శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తర్వాత ఉత్పాదక సంస్థల్లో రావలసిన మార్పు, కోవిడ్ -19 ను సవాళ్ళను అధిగమించే దిశలో పరిశ్రమ మరియు సహకారాలకు పరిశోధన చేరువగా ఉంటుంది.
ఎస్ అండ్ టీ ద్వారా ఆర్థిక వ్యవస్థను పునర్ వ్యవస్థీకృతం చేయడం మీద జరుగుతున్న డిజిటల్ సమావేశాల్లో నిపుణుల సూచనలు.

Posted On: 12 MAY 2020 6:59PM by PIB Hyderabad

జాతీయ సాంకేతిక దినోత్సవం నేపథ్యంలో నిర్వహిస్తున్న సైన్స్, టెక్నాలజీ, అండ్ రీసెర్చ్ ట్రాన్స్ లేషన్స్ (RE-START), ద్వారా ఆర్థిక వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించడంలో పై ఈ రోజు జరిగిన డిజిటల్ సమావేశం తయారీ సంస్థల్లో రావలసిన మార్పు ప్రాధాన్యతను ఎత్తి చూపింది. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడంలో పరిశ్రమ మరియు సహకారాలకు పరిశోధన చేరువగా ఉండాలని తెలిపారు.

‘కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి మెరుగైన సంసిద్ధత కోసం మెడిసిన్స్ & మెడికల్ టెక్నాలజీస్’ అనే సెషన్ లోని నిపుణులు అభిప్రాయం ప్రకారం, ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆర్ అండ్ డి గొప్ప అవకాశమని, దాన్ని బలోపేతం చేసేందుకు ఉపయోగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కోవిడ్ -19 సంక్షోభంలో ఔషధ ఆవిష్కరణలు, టీకాలు మరియు రోగ నిర్థారణ సాధనాలు మరియు ఇతర వైద్య పరికరాలు, అలాగే ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డులను సంరక్షించే మార్గాల్లో చారిత్ర పురోగతి నుంచి, భవిష్యత్ సంసిద్ధత కోసం ఎలా ఉపయోగించుకోవాలో పరిశోధించాలని నిపుణులు సూచించారు.

యు.కె.కు చెందిన మధుకర్ బోస్ మాట్లాడుతూ, అక్కడ ప్రాథమిక సంరక్షణకు సరికొత్త మార్గాలను అవలంబించే దిశగా ప్రజలను ఈ మహమ్మారి ముందుకు నడిపిందని, ఇప్పుడు యు.కె.లో 90 శాతం పరస్పర చర్య డిజిటల్ ఛానళ్ళ ద్వారా జరుగుతుందని వివరించారు. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ డాక్టర్ సురేష్ జాదవ్ మాట్లాడుతూ, కోవిడ్ -19 సమస్య పూర్తిగా పరిష్కారం కావడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చని, ప్రస్తుత పరిస్థితుల్లో జీవించేందుకు సాంకేతికతలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని, ఫేస్ మాస్క్ లు, సామాజిక దూరం వంటి ఉత్తమ పద్ధతులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని జీవితంలో ఒక భాగం చేసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు.

సి.ఎస్. ఐ.ఆర్. డైరక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మాండే మాట్లాడుతూ, కోవిడ్ -19 లాంటి మహమ్మారిని పరిష్కరించడానికి, పరిశోధన త్వరగా కాపిటల్ ఇంటెన్సివ్ నుంచి నాలెడ్జ్ ఇంటెన్సివ్ కు మారాలని, పరిశ్రమకు దగ్గరగా తీసుకు రావాలని అడ్వాన్స్ మెటిరియల్స్ సెషన్ లో వివరించారు.  అనేక పరిశ్రమలు ఇందులో జ్ఞాన భాగస్వాములు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో ఎదురు కాబోయే సమస్యలకు వినూత్న సాంతేకి పరిష్కారాలు అవసరం అవుతాయని నిపుణులు సూచించారు.  

అడ్వాన్స్ డ్ మానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ సెషన్ లో కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తయారీ సంస్థలు డిజిటల్ దిశగా వేస్తున్న అడుగుల గురించి చర్చ జరిగింది. ఈ దిశగా జరుగుతున్న మార్పుల గురించి జి.ఈ. ఇండియా టెక్నాలజీ సెంటర్ సి.ఈ.ఓ. శ్రీ అలోక్ నంద తెలిపారు. త్రీడీ ప్రింటింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఇందులో కీలక పాత్ర పోషిస్తుందని స్ట్రాటాసిస్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ రాజివ్ బజాజ్ సూచించారు. సంకలిత తయారీ మార్గాన్ని వేగంగా స్వీకరించాల్సిన అవసరం గురించి పూణే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డైరక్టర్ బి.బి.ఆహుజా తెలిపారు.

కోవిడ్ -19 సమయంలో బోధన మరియు అభ్యాసంలో తీసుకువచ్చే మార్పుల పై ఐఐటి రోపర్ డైరక్టర్ ప్రొఫెసర్ సరిత్ కుమార్ దాస్ చర్చించారు. దీనికి పరిశ్రమ మరియు విద్యాసంస్థల మధ్య సహకారం కీలకమైనదని ఆయన తెలిపారు. కోవిడ్ -19, వాతావరణ మార్పు వంటి వాటిని సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా మరింత వేగంగా అర్థం చేసుకోవచ్చని ఎక్సెంచర్ రీసెర్చ్ మేనేజింగ్ డైరక్టర్ రాఘవ్ నర్సలే ప్రముఖంగా ప్రస్తావించారు. స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక సవాళ్లను పరిష్కరించడంలో, అధునాతన సాంకేతికతలు పరిశ్రమకు ఆవిష్కరణ, సుస్థిరత మరియు ఉపాధిని తిరిగి ఉత్తేజపరిచే మార్గాలను అందిస్తాయని ప్యానెల్ అంగీకరించింది.

'గ్లోబల్ ఎకనామిక్ లీడర్‌షిప్ కోసం గ్లోబల్ ఇన్నోవేషన్ & టెక్నాలజీ అలయన్స్' అనే సెషన్ కోవిడ్ -19 సవాలును ఎదుర్కోవడంలో ప్రపంచ సహకారాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఈ బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ మాట్లాడుతూ, ప్రస్తుతం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కనెక్ట్ కావడానికి వర్చువల్ సహకారం కీలకమని, దేశాల మధ్య సహకారం మరింత శక్తితో కొనసాగాలని అభిప్రాయపడ్డారు.

భారతదేశ ఇటలీ రాయబారి విన్సెంజో డి లూకా , కెనడా పారిశ్రామిక సాంకేతిక సలహాదారు లూక్ ట్రాస్ లు మాట్లాడుతూ ఆయా దేశాలతో కలిగి భారత్ చేపుడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే వారి దేశాల్లో చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల గురిచి తెలిపారు. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ అమిరామ్ అప్పెల్బామ్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వ ఆరోగ్య సంక్షోభంలో తమ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను ఎలా ఉపయోగించుకుంటుందో వివరించారు.

"భారతదేశం సహకరించడానికి సిద్ధంగా ఉంది మరియు మహమ్మారిపై పోరాడటానికి మరియు దానిని గెలవడానికి అంతర్జాతీయ సహకారం కోసం మేము ఎదురుచూస్తున్నాము" అని డి.ఎస్.టి. అంతర్జాతీయ కో ఆపరేషన్ హెడ్ డాక్టర్ ఎస్.కె. వర్షిణి తెలిపారు

ఈ సదస్సు ప్రారంభ సమావేశానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఎర్త్ సైన్సెస్ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సి.ఐ.ఐ, డి.జి. శ్రీ చంద్రజిత్ బెనర్జీ, సి.ఐ.ఐ. అధ్యక్షుడు శ్రీ విక్రమ్ కిర్లోస్కర్, టి.డి.బి. కార్యదర్శి డాక్టర్ నీరజ్ శర్మలు ప్రారంభ సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.

ఈ సమావేశం ద్వారా శాస్త్రవేత్తలు, టెక్నోక్రాట్లు, ప్రభుత్వ అధికారులు, డిప్లమాట్లు, డబ్ల్యు.హెచ్.ఓ. అధికారులు, జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థల ప్రముఖులను ఆరోగ్య సంక్షోభం మరియు ప్రస్తుత సవాళ్ళకు పరిష్కరాలు కనుగొనేదిశగా ఒకే వేదిక మీదకు తీసుకువచ్చారు.కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) తో కలిసి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డి.ఎస్.టి) యొక్క స్వయంప్రతిపత్తి సంస్థ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ (టిడిబి) దీనిని నిర్వహించింది.

 

--(Release ID: 1623412) Visitor Counter : 42