PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 23 JUN 2020 6:26PM by PIB Hyderabad

Coat of arms of India PNG images free download

 

(కోడ్-19కు సంబంధించి గత 24 గంటల్లో జారీ చేసిన పత్రికా ప్రకటనలతోపాటు

పీఐబీ వాస్తవాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్యమ‌వుతాయి)

పత్రికా సమాచార సంస్థ

సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం

 

కోవిడ్‌-19పై కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ తాజా సమాచారం: ప్రపంచంలో ప్రతి లక్ష జనాభాకు మరణాలు అత్యల్పంగాగల దేశాల్లో భారత్‌ ఒకటి

ప్రపంచంలో కోవిడ్‌-19 మరణాలు అత్యల్పంగాగల దేశాల్లో భారత్‌ ఒకటని 2020 జూన్‌ 22నాటి “ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్థాయీ నివేదిక-154” స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలో ప్రతి లక్ష జనాభాకు మృతుల సంఖ్య సగటున 1.00 కాగా, అంతర్జాతీయ సగటు ఆరు రెట్లకన్నా అధికంగా 6.04గా నమోదైంది. ఈ నివేదిక ప్రకారం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (UK) లో ప్రతి లక్షమందికి మృతులు 63.13 కేసులు నమోదు కాగా- స్పెయిన్‌, ఇటలీ, అమెరికా దేశాల్లో వరుసగా 60.60; 57.19; 36.30గా ఉన్నాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YXC5.jpg

దేశంలో కోలుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ 56.38 శాతానికి చేరింది. ఈ మేరకు గడచిన 24 గంటల్లో 10,994 మంది కోలుకోగా, వ్యాధి నయమైనవారి సంఖ్య 2,48,189కి పెరిగింది. ప్రస్తుతం 1,78,014 మంది చురుకైన వైద్య పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇక వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ప్రభుత్వ రంగంలో 726, ప్రైవేటు రంగంలో 266 (మొత్తం 992) ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633677

 

కోవిడ్-19పై పోరుకోసం పీఎం కేర్స్ నిధి తోడ్పాటుతో 50,000 మేడ్‌ ఇన్ ఇండియా వెంటిలేటర్లు

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాల నిర్వహ‌ణ‌లోని కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులకు 50,000 ‘మేడ్-ఇన్-ఇండియా’ వెంటిలేటర్ల సరఫరా కోసం రూ.2,000 కోట్లు, వలస కార్మికుల‌ సంక్షేమానికి మ‌రో రూ.1,000 కోట్లు వంతున ‘పీఎం కేర్స్‌’ నిధి ట్రస్ట్ కేటాయించింది. ఈ 50,000 వెంటిలేట‌ర్లలో భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 30,000 మేర ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటిదాకా త‌యారైన 2,923 వెంటిలేట‌ర్లలో 1,340 వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆస్పత్రుల‌కు అందాయి. వీటిని అందుకున్న ప్రధాన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర (275), ఢిల్లీ (275), గుజరాత్ (175), బీహార్ (100), కర్ణాటక (90), రాజస్థాన్ (75) ఉన్నాయి. కాగా, 2020 జూన్ ఆఖ‌రుక‌ల్లా మరో 14,000 వెంటిలేటర్లను ఇత‌ర రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేస్తారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633552

 

కోవిడ్‌-19ను సామాజిక భాగస్వామ్యం, డిజిటల్‌ చర్యలతో దీటుగా ఢీకొంటున్న ఒడిషా

కోవిడ్‌-19పై పోరాటంలో ఒడిషా ప్రభుత్వం సమాచార సాంకేతికతను చురుగ్గా వినియోగిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని స్థానిక సర్పంచులకు సాధికారత కల్పించడంతోపాటు సామాజిక భాగస్వామ్యం ద్వారా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది నైపుణ్య వికాసానికి వీలు కల్పిస్తూ దుర్బల వర్గాలకు రక్షణ కల్పిస్తోంది. దీంతో వ్యాధివ్యాప్తితోపాటు మరణాల శాతం కూడా తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని కీలక చర్యలలో: ‘సచేతక్‌’ యాప్‌తో వృద్ధ పౌరులకు, ఇతర వ్యాధులున్నవారికి మద్దతివ్వడం; సమర్థ పర్యవేక్షణ కోసం సర్పంచులుకు సాధికారత కల్పించడం; ఫోన్‌ వైద్యసేవల విస్తరణ; వైద్య సిబ్బంది నైపుణ్య వికాసానికి తోడ్పాటు ఇవ్వడం వంటివి కీలకంగా ఉన్నాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633697

 

కోవిడ్‌-19పై పోరులో భాగంగా ఇతర వ్యాధులున్న వారిపై నిశిత దృష్టి, పటిష్ఠ నియంత్రణతో పంజాబ్‌లో కోలుకునేవారి శాతం పెరుగుదల

వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో పంజాబ్‌ ప్రభుత్వం గణనీయ ప్రగతి సాధించింది. ఆ మేరకు రాష్ట్రంలో కోలుకునేవారి శాతం స్థిరంగా పెరుగుతోంది. ఈ దిశగా అనుసరిస్తున్న బహుముఖ వ్యూహంలో భాగంగా నియంత్రణ జోన్లలోని అధికముప్పు/దుర్బల జనాభాను ప్రభుత్వ నిర్బంధ వైద్య శిబిరాలకు తరలించడంపై ప్రధానంగా దృష్టి సారించింది. మొత్తంమీద పంజాబ్‌ ప్రభుత్వం కఠిన నియంత్రణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. నియంత్రణ జోన్లను ఒకటి/రెండు వీధులుగా, తాలూకా లేదా సొసైటీలుగా స్పష్టమైన విభజన చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 19 నియంత్రణ జోన్లను ప్రకటించి 25,000 జనాభాను నియంత్రిస్తోంది. ఇందులో భాగంగా కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడం కోసం ‘ఘర్‌ ఘర్‌ నిగ్రాణీ’ పేరిట ఒక మొబైల్‌ యాప్‌ను పంజాబ్‌ ప్రభుత్వం ప్రారంభించింది. అలాగే కేసులను త్వరగా కనుగొనడం, సకాలంలో పరీక్ష నిర్వహణ దిశగా ‘ఆశా’ కార్యకర్తల/సామాజిక స్వచ్ఛంద సేవకుల సాయంతో ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. అంతేకాకుండా రోజుకు 8,000 నమూనాలదాకా పరీక్షించేలా ప్రయోగశాల సదుపాయాలను గణనీయంగా పెంచింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633471

 

కోవిడ్‌-19కు చికిత్సపై పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనలపై వివరణ కోరాం: ఆయుష్‌ మంత్రిత్వశాఖ

కోవిడ్‌-19ను నయం చేయగల ఆయుర్వేద ఔషధాన్ని అభివృద్ధి చేసినట్లు హరిద్వార్‌లోని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ సంస్థ పత్రికా, ప్రసారమాధ్యమాల్లో ప్రకటించడాన్ని గమనించినట్లు కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే, ఆ ప్రకటనలోని వాస్తవాలు, ఔషధ సంబంధ శాస్త్రీయ అధ్యయనం వివరాలు తమకు అందలేదని పేర్కొంది. అటువంటి ఔషధ సంబంధ వాణిజ్య ప్రకటనలు “డ్రగ్స్‌ అండ్‌ మేజిక్‌ రెమెడీస్‌ (అబ్జెక్షనబుల్‌ అడ్వర్టయిజ్‌మెంట్స్‌) చట్టం-1954లోని నిబంధనల కింద నియంత్రణలో ఉంటాయని సదరు సంస్థకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. కోవిడ్‌-19పై ఆయుష్‌ ఆవిష్కరణలు/ఔషధాలకు సంబంధించి ప్రభుత్వం గజిట్‌ ప్రకటనద్వారా నిర్దేశించిన నిబంధనల ప్రకారం పరిశోధన-అధ్యయనాలు సాగాల్సి ఉంటుందని పేర్కొంది.  ఆ మేరకు పైన పేర్కొన్న వార్తల విషయంలోనేగాక వాస్తవాల పరిశీలనపై మంత్రిత్వశాఖకు అవసరమైన వివరాలను అందించాల్సిందిగా పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ సంస్థను కోరినట్లు తెలిపింది. తదనుగుణంగా సదరు ఔషధం పేరు, తయారీకోసం వాడిన ముడిపదార్థాల వివరాలు, కోవిడ్‌-19 చికిత్సలో ఈ ఔషధంతో ప్రయోగాలు నిర్వహించిన ప్రదేశాలు/ఆస్పత్రులు, ప్రయోగ నమూనాల సంఖ్య, వ్యవస్థాగత నైతిక కమిటీ అనుమతి, సీటీఆర్‌ఐ రిజిస్ట్రేషన్‌, అధ్యయన ఫలితాల సమాచారం వంటివన్నీ తక్షణం మంత్రిత్వశాఖకు అందించాలని ఆదేశించినట్లు వెల్లడించింది. ఇవన్నీ అందిన తర్వాత పూర్తిస్థాయిలో పరిశీలన ముగిసేవరకూ ప్రకటనలు/ప్రచారాన్ని ఆపాల్సిందిగా సంస్థను ఆదేశించింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633737

 

దేశంలో ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలతో మెరుగుపడిన ఆర్థిక సూచీలు

దేశ ప్రజల ప్రాణరక్షణకు ప్రథమ ప్రాధాన్యం దిశగా “ప్రాణముంటేనే ప్రపంచం ఉంటుంది” అన్న నానుడి మేరకు కోవిడ్‌-19 వ్యాప్తిని ఆరంభ దశలోనే నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి 24 నుంచి 21 రోజులపాటు దేశవ్యాప్త దిగ్బంధం ప్రకటించింది. అయితే, కఠిన దిగ్బంధం, సామాజిక దూరం చర్యలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపాయి. అటుపైన క్రమంగా “ప్రాణాలతోపాటు-ప్రపంచం” వైపు వ్యూహాన్ని మార్చుకుంటూ ప్రజల ప్రాణరక్షణసహా జీవనోపాధికి భద్రత కల్పించేందుకు సిద్ధమైంది. ఆ మేరకు జూన్‌ 1 నుంచి దశలవారీగా వ్యాపారాలు, సేవలన పునఃప్రారంభిస్తూ దిగ్బంధ విముక్తి మార్గంలోకి భారత్‌ ప్రవేశించింది. తదనుగుణంగా వీలైనంత వేగంగా నష్టభయాన్ని కనిష్ఠస్థాయికి తగ్గిస్తూ ఆర్థిక వ్యవస్థకు క్రమానుగత పునరుత్తేజం కల్పిస్తూ ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు కచ్చితమైన స్వల్ప-దీర్ఘకాలిక చర్యలు తీసుకున్నాయి. మరోవైపు ఆర్థిక పునరుజ్జీవనం మే, జూన్‌ నెలల్లో చిగుళ్లు తొడగడాన్ని విద్యుత్‌, ఇంధన వినియోగం, రాష్ట్రాల్లో-రాష్ట్రాల మధ్య వస్తు రవాణా, చిల్లర ఆర్థిక లావాదేవీలు పుంజుకోవడం వంటి రూపాల్లో సూచీలు నిరూపించాయి. ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయిలో ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన వ్యవసాయ రంగం ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టనుంది. ఇక భారత తయారీ రంగం కూడా పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచింది. ఆ మేరకు వ్యక్తిగత రక్షణ సామగ్రి తయారీలో శూన్యస్థాయినుంచి కేవలం 2 నెలల్లోనే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉత్పత్తిదారు స్థాయికి ఎదిగింది.

మరిన్ని వివరాలకుhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633717

 

ఎంఎస్‌ఎంఈలు, ఎన్‌బీఎఫ్‌సీలపై ప్రభుత్వ పథకాలతో గణనీయ సానుకూల ప్రభావం

ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చొరవ ఫలితంగా ఆ రంగంలో ప్రగతి వేగం పుంజుకుంది. ప్రభుత్వ హామీగల అత్యవసర దశలవారీ రుణ విధానం నేపథ్యంలో ప్రభుత్వ-ప్రైవేటు రంగ బ్యాంకులు 2020 జూన్‌ 20నాటికి ఎంఎస్‌ఎంఈలకు రూ.79,000 కోట్ల మేర రుణాలు మంజూరు చేశాయి. ఇందులో రూ.35,000 కోట్లకుపైగా ఇప్పటికే విడుదలైంది. ఇది కాకుండా రిజర్వుబ్యాంకు 2020 మార్చి-ఏప్రిల్‌ నెలల్లో ప్రకటించిన ప్రత్యేక ద్రవ్యలభ్యత సదుపాయం కింద ఎంఎస్‌ఎంఈలకు, చిన్న రుణగ్రహీతలకు రుణాల మంజూరు కోసం ఎన్‌బీఎఫ్‌సీలకు, సూక్ష్మరుణ సహాయ సంస్థలకు-బ్యాంకులకు రూ.10,220 కోట్లకుపైగా నిధులను ‘సిడ్బి’ అందజేసింది. మరోవైపు జాతీయ గృహనిర్మాణ బ్యాంకు (NHB) తనకు నిర్దేశించిన రూ.10,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని గృహనిర్మాణ ఆర్థిక సహాయ సంస్థలకు విడుదల చేసింది. ప్రస్తుతం రూ.30,000 కోట్లకుపైగా నిధులతో కొనసాగుతున్న వివిధ పథకాలకు అదనంగా సిడ్బి, ఎన్‌హెచ్‌బీలు పునఃరుణ సదుపాయం అందించాయి.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633687

 

ప్రభుత్వ ఈ-మార్కెటింగ్‌ వేదిక (GeM)పై మేక్‌ ఇన్‌ ఇండియా, స్వయం సమృద్ధ భారతం కింద ప్రోత్సాహం కోసం విక్రేతలు తయారీ దేశం వివరాలు వెల్లడించాలి

కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రత్యేక ప్రయోజన సంస్థ ‘ప్రభుత్వ ఈ-మార్కెటింగ్‌ వేదిక’ (GeM) లో ప్రవేశించే విక్రయ సంస్థలు తమ కొత్త ఉత్పత్తులను నమోదు చేసేముందు వాటి తయారీ దేశం వివరాలు వెల్లడించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. అంతేకాకుండా ఈ కొత్త పద్ధతి అమలుకు ముందే జీఈఎంలో అప్‌లోడ్‌ చేసిన తమ ఉత్పత్తుల తయారీ దేశాల వివరాలను పొందుపరచాలని ఆయా సంస్థలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపింది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘స్వయం సమృద్ధ భారతం’ దిశగా ప్రోత్సహించడం లక్ష్యంగా జీఈఎం ఈ గణనీయ చర్యకు శ్రీకారం చుట్టింది. అలాగే ఆయా ఉత్పత్తుల తయారీలో వాడిన దేశీయ పదార్థాల శాతం వివరాలను కూడా సూచించాలన్న నిబంధనను ప్రవేశపెట్టింది. దీంతో అన్ని వస్తువులకు సంబంధించి తయారీ దేశం, వాటిలో వాడిన దేశీయ పదార్థాల వివరాలు స్పష్టం వెల్లడవుతాయి. ఈ పోర్టల్లో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఫిల్టర్‌ ప్రవేశపెట్టడం అన్నిటికన్నా ముఖ్యాంశం.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633636

 

భారతీయ ముస్లింలు ఈ ఏడాది హజ్‌-2020 కోసం సౌదీ అరేబియా వెళ్లరు

ఈ సంవత్సరం భారతీయ ముస్లింలు హజ్‌ యాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లరాదని నిర్ణయించినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఇవాళ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరోనా వైరస్‌ మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించడంతోపాటు ప్రజల ఆరోగ్యం-శ్రేయస్సు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈసారి భారత్‌ నుంచి హజ్‌ యాత్రికులను పంపవద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి అందిందని ఆయన చెప్పారు. ఈ మేరకు సౌదీ అరేబియా హజ్‌-ఉమ్రా మంత్రి డాక్టర్‌ మొహమ్మద్‌ సలేహ్‌ బిన్‌ తాహెర్‌ బెంతెన్‌ నిన్న ఫోన్‌ద్వారా సంభాషిస్తూ తమ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633728

 

భారత రైల్వేశాఖ కోవిడ్‌ సంరక్షణ బోగీల వినియోగం ప్రారంభం; ఐదు రాష్ట్రాల్లో 960 బోగీలను ఏర్పాటు చేసిన రైల్వేశాఖ

కోవిడ్‌-19పై పోరులో తనవంతు చేయూతలో భాగంగా భారత రైల్వేశాఖ తాత్కాలిక సంరక్షణ కేంద్రాలుగా రూపొందించిన బోగీలను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేంద్రాల్లో చేర్చిన వ్యాధిగ్రస్థులకు సంరక్షణ సేవలు ప్రారంభించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య సంరక్షణ సేవలకు తనవంతు తోడ్పాటునందిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 5,231 బోగీలను తాత్కాలిక కోవిడ్‌ సంరక్షణ కేంద్రాలు మార్చి రాష్ట్రాలకు అందజేసింది. వివిధ జోనల్ రైల్వేలు తయారుచేసిన ఈ బోగీ కేంద్రాల్లో అల్ప/స్వల్ప లక్షణాలున్న రోగులకు చికిత్స అందిస్తారు. ఇప్పటిదాకా రైల్వేశాఖ ఐదు రాష్ట్రాల్లో- ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో 960 బోగీలను ఏర్పాటు చేసింది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633448

 

జాతీయ వైద్యవిద్యాబోధన సంస్థల అధిపతులు, ప్రతినిధులనుద్దేశించి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ప్రసంగం

కోవిడ్‌-19 అనంతర కాలంలో అంటువ్యాధుల అధ్యయనం, నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టా సారించనున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ చెప్పారు. తదనుగుణంగా వైద్యవిద్యా బోధన వ్యవస్థ దీన్ని అనుసరిస్తుందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని జాతీయ వైద్యవిద్యా బోధన సంస్థల అధిపతులు, ప్రతినిధులతో నిన్న వాస్తవిక సాదృశ మాధ్యమ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS)- న్యూఢిల్లీ; పీజీఐ-చండీగఢ్‌; రీజినల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)-మణిపూర్, నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (NEIGRIHMS) -షిల్లాంగ్; షేర్-ఎ-కాశ్మీర్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శ్రీనగర్‌లకు చెందినవారు ఇందులో పాల్గొన్నారు. పాశ్చాత్య దేశాల వైద్య నిపుణులతో పోలిస్తే భారత వైద్య సమాజానికి సానుకూలత అధికమని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ అన్నారు. ఆ మేరకు పరిశుభ్రతతోపాటు వ్యాధుల వ్యాప్తి నిరోధం ప్రాతిపదికగా చికిత్స చేసేవిధంగా వైద్యవృత్తి నిర్వహించే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633493

 

దిగ్బంధం సమయంలో భవన-నిర్మాణరంగంలో 2 కోట్లమంది కార్మికులకు రూ.4,957 కోట్ల ఆర్థిక సహాయం

దేశవ్యాప్త దిగ్బంధం నేపథ్యంలో 2020 మార్చి 24 కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ జారీచేసిన సూచనపత్రం ప్రకారం వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు భవన-నిర్మాణ రంగంలోని దాదాపు 2 కోట్లమంది నమోదిత కార్మికులకు రూ.4,957 కోట్లదాకా ఆర్థిక సహాయం అందించాయి. ఆ మేరకు ప్రత్యక్ష లబ్ధిబదిలీ విధానంలో 1.75 కోట్ల లావాదేవీల ద్వారా ఈ సొమ్ము వారి బ్యాంకు ఖాతాలలో నేరుగా జమచేయబడింది. ప్రతి కార్మికుడికీ రూ.1,000 నుంచి రూ.6,000 వరకూ నగదు లబ్ధితోపాటు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వారికి రేషన్‌ సరుకులు కూడా అందించాయి. కాగా, కోవిడ్‌-19 సవాళ్లతో నిండిన దిగ్బంధం సమయంలో కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన శాఖ కార్మికుల అవసరాలకు తగినట్లు సకాలంలో వారి ఖాతాల్లో సొమ్ము జమయ్యేలా సకల చర్యలూ తీసుకుంది.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633619

 

రోగనిరోధక శక్తిని పెంచే మూలికా తేనీరును రూపొందించిన నైప‌ర్, మొహాలీ

కోవిడ్ మ‌హ‌మ్మారిపై పోరాటంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోగ‌ల జాతీయ ఔష‌ధ విద్య‌-ప‌రిశోధ‌న సంస్థ (NIPER)లు ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు, ప‌రిశుభ్రకాలు, మాస్కులు తదిత‌ర ఆవిష్కర‌ణాత్మక ఉత్పత్తుల‌ను త‌యారుచేశాయి. ఇదే క్రమంలో వ్యాధిని ఎదుర్కొన‌గ‌లిగేలా రోగ‌నిరోధ శ‌క్తిని ఇనుమ‌డింప‌జేసే ‘మూలికా తేనీరు’ (హెర్బల్ టీ)ను మొహాలీలోని నైప‌ర్ ప‌రిశోధ‌కులు రూపొందించారు.

మరిన్ని వివరాలకు... https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633689

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతానికి ఇటీవల ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన వ్యక్తులలో కోవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదైనట్లు పాలనాధికారి పేర్కొన్నారు. ఈ మేరకు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల రాక-బస-సంచారంపై పర్యవేక్షణలో ఆరోగ్యశాఖ, పోలీసు అధికారులకు తోడ్పడాలని స్థానిక నివాసుల సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు తదితరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఏ వ్యక్తికైనా వ్యాధి లక్షణం ఏదైనా కనిపించగానే ఆరోగ్యాధికారుల దృష్టికి తేవాలని సూచించారు. అటువంటి ముఖ్యమైన సమాచారం దాచితే వ్యాధి మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
  • పంజాబ్: రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు కోవిడ్‌-19 దుష్ప్రభావం నుంచి మరింత ఉపశమనం దిశగా పంజాబ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, పంజాబ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌తో వారి బకాయిల ఏకకాల పరిష్కార అవకాశాన్ని 2020 డిసెంబర్ 31 వరకు పొడిగించాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ప్రస్తుత కష్టకాలంలో పారిశ్రామివేత్తలకు ఈ విధమైన సహకారం అవసరంమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నార. ఈ చర్యద్వారా ఇప్పటిదాకా నిలిపివేసిన పారిశ్రామిక పెట్టుబడులు-ఆస్తుల విడుదలకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది మార్చి నెలలో దిగ్బంధంవల్ల మూతపడిన పరిశ్రమల పునరుజ్జీవనానికి వాడుకోవచ్చునని తెలిపారు.
  • హర్యానా: దేశవ్యాప్త దిగ్బంధం సమయంలో కరోనా మహమ్మారి సంబంధిత సమాచార ప్రదానానికి హర్యానాలో వివిధ శాఖలు ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి కంట్రోల్‌ రూమ్‌కు 2020 మార్చి 24 నుంచి జూన్ 21దాకా 4,78,369 ఫోన్‌ కాల్స్ రాగా, వీటిలో 4,54,000 కాల్స్‌కు జవాబు ఇవ్వబడింది. ఈ మేరకు సగటు వేచి ఉండాల్సిన సమయం 10 సెకన్లలోపే కాగా, మొత్తంమీద 95 శాతం కాల్స్‌కు విజయవంతంగా సమాధానం ఇవ్వబడింది. అలాగే 31,592 మందికి టెలి-కౌన్సెలింగ్ కూడా లభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో- కోవిడ్‌ మహమ్మారిపై హర్యానా పోరులో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కంట్రోల్‌ రూమ్‌ అత్యుత్తమంగా పనిచేసిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రశసించడం ఈ సందర్భంగా గమనార్హం.
  • హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని డిప్యూటీ కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్లతో ముఖ్యమంత్రి దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కోవిడ్‌ రోగుల గృహనిర్బంధ వైద్య పరిశీలన యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాలని ఆయన సూచించారు. అంతేగాక నిరంతరం అప్రమత్తత వహిస్తూ గృహనిర్బంధ పరిశీలన నుంచి రోగులు అర్ధంతరంగా వెళ్లిపోకుండా నిశిత నిఘా ఉంచాలని చెప్పారు. ఏ సందర్భంలోనైనా ఐఎల్‌ఐ లక్షణాలతో బాధపడేవారి సంఖ్య పెరిగినపుడు పడకల కొరత రాకుండా చూడటం కోసం వ్యవస్థాగత నిర్బంధ సదుపాయాలు పెంచాలన్నారు. రెడ్ జోన్ నగరాలనుంచి వచ్చేవారందర్నీ వ్యవస్థాగత నిర్బంధంలో ఉంచి, 4-5 రోజుల తర్వాత కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆ తర్వాత ప్రతికూల ఫలితం వస్తేనే గృహనిర్బంధానికి అనుమతిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,721 కొత్త కేసుల నమోదుతో మొత్తం రోగులసంఖ్య 1,35,796కు పెరిగింది. కోలుకున్నవారి సంఖ్య 67,706 కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 61,793గా ఉంది. మరోవైపు భారత నావికాదళ ప్రధాన శిక్షణ సంస్థలలో ఒకటైన లోనావాలోని ‘ఐఎన్ఎస్ శివాజీ’లో 8 మంది శిక్షణార్థి నావికులకు కోవిడ్‌ నిర్ధారణ అయింది. వీరి బృందంలో మొత్తం 150 మంది శిక్షణార్థులున్నారు. కాగా, ఈ 8 మందినీ పుణె నగరంలోని వనోవరీలోగల సైనిక ఆస్పత్రికి తరలించారు.
  • గుజరాత్: రాష్ట్రంలో 24 గంటల్లో నమోదైన 563 కొత్త కేసులతో మొత్తం కేసుల సంఖ్య 27,880కి చేరింది. అలాగే 21మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,685కు పెరిగింది.
  • రాజస్థాన్: రాష్ట్రంలో సుమారు 15 రోజుల తర్వాత యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,000 స్థాయిని దాటింది. ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇవాళ 199 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 15,431కి పెరిగింది.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో 175 కొత్త కేసులు నమోదవగా 200 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు ప్రస్తుతం మొత్తం 12,078 కేసులలో యాక్టివ్‌ కేసులు 2,342 మాత్రమే కావడం గమనార్హం.
  • అరుణాచల్ ప్రదేశ్: రాష్ట్రంలోని ప్రస్తుత 126 యాక్టివ్ కేసులలో చాంగ్లాంగ్ నుంచి 74, ఇటానగర్‌లోని రాజధాని భవన ప్రాంగణంలో 20, పశ్చిమ కామెంగ్ జిల్లాలో 12వంతున నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రామాణిక ప్రక్రియ విధివిధానాలను కచ్చితంగా అనుసరిస్తున్నందున రాష్ట్రం ఇంకా గ్రీన్ జోన్‌ విభాగంలో ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది.
  • మణిపూర్: రాష్ట్రంలో ప్రస్తుతం 5000మంది అధికారిక నిర్బంధంలో, మరో 14.000 మంది సామాజిక దిగ్బంధంలో ఉన్నారు. మరో 5500 మంది మణిపూర్‌లో చెల్లింపు నిర్బంధ సదుపాయాల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, మణిపూర్‌లో రోజూ పరీక్షిస్తున్న నమూనాల సంఖ్య 2200కు పెరిగింది. ఈ మేరకు ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 38,000 నమూనాలను పరీక్షించారు.
  • మిజోరం: జోరం వైద్య కళాశాల-ZMC నుంచి మరో ఏడుగురు కోవిడ్‌ రోగులు డిశ్చార్జి అయ్యారు. దీంతో మిజోరంలో కోలుకున్న రోగుల సంఖ్య 19కి చేరగా, ప్రస్తుతం 123 యాక్టివ్‌ కేసులున్నాయి.
  • నాగాలాండ్: రాష్ట్రంలో గత 24 గంటల్లో పరీక్షించిన 312 నమూనాలకుగాను 50 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 330కి చేరగా, వీటిలో 189 యాక్టివ్‌ కేసులున్నాయి. మరోవైపు ఇప్పటిదాకా 141 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
  • సిక్కిం: లద్దాఖ్‌ పరిధిలోని గాల్వన్‌ లోయలో ఇటీవల అమరులైన 20 మంది సైనికులకు జూన్ 25న గాంగ్‌టక్‌లో నివాళి అర్పించే కార్యక్రమం నిర్వహించనున్నారు. “శాల్యూట్‌ టు బ్రేవ్‌ హార్ట్స్‌” పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
  • ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో సోమవారం 46మందికి వ్యాధి నిర్ధారణ కావడంతో మొత్తం రోగుల సంఖ్య 2,302కు పెరిగింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో కరోనా వైరస్‌కు ఇప్పటిదాకా 12 మంది బలయ్యారు.
  • గోవా: రాష్ట్రంలో 46 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 864కు పెరిగింది. వీటిలో ప్రస్తుతం 711 కేసులున్నాయి.
  • కేరళ: రాష్ట్రంలో ఇవాళ మరొకరి మృతితో కేరళలో మరణాల సంఖ్య 23కు పెరిగింది. కాగా, కోళికోడ్‌లో మరణించిన 68 ఏళ్ల వ్యక్తి నమూనాలను కోవిడ్‌ నిర్ధారణ పరీక్షకు పంపారు. ముంబై నుంచి తిరిగి వచ్చి ప్రస్తుతం కన్నూర్‌లో సంస్థాగత నిర్బంధంలో ఉన్న ఒక వ్యక్తికి 24 రోజుల తర్వాత రోగ నిర్ధారణ అయింది. కాగా, వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో సంప్రదించిన తరువాత, విదేశాల నుంచి వచ్చేవారికి కోవిడ్-19 నిర్ధారణకు ట్రూనాట్ పరీక్ష నిర్వహించాలన్న కేరళ అభ్యర్థన ఆచరణ సాధ్యం కానిదంటూ కేంద్రం తిరస్కరించింది. మరోవైపు విదేశాల నుంచి కేరళకు వచ్చే కోవిడ్‌-19 నిర్ధారిత ప్రయాణికుల కోసం ప్రత్యేక విమానం కేటాయించడం అసాధ్యమని కూడా స్పష్టం చేసింది. కాగా, వివిధ దేశాలనుంచి ఇవాళ 2 వేల మందికిపైగా ప్రవాసులు కొచ్చి చేరుకోనున్నారు. రాష్ట్రంలో నాలుగు రోజులుగా కేసుల పెరుగుదల ధోరణి కనిపిస్తున్న నేపథ్యంలో నిన్న 138 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 1,540 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
  • తమిళనాడు: రాష్ట్రంలోని మదురైలో కేసుల పెరుగుదలతో అదనపు పడకలు అవసరం ఏర్పడింది. కాగా, తమిళనాడులో ప్రస్తుత యాక్టివ్‌ కేసుల (452) రీత్యా ఈ జిల్లా 6వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి జూన్ 30 వరకు మదురై, పరిసర ప్రాంతాలలో సంపూర్ణ దిగ్బంధం అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్-19 విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి ఫేస్ షీల్డ్ సమకూర్చడంపై సాధ్యాసాధ్యాల విషయంలో స్పందించాలని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమిళనాడులో నిన్న 2,710 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య 60,000 దాటింది. కాగా, నిన్న  1358మంది కోలుకోగా, 37 మరణాలు కూడా నమోదయ్యాయి. కొత్త కేసులలో చెన్నైనుంచి 1487 నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు: 27178, మరణాలు: 794, చెన్నైలో యాక్టివ్ కేసులు: 18372గా ఉన్నాయి.
  • కర్ణాటక: రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులలో కోవిడ్-19 చికిత్స రేట్లు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం... ఈ చికిత్స సదుపాయాలున్న ఆస్పత్రులలో 50శాతం పడకలు ప్రభుత్వ అధికారులు సూచించిన రోగుల కోసం కేటాయించాల్సి ఉంటుంది. కర్ణాటకలో నిన్న 249 కొత్త కేసులు, 111 డిశ్చార్జెస్, ఐదు మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు: 9399, యాక్టివ్‌: 3523, మరణాలు: 142, డిశ్చార్జి: 5730గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కె.శ్రీనివాస రావుతోపాటు ఆయన వ్యక్తిగత భద్రతాధికారికి జూన్ 22న కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ ఎమ్మెల్యే ఇటీవలే అమెరికానుంచి తిరిగివచ్చి స్వీయ ఏకాంతవాసంలో ఉన్నారు. కాగా, 104 అంబులెన్స్ సేవలద్వారా 90 రోజుల్లోగా అన్ని నివాసాల్లో సమగ్ర తనిఖీ, పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇక కృష్ణా జిల్లా యంత్రాంగం జిల్లాలో కనీసం 2 వేల కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ దిశగా నమూనాల సేకరణ కోసం 10 ఇంటెలిజెంట్ మానిటరింగ్ అనాలిసిస్ సర్వీస్ క్వారంటైన్‌- IMASQ) బస్సులను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2020 పరీక్షల నిర్వహణకు సవరించిన షెడ్యూల్‌ను కమిషన్‌ విడుదల చేసింది, ఈ పరీక్షలు లోగడ దిగ్బంధం కారణంగా వాయిదాపడ్డాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 462 కొత్త కేసులు, 129 డిశ్చార్జ్, ఐదు మరణాలు నమోదయ్యాయి; కొత్తగా నమోదైన 407 కేసులలో 40 ఇతర రాష్ట్రాలనుంచి వచ్చినవారికి సంబంధించినవి కాగా, విదేశాలనుంచి వచ్చినవారిలో 15 మందికి సంబంధించినవి ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం కేసులు: 9834, యాక్టివ్ కేసులు: 5123, డిశ్చార్జ్: 4592, మరణాలు: 119గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల సందర్భంగా సామాన్యులను వాణిజ్యపరంగా దోపిడీ చేయరాదని ప్రైవేట్ ప్రయోగశాలలను ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. కాగా, పాకిస్థాన్‌ నుంచి భారతదేశంలోకి కొత్త మిడుతల దండు ప్రవేశించిన నేపథ్యంలో జూన్ 25న అవి తెలంగాణలో ప్రవేశించే ప్రమాదం ఉందని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో మొత్తం కేసులు 8674, యాక్టివ్‌ కేసులు: 4452, మరణాలు 217, కోలుకున్నవి 4005గా ఉన్నాయి.

 

 

 

 

********

 

 


(Release ID: 1633817) Visitor Counter : 321