రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మిషన్ సాగర్: మాల్దీవులకు ఆహార ప‌దార్థాల‌ను అంద‌జేసిన‌ ఐఎన్ఎస్ కేసరి నౌక‌

Posted On: 12 MAY 2020 6:59PM by PIB Hyderabad

'మిషన్ సాగర్'లో భాగంగా, భారతీయ నావికాదళపు నౌక‌ కేసరి ఈ నెల 12న మాల్దీవుల్లోని పోర్ట్ ఆఫ్ మాలేలోకి ప్రవేశించింది. స్నేహ పూర్వక విదేశాలకు భారత ప్రభుత్వం సహాయం అందిస్తూ వ‌స్తోంది. ఈ దిశగానే ఐఎన్‌ఎస్ కేసరి నౌక మాల్దీవుల‌లోని ప్రజల కోసం 580 టన్నుల ఆహార సామ‌గ్రిని తీసుకువెళ్లింది. ఈ ప్రాంతంలోని కోవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో.. సామాజిక దూరపు నిబంధనలు అమ‌లులో ఉన్న దృష్ట్యా మే 12వ తేదీన‌ ఆన్‌లైన్ ద్వారా ఆహార సామ‌గ్రి హ్యాండ్‌వేర్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్, రక్షణ మంత్రి మరియా అహ్మద్ దీదీలు పాల్గొన్నారు.
భార‌త్ త‌రపున మాల్దీవులకు భారత హై కమిషనర్ సుంజయ్ సుధీర్ ఈ కార్య‌క్ర‌మానికి ప్రాతినిధ్యం వహించారు. భారతదేశం అందించిన సహాయాన్ని విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఈ సంద‌ర్భంగా ప్రశంసించారు. సాగ‌ర్ ప్రాంతంలో ఉన్న అంద‌రి భ‌ద్ర‌త, అభివృద్ధికి సంబంధించి ప్ర‌ధాన మంత్రుల విజన్‌తో పాటు భార‌త్ పోరుగు దేశాల‌కు ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త విధానం రెండింటిలోనూ మాల్దీవులు ప్ర‌ముఖంగా నిలుస్తున్నందున భార‌త్ ఆహార ప‌దార్థాల‌తో కూడిన నౌక‌ను ఇక్క‌డ‌కు పంపింది. దేశ రక్షణ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖలు మరియు భారత ప్రభుత్వంలోని ఇతర ఏజెన్సీల సన్నిహిత సమన్వయంతో ఈ మిషన్ ముందుకు సాగింది. మాల్దీవులతో సహా వివిధ విదేశాల నుండి భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించడం లక్ష్యంగా చేప‌ట్టిన స‌ముద్ర సేతు అప‌రేష‌న్‌కు సామిప్య‌త‌తో మిషన్ సాగ‌ర్ కార్య‌క్ర‌మం కొన‌సాగింది. స‌ముద్ర సేతు ఆప‌రేష‌న్‌లో భాగంగా మొత్తం 900 మంది భారతీయ పౌరులను ఐఎన్ఎస్ జలాశ్వా మరియు ఐఎన్ఎస్ మాగర్ నౌక‌ల‌లో వరుసగా ఈ నెల 08, 10వ తేదీన స్వదేశానికి రప్పించ‌డం జ‌రిగింది. భారతదేశం మరియు మాల్దీవులు  సన్నిహిత సముద్ర పొరుగువారిగా బలమైన మరియు అత్యంత స్నేహపూర్వక రక్షణ మరియు దౌత్య సంబంధాలను క‌లిగి ఉన్నాయి. 


(Release ID: 1623397) Visitor Counter : 347