ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారత ఆర్ధిక వ్యవస్థ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వ్యాపారాలకు, ముఖ్యంగా ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లకు సంబంధించిన ఉపశమనం మరియు రుణ మద్దతు కోసం చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు.

Ø   ఎమ్.ఎస్.ఎం.ఈ. లతో సహా వ్యాపారాలకు 3 లక్షల కోట్ల రూపాయల అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ సదుపాయం. 

Ø     ఒత్తిడికి గురైన ఎమ్.ఎస్.ఎమ్.ఈ.ల కోసం 20,000 కోట్ల రూపాయల సబార్డినేట్ ఋణం. 

Ø    ఎమ్.ఎస్.ఎమ్.ఈ. నిధి ద్వారా 50,000 కోట్ల రూపాయల ఈక్విటీ ఇన్ఫ్యూజన్. 

Ø  ఎమ్.ఎస్.ఎమ్.ఈ. కి కొత్త నిర్వచనం మరియు ఎమ్.ఎస్.ఎమ్.ఈ. కోసం ఇతర చర్యలు.  

Ø     200 కోట్ల రూపాయల వరకు  ప్రభుత్వ టెండర్లకు గ్లోబల్ టెండర్లు అవసరం లేదు. 

Ø  వ్యాపారం మరియు వ్యవస్థీకృత కార్మికులకు ఉద్యోగుల భవిష్యనిధి మద్దతును మరో మూడు నెలలపాటు, జూన్, జులై, ఆగష్టు, 2020 నెలల వేతనాలకు కొనసాగింపు.   

Ø  ఈ.పి.ఎఫ్.ఓ. పరిధిలోకి వచ్చే అన్ని సంస్థల యజమానులకు, ఉద్యోగులకు వచ్చే మూడు నెలలు ఈ.పి.ఎఫ్. చందా 12 శాతం నుండి 10 శాతానికి తగ్గింపు. 

Ø    &

Posted On: 13 MAY 2020 6:39PM by PIB Hyderabad

 

ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్రమోదీ నిన్న 20 లక్షల కోట్ల రూపాయలతో ప్రత్యేక ఆర్ధిక మరియు సమగ్ర ప్యాకేజీ ని ప్రకటించారు. ఇది భారత జి.డి.పి. లో 10 శాతానికి సమానం. "ఆత్మనిర్భర్ భారత్ అభియాన్" లేదా "స్వావలంబనతో కూడిన భారత ఉద్యమం" పేరు మీద ఆయన ఒక ప్రోత్సాహకరమైన పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ కి ఐదు స్తంభాలను కూడా ఆయన పేర్కొన్నారు.  ఆర్ధిక వ్యవస్థ, మౌలికసదుపాయాల, విధానం, శక్తివంతమైన జనాభా, డిమాండ్. 

కేంద్ర ఆర్ధికకార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ఈ రోజు ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నిన్న జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఒక సమగ్ర విధానాన్ని తెలియజేశారని పేర్కొన్నారు  కోవిడ్-19 కు వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా విస్తృతమైన సంప్రదింపుల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా ఆర్థిక ప్యాకేజీ పొందుపరచవలసిన విషయాలను ప్రధానమంత్రి స్వయంగా గణనీయమైన సమయాన్ని వెచ్చించిన అనంతరం నిర్ధారించినట్లు, ఆమె చెప్పారు

ముఖ్యంగా, ఒక స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడమే లక్ష్యంగా, ఈ ఆర్ధిక ప్యాకేజీని ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ గా వ్యవహరిస్తున్నట్లు  ఆమె తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ను నిర్మించడానికి అవసరమైన మూల స్థంభాల గురించి శ్రీ సీతారామన్ పేర్కొంటూ, భూమి, శ్రమ, ద్రవ్యత, చట్టం లపై మన దృష్టి సారించాలని అన్నారు. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం మనం చెప్పేది విని, ప్రతిస్పందించే ప్రభుత్వం అనీ, అందువల్ల 2014 నుండి చేపట్టిన కొన్ని సంస్కరణలను ఈ సందర్భంగా  గుర్తుచేసుకోవడం సముచితమనీ, ఆర్థిక మంత్రి అన్నారు. 

" 2020 వార్షిక బడ్జెట్ అయిన వెంటనే కోవిడ్-19 వచ్చింది. మొదటి దశ లాక్ డౌన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పి.ఎమ్.జి.కే.వై.) ని ప్రకటించడం జరిగింది." అని శ్రీమతి సీతారామన్ చెప్పారు.  ఈ ప్యాకేజీ పై మనం ముందుకు వెళ్తున్నామని ఆమె అన్నారు. 

"నిన్న ప్రధాని నిర్దేశించిన ఆత్మనిర్భర్ భారత్ కోసం ప్రధానమంత్రి దృష్టిని వివరించడానికి.  ఈ రోజు నుండీ, వచ్చే కొన్ని రోజుల పాటు, ఆర్ధిక మంత్రిత్వశాఖకు చెందిన మొత్తం బృందంతో నేను వస్తూ ఉంటాను." అని శ్రీమతి సీతారామన్ తెలియజేసారు. 

ఉద్యోగులుయజమానులువ్యాపారాలు, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో తిరిగి ఉత్పత్తి ప్రారంభించడానికి మరియు కార్మికులు లాభదాయకమైన ఉపాధికి తిరిగి రావడానికి వీలు కల్పిస్తూ, పనికి తిరిగి రావడంపై దృష్టి సారించిన చర్యలను శ్రీమతి నిర్మల సీతారామన్ ఈ రోజు ప్రకటించారు.  నాన్-బ్యాంకింగ్ ఆర్ధిక సంస్థలు (ఎన్.బిఎఫ్.సి.లు), గృహనిర్మాణ ఆర్ధిక సంస్థలు(హెచ్.ఎఫ్.సి.లు), సూక్ష్మ ఆర్ధిక రంగ, విద్యుత్ రంగాలను బలోపేతం చేసే ప్రయత్నాలను  కూడా వెల్లడించారు. వీటితో పాటు, వ్యాపారానికి పన్ను ఉపశమనం, ప్రభుత్వ సేకరణలో కాంట్రాక్టర్లకు కాంట్రాక్టు కట్టుబాట్ల నుండి ఉపశమనం మరియు రియల్ ఎస్టేట్ రంగానికి సమ్మతి ఉపశమనం కూడా ఉన్నాయి.

గత ఐదేళ్లలోపరిశ్రమల రంగం మరియు ఎం.ఎస్.ఎం.ఈ.ల  కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. రియల్ ఎస్టేట్ రంగానికిపరిశ్రమలో మరింత పారదర్శకత తీసుకురావడానికి రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) చట్టం [రెరా] 2016 లో అమలు చేయబడింది. ఈ విభాగంలో ఒత్తిడిని ఎదుర్కోవటానికి సరసమైన మరియు మధ్య ఆదాయ గృహనిర్మాణాల కోసం ప్రత్యేక నిధిని గత సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది.  ఏదైనా ప్రభుత్వ శాఖ లేదా ప్రభుత్వరంగ సంస్థల చెల్లింపులు ఆలస్యమైన పక్షంలో ఎం.ఎస్.‌ఎం.ఈ. లకు సహాయం చేయడానికి, 2017 లో సమాధాన్ పోర్టల్ ప్రారంభించడం జరిగిందిదేశంలో వ్యవస్థాపకత పెంచడానికి మరియు ఎం.ఎస్.‌ఎం.ఈ.లకు రుణాలు సక్రమంగా అందేలా సహాయపడటానికి వీలుగా  వివిధ ఇతర క్రెడిట్ గ్యారెంటీ పథకాలను ఎస్.ఐ.డి.బి.ఐ. కింద అంకురసంస్థల కోసం ఫండ్ అఫ్ ఫండ్స్ ను  ఏర్పాటు చేశారు.

ఈ క్రింది చర్యలను  ఈ రోజు ప్రకటించారు : -

1.    ఎంఎస్‌ఎంఇలతో సహా వ్యాపారాల కోసం 3 లక్షల కోట్ల రూపాయల ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీ :

వ్యాపారానికి ఉపశమనం కలిగించడానికి, 2020 ఫిబ్రవరి 29 తేదీ నాటికి, బకాయి పడ్డ రుణంలో 20 శాతాన్ని  అదనపు వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ గా వడ్డీ రేటు రాయితీ టర్మ్ లోన్ రూపంలో అందించబడుతుంది. ఈ సదుపాయాన్ని 25 కోట్ల రూపాయల వరకు బకాయి ఉన్న యూనిట్లకు మరియు 100 కోట్ల రూపాయల వరకు టర్నోవర్ ఉన్న యూనిట్లకు కలుగజేస్తారు.  యూనిట్లు తమ సొంత హామీ లేదా మరొకరితో కలిసి హామీ కానీ అందించాల్సిన అవసరం లేదు.  45 లక్షలకు పైగా ఎం.ఎస్.ఎం.ఇ. లకు మొత్తం 3.00 లక్షల కోట్ల రూపాయల  లిక్విడిటీని భారత ప్రభుత్వం 100% హామీ ఇస్తుంది.

2.    ఒత్తిడికి గురైన ఎమ్.ఎస్.ఎమ్.ఈ.ల కోసం 20,000 కోట్ల రూపాయల సబార్డినేట్ ఋణం. 

ఎన్‌.పి.ఎ. లేదా ఒత్తిడికి గురైన రెండు లక్షల ఎం.ఎస్.ఎం.ఇ. లకు 20,000 కోట్ల రూపాయల మేర సబార్డినేట్ అప్పు సదుపాయం కల్పించారు.  సూక్ష్మ, చిన్న సంస్థల క్రెడిట్ గారంటీ ట్రస్టు (సి.జి.టి.ఎం.ఎస్.ఈ .) కు  4,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం మద్దతు ఇస్తుంది.  అటువంటి ఎమ్.ఎస్.ఎం.ఈ.ల  ప్రమోటర్లకు  యూనిట్‌లో ప్రస్తుతం ఉన్న 15% వాటాకు సమానంగా గరిష్టంగా 75 లక్షల రూపాయలకు లోబడి బ్యాంకులు సబార్డినేట్-రుణాన్ని అందించాలని భావిస్తున్నాయి. 

3.    ఎం.ఎస్.ఎం.ఇ.  ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా 50,000 కోట్ల రూపాయల ఇన్ఫ్యూజన్: 

ఎస్‌ఎంఇలకు ఈక్విటీ ఫండింగ్ సహాయాన్ని అందించే 10,000 కోట్ల రూపాయల కార్పస్‌తో ప్రభుత్వం ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‌ను ఏర్పాటు చేస్తుంది.  ఫండ్ అఫ్ ఫండ్స్ ఒక తల్లి ద్వారా కానీ లేదా కొంతమంది కుమార్తెల ద్వారా కానీ నిర్వహించబడుతుంది.  కుమార్తె నిధుల స్థాయిలో 1: 4 పరపతితో, ఫండ్ అఫ్ ఫండ్స్ ఈక్వీటీని సుమారు 50,000 కోట్ల రూపాయలతో సమీకరించగలదని భావిస్తున్నారు.

4.    ఎమ్.ఎస్.ఎం.ఈ. క్రొత్త నిర్వచనం :

పెట్టుబడి పరిమితిని పెంచడం ద్వారా ఎమ్.ఎస్.ఎం.ఈ  యొక్క నిర్వచనం సవరించబడుతుంది.  టర్నోవర్ యొక్క అదనపు ప్రమాణాలు కూడా ప్రవేశపెట్టబడ్డాయి. తయారీ మరియు సేవా రంగాల మధ్య వ్యత్యాసం కూడా తొలగించబడుతుంది.

5.    ఎమ్.ఎస్.ఎం.ఈ. కోసం ఇతర చర్యలు :

వాణిజ్య ఉత్సవాలు మరియు ప్రదర్శనలకు బదులుగా ఎమ్.ఎస్.ఎం.ఈ. కోసం ఇ-మార్కెట్ అనుసంధానాలు ప్రోత్సహించబడతాయి. ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి ఎమ్.ఎస్.ఎం.ఈ. లకు రావలసిన బకాయిలు 45 రోజుల్లో విడుదల చేయబడతాయి

6.    200 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ టెండర్లకు  గ్లోబల్ టెండర్లు ఉండవు: 

200 కోట్ల కన్నా తక్కువ విలువైన వస్తువులు మరియు సేవల కోసం  గ్లోబల్ టెండర్ విచారణను అనుమతించని విధంగా ప్రభుత్వ సాధారణ ఆర్థిక నిబంధన1లు (జిఎఫ్ఆర్) సవరించబడతాయి.

7.    వ్యాపారం మరియు వ్యవస్థీకృత కార్మికులకు ఉద్యోగుల భవిష్య నిధి మద్దతు :

పిఎమ్‌జికెవైలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ఇపిఎఫ్‌కు యజమాని మరియు ఉద్యోగి తరఫున ఒక్కొక్కరికి  జీతంలో 12% భారత ప్రభుత్వం ఇస్తుంది.  ఈ మద్దతును మరో మూడు నెలలపాటు, జూన్, జులై, ఆగష్టు, 2020 నెలల వేతనాలకు కొనసాగిస్తారు.     మొత్తం ప్రయోజనాలు 72.22 లక్షల మంది ఉద్యోగులకు 2500 కోట్ల రూపాయల మేర ఉంటుంది. 

8.    యజమానులు మరియు ఉద్యోగులకు 3 నెలల పాటు ఇపిఎఫ్ చందా తగ్గించడుతుంది. 

ఈ.పి.ఎఫ్.ఓ. పరిధిలోకి వచ్చే అన్ని సంస్థల యజమానులకు, ఉద్యోగులకు వచ్చే మూడు నెలలు చట్టబద్ధమైన పి.ఎఫ్. చందా 12 శాతం నుండి 10 శాతానికి తగ్గించారు.  ఇందుకోసం నెలకు సుమారు 2250 కోట్ల రూపాయల మేర నిధులు  కేటాయిస్తారు. 

9.    ఎన్.బి.ఎఫ్.సి./హెచ్.ఎఫ్.సి./ఎమ్.ఎఫ్.ఐ. లకు 30,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ పధకం. 

ఆర్‌బిఐ అందించే లిక్విడిటీ సహాయంతో ప్రభుత్వం  30,000 కోట్ల రూపాయలతో  ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని ప్రారంభించనుంది.  ఎన్‌బిఎఫ్‌సిలు, హెచ్‌ఎఫ్‌సిలు మరియు ఎంఎఫ్‌ఐల ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ ఋణ పేపర్‌లో ప్రాధమిక మరియు ద్వితీయ మార్కెట్ లావాదేవీలలో పెట్టుబడులు పెట్టబడతాయి.  దీనికి భారత ప్రభుత్వం 100 శాతం హామీ ఇస్తుంది.

10.    ఎన్.బి.ఎఫ్.సి./ఎమ్.ఎఫ్.ఐ.రుణాలకు 45,000 కోట్ల రూపాయల పాక్షిక క్రెడిట్ హామీ పధకం 2.0  

ప్రస్తుతం ఉన్న పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ పథకం పునరుద్ధరించబడింది. ఇప్పుడు తక్కువ రేటుతో ఉన్న ఎన్‌బిఎఫ్‌సిలు, హెచ్‌ఎఫ్‌సిలు మరియు ఇతర మైక్రో ఫైనాన్స్ సంస్థలు (ఎంఎఫ్‌ఐ) రుణాలు తీసుకోవడానికి విస్తరించబడతాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు 20 శాతం మొదటి నష్ట సార్వభౌమ హామీని భారత ప్రభుత్వం   ఇస్తుంది.

11.   డిస్కామ్ లకు 90,000 కోట్ల రూపాయల లిక్విడిటీ ఇంజక్షన్ :

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ రెండు సమాన వాయిదాలలో 90,000 కోట్ల  రూపాయల మేర డిస్కమ్స్‌లో ద్రవ్యతను నింపుతాయి. ఈ మొత్తాన్ని ట్రాన్స్మిషన్ మరియు జనరేషన్ కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడానికి  డిస్కామ్స్  ఉపయోగించుకుంటాయి. తుది వినియోగదారులకు వారి స్థిర ఛార్జీలకు ఉపశమనం కలిగించే షరతుపై, సి.పి.ఎస్.‌ఇ.  జెన్‌కోలు డిస్కమ్‌లకు రిబేటును ఇస్తాయి

12.    కాంట్రాక్టర్లకు ఉపశమనం :

ఈ.పి.సి. మరియు రాయితీ ఒప్పందాలతో సహా ఒప్పంద బాధ్యతలను పూర్తి చేయడానికి రైల్వేలు, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, సి.పి.డబ్ల్యూ.డి. వంటి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఆరు నెలల గడువు పొడిగిస్తాయి. 

13.  రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఉపశమనం : 

ఆర్.ఈ.ఆర్.ఏ.  కింద ఫోర్స్ మేజూర్ నిబంధనను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. రిజిస్టర్ అయిన అన్ని ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ మరియు పూర్తి చేసే తేదీ గడువును ఆరు నెలల పాటు పొడిగించారు.    రాష్ట్ర పరిస్థితి ఆధారంగా మరో 3 నెలలు పొడిగించవచ్చు.  ఆర్.ఈ.ఆర్.ఏ. కింద వివిధ చట్టబద్ధమైన ఒప్పందాలు కూడా పొడిగించబడతాయి. 

14.    వ్యాపారానికి పన్ను ఉపశమనం :

స్వచ్చంద సంస్థలుకార్పొరేట్ కాని వ్యాపారాలు మరియు యాజమాన్య, భాగస్వామ్యం మరియు ఎల్‌.ఎల్.పి.లు మరియు సహకార సంస్థలతో సహా అన్ని వృత్తులకు పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను వాపసు వెంటనే జారీ చేయబడుతుంది.

15.   పన్ను కు సంబంధించిన చర్యలు : 

·  "టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్" మరియు "టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్" రేటు లో తగ్గింపు" -  వేతనాల చెల్లింపులు కాని  నివాసితులకు టి.డి.ఎస్. రేట్లు,  టి.సి.ఎస్. రేట్లు 2020-21 ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన కాలానికి నిర్ణీత రేట్లపై 25 శాతం మేర తగ్గుతాయి.  ఇందుకోసం 50,000 కోట్ల రూపాయల మేర ద్రవ్యతను కేటాయించారు 

·     2020-21 మదింపు సంవత్సరానికి అన్ని రకాల ఆదాయపన్ను రిటర్న్ దాఖలుకు గడువు తేదీని 2020 నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు.  అదేవిధంగా టాక్స్ ఆడిట్ గడువును కూడా 2020 అక్టోబర్ 31వ తేదీకి పొడిగించారు

·       "వివాద్ సే విశ్వాస్" పధకం కింద ఎటువంటి అదనపు చార్జి లేకుండా చెల్లింపుకు గడవును 2020 డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించారు

****(Release ID: 1623712) Visitor Counter : 558