశంసించారు.  కరోనా దాడి నుంచి క్రమంగా బయట పడతున్న భారతదేశంలోని ప్రధాన పెద్ద ప్రాంతాల్లో మొత్తం ఈశాన్య ప్రాంతం ఉందని ప్రశంసించారు. అదే విధంగా జమ్మూ & కాశ్మీర్ లో ప్రస్తుత పాలనలో సమర్థవంతమైన పరిపాలనను వారు ప్రశంసించారు. ఇది కరోనా వ్యాప్తి విస్తరించకుండా సహాయపడిందని అభిప్రాయపడ్డారు.

లాక్ డౌన్ గురించి మాట్లాడుతూ, సడలింపులు క్రమంగా సాగాలని అభిప్రాయపడ్డారు. అదే విధంగా బంగ్లాదేశ్ వంటి ఇతర దేశాలతో సరిహద్దులు మూసివేయడం వల్ల ఈశాన్య ప్రాంతం ప్రయోజనం పొందిందని తెలిపారు.

ఈశాన్య మరియు జమ్మూ & కాశ్మీర్ రెండింటిలోనూ సామాన్య ప్రజల వైఖరి అనుకూలంగా ఉందని, అదే విధంగా ఆన్ లైన్ షాపింగ్ మరియు ఆన్ లైన్ తరగతుల ఎంపిక గురించి కూడా సానుకూల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 

 

***



(Release ID: 1619395) Visitor Counter : 186