రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
జనౌషధి కేంద్రాల వివరాలు తెలుసుకోడానికి 'జనౌషధి సుగం' మొబైల్ యాప్ ని ఉపయోగిస్తున్న 3,25,000 మంది ప్రజలు
Posted On:
30 APR 2020 11:52AM by PIB Hyderabad
కోవిడ్-19 లాక్ డౌన్ సందర్బంగా జనఔషధిసుగం మొబైల్ యాప్ ప్రజలకు బాగా ఉపయుక్తంగా ఉంది. తమకు దగ్గరలో ఉన్న ప్రధాన మంత్రి జనౌషధి కేంద్రం (పీఎంజెఏకె) గుర్తించి సరసమైన ధరల్లో జనరిక్ మందులను పొందడానికి ఈ యాప్ సౌలభ్యంగా ఉంది. 3,25,000 మందికి పైగా జనఔషధిసుగం మొబైల్ యాప్ ని ఉపయోగించి లబ్ది పొందుతున్నారు. వినియోగదారుల రోజు వారి అవసరాలను సులభతరం చేయడానికి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటానికి, ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పిఎమ్‌బిజెపి) కోసం ఈ మొబైల్ అప్లికేషన్‌ను ఫార్మస్యూటికల్స్ విభాగం కింద ఉన్న బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్‌యుస్ ఆఫ్ ఇండియా (బిపిపిఐ) అభివృద్ధి చేసింది. ఈ విభాగం రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. డిజిటల్ వేదికపై ఇది అందరికి అందుబాటులో ఉండడంతో దీనిని ఉపయోగించే వారు అతి సునాయాసంగా జనౌషధి కేంద్రాలు సమీపంలో ఎక్కడున్నాయి, వాటిలో లభ్యమయ్యే మందులు, వాటి గరిష్ట రిటైల్ ధర, ఆ ఉత్పత్తి ధరలను వేరే వాటితో విశ్లేషించడం వంటి వివరాలు అతి సులభంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా లభ్యమయ్యే మందులకు, జనరిక్ మందులకు తేడా, వినియోగరునికి ఎంత డబ్బు పొదుపు అవుతుంది వివరాలు కూడా ఈ యాప్ లో లభ్యమవుతాయి. ఆండ్రాయిడ్, ఐ-ఫోన్ రెంటిలోనూ లభ్యమయ్యే ఈ మొబైల్ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ నుండి కూడా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
కోవిడ్-19 కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థని విప్లవాత్మకంగా మారుస్తోంది. పిఎమ్‌బిజెపి వంటి ముఖ్యమైన పథకాల ద్వారా 900 నాణ్యమైన జనరిక్-మండులు, 154 శస్త్రచికిత్సా పరికరాలను అందిస్తోంది. ప్రస్తుతం, దేశంలోని 726 జిల్లాల్లో 6300 కి పైగా పిఎమ్‌జెఎకెలు పనిచేస్తున్నాయి. లాక్ డౌన్ వ్యవధిలో, కొరోనావైరస్ నుండి ప్రజలు తమను తాము రక్షించుకోవడంలో సహాయపడటానికి పిఎమ్‌బిజెపి తన సామజిక మాధ్యమ వేదికల ద్వారా విస్తృతంగా సమాచారాన్ని అందిస్తోంది.
(Release ID: 1619522)
Visitor Counter : 186
Read this release in:
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Malayalam