ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, బంగ్లాదేశ్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాల మధ్య టెలిఫోన్ సంభాషణ
Posted On:
29 APR 2020 8:19PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ఈరోజు బంగ్లాదేశ్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రధానమంత్రి ఎమతి షేక్ హసీనాతో ఫోన్‌లో మాట్లాడారు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశ ప్రజల తరఫున, వ్యక్తిగతంగానూ బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి, బంగ్లాదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ప్రాంతీయంగా పరిస్థితుల గురించి ఇరువురు నాయకులు చర్చించారు. తమ తమ దేశాలలో ఈ వ్యాధి ప్రభావాన్ని ఎదుర్కోనేందుకు తీసుకుంటున్న చర్యలను ఒకరికొకరు తెలియజేసుకున్నారు.
సార్క్ దేశాల నాయకుల మధ్య మార్చి 15 న అంగీకరించిన ప్రత్యేక ఏర్పాట్లను అమలు చేయడంలో సాధించిన పురోగతిపై ఇరువురు నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. సార్క్ కోవిడ్ -19 అత్యవసర నిధికి 1.5 మిలియన్ డాలర్లు అందించినందుకు ప్రధాని షేక్ హసీనాకు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ప్రాంతంలో కోవిడ్ -19 ను ఎదుర్కోనే ప్రయత్నాలను సమన్వయం చేస్తున్నందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.అలాగే బంగ్లాదేశ్‌కు వైద్యసరఫరాలు, సామర్ధ్యాల నిర్మాణం పరంగా సహాయం పంపుతున్నందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
రహదారి, రైలు, జలమార్గాలు వాయు మార్గాల ద్వారా సరిహద్దుల ద్వారా అవసరమైన వస్తువుల సరఫరాను కొనసాగించడంపై ఇద్దరు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇరుదేశాల మధ్య ఉమ్మడి చారిత్రక బంధం, సంస్కృతి, భాష, బంధుత్వాలను గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అద్భుత స్థాయిలో ఉండడంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా పడే ఆర్థిక, ఆరోగ్య ప్రభావాలను తగ్గించేందుకు బంగ్లాదేశ్‌కు సహాయపడడానికి ఇండియా సిద్ధంగా ఉందని చెప్పారు.
ఈ చారిత్రాత్మక ముజిబ్ బార్షో సందర్భంగా ప్రధాని షేక్ హసీనా , స్నేహపూర్వక బంగ్లాదేశ్ ప్రజలందరి ఆరోగ్యం శ్రేయస్సు కోరుకుంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.
***
(Release ID: 1619427)
Visitor Counter : 240
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam