ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, కేంద్ర‌పాలిత ప్రాంతాలైన జ‌మ్ముకాశ్మీర్‌, ల‌ద్దాక్ ల‌లో కోవిడ్ -19 నియంత్ర‌ణ‌,స‌న్న‌ద్ధ‌త ,నిర్వ‌హ‌ణ‌పై స‌మావేశం నిర్వ‌హించారు.

Posted On: 12 MAY 2020 5:13PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ ఈరోజు జ‌మ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ గిరీష్ చంద్ర ముర్ము, ల‌ద్దాక్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఆర్‌.కె.మాథూర్‌, ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి శ్రీ త్రివేంద్ర సింగ్ రావ‌త్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ శ్రీ జైరామ్ ఠాకూర్‌ల‌తో కేంద్ర ఆరోగ్య‌కుటుంబ సంక్షేమ  శాఖ స‌హాయ‌మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే సమ‌క్షంలో  ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు.వివిధ రాష్ట్రాల ఆరోగ్య‌మంత్రులు ,రెడ్ జోన్ జిల్లాల క‌లెక్ట‌ర్లతో స‌మావేశాలు నిర్వ‌హించ‌డంలో భాగంగా ఈ స‌మావేశం నిర్వ‌హించారు. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో కోవిడ్ -19 క‌ట్ట‌డి, కేసుల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించేందుకు ఈ స‌మావేశం నిర్వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ, 2020 మే 12 నాటికి దేశం  మొత్తం 70,756 కేసులు నమోదయ్యాయని, ఇందులో 22,455 మంది కి వ్యాధిన‌య‌మైంద‌ని, 2,293 మంది మ‌ర‌ణించార‌ని చెప్పారు. గత 24 గంటల్లో, కొత్తగా 3,604 కేసులు న‌మోద‌య్యాయ‌ని,  1538 మంది రోగుల‌కు న‌య‌మైంద‌ని చెప్పారు. కేసులు రెట్టింపు కావ‌డానికి ప‌ట్టే స‌మ‌యం గ‌త 14 రోజుల‌లో 10.9 గా ఉండ‌గా గ‌త మూడు రోజుల‌లో ఇది 12.2 కు పెరిగింద‌ని ఆయ‌న చెప్పారు. మ‌ర‌ణాల రేటు 3.2 శాతం గా  ఉండ‌గా, కోలుకుంటున్న వారి శాతం 31.74 శాతం. నిన్న‌టివ‌ర‌కూ గ‌మ‌నించిన‌ట్ట‌యితే ఐసియులో 2.37 శాతం కోవిడ్ -19 యాక్టివ్  కేసులు ఉన్న‌ట్టు చెప్పారు0.41 శాతం వెంటిలేట‌ర్ పై ఉన్నార‌ని 1.82 శాతం ఆక్సిజ‌న్ మ‌ద్ద‌తుతో ఉన్నార‌న్నారు. దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించే సామ‌ర్ధ్యం పెరిగింద‌ని, ఇది రోజుకు 1,00,000 టెస్టులుగా ఉంద‌న్నారు. 347 ప్ర‌భుత్వ లేబ‌రెట‌రీలు, 137 ప్రైవేటు లేబ‌రెట‌రీలు, క‌లిపి మొత్తం 17,62,840 కోవిడ్ -19  ప‌రీక్ష‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ నిర్వ‌హించిన‌ట్టు మంత్రి చెప్పారు. నిన్న ఒక్క‌రోజే 86,191 శాంపిళ్ళు ప‌రీక్షించారు.
, “కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి  కేంద్ర‌ప్ర‌భుత్వం రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ సమన్వయంతో, ముమ్మ‌ర చ‌ర్య‌లు తీసుకుంటోంది. కోవిడ్  ఆస్పత్రులు, ఐసోలేషన్ కేంద్రాలు , ఐసియు పడకలు , క్వారంటైన్ కేంద్రాలుప త‌గిన‌న్ని గుర్తించడం జ‌రిగింది. కోవిడ్ -19 కు సంబంధించి ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కోవటానికి దేశం సంసిద్ధంగా ఉందని ఆయ‌న  భరోసా ఇచ్చారు. రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు తగిన సంఖ్యలో మాస్క్ లు , వ్యక్తిగత రక్షణ పరికరాలు మొదలైనవి అందించడం ద్వారా కేంద్రం సహకరిస్తోందని కూడా ఆయన అన్నారు.

రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లోని కోవిడ్ -19 కేసుల స్థితి , వాటి  నిర్వహణపై  ప్రదర్శన ఇచ్చిన తరువాత, డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ “ స్వ‌స్థ‌లాల‌కు తిరిగి వచ్చిన వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాలు మరింత  నిఘా,  ప‌ర్య‌వేక్ష‌ణ‌పై దృష్టి పెట్టాలి. వివిధ ప్రాంతాల‌నుంచి తిరిగి వచ్చిన వారందరికీ ట్రేసింగ్, తగిన పరీక్ష , సకాలంలో చికిత్స అందించాల‌న్నారు.విదేశాల నుండి తిరిగి వచ్చేవారు  కూడా ఇందులో ఉన్నారు ”. వివిధ  రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలకు చేరుకున్న వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం,  వారిని క్వారంటైన్‌కు పంప‌డం, వారికి త‌గిన ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం,   తదుపరి చికిత్స కోసం చేప‌డుతున్న‌ సన్నాహాలను రాష్ట్రాలు, యుటిలు వివ‌రించాయి.. మెరుగైన నిఘా , తగిన వైద్య ప‌రీక్ష‌ల‌ కోసం తిరిగి వచ్చిన వారందరికీ ఆరోగ్య సేతును డౌన్‌లోడ్ చేసుకోవ‌డం తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు.
కోవిడ్ బాధిత జిల్లాలు లేదా దీని ప్రభావం లేని   జిల్లాల్లో తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ (SARI) ,ఇన్ఫ్లుఎంజా  వంటి అనారొగ్యాల విష‌యంలో (ILI)  నిఘా పెంచాల్సిన అవ‌స‌రంపై డాక్టర్ హర్ష్ వర్ధన్ నొక్కి చెప్పారు.  ఈ విషయంలో రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు అక్కడ ఉంటే మెడికల్ కాలేజీల సహాయం తీసుకోవాలని సూచించారు. "ఇటువంటి చర్యలు ప్రారంభ దశలో బ‌య‌ట‌కు క‌నిపించ‌ని ల‌క్ష‌ణాలుగ‌ల కేసులను ప్రారంభ‌ద‌శ‌లోనే గుర్తించ‌డానికి సహాయపడతాయి, తద్వారా దానిని అప్ప‌టిక‌ప్ప‌డు దానిని అరిక‌ట్ట‌డానికి సహాయపడుతుంది" అని ఆయన చెప్పారు
 ఉత్త‌రాఖండ్ లో SARI, ILI నిఘా కోసం చేప‌ట్టిన చ‌ర్య‌లు,  కాంటాక్ట్ ట్రేసింగ్ , పర్యవేక్షణ కోసం IDSP చేపట్టిన కృషిని  డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ ప్రశంసించారు. కోవిడ్ తో సంబంధం లేని ముఖ్యమైన వైద్య సేవలను అందించడానికి, సుదూర ప్రాంతాల‌లోని వారిని చేరుకోవడానికి  మొబైల్ మెడికల్ వ్యాన్లను ప్రారంభించినట్లు లడఖ్  కేంద్ర‌పాలిత  ప్రాంతం పేర్కొంది.  కొంతమంది వైద్యులను పోలీసు సిబ్బందిని రిజర్వులో ఉంచుతున్నామ‌ని, తద్వారా ల‌ద్దాక్‌లో కోవిడ్ -19 పై  పూర్తి సమయం కేటాయించ‌డం కోసం వారిని రొటేష‌న్  ప్రాతిపదికన నియమించడానికి వీలు క‌లుగుతుంద‌ని శ్రీ ఆర్‌.కె. మాథూర్ తెలిపారు. కోవిడ్ పై  ప్ర‌జ‌ల‌లో అవగాహన క‌ల్పించ‌డం, వారిలో విశ్వాసం పెంపొందించడానికి  పంచాయతీలు , సమాజ పెద్దలతో కలిసి పని చేస్తున్న‌ట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న సాంకేతిక , ఇతర సహకారానికి అన్ని రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాలు కృతజ్ఞతలు తెలిపాయి. హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లా లో కోవిడ్ -19 అనంత‌ర ప‌రిస్థితుల‌లో సుర‌క్షిత‌ కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌కు  బార్బర్లు ,సెలూన్ ఆపరేటర్ల‌ను  సిద్ధం చేయడానికి శిక్షణ ఇస్తున్నారు. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు సిబ్బంది, పారా మిలటరీ దళాలకు ఆయుర్వేద రోగనిరోధక శక్తి పెంచే బూస్ట‌ర్ల‌ను  అందించినట్లు శ్రీ జై రామ్ ఠాకూర్ తెలిపారు.  

    ల‌ద్దాక్‌లో పొగాకు వినియోగం ఎక్కువ‌గా ఉన్నందున అక్క‌డ బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో ఉమ్మివేయ‌డాన్ని ఇంత‌కు ముందు విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా నిషేధించాల్సి ఉంద‌న్నారు.  
  రోగనిరోధకత చ‌ర్య‌లు, టిబి కేస్ ల‌ను క‌నుగోన‌డం , చికిత్స, డయాలసిస్ రోగులకు రక్త మార్పిడి అందించడం, క్యాన్సర్ రోగులకు చికిత్స, గర్భిణీ స్త్రీలకు ఎ.ఎన్.సి మొదలైన వాటికి సంబంధించి కోవిడ్ తో సంబంధం లేని  ముఖ్యమైన ఆరోగ్య సేవలను అందించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయ‌న రాష్ట్రాలకు పునరుద్ఘాటించారు. రక్తపోటు, డయాబెటిస్  వంటి మూడు రకాల క్యాన్సర్ల కోసం ఆయుష్మాన్ భారత్-హెల్త్ , వెల్నెస్ సెంటర్లను స్క్రీనింగ్ కోసం ఉపయోగించవచ్చని కూడా పేర్కొన్నారు.
 ఇలాంటి కేసుల‌ను స‌కాలంలో పరీక్షించడంతో పాటు నివారణ, మందులు , రోగనిరోధక శక్తిని పెంచేందుకు చ‌ర్య‌ల‌ను రాష్ట్రాలు చేప‌ట్టాల‌ని ఆయన రాష్ట్రాలకు గుర్తు చేశారు. అవసరమైన ఔష‌ధాల‌ నిల్వను తగినంతగా ఉంచాలని రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు సూచించారు. కోవిడ్ కాని ముఖ్యమైన సేవలకు సంబందంచి ఫిర్యాదుల ప‌రిష్కారం కోసం 1075 తో పాటు హెల్ప్‌లైన్ నంబర్ 104 ను ఉపయోగించవచ్చని, ఈ సేవల అందుబాటు  గురించి తెలియజేయాల్సిందిగా రాష్ట్రాలకు సమాచారం ఇవ్వ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. వెక్టర్ వ్యాధుల నివారణకు తగిన చర్యలు కూడా తీసుకోవలసిన అవసరం ఉందని మంత్రి సూచించారు. సకాలంలో జీతాలు, ప్రోత్సాహకాలు చెల్లించడం ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తల మనోస్థైర్యాన్ని పెంచుతుందని , రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాలు  వీటిని సకాలంలో విడుదల చేయాలని కోరారు
    హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా, చంబా, హమీర్‌పూర్, సిర్మౌర్, సోలన్ , కాంగ్రా వంటి వివిధ జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో డాక్టర్ హర్ష్ వర్ధన్ సుదీర్ఘంగా  మాట్లాడారు; జమ్మూ కాశ్మీర్ లోని షోపియన్, శ్రీనగర్, బండిపోరా , అనంతనాగ్; ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్;  లడఖ్ లో లే , కార్గిల్  జిల్లాల్లో కోవిడ్ -19 నియంత్ర‌ణ ప‌రిస్థితులు, నిర్వహణ గురించి స‌వివరంగా చర్చించారు. ఇటువంటి సమావేశాలు మరింత బాగా పనిచేయడానికి సహాయపడతాయని ,ఏదైనా గ్యాప్‌లు ఉంటే వాటిని పూరించడానికి, సమస్యలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ,పరిష్కరించడానికి సహాయపడతాయని ఆయన అన్నారు.
కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ‌మ‌తి ప్రీతిసుడాన్‌, ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి శ్రీ సంజీవ కుమార్‌, ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ఓ.ఎస్‌.డి శ్రీ రాజేష్ భూష‌ణ్, అలాగే ఎన్‌.హెచ్‌.ఎం. ఎఎస్‌, ఎండి శ్రీ‌మ‌తి వంద‌న గుర్నాని, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి శ్రీ వికాస్ శీల్‌, ఎన్‌సిడిసి డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ ఎస్‌.కె.సింగ్‌, ఆరోగ్య శాఖ ప్ర‌న్సిప‌ల్ సెక్ర‌ట‌రీ, ఇత‌ర సీనియ‌ర్ రాష్ట్ర స్థాయి అధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.


*****


(Release ID: 1623367) Visitor Counter : 265