శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా ఉన్న సిఎస్ఐఆర్ ల్యాబులు తమ ప్రాంతాలతో పాటు పరిథి దాటి కూడా ఆహారం, శానిటైజర్లు,మాస్కులు మొదలైనవి అందించడం ద్వారా ఆర్తులకు అండగా ఉంటున్నాయి


సిఎస్ఐఆర్-సిఎఫ్టిఆర్ఐ మైసూరు, సిఎస్ఐఆర్-ఐహెచ్బిటి పాలంపూర్, సిఎస్ఐఆర్-ఐఎమ్ఎమ్టి భువనేశ్వర్, సిఎస్ఐఆర్-సిఐఎమ్ఎఫ్ఆర్ ధన్‌బాద్, సిఎస్ఐఆర్-ఐఐపి డెహ్రాడూన్ వంటి సిఎస్ఐఆర్ ల్యాబ్‌లు వలస కూలీలు, రోగులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులకు కోవిడ్-19 వ్యాప్తి సమయంలో వంటకం అవసరం లేని, సిద్ధమైన ఆహారాన్ని అందిస్తున్నాయి

వీటితో పాటు పరిశోధన అభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సిఎస్ఐఆర్ అత్యవసర స్థితిలో ఆదుకునే

చరిత్ర ఉంది

Posted On: 30 APR 2020 3:18PM by PIB Hyderabad

 

అత్యంత వేగవంతమైన గతిలో ప్రపంచాన్ని కబళించిన సార్స్-సిఓవివైరస్ నియంత్రణకై భౌతిక దూరం అనేది తారక మంత్రం లాంటిది. దేశంలో మహమ్మారి వేగాన్ని నిరోధించడానికి లాక్ డౌన్ ఆచరణాత్మక పరిష్కారం అయింది. అయితే సమాజంలో సామజిక ఆర్ధిక బలహీన వర్గాలువలసదారులు వంటి హానికర పరిస్థితులకు  దగ్గరగా ఉండే వర్గాలు అనేక కష్ట నష్టాలకు కూడా ఈ మహమ్మారి కారణమైంది. 

పరిశోధన అభివృద్ధిశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న సిఎస్ఐఆర్ దేశంలో అనేక వైపరీత్యాలుఅత్యవసర పరిస్థితిలో ఆపన్న హస్తం అందించిన  గత చరిత్ర ఉంది. ఉత్తర కాశీచెన్నై వరదలైనాఫానీ వంటి తుపానులైన సిఎస్ఐఆర్ ప్రయోగశాలలు తమకున్న వనరులునైపుణ్యాన్ని ఫణంగా పెట్టి పని చేశాయి. నీటి శుద్ధి సాంకేతికలుచేతి పంపులుతుపాను సహాయ కేంద్రాలువ్యవస్థీకృత పునరావాసంవంట అవసరం లేని ఉన్నదున్నట్టు ఆరగించగలిగే ఆహరం ఇలా అనేక సహాయాలను అందించాయి సిఎస్ఐఆర్ ల్యాబ్ లు. 

"సిఎస్ఐఆర్ వైరల్ జన్యుపరిశోధనలు చేయడానికిమందులు మరియు ఆరోగ్య పరీక్షల కిట్‌లను అభివృద్ధి చేయడానికికోవిడ్-19 ను అరికట్టే టీకాలను అన్వేషించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీఆహార సంబంధిత పరిశోధనసాంకేతికత ను కూడా అభివృద్ధి చేసింది. తద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వలస కార్మికులుపేద బలహీన వర్గాల ప్రజలకు ఆహారాన్ని అందించే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. దేశంలో అనేక చోట్ల ఉన్న సిఎస్ఐఆర్ ల్యాబ్ లు తమ రీజియన్ పరిథిలో  అవసరమైన వర్గాలకు ఆహరంశానిటైజెర్లుమాస్కులు అందిస్తున్నాయని చెప్పడానికి ఆనందంగా ఉంది" అని సిఎస్ఐఆర్-డీజీ డాక్టర్ శేఖర్ మండే అన్నారు. 

దేశంలో సిఎస్ఐఆర్ కి చెందిన  ప్రతిష్టాత్మకమైన ఫుడ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రం (మైసూరు) అత్యంత పోషక విలువలున్న 10 టన్నుల బిస్కట్లుఒక టన్ను స్పిరులినా చిక్కీలుయాలకుల రుచి గల 10 టన్నుల నీరు, 5 టన్నుల నూట్రిఫిట్ బార్ చాక్లేట్లు తయారు చేసి 56,000 వలస కార్మికులురోగులుడాక్టర్లుపోలిస్ సిబ్బంది కి పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తోంది. రోగ నిరోధక శక్తిని అందించే పోషకాలతో పాటు ఇవి ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి.

వాస్తవానికిసిఎస్ఐఆర్-సిఎఫ్‌టిఆర్‌ఐ ఎయిమ్స్ నుండి ప్రత్యేక అభ్యర్థన మేరకు కోవిడ్ -19 రోగులను తిరిగి కోలుకోవడం కోసం ఎయిమ్స్-న్యూఢిల్లీ కి 500 కిలోల అధిక ప్రోటీన్ బిస్కెట్లు, 500 కిలోల అధిక ప్రోటీన్ రస్క్‌లను సరఫరా చేసింది. ఈ బిస్కెట్లు బయట దొరికే సాధారణ బిస్కెట్ల కంటే 60-80% ప్రోటీన్ల అధికం కలిగి ఉంటాయి.

"పోషక ఉత్పత్తులు ప్రోటీన్ లేదా ఖనిజాలు మరియు రోగనిరోధక శక్తిని సానుకూలంగా ప్రభావితం చేసే విటమిన్లతో తయారవుతున్నాయి. లాక్ డౌన్ఐసోలేషన్‌కు సంబంధించిన తీవ్రమైన ఆందోళన మరియు అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కోడానికి ఈ ప్రయత్నాలు అవసరం" అని  సిఎస్ఐఆర్-సిఎఫ్‌టిఆర్‌ఐ  కేఎస్ఎంఎస్ రాఘవ రావు తెలిపారు. 

 

 

 

(సిఎస్ఐఆర్-సిఎఫ్‌టిఆర్‌ఐ పంపిణీ చేసిన బిస్కట్లు, చిక్కి లని ఆశ్వాదిస్తున్నచిన్నారులు)

 

 

బెంగళూరు నగరంలో వలస వచ్చిన కార్మికుల కోసం ఆదాయపు పన్ను కార్యాలయం తరపున సహాయక చర్యలు చేపట్టిన ప్రిన్సిపాల్ ఆదాయపు పన్ను కమిషనర్ శ్రీ జాకీర్ థామస్ మాట్లాడుతూ సిఎస్ఐఆర్-సిఎఫ్‌టిఆర్‌ఐ ఈ ప్రయత్నంలో అద్భుతమైన భాగస్వామి. ఎటువంటి బ్యూరోక్రాటిక్ అడ్డంకులు లేకుండా మేము వెంటనే వలస కార్మికులలో పోషకాలతో సుసంపన్నమైన బిస్కెట్లుస్పిరులినా చిక్కిలను పంపిణీ చేసాము. పిల్లలు వాటిని ఆశ్వాదించడం చాల ఆనందం కలిగిస్తుంది. విజ్ఞాన శాస్త్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది మంచి ఉదాహరణ అని నేను భావిస్తున్నాను” అని అన్నారు. 

ఇకలాక్ డౌన్ కారణంగా చిక్కుకున్న  అనేక మంది వలస కార్మికుల ఆహారం దొరకడం లేదని పంచాయతీ ప్రతినిధి సమాచారం ఇవ్వడంతోపాంపూర్ పరిథి లో ఉన్న సిఎస్ఐఆర్-ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోసోర్స్ టెక్నాలజీ (సిఎస్ఐఆర్-ఐహెచ్బిటి),  ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలకు పేరుగాంచిన మరొక ఇన్స్టిట్యూట్ ఇది,  60 టన్నుల దాల్ చావల్ ఆలూ మిక్స్, 2.16 టన్నుల రెడీ-టు-ఈట్ లోకల్ (కాంగ్రా) వంటకాలు, 1500 స్పిరులినా శనగ బార్లు, 1000 మల్టీగ్రెయిన్ ఎనర్జీ బార్స్,  1500 మల్టీగ్రెయిన్ ప్రోటీన్ పౌడర్...  ఇవన్నీ ఉన్న 5000 బాక్సులను సరఫరా చేసింది. వలస కార్మికులకు మాత్రమే కాదువైద్యులుపారామెడికల్ సిబ్బందిఆరోగ్య కార్యకర్తలుపోలీసుల వంటి ముందుండి పనిచేసే కార్మికులకు కూడా. ఆహారం రసాయనాలుఉండవుప్రోబయోటిక్ ప్రభావాలను కలిగి ఉంటుంది . దాని నిల్వ గడువు 12 నెలలు.

డెహ్రాడూన్లోని సిఎస్ఐఆర్-ఐఐపి కూడా గత ఒక నెల రోజులుగా దాదాపు 300 మందికి ప్రతిరోజూ ఆహారాన్ని అందిస్తోంది. భువనేశ్వర్‌లోని సిఎస్‌ఐఆర్-ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ & మెటీరియల్స్ టెక్నాలజీ (సిఎస్‌ఐఆర్-ఐఎమ్ఎమ్‌టి) చేతిశానిటైజర్స్‌తో పాటు రెడీ-టు-ఈట్ ఆహరం (ఖిచిడి)సిఎస్‌ఐఆర్-ఐహెచ్‌బిటి అందించిన సబ్బులను భువనేశ్వర్ కమిషనరేట్ పోలీసులకు అందించారు. కర్ణాటకలోని డోనిమలై ఇనుప ఖనిజ గనుల వద్ద విధుల్లో ఉన్న సిఎస్ఐఆర్-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్-సిఐఎంఎఫ్ఆర్) సిబ్బంది కి  కూడా  ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.  

Image

 

సిఎస్ఐఆర్-ఐహెచ్బిటి సిద్ధం చేసిన ఆహార పెట్టెలను సిఎస్ఐఆర్-ఐఎంఎంటి భువనేశ్వర్‌లో పంపిణీ చేసింది. ఆహారాన్ని అందించడంతో పటు సిఎస్ఐఆర్ గ్రామీణ / సామాజిక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ద్వారా చిన్న పరిశ్రమలు  ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా వలస వెళ్లే వారికి ఇది అవకాశాలను అందిస్తుంది. సాంఘిక స్వచ్ఛంద సంస్థల ద్వారా క్రిమిసంహారకాలుశానిటైజర్లుసబ్బులుమాస్కులుచేతి తొడుగులుఆహార ఉత్పత్తులునీటి శుద్దీకరణ వస్తు సామగ్రి మొదలైన వాటి సంశ్లేషణతయారీపై శిక్షణ ఇందులో ఉంటుంది.

 

 

#CSIRFightsCovid19



(Release ID: 1619719) Visitor Counter : 172