PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 13 MAY 2020 7:14PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

  • స్వయం సమృద్ధ భారతం దిశగా ప్రధానమంత్రి శంఖారావం; రూ.20 లక్షల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన.
  • ప్రత్యేక ప్యాకేజీ తొలిదశలో ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యమిస్తూ ఆర్థికశాఖ మంత్రి ప్రకటన.
  • నేటిదాకా 74,281 కోవిడ్‌-19 కేసులకుగాను 24,386మందికి నయంకాగా- మరణాలు 2,415గా ఉన్నాయి.
  • గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,525 కొత్త కేసులు నమోదయ్యాయి.
  • ఇప్పటిదాకా 18.5 లక్షలకుపైగా కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు.
  • కేంద్ర సాయుధ పోలీసు బలగాల క్యాంటీన్లు, స్టోర్లలో జూన్‌ 1 నుంచి కేవలం దేశీయ వస్తువుల అమ్మకం.
  • వందే భారత్‌ మిషన్‌ కింద 6 రోజులలో విదేశాల నుంచి 8,503 మంది భారతీయుల తరలింపు.
  • ఇప్పటిదాకా 642 ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లు నడిపిన రైల్వేశాఖ.

“స్వ‌యం స‌మృద్ధ‌ భారతం” దిశగా ప్రధానమంత్రి శంఖారావం; రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన

ప్ర‌ధాన‌మంత్రి మంగళవారంనాడు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ప్రపంచ మహమ్మారికి బలైనవారిని సంస్మరిస్తూ- కోవిడ్‌-19వల్ల తలెత్తిన సంక్షోభం మునుపెన్నడూ మనం ఎరుగనిదని పేర్కొన్నారు. అయితే, ఈ యుద్ధంలో మనను మనం కాపాడుకోవడం మాత్రమేగాక ముందడుగు వేయాల్సిన అవసరం కూడా ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు ‘21వ శతాబ్దపు భారతదేశం’ స్వప్న సాకారం దిశగా ‘స్వయం సమృద్ధం’ కావడమే మనముందున్న మార్గమని పేర్కొన్నారు. ‘స్వయం సమృద్ధ భారత’ నిర్మాణంలో “ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులు, 21వ శతాబ్దపు సాంకేతికపరిజ్ఞాన చోదిత సదుపాయాలుగల వ్యవస్థ, శక్తిమంతమైన జనబలం, గిరాకీ” ఐదు కీలక స్తంభాలుగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూ- “స్వయం సమృద్ధ భారతం” మన లక్ష్యం కావాలని శంఖం పూరించారు. కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వం ఇంతకుముందు చేసిన ప్రకటనలు, భారత రిజర్వు బ్యాంకు నిర్ణయాలతో కలిపి ఈ ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లకు చేరుతుందని, ఇది స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 10 శాతంతో సమానమని, “స్వయం సమృద్ధ భారతం” లక్ష్యసాధనలో మనకు ఎనలేని ఉత్తేజాన్నిచ్చేది ఇదేనని ప్రకటించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623421

ప్రధానమంత్రి 12.5.2020న జాతినుద్దేశించి చేసిన ప్రసంగం ఆంగ్ల పాఠం

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623421

ప్రత్యేక ప్యాకేజీ తొలిదశలో ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యమిస్తూ ఆర్థికశాఖ మంత్రి ప్రకటన

కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారత ఆర్ధిక వ్యవస్థ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వ్యాపారాలకు, ముఖ్యంగా ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లకు సంబంధించిన ఉపశమనం మరియు రుణ మద్దతు కోసం చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623712

పంజాబ్‌లో కోవిడ్‌-19 నియంత్రణ చర్యలు, తదుపరి సన్నద్ధతపై సమీక్షించిన డాక్టర్‌ హర్షవర్ధన్‌

కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇవాళ పంజాబ్‌లో కోవిడ్‌-19 నియంత్రణ చర్యలు, సన్నద్ధతపై దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశంద్వారా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రితో సమీక్షించారు. దేశంలో 2020 మే 13వ తేదీనాటికిగల 74,281 కేసులకుగాను 24,386మంది కోలుకోగా ఇప్పటివరకూ 2,415 మరణాలు సంభవించాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గడచిన 24 గంటల్లో 3,525 కొత్త కేసులు నమోదైనట్లు తెలిపారు. కేసుల రెట్టింపు వ్యవధి గడచిన 14 రోజులలో 11 కాగా, గత 3 రోజులలో మెరుగుపడి 12.6కు చేరిందన్నారు. ఇక మరణాలు 3.2 శాతంగానూ, కోలుకునేవారు 32.8 శాతంగానూ నమోదయ్యాయన్నారు. కాగా, మొత్తం కోవిడ్‌-19 రోగులలో 2.75 శాతం (నిన్నటివరకూ) ఐసీయూలలో ఉండగా, వెంటిలేటర్లపై ఉన్నవారు 0.37 శాతం, ప్రాణవాయువు సరఫరాగల వారు 1.89 శాతంగా ఉన్నట్లు వివరించారు. దేశం మొత్తంమీద ఇప్పటిదాకా 18,56,447 రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, నిన్న ఒక్కరోజే 94,708 పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఇక ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఆరోగ్య-శ్రేయో కేంద్రాలను పంజాబ్‌ ప్రభుత్వం ప్రశంసనీయంగా నిర్వహిస్తున్నదని డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఈ కేంద్రాలను ఇంకా మధుమేహం, అధిక రక్తపోటు, మూడు సాధారణ (నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార) కేన్సర్ల పరీక్షల కోసం కూడా వినియోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా అత్యధిక ప్రజానీకానికి సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు కూడా అందించవచ్చునన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623367

జూన్‌ 1 నుంచి దేశంలోని కేంద్ర సాయుధ పోలీసు బలగాల క్యాంటీన్లు, స్టోర్లలో దేశీయ వస్తువులు మాత్రమే అమ్మకం.

దేశంలోని కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన క్యాంటీన్లు, స్టోర్లలో 2020 జూన్‌ 1 నుంచి దేశంలో తయారైన వస్తువులను మాత్రమే విక్రయించాలని దేశీయాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ విక్రయశాలల్లో కొనుగోళ్ల విలువ రూ.2,800 కోట్లదాకా ఉంటుందని, తాజా నిర్ణయంతో 10 లక్షలమంది వరకూగల కేంద్ర సాయుధ పోలీసు బలగాల కుటుంబాల్లోని సుమారు 50 లక్షలమంది దేశీయ ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తారని పేర్కొంది. అలాగే “మీరందరూ వీలైనంతవరకూ దేశంలో తయారైన వస్తువులను వాడటమే కాకుండా ఇతరులు కూడా వినియోగించేలా ప్రోత్సహించండి. ఇది ఎంతమాత్రం వెనుకబడే సమయం కాదు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుంటూ ముందడుగు వేద్దాం” అని దేశీయాంగ శాఖ మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623545

ప్రధానమంత్రి ఆర్థిక ప్యాకేజీపై శ్రీ నితిన్‌ గడ్కరీ హర్షం; ఎంఎస్‌ఎంఈలు, గ్రామీణ-కుటీర పరిశ్రమల రంగాలను సమున్నతస్థాయికి చేర్చగలదని ప్రశంస

ప్రధానమంత్రి నిన్న రాత్రి రూ.20 లక్షల విలువైన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడంపై కేంద్ర ఎంఎస్‌ఎంఈ, రోడ్డురవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ప్యాకేజీద్వారా ఎంఎస్‌ఎంఈలు, గ్రామీణ-కుటీర పరిశ్రమల రంగాల ఆకాంక్షలను ప్రధానమంత్రి నెరవేర్చారని ఆయన పేర్కొన్నారు. అపార వనరులు, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం, ముడిసరకులు తదితరాలతో విలసిల్లే భారతదేశం అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధం కాగలదని గడ్కరీ చెప్పారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623425

వందే భారత్‌ మిషన్‌ కింద 43 విమానాల్లో విదేశాలనుంచి 8,503 మంది భారతీయుల తరలింపు

వందేభారత్‌ మిషన్‌ కింద విదేశాల్లో చిక్కుకుపోయిన 8,503 మంది భారత పౌరులను 2020 మే 7 నుంచి ఆరు రోజుల్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలకు చెందిన 43 విమానాలు స్వదేశానికి తీసుకొచ్చాయి. వందే భారత్‌ మిషన్‌ పేరిట విదేశాల్లో చిక్కుకున్న భారతీయలను తిరిగి తీసుకొచ్చేందుకు 2020 మే 7వ తేదీన కేంద్ర ప్రభుత్వం బృహత్కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎయిరిండియా (42), దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (24) మొత్తం 64 విమానాలద్వారా తొలిదశలో 14,800 మంది భారతీయులను తీసుకురానున్నాయి. ఈ మేరకు అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, సౌదీ అరేబియా, కువైట్‌, ఫిలిప్పీన్స్‌, యూఏఈ, మలేషియా తదితర 12 దేశాల్లోని భారతీయులను ఇవి స్వదేశం చేరుస్తాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623532

దేశవ్యాప్తంగా 2020 మే 13దాకా 642 ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లను నడిపిన రైల్వేశాఖ

భారత రైల్వేశాఖ 2020 మే 13నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య 642 ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లను నడిపింది. ఈ రైళ్లు మొత్తం ఇప్పటికే గమ్యస్థానాలు చేరగా రాష్ట్రాలవారీగా ఆంధ్రప్రదేశ్ (3), బీహార్ (169), ఛత్తీస్‌గఢ్‌ (6), హిమాచల్ ప్రదేశ్ (1), జమ్ముకశ్మీర్‌ (3), జార్ఖండ్ (40), కర్ణాటక (1), మధ్యప్రదేశ్ (53), మహారాష్ట్ర (3), మణిపూర్‌ (1), మిజోరం (1),  ఒడిశా (38), రాజస్థాన్ (8), తమిళనాడు (1), తెలంగాణ (1), త్రిపుర (1),  ఉత్తర ప్రదేశ్ (301), ఉత్తరాఖండ్‌ (4), పశ్చిమ బెంగాల్ (7) వంతున ఉన్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623653

దిగ్బంధం సందర్భంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు 160 లక్షల టన్నుల ఆహారధాన్యాలు పంపిణీ చేసిన భారత ఆహార సంస్థ

దేశ ఆహార అవసరాలను తీర్చగలిగినన్ని నిల్వలు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)వద్ద ఉన్నాయి. ఈ మేరకు 2020 మే 1వ తేదీనాటికి నిల్వలు 642.7 లక్షల టన్నుల నిల్వలున్నాయి. ఇందులో బియ్యం 285.03 లక్షల టన్నులు, గోధుమలు 357.7 లక్షల టన్నులున్నాయి. కాగా, 2020 మే 12వ తేదీనాటికి వివిధ పథకాల కింద 159.36 లక్షల టన్నుల ఆహారధాన్యాలను పంపిణీ చేశారు. తదనుగుణంగా జాతీయ ఆహార భద్రత చట్టం కింద 60.87 లక్షల టన్నుల ఆహారధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు తరలించుకువెళ్లాయి. ఇది ఒకటిన్నర నెలల అవసరాలకు సమానం. అంతేకాకుండా పీఎంజీకేవై కింద కేటాయించిన 120 లక్షల టన్నులకుగాను 79.74 లక్షల టన్నులు పంపిణీ చేయగా, ఇది రెండు నెలల కోటాకు సమానం కావడం విశేషం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623588

దేశవ్యాప్తంగా ఆహారధాన్యాల లభ్యతకు భరోసా ఇస్తూ పలు చర్యలు తీసుకున్న భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623656

మిషన్‌ సాగర్‌: మాల్దీవ్స్‌కు ఆహార సరకులు అందజేసిన ఐఎన్‌ఎస్‌ కేసరి నౌక

‘మిషన్‌ సాగర్‌’ కార్యక్రమంలో భాగంగా భారత నావికాదళ యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కేసరి 2020 మే 12వ తేదీన మాల్దీవ్స్‌ రాజధాని నగరం మాలే రేవుకు చేరింది. ఇరుగుపొరుగు మిత్ర దేశాలపై భారత ప్రభుత్వ సౌహార్దతలో భాగంగా మాల్దీవ్స్‌ ప్రజల కోసం పంపిన 580 టన్నుల ఆహార సరకులను ఐఎన్‌ఎస్‌ కేసరి నౌక గమ్యం చేర్చింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623397

ఉద్యోగుల శ్రేయస్సుపై మోదీ ప్రభుత్వం నిబద్ధతతో ఉంది; వారి సమస్యలను సముచితంగా పరిష్కరిస్తుంది: డాక్టర్‌ జితేంద్ర సింగ్‌

కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల నడుమ కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ వినూత్న రీతిలో ఇవాళ డీవోపీటీ, డీఏఆర్‌పీజీ, డీవోపీపీడబ్ల్యూ శాఖలకు చెందిన సెక్షన్‌ ఆఫీసర్ల స్థాయివరకూగల ఉద్యోగులతో దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశంద్వారా చర్చించారు. ఉద్యోగుల శ్రేయస్సుపై మోదీ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. వారి సంక్షేమం విషయంలో తగుశ్రద్ధతో  వ్యవహరిస్తున్నదని వివరించారు. కోవిడ్‌ సంక్షోభం నేపథ్యంలో ఇళ్లనుంచే పనులు చేసుకునే ఆరోగ్యకర విధానాన్ని అనుసరిస్తూ, కార్యాలయాలను 33 శాతం సిబ్బందితో నిర్వహించినట్లు గుర్తుచేశారు. ఉద్యోగసన్నిహిత పర్యావరణానికి ఇది తిరుగులేని నిదర్శనమని ఆయన అభివర్ణించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623589

వ్యవసాయ, మత్స్య, అటవీ రంగాల స్థానిక ముడిసరకులతో వస్తుతయారీ చేపట్టాలని ఎంఎస్‌ఎంఈలకు శ్రీ నితిన్‌ గడ్కరీ ఆదేశం

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందే పారిశ్రామిక సదుపాయాలు, రవాణా పార్కుల వంటివాటిలో పరిశ్రమల రంగం పెట్టుబడులు పెట్టేందుకు సరికొత్త హరిత జాతీయ రహదారులు అవకాశం కల్పిస్తాయని మంత్రి పునరుద్ఘాటించారు. పరిశ్రమల వికేంద్రీకరణపై యోచించాల్సిన తరుణం ఆసన్నమైందని, తదనుగుణంగా దేశంలోని గ్రామీణ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి సారించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623422

“గిరిజనుల జీవనోపాధి-భద్రత”పై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్‌ముండా దృశ్య-శ్రవణమాధ్యమ సమావేశం

దేశంలోని గిరిజనుల జీవనోపాధికి భరోసా ఇస్తూ సవరించిన కనీస మద్దతు ధరతో రాష్ట్రాలు సూక్ష్మ అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టడంపై శ్రీ అర్జున్‌ముండా అభినందనలు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ప్రధానమంత్రి వన్‌ధన్‌ యోజన అమలు తీరుపైనా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్‌ముండా సమీక్షించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చిరకాల వాంఛితంలో భాగంగా అంతర్జాతీయ విపణిలో గిరిజన ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు విలువ జోడింపుపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కోవిడ్‌-19 నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న గిరిజన వలస కార్మికులు, విద్యార్థులు స్వస్థలాలకు తిరిగి వెళ్లడంలో రాష్ట్రాలు చేస్తున్న ఏర్పాట్లను కూడా శ్రీ అర్జున్‌ముండా సమీక్షించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623422

జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లలో కోవిడ్‌-19 పరిస్థితులుసహా జమ్మునుంచి క్రమబద్ధంగా రైళ్లరాకపోకల ఏర్పాట్లపై డాక్టర్‌ జితేంద్రసింగ్‌ సమీక్ష

జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ల పరిధిలోని అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో డాక్టర్‌ జితేంద్ర సింగ్ వివిధ అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా కోవిడ్‌-19 పరిస్థితులు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు ‘శ్రామిక్‌ స్పెషల్‌’ రైళ్లలో వలస కార్మికుల రాక, వారికోసం జిల్లా యంత్రాంగాలు చేపట్టిన ఏర్పాట్లు తదితరాలను ఆయన సమీక్షించారు. అంతేకాకుండా బుధవారం జమ్ము నుంచి రైళ్ల సాధారణ రాకపోకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సంబంధిత సమాచారం అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623432

గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని కుటుంబాల‌కూ 2022 డిసెంబ‌రు నాటికి మంచినీటి కనెక్ష‌న్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న హ‌ర్యానా

రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కింద 2019-20లో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు 1.05 లక్షల కొళాయి క‌నెక్ష‌న్లు ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో 2024-25నాటికి సాధించ‌ద‌ల‌చిన జాతీయ ల‌క్ష్యం గ‌డువుక‌న్నా ముందుగా... అంటే- 2022 డిసెంబ‌రుక‌ల్లా గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌తి ఇంటికీ కొళాయి ల‌క్ష్యం సాధించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. త‌ద్వారా  గ్రామీణ ప్రాంతంలోని  ప్రతి గృహానికీ మంచినీటి స‌ర‌ఫ‌రా దిశ‌గా ప్ర‌తిష్టాత్మ‌క లక్ష్యాన్ని నెరవేర్చే రాష్ట్రాల జాబితాలో హర్యానా అగ్ర‌స్థానంలో ఉంటుంద‌న్న మాట‌! కాగా, ప్ర‌జారోగ్య‌శాఖ ఇంజ‌నీరింగ్ విభాగం డ్యాష్‌బోర్డును ముఖ్య‌మంత్రి ఇటీవ‌ల ప్రారంభించారు. అన్ని గ్రామాల వివ‌రాలు, కొళాయి క‌నెక్ష‌న్లు, ఆర్థిక ప్ర‌గ‌తి వ‌గైరాల‌న్నిటినీ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించ‌గ‌ల ప్ర‌గ‌తిశీల వేదిక ఇది‌. ప్ర‌స్తుత కోవిడ్‌-19 ప‌రీక్షా స‌మయాన గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌తి ఇంటికీ కొళాయిద్వారా మంచినీటి స‌ర‌ఫ‌రా చేయ‌డ‌మన్న‌ది మ‌హిళలు, బాలిక‌ల జీవ‌న ‌ప్ర‌మాణాల‌ను పెంచ‌డానికి, కఠోర శ్ర‌మ‌నుంచి విముక్తితోపాటు వారు సుర‌క్షితంగా ఆత్మ‌గౌర‌వంతో జీవించ‌డానికి ఎంత‌గానో తోడ్ప‌డుతుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623553

జమ్ముకశ్మీర్‌లో 2022 డిసెంబరుకల్లా ఇంటింటికీ కొళాయిద్వారా మంచినీరు

ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని గందర్‌బాల్‌, శ్రీనగర్‌, రైసి జిల్లాల పరిధిలోగల 5,000 గ్రామాల్లో ఈ ఏడాదిలోనే ఇంటింటికీ కొళాయిద్వారా నీరందించే లక్ష్యాన్ని 100 శాతం సాధించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈ మేరకు జల్‌జీవన్‌ మిషన్‌ కింద కార్యాచరణ ప్రణాళికను సంబంధిత అధికారులు నిన్న తాగునీరు-పారిశుధ్య శాఖకు అందజేశారు. కేంద్రపాలిత ప్రాంత పరిధిలో మొత్తం 18.17 లక్షల ఇళ్లున్నట్లు ఇందులో వారు పేర్కొన్నారు. వీటిలో 5.75 లక్షల ఇళ్లకు ఇప్పటికే ఇంటింటి కొళాయిద్వారా నీరు సరఫరా అవుతున్నట్లు వివరించారు. మిగిలినవాటిలో మరో 1.76 లక్షల ఇళ్లకు 2020-21లో కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623543

కోవిడ్-19 తర్వాత త‌యారీ కంపెనీల్లో ప‌రివ‌ర్త‌నాత్మ‌క‌త‌ కోసం ప్రస్తుత సవాళ్ల‌ను అధిగమిస్తూ పరిశ్రమలు/సంయుక్త సంస్థ‌ల‌కు పరిశోధనలు చేరువకావాలి

జాతీయ సాంకేతిక దినోత్సవం నేపథ్యంలో “సైన్స్, టెక్నాలజీ, అండ్ రీసెర్చ్ ట్రాన్స్‌లేషన్స్‌ (RE-START) అంశంపై ఒక‌రోజుపాటు నిర్వ‌హించిన డిజిట‌ల్ స‌ద‌స్సులో- కోవిడ్-19 తర్వాత త‌యారీ కంపెనీల్లో ప‌రివ‌ర్త‌నాత్మ‌క‌త‌ కోసం ప్రస్తుత సవాళ్ల‌ను అధిగమిస్తూ పరిశ్రమలు/సంయుక్త సంస్థ‌ల‌కు పరిశోధనలు చేరువకావాల్సిన అవ‌స‌రాన్ని వ‌క్త‌లు ప్ర‌ముఖంగా వివ‌రించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623412

‘దేఖో అప్నాదేశ్‌’ కార్యక్రమం కింద “ఒడిసా-ఇండియాస్‌ బెస్ట్‌కెప్ట్‌ సీక్రెట్‌” పేరిట 18వ వెబినార్‌ నిర్వహించిన కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1623554

కోవిడ్‌-19పై పోరులో వినూత్న సాంకేతికతను వాడుతున్న భాగల్పూర్‌ స్మార్ట్‌సిటీ

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1623568

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • కేరళ: వందే భారత్ మిషన్ రెండో దశకింద 36 విమానాల సేవలు కేరళకు కేటాయించ‌బ‌డిన‌ట్లు విదేశాంగ వ్యవహారాల శాఖ స‌హాయ‌మంత్రి వి.మురళీధరన్ చెప్పారు. ఎయిరిండియా క‌న్నా తక్కువ ఖర్చుతో లేదా ఉచితంగా ప్ర‌వాస భార‌తీయుల‌ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రైవేటు సంస్థ‌లేవీ ముందుకు రాలేద‌ని మంత్రి చెప్పారు. కాగా, ఈ రాత్రి గ‌ల్ఫ్ నుంచి రెండు విమానాలు కోచ్చి చేరుకుంటాయి. కోవిడ్ నియంత్రణ చర్యల కోసం నిధుల స‌మీక‌ర‌ణ దిశ‌గా మద్యంపై ప్ర‌త్యేక రుసుము కింద‌ 10-35 శాతం అదనపు పన్ను విధించాలని రాష్ట్రం నిర్ణయించింది. ఇక మే 17న మూడో దశ దిగ్బంధం ముగిశాక రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభమవుతాయి. కాగా, కేర‌ళ‌కు చెందిన మ‌రొక‌వ్య‌క్తి యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో మ‌ర‌ణించారు.
  • తమిళనాడు: రాష్ట్రంలో ఇవాళ నాలుగు కొత్త‌కేసులు న‌మోదు కాగా, పుదుచ్చేరిలోని ఫ్యాక్టరీ కార్మికుడికి వ్యాధి సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. కోవిడ్ చికిత్స‌లో ముందువ‌రుస‌న‌గ‌ల వైద్యేతర కార్య‌క‌ర్త‌ల‌కు వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ సామ‌గ్రి అంద‌జేయ‌డంపై స్థాయీ నివేదిక దాఖ‌లు చేయాల‌ని మ‌ద్రాస్ హైకోర్టు త‌మిళ‌నాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఆంక్ష‌ల‌తో కూడిన ప‌రిస్థితుల న‌డుమ పరిశ్రమలు ప‌నిచేసేందుకుగ‌ల అవ‌రోధాల‌ను తొల‌గించే దిశ‌గా రాష్ట్రంలోని కార్మిక చట్టాలను స‌వ‌రించాల‌ని పారిశ్రామిక సంస్థ‌లు కోరాయి. ఇక ప్ర‌త్యేక రైళ్ల‌లో త‌మిళ‌నాడుకు రానున్న 1,100 మంది ప్ర‌యాణికుల‌కు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు త‌ప్ప‌నిస‌రిగా నిర్వ‌హించాల్సి ఉంది. ఇక చెన్నైతోపాటు కోయంబేడు క్లస్టర్‌స‌హా చెంగల్పట్టు, తిరువళ్లూరుల‌లోనూ కేసులు పెరిగాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు: 8718, యాక్టివ్ కేసులు: 6520, మరణాలు: 61, డిశ్చార్జ్ అయిన‌వారు: 2134. చెన్నైలో యాక్టివ్ కేసులు: 4882గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు 26 కొత్త కేసులు నమోదవ‌గా- బీదర్ 11, హసన్ 4; ఉత్తర‌ కన్నడ, కల్బుర్గి, విజయపుర, దావణ‌గేరెల‌లో రెండేసి; బెంగళూరు, దక్షిణ కన్నడ, బ‌ళ్లారిల‌లో ఒక్కొక్కటి వంతున ఉన్నాయి. కాగా, కల్బుర్గిలో ఇవాళ ఒకరు మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 951 కాగా, ఇప్పటిదాకా 32 మంది మరణించారు.. 442 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో అసంఘటిత రంగానికి రెండో కోవిడ్ ఊర‌ట ప్యాకేజీ ప్రకటించాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో మే 18 నుంచి ప్రజా రవాణా బస్సు సేవలను కొన్ని మినహాయింపులతో ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.1 లక్షల కోవిడ్ -19 పరీక్షలు నిర్వ‌హించిన నేప‌థ్యంలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రైవేటు కళాశాలల్లో మరో రెండు ప్రయోగశాలలను త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. కాగా, తాజాగా 48  కేసులు (వీరిలో వలసదారులు 8 మంది) న‌మోద‌య్యాయి. గడ‌చిన 24 గంటల్లో 86 మంది డిశ్చార్జ్ కాగా, ఒక మరణం నమోదైంది. మొత్తం కేసులు 2137కి పెరిగిన నేప‌థ్యంలో కేసుల సంఖ్య‌రీత్యా క‌ర్నూలు (591), గుంటూరు (399), కృష్ణా (349), చిత్తూరు (142), అనంత‌పురం (118), నెల్లూరు (111) అగ్ర‌స్థానంలో ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం “ఈ-సంజీవ‌ని” పేరిట ఆన్‌లైన్ ‘అవుట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్’ (ఓపీడీ) సేవల‌ను ప్రారంభించింది. ఇంత‌కుముందు దీన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిమితంగానే అమ‌లు చేసిన నేప‌థ్యంలో ఇప్పుడు పూర్తిస్థాయిలో అమలులోకి తెచ్చింది. నిన్న సాయంత్రం వేళ‌కు రాష్ట్రంలో మొత్తం కేసులు 1,326 కాగా, డిశ్చార్జ్ అయిన‌వారు 822 మంది; యాక్టివ్ కేసులు 472, మరణాల సంఖ్య 32గా ఉంది.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో రెండో కోవిడ్‌-19 పరీక్ష కేంద్రం నహర్‌లాగన్ ఏర్పాటైంది. ఇక్క‌డ రోజుకు 20 నమూనాల వంతున పరీక్షించగల సామర్థ్యంతో ‘ట్రూనాట్’ యంత్రాలను ఏర్పాటు చేశారు.
  • అసోం: రాష్ట్రంలోని ఎంఎంజీహెచ్‌లో ఇవాళ ఒక వ్య‌క్తికి వ్యాధి న‌య‌మైన‌ట్లు వ‌రుస ప‌రీక్ష‌ల్లో స్ప‌ష్టం కావ‌డంతో డిశ్చార్జి చేశారు. దీంతో ఇప్ప‌టిదాకా కోలుకున్నవారి సంఖ్య 39కి పెరిగిందని ఆరోగ్య శాఖ మంత్రి ట్వీట్ చేశారు. కాగా, ఢిల్లీ నుంచి 163 మంది విద్యార్థులు, చెన్నై నుంచి 24 మంది కేన్సర్ రోగులు ఈ రోజు గువహటి  చేరుకున్నారు. వీరిని 14 రోజులపాటు నిర్బంధ వైద్య ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రానికి పంపుతారు.
  • మ‌ణిపూర్: రాష్ట్రం వెలుప‌ల చిక్కుకున్న మ‌ణిపూర్ వాసుల‌లో 1,141 మంది ఇవాళ చెన్నై నుంచి ప్రత్యేక రైలులో జిరిబామ్ రైల్వేస్టేషన్ చేరుకున్నారు. వీరంద‌రినీ నిర్దిష్ట‌ వ్య‌వ‌స్థాగ‌త‌, సామూహిక కేంద్రాలలో నిర్బంధ వైద్య ప‌ర్యవేక్ష‌ణలో ఉంచుతారు. అధికారులు, ప‌ర్య‌వేక్ష‌ణ‌లోగ‌ల వ్య‌క్తుల‌ను మాత్ర‌మే ఈ కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
  • మిజోరం: కోవిడ్‌-19 కార‌ణంగా రాష్ట్రం వెలుప‌ల చిక్కుకున్న మిజోరం శాశ్వత నివాసితులను తిరిగి ర‌ప్పించ‌డం కోసం ప్ర‌భుత్వం ప్రామాణిక విధాన ప్ర‌క్రియ‌ల‌ను జారీచేసింది.
  • నాగాలాండ్: ఇత‌ర ప్రాంతాల్లో చిక్కుకున్న‌వారిని రాష్ట్రానికి రైళ్ల‌లో తీసుకొచ్చేందుకు అయ్యే వ్య‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించ‌నుంది. మ‌రోవైపు కోవిడ్‌-19పై ఏర్పాటుచేసిన సాధికార సంఘం స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను రూపొందించింది.
  • మేఘాలయ: రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లో చిక్కుకున్న 4,221 మంది స్థానిక పౌరులను వారి సొంత జిల్లాల‌కు పంప‌డానికి కోహిమా జిల్లా పాలనయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కాగా, కైఫీరే జిల్లావాసులు 332 మంది వారి స్వ‌స్థ‌లాల‌కు చేరుకున్నారు.
  • సిక్కిం: రాష్ట్రవ్యాప్తంగా మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ ప‌థకం, ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్‌యోజ‌న‌, ప్ర‌ధాన‌మంత్రి గ్రామ్‌స‌డ‌క్ యోజ‌న త‌దిత‌ర ప‌థ‌కాల కింద గ్రామీణాభివృద్ధి శాఖ ఇవాళ‌ పనులను పునఃప్రారంభించింది. దీంతో గ్రామీణ కార్మికులకు దిగ్బంధం స‌మ‌యంలో ఉపాధి అవకాశాలు ల‌భిస్తాయి.
  • త్రిపుర: పుణెలో చిక్కుకున్న త్రిపుర వాసులతో రెండో బ‌స్సు అగర్తల‌కు బ‌య‌ల్దేరింది.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో కొత్త కేసులు 1026; కోలుకున్న‌వారు 339 మంది; మ‌ర‌ణాలు 53గా ఉన్నాయి. తాజా వివ‌రాల నేప‌థ్యంలో మ‌హారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 24,427కు చేరింది. ఇక కోవిడ్‌-19 విధుల‌తో డ‌స్సిపోయిన రాష్ట్ర పోలీసు దళాలకు ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌డం కోసం కేంద్ర సాయుధ పోలీసు ద‌ళం నుంచి 20 కంపెనీల సిబ్బందిని పంపాల‌ని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్ర‌ధాన‌మంత్రితో సోమ‌వారంనాటి దృశ్య‌-శ్ర‌వ‌ణ మాధ్య‌మ స‌మావేశం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ మేర‌కు విజ్ఞ‌ప్తి చేశారు.
  • గుజరాత్: రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా స‌మాచారం ప్ర‌కారం... 362 కొత్త కేసుల న‌మోదుతో మొత్తం కేసుల సంఖ్య 8903కు చేరింది. అలాగే నిన్న 24 మరణాలు సంభవించాయి. దాదాపు 8 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్న రాష్ట్రంలోని 135కి పైగా పుర‌పాల‌క ప్రాంతాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు పునఃప్రారంభ‌మ‌య్యాయి. మ‌రోవైపు దాదాపు 3 లక్షల మంది వలస కార్మికులు గుజరాత్ నుంచి తమ సొంత రాష్ట్రాలకు బయల్దేరారు.
  • రాజస్థాన్: రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం 2 గంటల వ‌ర‌కుగ‌ల స‌మాచారం ప్ర‌కారం... 152 కొత్త కేసుల న‌మోదుతో  మొత్తం కేసుల సంఖ్య‌ 4173కు పెరిగింది. కొత్త కేసుల‌లో జైపూర్ 49, ఉదయపూర్ 22, జ‌లోర్ 28, పాలిలో 24 వంతున ఉన్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నుంచి గ్రామాలను ప‌రిర‌క్ష‌ణకు నిర్బంధ వైద్య‌ప‌ర్య‌వేక్ష‌ణ‌ను ప‌టిష్ఠంగా అమ‌లు చేయ‌డ‌మే రాష్ట్రంలో అత్యంత ప్ర‌ధాన కార్య‌క్ర‌మంగా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు. కాగా, రాష్ట్రమంత‌టా నిత్యం 25 వేల పరీక్షలు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రం‌లో ఇవాళ 201 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,986కు చేరింది. కొత్త కేసుల‌లో ఇండోర్ 81, భోపాల్ 30, ఉజ్జయిని 27, ఖండ్వా 20 వంతున‌ నమోదయ్యాయి. ఇక 864 మంది రోగులలో 535 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆన్‌లైన్ ఆరోగ్య పరీక్షల కోసం ‘ఇ-సంజీవని’ పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స‌మీకృత టెలిమెడిసిన్ ప‌థకాన్ని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్ర‌వేశ‌పెట్ట‌గా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

 

FACT CHECK

*******

 



(Release ID: 1623681) Visitor Counter : 311