వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల లభ్యత ఉండేలా ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టిన ఎఫ్‌సీఐ

రాష్ట్రాలు / ‌యూటీల‌కు సుమారు 160 ఎల్‌ఎమ్‌టీల మేర ఆహార ధాన్యాల పంపిణీ, నిల్వ‌లో 671 ఎల్‌ఎమ్‌టీల‌కు పైగా ఆహార ధాన్యాలు

Posted On: 13 MAY 2020 5:11PM by PIB Hyderabad

 

ఈ నెల 12వ తేదీ నాటికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) అందించిన నివేదిక ప్రకారం, ఎఫ్‌సీఐ ప్రస్తుతం 271.27 ఎల్‌ఎమ్‌టీల‌ బియ్యం, 400.48 ఎల్‌ఎమ్‌టీల‌ గోధుమల నిల్వ‌ల‌ను క‌లిగి ఉంది. దీంతో సంస్థ వ‌ద్ద మొత్తంగా అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాల నిల్వ 671.75 ఎల్‌ఎమ్‌టీల‌కు (గోధుమలు మరియు వరి కొనుగోలును మినహాయించి, ఇవి ఇంకా గోదాముల‌కు చేరుకోలేదు). ఎన్ఎఫ్ఎస్ మ‌రియు ఇత‌ర సంక్షేమ కార్య‌క్ర‌మాల నిమిత్తం నెల‌కు సుమారు 60 ఎల్‌ఎమ్‌టీల‌ ఆహార ధాన్యాలు అవసరం. లాక్‌డౌన్ అమ‌లులోకి వ‌చ్చిన నాటి నుంచి సుమారు 80.64 ఎల్ఎంటీల ఆహార ధాన్యాల‌ను 2880 రైలు ర్యాకుల ద్వారా రవాణా చేశారు. రైలు మార్గం కాకుండా, రోడ్డు మరియు జలమార్గాల ద్వారా కూడా రవాణా ఆహార ధాన్యాల ర‌వాణా జ‌రిపింది. మొత్తంగా 159.36 ఎల్‌ఎమ్‌టీల ఆహార ధాన్యాల రవాణా చేయబడింది. 11 ఓడల ద్వారా 15,031 మెట్రిక్ టన్నుల ధాన్యాలు రవాణా చేయబడ్డాయి.
ఇందులో మొత్తం 7.36 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలు ఈశాన్య రాష్ట్రాలకు రవాణా చేయబడ్డాయి.
ఎన్ఎఫ్ఎస్ఏ మ‌రియు పీఎంజీకేఏవై కింద రేష‌న్‌కు గాను రానున్న 3 నెలలకు ఈశాన్య ప్రాంత‌
రాష్ట్రాల్లో మొత్తం 11 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలు అవసరం.
ఓపెన్ మార్కెట్ అమ్మకాల పథకంః
లాక్‌డౌన్‌ సమయంలో, ఎన్జీఓలు మరియు సహాయ శిబిరాలు నడుపుతున్న సామాజిక సంస్థలు ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్) రేటుతో ఎఫ్‌సీఐ డిపోల నుండి నేరుగా గోధుమలు మరియు బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇదే స‌మ‌యాన‌ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎఫ్‌సీఐ నుంచి నేరుగా ఆహార ధాన్యాలు కొనుగోలు చేయవచ్చు. రానున్న‌ మూడు నెలలకు గాను రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు జారీ చేసిన ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ప‌రిధిలోకి రాని కుటుంబాలకూ బియ్యం / గోధుమలను అందించవచ్చు. ఓఎంఎస్ఎస్ కింద బియ్యం రేట్ల‌ను కిలోకు రూ.22 మరియు గోధుమలు కిలోకు రూ.21 లకు స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఓఎంఎస్ఎస్ ద్వారా ఎఫ్‌సీఐ 4.68 ఎల్ఎంటీల గోధుమల్ని 6.58 ఎల్ఎంటీల బియ్యాన్ని ఎఫ్‌సీఐ విక్ర‌యించింది.
ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ అన్న్‌ యోజన (పీఎంజీకేఏవై)
ఆహార ధాన్యం (బియ్యం / గోధుమ)
పీఎంజీకేఏవై కింద రానున్న‌ 3 నెలలకు మొత్తం 104.4 ఎల్ఎంటీల‌ బియ్యం మరియు 15.6 ఎల్ఎంటీల గోధుమలు అవసరమవుతాయి, వీటిలో 69.65 ఎల్ఎంటీల బియ్యం మరియు 10.1 ఎల్ఎంటీల‌ గోధుమలను వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల వారు ఎఫ్‌సీఐ నుంచి స‌మీక‌రించారు. దీంతో మొత్తం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్న మొత్తం ధాన్యం 79.75 ఎల్‌ఎమ్‌టీల‌కు చేరింది. ఈ పథకం కింద రూ.46,000 కోట్ల 100 శాతం ఆర్థిక భారాన్నిభారత ప్రభుత్వం మోస్తోంది. ఆరు రాష్ట్రాలు / ‌కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు గోధుమలు కేటాయించబడ్డాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఛండీగఢ్‌, ఢిల్లీ, గుజ‌రాత్ రాష్ర్టాల‌కు గోధుమ‌లు కేటాయించ‌బ‌డ్డాయి. మిగిలిన రాష్ట్రాలు / కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు బియ్యం అందించబడ్డాయి.
పప్పు ధాన్యాలుః
పప్పుధాన్యాల విషయానికొస్తే రాబోయే మూడు నెలలకు మొత్తంగా 5.87 ఎల్‌ఎమ్‌టీల మేర ప‌ప్పు ధాన్యాలు అవ‌స‌రం. ఇప్పటివరకు 3.15 ఎల్‌ఎమ్‌టీల‌ పప్పులు పంపించగా.. 2.26 ఎల్‌ఎమ్‌టీల‌ పప్పులు రాష్ట్రాలు / యుటీలకు చేరుకున్నాయి. దాదాపుగా 71,738 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయబడ్డాయి. ఈ నెల 12వ తేదీ నాటికి బఫర్ స్టాక్‌లో మొత్తం 12.75 ఎల్‌ఎమ్‌టీల‌ పప్పులు (కంది ప‌ప్పు -5.70 ఎల్‌ఎమ్‌టీ, పెస‌ర ప‌ప్పు-1.72 ఎల్‌ఎమ్‌టీ, మిన‌ప‌ప్పు- 2.44 ఎల్‌ఎమ్‌టీ, శ‌న‌గ ప‌ప్పు-2.42 ఎల్‌ఎమ్‌టీ మరియు ఎర్ర ప‌ప్పు-0.47 ఎల్‌ఎమ్‌టీ) అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ -19 వైర‌స్ కారణంగా పెరిగిన డిమాండ్ దృష్ట్యా వినియోగదారుల వ్యవహారాల విభాగం ఫేస్ మాస్క్‌లు మరియు శానిటైజర్‌లను కూడా నిత్య‌వ‌స‌ర‌
ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద నోటిఫై చేసింది. ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు మరియు వాటి తయారీలో ఉపయోగించే పదార్థాల ధరలు కూడా పరిమితం చేయబడ్డాయి. లాక్‌డౌన్ నేప‌థ్యంలో అన్ని నిత్య‌వసరమైన వస్తువుల ధరలను తనిఖీ చేయడంతో పాటుగా వాటి సరఫరా - గొలుసు నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్ధారించుకోవాల‌ని కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాల‌ను జారీ చేసింది. అత్య‌వ‌స‌ర వ‌స్తువుల చ‌ట్టం కింద నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం అన్ని అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది.
ఆహార ధాన్యం సేకరణః
ఈ నెల 12వ తేదీ నాటికి ఎఫ్‌సీఐ మొత్తం 268.9 ఎల్‌ఎమ్‌టీల గోధుమ‌లు (ఆర్‌ఎంఎస్ 2020-21), 666.9 ఎల్‌ఎమ్‌టీల‌ బియ్యంను (కేఎంఎస్ 2019-20) సేకరించింది
ఎండ్-టు-ఎండ్ కంప్యూటరీకరణః
మొత్తం 90 శాతం ఎఫ్‌పీఎస్‌ ఆటోమేషన్ ప్ర్ర‌క్రియ ఈ-పీఓఎస్‌ ద్వారా పూర్తి చేయ‌డం జరిగింది. మొత్తం 20 రాష్ట్రాలు / యుటీలలో ఇది 100 శాతం ఈ ప్ర్ర‌కియ పూర్త‌యింది. దాదాపు 90 శాతం మేర‌ రేషన్ కార్డుల ఆధార్ సీడింగ్ ప్ర్ర‌కియ కూడా పూర్త‌యింది. 11 రాష్ట్రాలు / ‌యూటీ
లలో ఇది 100 శాతం పూర్త‌యింది.

 

***


(Release ID: 1623656) Visitor Counter : 325