సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ మరియు కుటీర పరిశ్రమలకోసం ప్రధాని ఇచ్చిన ఆర్ధిక ప్యాకేజీని స్వాగతించిన కేంద్ర మంత్రి గడ్కరీ. ఈ ప్యాకేజీతో చిన్న మధ్య తరహా పరిశ్రమలు నూతన శిఖరాలు అందుకుంటాయన్న కేంద్ర మంత్రి గడ్కరీ
प्रविष्टि तिथि:
12 MAY 2020 9:50PM by PIB Hyderabad
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని స్వాగతిస్తున్నట్టు కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు, రోడ్డు రవాణా మరియ ప్రధాన రహదారుల శాఖ మంత్రి శ్రీ గడ్కరీ అన్నారు. ఈ చారిత్రాత్మక ప్యాకేజీ ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమలను, గ్రామీణ మరియు కుటీర పరిశ్రమల రంగాన్ని నమ్ముకున్నవారి జీవితాల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కొత్త ఆశలు చిగురింప చేశారని ఆయన అన్నారు.
అపారమైన వనరులతో, అత్యున్నత సాంకేతికత, ముడి సరుకుల సాయంతో భారతదేశం త్వరలోనే అన్ని రంగాల్లో స్వయంసమృద్ధి సాధిస్తుందని శ్రీ గడ్కరీ దీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆర్ధిక రంగంలో భారతదేశం ఉన్నతమైన ఆర్ధిక నమూనాగా అవతరించేలా ప్రధాని రూపకల్పన చేస్తున్నారని శ్రీ గడ్కరీ అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్ధిక మందగమన పరిస్థితులను అనుకూల అవకాశాలుగా మార్చుకొని ఆత్మవిశ్వాసంతో,అనుకూల దృక్పథంతో ముందుకు సాగుదామని శ్రీ గడ్కరీ అన్నారు.
అత్యున్నతమైన ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించడంద్వారా ప్రధాని చూపిన చొరవను చాలా కాలం పాటు దేశం గుర్తు పెట్టుకుంటుందని శ్రీ గడ్కరీ అన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగం 11 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధినిస్తోందని, జిడిపిలో 29 శాతం వాటా కలిగి వుందని ఈ రంగంమీద ఆధారపడి వున్నవారు అందరూ ప్రధాని అందించిన మద్దతును ఎన్నటికీ మరువలేరని శ్రీ గడ్కరీ అన్నారు. ఈ ప్యాకేజీ ద్వారా చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం రానున్నకాలంలో నూతన శిఖరాలను అందుకుంటుందనే నమ్మకం తనకు వున్నట్టు కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు.
***
(रिलीज़ आईडी: 1623425)
आगंतुक पटल : 350