జల శక్తి మంత్రిత్వ శాఖ

2022 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీటి సరఫరా చేయనున్న - జమ్మూ, కశ్మీర్ ప్రభుత్వం.

Posted On: 13 MAY 2020 1:14PM by PIB Hyderabad

జల్ జీవన్ మిషన్ (జే.జే.ఎమ్.) పధకం కింద 2022 డిసెంబర్ నాటికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ నీటి కుళాయి కనెక్షన్ సౌకర్యం కల్పించాలని జమ్మూకశ్మీర్ యోచిస్తోంది ప్రస్తుత సంవత్సరంలో, గంధర్బల్, శ్రీనగర్రైసి మూడు జిల్లాల్లోని 5,000 గ్రామాలలో నూరు శాతం పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది

జె.జె.ఎం. కింద ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీటిని సరఫరా చేయలనేలక్ష్యాన్ని సాధించడానికి త్రాగునీరు, పారిశుధ్య శాఖ నిన్న  ఒక కార్యాచరణ ప్రణాళికను సమర్పించింది. ఈ కేంద్రపాలితప్రాంతంలో 18.17 లక్షల గృహాలు ఉండగా, వీటిలో 5.75 లక్షల గృహాలకు ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ (ఎఫ్.హెచ్.టి.సి.) సహాయంతో ఇప్పటికె  నల్లా 

కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన గృహాలలో 1.76 లక్షల గృహాలకు 2020-21 కల్లా పూర్తిచేయాలని జమ్మూకశ్మీర్ ప్రణాళిక  యోచిస్తోంది

జమ్మూ కాశ్మీర్, ఈ ఆర్ధిక సంవత్సరంలో జె.జె.ఎం. కింద కేంద్ర వాటాగా 680 కోట్ల రూపాయల నిధులు పొందే అవకాశం ఉంది.  భౌతికఆర్ధిక పనితీరు ఆధారంగా జమ్మూ,కశ్మీర్ కు అదనపు కేటాయింపు పొందేందుకు కూడా అర్హత ఉందిజాతీయ స్థాయి లక్ష్యమైన 2024-25 కంటే ముందుగానే 2022 డిసెంబర్ కల్లా నూరు శాతం కవరేజ్ సాధించాలని కేంద్రపాలితప్రాంతం యంతాంగం యోచిస్తోందిఈ విధంగా చేయడం ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ టాప్ కనెక్షన్ ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న రాష్ట్రాలకు జమ్మూకాశ్మీర్ ఒక ప్రముఖ ఉదాహరణగా నిలువనుంది. 

మొత్తం 98 నీటి పరీక్ష ప్రయోగశాలల్లో, 10 ప్రయోగశాలలకు ఈ ఏడాది ఎన్.ఏ.బి.ఎల్. నుండి గుర్తింపు పొందాలని కేంద్రపాలిత ప్రాంతం కృషి చేస్తోందిదిద్దుబాటు చర్యలు తీసుకోడానికి వీలుగా నీటి నాణ్యతను పరీక్షించేందుకు కమ్యూనిటీ స్థాయిలో ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ అందజేయనున్నారు.  నాలుగు నాణ్యత ప్రభావిత నివాస ప్రాంతాల్లో త్రాగునీటిని అందించడానికి జమ్మూ,కశ్మీర్ పాలనా యంత్రాంగం చర్యలు తీసుకుంది.  యాజమాన్య భావాన్ని పెంపొందించి, సంఘాన్ని సమీకరించడానికి వీలుగా గ్రామ స్థాయి నీరు మరియు పారిశుధ్య కమిటీలను ఏర్పాటు చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. గ్రామాల కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికల ఆధారంగా తుది కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు.   

కోవిడ్-9 మహమ్మారి నెలకొన్న ఈ పరీక్ష సమయంలో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌లను అందించడానికి చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా మహిళలు, బాలికల జీవన సౌలభ్యాన్ని ఖచ్చితంగా మెరుగుపరుస్తాయి.  వారి కష్టాలను తగ్గించి, వారు సురక్షితంగా, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి దోహదపడతాయి. 

దేశంలోని ప్రతి గ్రామీణ గృహాలకు  సరసమైన మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన తక్కువ ఛార్జీలతో,  సూచించిన నాణ్యతలో తగినంత పరిమాణంలో త్రాగునీటి కోసం ఎఫ్.హెచ్.‌టీ.సీ.ని అందించడమే ‘జల్ జీవన్ మిషన్’ (జె.జె.ఎం.) లక్ష్యం కాగా అది వారి జీవన ప్రమాణాలలో మెరుగుదలకు దారితీస్తుంది. 

కోవిడ్-19 నెలకొన్న ప్రస్తుత పరిస్థితిల్లో, గ్రామీణ గృహాల్లో ప్రాధాన్యత ప్రాతిపదికన నల్లా కనెక్షన్‌లను అందించాలని, కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.  తద్వారా, గ్రామీణ ప్రజలు పబ్లిక్ స్టాండ్-పోస్టుల నుండి నీటిని తీసుకురావడం మరియు పొడవైన క్యూలో నిలబడటం వంటి కష్టాలను ఎదుర్కొనవలసిన అవసరం ఉండదు.  సమాజంలోని పేద మరియు అట్టడుగు వర్గాలకు వారి ఇంటి ప్రాంగణంలో నల్లా కనెక్షన్ల ద్వారా నీటి సరఫరాను అందించడం ద్వారా, కోవిడ్-19 మహమ్మారి కారణంగా గ్రామీణ ప్రజలు కష్టాల బారిన పడకుండా సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం భావిస్తోంది. గ్రామాల్లో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లను అందించడంతో పాటు స్థానిక ప్రజలు, వలస కార్మికులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం అనే జంట లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశ్యంతో,  తాగునీటికి సంబంధించిన పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం తగిన సూచనలు జారీ చేసింది. 

ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్లు కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రతి గ్రామంలోనూ నీటి సరఫరా పధకాలు ఉన్న రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరుపుతూ గత 3 నెలలుగా సవివరమైన కృషి కొనసాగుతోంది. 

*****(Release ID: 1623543) Visitor Counter : 72