రైల్వే మంత్రిత్వ శాఖ
మే 13, 2020 వరకు 642 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడిపిన రైల్వే శాఖ
సొంత రాష్ట్రాలకు చేరిన 7.9 లక్షల మంది ప్రయాణీకులు
ప్రయాణ సమయంలో ఉచితంగా ఆహారం, మంచినీళ్లు సరఫరా
Posted On:
13 MAY 2020 5:15PM by PIB Hyderabad
లాక్‌డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతరులను ప్రత్యేక రైళ్ల ద్వారా వారి సొంత రాష్ట్రాలకు తరలించొచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతించిన తర్వాత, "శ్రామిక్ స్పెషల్" రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది.
మే 13, 2020 నాటికి, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 642 శ్రామిక్ స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ నడిపింది. ఈ రైళ్ల ద్వారా దాదాపు 7.9 లక్షల మంది ప్రయాణీకులు వారి సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. ప్రయాణీకులను పంపే రాష్ట్రం, స్వీకరించే రాష్ట్రం సమ్మతి తర్వాతే ఈ రైళ్లను రైల్వే శాఖ నడిపింది.
ఈ 642 రైళ్లలో.. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రైళ్లు, బిహార్ -169 రైళ్లు, ఛత్తీస్‌గఢ్ -6 రైళ్లు, హిమాచల్‌ప్రదేశ్ - 1 రైలు, జమ్ము&కశ్మీర్ - 3 రైళ్లు, జార్ఖండ్ - 40 రైళ్లు, కర్ణాటక - 1 రైలు, మధ్యప్రదేశ్ - 53 రైళ్లు, మహారాష్ట్ర - 3 రైళ్లు, మణిపూర్ - 1 రైలు, మిజోరం - 1 రైలు, ఒడిశా - 38 రైళ్లు, రాజస్థాన్ - 8 రైళ్లు, తమిళనాడు - 1 రైలు, తెలంగాణ - 1 రైలు, త్రిపుర -1 రైలు, ఉత్తరప్రదేశ్ - 301 రైళ్లు, ఉత్తరాఖండ్ - 4 రైళ్లు, పశ్చిమ బెంగాల్ నుంచి 7 రైళ్లు నడిచాయి.
రైలు ఎక్కేముందే ప్రయాణీకులందరికీ వైద్య పరీక్షలు చేశారు. ప్రయాణ సమయంలో ఉచితంగా ఆహారం, మంచినీళ్లు అందించారు.
(Release ID: 1623653)
Visitor Counter : 271
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam