ప్రధాన మంత్రి కార్యాలయం
ఆత్మనిర్భర భారత్‌కు పిలుపునిచ్చిన ప్రథానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన ప్రధానమంత్రి
20 లక్షల కోట్ల రూపాయల సమగ్ర ప్యాకేజ్
ఈ ప్యాకేజ్ మొత్తం, భారతదేశ జిడిపిలో పదిశాతానికి సమానం
స్వావలంబన భారత్ కు ప్రధానమంత్రి పిలుపు. ఆత్మనిర్భర భారత్ కు సంబంధించి ఐదు స్తంభాల గూర్చి ప్రకటన
వివిధ రంగాలలో పెద్ద ఎత్తున సంస్కరణలు దేశాన్ని స్వావలంబన వైపు ముందుకు తీసుకువెళ్ళడానికి దోహదం చేస్తాయి: ప‌్రధానమంత్రి
మన స్థానిక ఉత్పత్తులకు మద్దతునిచ్చి , స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాలి : ప‌్రధానమంత్రి
Posted On:
12 MAY 2020 8:45PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటం సాగిస్తూ మరణించిన వారిని స్మరించుకుంటూ ప్రధానమంత్రి, కోవిడ్ -19 వల్ల ఉత్పన్నమైన సంక్షోభం వంటిది మున్నెన్నడూ లేదని అన్నారు. అయితే ఈ పోరాటంలో మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు, ముందుకు సాగిపోవలసి ఉందన్నారు.
స్వావంలంబ భారత్:
కోవిడ్ కు ముందు,కోవిడ్ అనంతర ప్రపంచం గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, 21 వ శతాబ్దపు భారతదేశ కలలను సాకారం చేసే దిశగా ముందుకు సాగాలంటే అందుకు మార్గం, దేశం స్వావలంబన సాధించేందుకు పూచీ పడడమేనన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవడం గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, పిపిఇ కిట్లు, ఎన్ -95 మాస్క్‌లకు సంబంధించిన ఉదాహరణను ప్రస్తావించారు. కోవిడ్ కు ముందు నామమాత్రంగా ఉన్న వీటి తయారీ ఇప్పడు రోజుకు 2 లక్షల ఉత్పత్తిస్థాయికి చేరిన విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు..
నేటి ప్రపంచీకరణ ప్రపంచంలో స్వావలంబనకు నిర్వచనం మారిపోయిందని అన్నారు. దేశం స్వావలంబన గురించి మాట్లాడిందంటే అది స్వీయ కేంద్రితంగా ఉండడానికి భిన్నమైనదని అన్నారు.ప్రపంచమంతా ఒక కుటుంబంగా భారతీయ సంస్కృతి భావిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశ ప్రగతి అంటే ఇది అందులో భాగమని, ఇది మొత్తం ప్రపంచ ప్రగతికి దోహదపడుతుందని ఆయన అన్నారు.మొత్తం మానవాళి అభివృద్ధికి భారతదేశం ఎంతో దోహదపడుతుందని ప్రపంచం విశ్వసిస్తున్నదని ఆయన పేర్కొన్నారు
స్వావలంబిత భారత్‌కు ఐదు స్తంభాలు:
కచ్ ప్రాంతాన్ని భూకంపం కుదిపివేసిన సమయాన్ని గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి, పట్టుదల, సంకల్పం తో తిరిగి ఆ ప్రాంతం మామూలు స్థితికి వచ్చి తన కాళ్ళమీద తాను నిలబడగలిగిందని చెప్పారు. ఇలాంటి పట్టుదలే ఇప్పడు దేశం స్వావలంబన సాధించేందుకు కావాలని ప్రధానమంత్రి సూచించారు.
స్వావలంబన తోకూడిన భారతదేశం ఐదు స్తంభాలపై నిలబడుతుందని ప్రధానమంత్రి చెప్పారు. అవి ఆర్థిక వ్యవస్థ- ఇది తాత్కాలిక మార్పు కాకుండా గొప్ప మార్పు తీసుకువస్తుంది. మౌలికసదుపాయాలు- ఇది భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉండబోతుంది. వ్యవస్జలు-21 వ శతాబ్దపు సాంకతిక పరిజ్ఞానం ఆధారంగా రూపుదిద్దుకున్న వ్యవస్థలకు ఏర్పాట్లు, చైతన్యవంతులైన జనాభా-ఇది స్వావలంబన భారత్‌కు శక్తిని సమకూరుస్తుంది. డిమాండ్- మనకున్న డిమాండ్, సరఫరా సప్లయ్ చెయిన్‌ను పూర్తి సామర్ద్యంతో ఉపయోగించుకోవాలి.
డిమాండ్‌ను పెంచడానికి , డిమాండ్ కు తగ్గ సరఫరాకు వీలుగా దీనితో సంబంధం ఉన్న సరఫరా చెయిన్‌ను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
ఆత్మనిర్భర భారత్ అభియాన్:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మనిర్భర భారత్‌కు పిలుపునిచ్చారు. అలాగే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారు. ఈ ప్యాకేజ్ , కోవిడ్ సంక్షోభం సందర్బంగా ప్రభుత్వం ప్రకటించినవి,రిజర్వు బ్యాంకు ప్రకటించినవి కలిపి సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు అవుతాయని ప్రధానమంత్రి చెప్పారు. ఇది భారతదేశే జి.డి.పిలో సుమారు 10 శాతంగా ఉంటుందని అన్నారు. ఈ ప్యాకేజ్ ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన మరింత ఊపునిస్తుందని ఆయన అన్నారు.
ఈ ప్యాకేజ్ భూమి, కార్మికులు, లిక్విడిటి, చట్టాలు ఇలా అన్ని అంశాలను పరిగణన లోకి తీసుకుంటుందన్నారు. కుటీర పరిశ్రమలు, ఎం.ఎస్.ఎం.ఇలు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలు, పరిశ్రమలవారు తదితర వర్గాల ప్రయోజనాలను తీర్చేదిగా ఉంటుందన్నారు. ఈ ప్యాకేజ్ స్వరూప స్వభావాలను రేపటినుంచి, రాబోయే కొద్ది రోజుల్లో ఆర్థిక మంత్రి వెల్లడిస్తారని ఆయన తెలియజేశారు.
గత ఆరు సంవత్సరాలలో తీసుకువచ్చిన జె.ఎ.ఎం , ఇతర సంస్కరణల సానుకూల ప్రభావం గురించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, దేశాన్ని స్వావలంబన సాధించేట్టు చేయడానికి పలు గొప్ప సంస్కరణలు అవసరమని, అప్పుడే కోవిడ్ సంక్షోభం వంటివాటి ప్రభావాన్ని భవిష్యత్తులో తిప్పికొట్టడానికి వీలుకలుగుతుందని అన్నారు. ఈ సంస్కరణలలో వ్యవసాయ రంగానికి సంబంధించి సరఫరా చెయిన్ సంస్కరణలు, హేతుబద్ద పన్ను విధానం, సులభమైన , స్పష్టమైన చట్టాలు, సమర్ధ మానవ వనరులు, బలమైన ఆర్థిక వ్యవస్జ ఉంటాయన్నారు. ఈ సంస్కరణలు వ్యాపారాన్ని ప్రోత్సహించి పెట్టుబడులను ఆకర్షించి మేక్ ఇన్ ఇండియాను మరింత బలోపేతం చేస్తాయన్నారు.
స్వావలంబన, దేశాన్ని ప్రపంచ సరఫరా గొలుసులో కఠినమైన పోటీకి సిద్ధం చేస్తుందని, ఈ పోటీలో దేశం గెలవడం చాలా ముఖ్యం అని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్యాకేజీని రూపొందించేటపుడు దీనిని గుర్తుంచుకోవడం జరిగిందన్నారు. ఇది వివిధ రంగాలలో సామర్థ్యాన్ని పెంచడమే కాక నాణ్యతకు కూడా హామీ ఇస్తుందన్నారు.
సంఘటిత, అసంఘటిత రంగాలలోని దేశానికి అందించిన సేవలను ప్రముఖంగా ప్రస్తావించిన పేదలు, కార్మికులు, వలస కార్మికులు, మొదలైనవారు సాధికారత సాధించడంపై కూడా ఈ ప్యాకేజీ దృష్టి సారిస్తుందని అన్నారు.
ప్రస్తుత సంక్షోభం స్థానిక తయారీ, స్థానిక మార్కెట్ , స్థానిక సరఫరా గొలుసుల ప్రాముఖ్యతను తెలియజెప్పిందని ప్రధానమంత్రి అన్నారు. సంక్షోభ సమయంలో మన డిమాండ్లన్నీ ‘స్థానికంగా’ నెరవేరాయి. ఇప్పుడు, స్థానిక ఉత్పత్తుల గురించి గట్టిగా చెప్పడానికి వాటికి మద్దతునివ్వడానికిఈ స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయికి ఎదిగేలా చేయడానికి సహాయపడే సమయం ఆసన్నమైంది అని ఆయన అన్నారు.
కోవిడ్ తో జీవనం:
వైరస్ చాలా కాలం మన జీవితంలో భాగంగా ఉండబోతుందని పలువురు నిపుణులు శాస్త్రవేత్తలు చెప్పారని ప్రధాని ప్రస్తావించారు. కానీ, మన జీవితం దాని చుట్టూ మాత్రమే తిరగకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యమని ఆయన అన్నారు. మాస్క్‌లు ధరించడం , ‘దో గజ్ దూరి’ పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు తమ లక్ష్యాలను చేరుకోవాలని కోరారు.
నాలుగవ దశ లాక్ డౌన్ గురించి మాట్లాడుతూ, దీనికి సంబంధించిన విధానాలు ఇప్పటివరకూ చూసిన దానికి పూర్తిగా భిన్నంగా ఉండబోతాయని ప్రధానమంత్రి అన్నారు. రాష్ట్రాలనుంచి వచ్చిన సిఫార్సులకు అనుగుణంగా నూతన నిబంధనలను రూపొందిస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మే 18వ తేదీకి ముందే తెలియజేయనున్నట్టు కూడా ప్రధానమంత్రి తెలిపారు.
(Release ID: 1623421)
Visitor Counter : 711
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam