జల శక్తి మంత్రిత్వ శాఖ

గ్రామీణ ప్రాంతాల‌లోని అన్నిగృహాల‌కు2022 డిసెంబ‌ర్ నాటికి మంచినీటి కుళాయి క‌నక్ష‌న్లు అందించేందుకు సిద్ధమౌతున్న హ‌ర్యానా.

Posted On: 13 MAY 2020 1:16PM by PIB Hyderabad

హర్యానా 2022 డిసెంబర్ నాటికి  అన్ని గ్రామీణ గృహాలకు కుళాయిల ద్వారా నీటి కనెక్షన్‌ను అందించడానికి సిద్ధ‌మౌతోంది. జల్ జీవన్ మిషన్ (జెజెఎం) కింద 2019-20లో రాష్ట్రం 1.05 లక్షల ట్యాప్ కనెక్షన్‌లను అందించింది.  2022-25 నాటికి  నూరుశాతం ల‌క్ష్యాన్ని సాధించాల‌న్న జాతీయ సంక‌ల్పంకంటె ముందే  2022 డిసెంబర్ నాటికి  ఈ ల‌క్ష్యాన్ని ముందే  సాధించ‌డానికిరాష్ట్ర ప్రభుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. దీనివ‌ల్ల‌, గ్రామీణ ప్రాంతంలోని  ప్రతి గృహానికి ట్యాప్ కనెక్షన్ అందించే లక్ష్యాన్ని నెరవేర్చే ప్రముఖ రాష్ట్రాలలో హర్యానా ఉంటుంది.

జెజెఎం కింద కుళాయి నీటిని స‌ర‌ఫ‌రా చేసి  ప్రతి ఇంటికి నిర్దేశించిన‌ లక్ష్యాన్ని సాధించడం కోసం ,నిన్న హ‌ర్యానా రాష్ట్ర అధికారులు , తాగునీరు పారిశుద్ధ్య శాఖకు తమ కార్యాచరణ ప్రణాళికను  స‌మ‌ర్పించారు. హ‌ర్యానాలో  28.94 లక్షల గృహాలు ఉన్నాయి, వీటిలో 18.83 లక్షలగృహాల‌కు ఇప్పటికే  ట్యాప్ కనెక్షన్లు అందించారు. మిగిలిన 10.11 లక్షల గృహాల్లో, 2020-21 నాటికి 7 లక్షల గృహాల్లో ట్యాప్ కనెక్షన్లు అందించాలని హర్యానా భావిస్తోంది.

ప్రస్తుత సంవత్సరంలో, మొత్తం 6,987 గ్రామాలలో 1 జిల్లా , 2,898 గ్రామాలలో 100 శాతం ట్యాప్ క‌నెక్ష్లన్ల కవరేజ్ కోసం రాష్ట్రంభావిస్తోంది. కరువు పీడిత ప్రాంతాలు ఆకాంక్ష జిల్లాల్లోని గ్రామీణ గృహాలను కవర్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం జెజెఎం కింద కేంద్ర ప్ర‌భుత్వం వాటాగా రూ .290 కోట్లు పొందే అవకాశం ఉంది,  రాష్ట్ర వాటా మొత్తానికి ఇది స‌మానంగా ఉంటుంది.. కార్య‌క్ర‌మ వాస్త‌వ అమ‌లు, ఆర్థిక పనితీరు ఆధారంగా అదనపు కేటాయింపులకు రాష్ట్రం అర్హత క‌లిగి ఉంటుంది..

 రాష్ట్రంలోని 44 నీటి పరీక్ష లేబ‌రెట‌రీల‌లో, ప్రస్తుత సంవత్సరంలో 18 లేబ‌రెట‌రీల‌కు ఎన్‌ఎబిఎల్ అక్రిడిటేషన్ పొంద‌డానికి రాష్ట్రం ప్ర‌య‌త్నిస్తోంది.  నీటి నాణ్యతను పరీక్షించడానికి కమ్యూనిటీ స్థాయిలో నీటినాణ్య‌త ప‌రిర‌క్ష‌ణ , ఫీల్డ్ టెస్టింగ్ కిట్లు అందిస్తారు. నాణ్యత లోపంతో  ఇబ్బందులు ప‌డుతున్న‌ మొత్తం 35 నివాసాలకు ప‌రిశుభ్ర‌మైన తాగునీరు అందించాలని రాష్ట్రం భావిస్తోంది.
ప్రతి గ్రామ పంచాయతీలో,  పంచాయ‌తీ క‌మిటీ లేదా, ఉప కమిటీ ఏర్పాటైంది.  అంటే గ్రామ స్థాయిలో ప్రణాళిక కోసం గ్రామస్థాయిలో  నీటి పారిశుధ్య కమిటీలను ఏర్పాటు చేశారు.  గ్రామ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. వీటి ఆధారంగా కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు

 రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఇటీవ‌లే డాష్ ‌బోర్డ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట‌మెంట్‌ (పిహెచ్‌ఇడి) ను ఇటీవల ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇది డైనమిక్ ప్లాట్‌ఫాం, దీనిలో గ్రామాల వివరాలు, ట్యాప్ కనెక్షన్లు, ఆర్థిక పురోగతి మొదలైనవాటిని రియ‌ల్ టైమ్  ప్రాతిపదికన పర్యవేక్షిస్తారు..

 ప్ర‌స్తుత కోవిడ్ సంక్షోభ స‌మ‌యంలో , గ్రామీణ ప్రాంతాల‌లో ఇంటింటికి ట్యాప్ ద్వారా మంచినీటిని స‌ర‌ఫ‌రా చేయ‌డ‌మనేది మ‌హిళలు, బాలిక‌ల జీవ‌న‌ప్ర‌మాణాల‌ను పెంచ‌డానిఇక అలాగే వారి భ‌ద్ర‌త‌కు, గౌర‌వ‌ప్ర‌దమైన జీవ‌నానికి ఉప‌క‌రిస్తుంది.

దేశంలో గ్రామీణ ప్రాంతంలోని ప్ర‌తి  గృహానికి  స‌రిప‌డినంత‌ నాణ్య‌మైన తాగునీరుఅందుబాటులో ఉండేట్టు చూడ‌డానికి భారత ప్రభుత్వం రాష్ట్రాల భాగస్వామ్యంతో 'జల్ జీవన్ మిషన్' (జెజెఎం) ను అమలు చేస్తోంది. ఇది గ్రామీణ ప్ర‌జ‌ల జీవన ప్రమాణాలలో మెరుగుప‌రిచేందుకుఉద్దేశించిన కార్య‌క్ర‌మం.

ప్ర‌స్తుత కోవిడ్ మ‌హ‌మ్మారి ప‌రిస్థితుల‌లో గ్రామీణ ప్ర‌జ‌లు ప‌బ్లిక్ కుళాయిల వ‌ద్ద పెద్ద పెద్ద  క్యూల‌లో నిల‌బ‌డి నీళ్లు తెచ్చుకునే ఇబ్బందులు లేకుండా చూడ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్రాధాన్య‌తా ప్రాతిప‌దిక‌న గ్రామీణ గృహాల‌కు ట్యాప్ క‌నెక్ష‌న్లు స‌మ‌కూర్చ‌డానికి కృషి చేస్తోంది. కోవిడ్ -19 ప‌రిస్థితుల‌లో గ్రామీణ పేద ప్ర‌జ‌లు ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్ల‌కు గురికాకుండా త‌మ ఇంట్లోనే ట్యాప్‌ద్వారా మంచినీటిని పొంద‌గ‌లిగేట్టు చేయాల‌న్న‌ది కేంద్ర ప్ర‌భుత్వ ల‌క్ష్యం. దీనివ‌ల్ల దూరంగా ఉండే ప‌బ్లిక్ కుళాయిల‌వ‌ద్ద‌కు వెళ్ల‌డం , అక్క‌డ సామాజిక దూరం పాటిస్తూ పెద్ద‌పెద్ద క్యూల‌లో నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం త‌ప్పుతుంది. గ్రామీణ ప్రాంతాల‌లో మంచినీటి స‌ర‌ఫ‌రా కార్య‌క్ర‌మాల‌ను ప్రాధాన్య‌తా ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాల్సిందిగా కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు సూచించింది.

గ్రామీణ గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించడంతో పాటు స్థానిక ప్రజలకు , వలస కార్మికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే  లక్ష్యాల‌ను సాధించడానికి తాగునీటికి సంబంధించిన పనులను ప్రాధాన్యత ప్రాతిప‌దిక‌న  చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు  కేంద్రం సూచ‌న‌లు జారీచేసింది.

గత 3 నెలలుగా రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ను విస్తృతంగా  సంప్రదించిన మీద‌ట‌, గ్రామీణ ప్రాంత గృహాల‌కు ట్యాప్ కనె‌క్ష‌న్లు ఇచ్చేందుకు  నీటి సరఫరా పథకాల‌ను విశ్లేషించ‌డం జ‌రిగింది.


(Release ID: 1623553) Visitor Counter : 306