సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

స్థానిక ముడి పదార్థాలను ఉపయోగించుకుని వ్య‌వ‌సాయ‌, మ‌త్స్య మరియు అట‌వీ ఎంఎస్‌ఎంఈలు త‌మ ఉత్పత్తుల్ని తయారు చేయాలిః మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఉద్ధాట‌న

Posted On: 12 MAY 2020 6:30PM by PIB Hyderabad

స్థానికంగా ల‌భించే ముడి పదార్థాలు ఉపయోగించి త‌మ ఉత్పత్తులను తయారు చేసేందుకు గ‌ల అవ‌కాశాల‌ను అన్వేషించాల‌ని వ్యవసాయ, మ‌త్స్య‌, అటవీ శాఖ‌ల ఎంఎస్‌ఎంఈలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ సూచించారు. ఎంఎస్‌ఎంఈలపై కోవిడ్ -19 ప్రభావంపై ఛాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో శ్రీ గ‌డ్క‌రీ వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ స్థానికంగా ల‌భించే ముడి పదార్థాలు ఉపయోగించి వారి ఉత్పత్తుల త‌యారీకి గ‌ల‌ అవ‌కాశాల్ని అన్వేషించాల‌ని సూచించారు. కొత్త గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు పారిశ్రామిక క్లస్టర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లాజిస్టిక్స్ పార్కులందు భవిష్యత్తులో మ‌రిన్ని పెట్టుబడులు పెట్టడానికి స‌రికొత్త అవ‌కాశాల్ని సృష్టిస్తాయ‌ని అన్నారు.
ప‌రిశ్ర‌మ‌ల వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గాలి..
పరిశ్రమల వికేంద్రీకరణపై కృషి చేయాల్సిన అవసరం ఉందని, దేశంలోని గ్రామీణ, ‌గిరిజన, వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి పెట్టాల్సి అవ‌స‌రం ఉంద‌ని ఆయన అభిప్రాయపడ్డారు. ప‌రిశ్ర‌మ ఎగుమతి మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని మంత్రి అన్నారు. ప్రపంచ మార్కెట్లో పోటీగా మారడానికి విద్యుత్ ఖర్చు, లాజిస్టిక్స్ ఖర్చు మరియు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి అవసరమైన పద్ధతులను అవలంబించాలని సూచించారు. దీనికి తోడు విదేశీ దిగుమతులను దేశీయ ఉత్పత్తితో భర్తీ చేయడానికి దిగుమతి ప్రత్యామ్నాయంపై కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జ్ఞానాన్ని సంపదగా మార్చడానికి పరిశ్రమలు ఆవిష్కరణ, వ్యవస్థాపకత, సైన్స్ అండ్ టెక్నాలజీ, పరిశోధనా నైపుణ్యం మరియు అనుభవాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఎంఎస్ఎంఈల రేటింగ్ వ్య‌వ‌స్థ‌లో త‌గిన
పారదర్శకతను తీసుకురావడానికి, ఫలితం ఆధారిత మరియు సమయ పరిమితి ప్రక్రియలను కలిగి ఉండటానికి ఐటీ ఆధారిత విశ్లేషణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఆలోచనలను ఏర్పాటు చేయాల‌ని మంత్రి కోరారు.
ఉత్త‌మ ప‌ద్ధ‌తుల‌పై అధ్య‌య‌నం జ‌ర‌గాలి..
భారతదేశంలో ఎంఎస్‌ఎంఈ స్థానాన్ని బలోపేతం చేయడానికి ప్రపంచంలోని ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాల‌ని కూడా మంత్రి కోరారు. ప్రాజెక్టుల వ్యయాన్ని లెక్కించేటప్పుడు, నిర్ణయం తీసుకోవడంలో సమయం యొక్క ప్రాముఖ్యతను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ఆయన నొక్కి చెప్పారు. కోవిడ్ -19 వ్యాప్తిని నివారించేందుకు అవసరమైన అన్ని ర‌కాల నివారణ చర్యలు తీసుకునేలా పరిశ్రమలు నిర్ధారించాల్సిన అవసరం ఉందని శ్రీ గడ్కరీ పరిశ్రమకు పిలుపునిచ్చారు. వ్యాపార కార్యకలాపాల సమయంలో సామాజిక దూర ప్రమాణాలను పాటించాలని ఆయ‌న ఉద్ఘాటించారు. వ్యక్తిగత జీవితంలో విరివిగా పీపీఈల‌ (ముసుగులు, శానిటైజర్ మొదలైనవి) వాడకాన్ని కూడా ఆయ‌న సూచించారు. సంక్షోభ‌పు ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్రజా జీవితాలను, జీవనోపాధికి భరోసానిచ్చేలా వాటాదారులందరూ సమగ్ర విధానాన్ని అవలంబించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సంక్షోభం నుండి బయటపడటానికి పరిశ్రమలు ఈ సమయంలో సానుకూల వైఖరిని కలిగి ఉండాలని శ్రీ గడ్కరీ కోరారు.
కోవిడ్‌తో క‌లిసి జీవించేలా జీవ‌న క‌ళ‌ను నేర్చుకోవాలి..
కోవిడ్ -19తో క‌లిసి జీవించేలా జీవన కళను నేర్చుకోవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. చైనా నుండి  జపాన్ పెట్టుబడులు తీసుకొని వేరే ప్రాంతాలకు వెళ్లడానికి జపాన్ ప్రభుత్వం తన పరిశ్రమల వారికి ప్రత్యేక ప్యాకేజీని అందించిందనే విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా మంత్రి గ‌డ్క‌రీ గుర్తు చేశారు. ఇది భారతదేశానికి ఇది ఒక స‌దావకాశమని, దానిని ఒడిసి పట్టుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప‌ర‌స్ప‌ర చ‌ర్చ‌లో కోవిడ్-19 మహమ్మారి కార‌ణంగా తాము ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ళ గురించి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు ప‌లు సూచనలు చేశారు. ఈ రంగంను స‌జీవంగా ఉంచ‌డానికి గాను ప్రభుత్వం నుంచి త‌గిన మద్దతును కోరారు.
ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా వెలుగులోకి వ‌చ్చిన వివిధ సమస్యలు మరియు సూచనలు ఇలా ఉన్నాయి:
ఎంఎస్ఎంఈ కేసుల ప‌రిష్కారానికి గాను ప్ర‌త్యేక ట్రైబ్యున‌ల్‌ను ఏర్పాటు చేయాలి- ఏడాది పాటు స‌ర్‌ఫైసీ చ‌ట్టాన్ని ప‌క్క‌న‌బెట్టాలి - ఎంఎస్ఎంఈ సంస్థ‌ల‌కు స‌రిప‌డా నిధుల ల‌భ్య‌త ఉండేలా త‌గిన ప్ర‌ణాళిక‌లు ఉండాలి - సంస్థ‌లు వ‌న‌రుల‌ను స‌మ‌ర్థ‌మంతంగా వినియోగించుకొనే విష‌యాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు గాను త‌గిన వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాలి - వ‌ల‌స కూలీలు సొంత ప్రాంతాల‌కు త‌ర‌లి పోయిన నేప‌థ్యంలో ఎద‌ర‌య్యే స‌వాళ్ల‌ను అధిగ‌మించేలా త‌గిన ప్ర‌ణాళికను తీసుకురావాలి - చౌక దిగుమతి ముప్పును పరిగణనలోకి తీసుకుని ఎంఎస్ఎంఈ త‌గిన ప్రొవిజ‌న్స్ ఏర్పాటు చేయాలి - జాప్యంతో నిలిచిపోయిన చెల్లింపులు జ‌ర‌పాలి - నిర‌ర్థ‌క ఆస్తుల‌కు సంబంధించిన ఖాతాల‌ను పున‌ర్నిర్మించాలి - బాహ్య రుణ రేటింగ్ మరియు బ్యాంక్ లోన్ కోసం సిబిల్ స్కోరు యొక్క అవసరాన్ని తొలగించాలి - ఎంఎస్ఎంఈకి అనుకూలంగా ఏదైనా కోర్టు నిర్ణయం ఇచ్చినట్లయితే ఎంఎస్ఎంఈల‌కు కి వ్యతిరేకంగా అప్పీల్ చేసే ఎంపికను తాత్కాలికంగా నిలిపి వేయాలి - ఉత్పత్తి కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొన్న తుది ఉత్ప‌త్తులకు స‌ప్ల‌యి గొలుసు స‌మ‌స్య‌లు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి - రిసీవ‌బుల్స్‌పై జీఎస్టీ వ‌ర్తింప‌జేయాలి - గ్రామీణ ప్రాంతాల‌లో ప‌రిశ్ర‌మ‌లను ప్రారంభించ‌డానికి వీలుగా వివిధ ర‌కాల డాక్యుమెంటేషన్ల‌ ఏర్పాటు
(భూ వినియోగ అనుమతి, అగ్నిమాపక విభాగం నుంచి ఎన్ఓసీ మొదలైనవి) చేయాలి - బ్యాంక్ గ్యారెంటీలో మార్జిన్ డబ్బు తీసుకోకపోవడం, వ్యయంపై శిక్షణ కోసం ప్రణాళిక, ఎంఎస్ఎంఈలో ఉత్తమ పద్ధతులు అవ‌లంభ‌న మొద‌లైన‌వి చేప‌ట్టాలి.
కోవిడ్ సంక్షోభం ముగిశాక‌ వ‌చ్చే అవ‌కాశాల్ని అందిపుచ్చుకోవాలి..
ప్రతినిధుల ప్రశ్నలకు శ్రీ గడ్కరీ స్పందిస్తూ ప్రభుత్వం నుండి సాధ్యమైనంత సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌ల దృష్టికి ఆయా సమస్యల్ని తీసుకు వెళ‌తామ‌ని తెలిపారు. కోవిడ్-19 సంక్షోభం ముగిసిన త‌రువాత ఏర్పడే అవకాశాలను ఒడిసి ప‌ట్టుకోనేందుకు పరిశ్రమలు సానుకూల విధానంలో ముందుకు సాగాల‌ని ఆయ‌న నొక్కి చెప్పారు.


(Release ID: 1623422) Visitor Counter : 256