పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

“వందే భారత్ మిషన్” కింద 7 మే 2020 నుండి 43 విమానాలలో 8,503 మంది భారతీయులను విదేశాల నుండి స్వదేశానికి తరలింపు

Posted On: 13 MAY 2020 11:58AM by PIB Hyderabad

మే 7వ తేదీన ప్రారంభమైన “వందే భారత్ మిషన్” లో భాగంగా గత ఆరు రోజుల నుంచి ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నడుపుతున్న 43  ఇన్బౌండ్ విమానాలలో  8,503 మంది భారతీయులను విదేశాల నుంచి తిరిగి భారతదేశానికి తీసుకువచ్చారు.  విదేశాలలో చిక్కుకు పోయిన వారిని స్వదేశానికి  రప్పించేందుకు గాను భారత ప్రభుత్వం  ఈ  నెల 7వ తేదీన “వందే భారత్ మిషన్” పేరిట అతిపెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించింది.  ఈ మిషన్ కింద భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఓసీఏ) , విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ,  రాష్ట్ర ప్రభుత్వాలతో  సమన్వయం  చేస్తోంది. ఎయిర్ ఇండియాతో పాటు దాని అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 12 దేశాలకు మొత్తం 64 విమానాలను (42 ఎయిర్ ఇండియా మరియు 24 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ద్వారా) నడుపుతొంది.  మొదటి దశలో 14,800 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించడానికి అమెరికా (యుఎస్ఏ), యూకే,  బంగ్లాదేశ్,  సింగపూర్,  సౌదీ అరేబియా,  కువైట్,  ఫిలిప్పీన్స్,  యుఏఈ మరియు మలేషియాలకు విమాన సర్వీసులను నడిపించింది.  ఈ భారీ వాయు తరలింపు మిషన్లోని ప్రతి  పనిని ప్రభుత్వం మరియు డీజీసీఏ నిర్దేశించిన భద్రత మరియు పరిశుభ్రత ప్రోటోకాల్కు ఖచ్చితంగా కట్టుబడి చేపడుతున్నారు. ఎంఓసీఏ,  ఏఏఐ మరియు ఎయిర్ ఇండియా ఈ  సున్నితమైన  వైద్య  తరలింపు  మిషన్లలో ప్రయాణీకులు,  సిబ్బంది మరియు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది యొక్క భద్రత విషయంలో అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్వహిస్తున్నారు. ఈ మిషన్కు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విస్తృతమైన మరియు ఖచ్చితమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.



(Release ID: 1623532) Visitor Counter : 342