ఆర్థిక మంత్రిత్వ శాఖ

పుంజుకున్న ఆర్థిక కార్యక‌లాపాలు- మెరుగుప‌డిన ఆర్థిక సూచిక‌లు


త‌క్కువ న‌ష్టంతో ఆర్ధిక వ్యవ‌స్థను వీలైనంత త్వర‌గా తిరిగి ప‌రుగులు పెట్టించేందుకు స‌కాలంలో విధాన చ‌ర్యలు చేట్టిన ప్రభుత్వం, ఆర్‌.బి.ఐ.

నిర్మాణాత్మక సంస్కర‌ణ‌లు, స‌హాయ సాంఘిక సంక్షేమ చ‌ర్యల ప‌ట్ల ప్రభుత్వానికిగ‌ల నిబ‌ద్ధత ఆర్థిక వ్యవ‌స్థ తిరిగి కొలుకునేందుకు దోహ‌ద‌ప‌డుతుంది

స్టేక్ హోల్డర్ల స‌మ‌ష్టి కృషితో ఆత్మనిర్భర భార‌త్ సంక‌ల్పాన్నిబ‌లోపేతం చేయ‌డం జ‌రుగుతుంది. ఇది బ‌ల‌మైన, శ‌క్తిమంత‌మైన ఆర్థిక వ్యవ‌స్థను పున‌ర్ నిర్మించేందుకు దోహ‌ద‌ప‌డుతుంది

Posted On: 23 JUN 2020 12:00PM by PIB Hyderabad

ప్రజ‌ల ప్రాణాలు కాపాడే త‌క్షణావ‌స‌రాన్ని -జాన్‌హైతో జ‌హాన్ హై’ ని దృష్టిలో పెట్టుకుని -కేంద్ర ప్రభుత్వం దేశంలో కోవిడ్ -19 ప్రారంభ ద‌శ‌లోనే దానిని అదుపు చేసేందుకు 2020 మార్చి 24 నుంచి దేశ‌వ్యాప్త  ప‌టిష్ట‌ లాక్‌డౌన్‌ను అమ‌లుచేసింది. లాక్‌డౌన్ స‌మ‌యంలో దేశంలో ఆరోగ్య‌, ప‌రీక్షల మౌలిక స‌దుపాయాల‌ను పెద్ద ఎత్తున స‌మ‌కూర్చుకునేందుకు కాస్త ఊర‌ట ల‌భించింది.

 

స‌కాలంలో కోవిడ్ వైర‌స్ కేసుల గుర్తింపు, చికిత్స‌, కేసుల సంఖ్యను వెంట‌నే తెలియ‌జేయ‌డం వంటి వాటివ‌ల్ల వ్యాధి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య నిరంత‌రం పెరుగుతూ వ‌స్తున్నది. ప్రస్తుతం దేశంలో చురుకుగా ఉన్న కోవిడ్‌-19 కేసుల సంఖ్య ఇవాల్టికి దేశంలోని మొత్తం కేసుల‌లో 41 శాతం.

 

 లాక్‌డౌన్‌ను ప‌టిష్టంగా అమ‌లుచేయ‌డం, సామాజిక దూరాన్ని పాటించేందుకు తీసుకున్న చ‌ర్యల వ‌ల్ల ఆర్థిక వ్యవ‌స్థపై ప్రతికూల ప్రభావం ప‌డింది. అయితే ప్రజ‌ల ప్రాణాలు, వారి జీవ‌నొపాథిని కాపాడే వ్యూహం, జాన్ బి, జ‌హాన్ భి దిశ‌గా క్రమంగా మారుతూ , ద‌శ‌ల‌వారీగా వ్యాపారాలు, సేవ‌లు పున‌రుద్ధరిస్తూ  మ‌న‌దేశం,  అన్ లాక్ ఇండియా ద‌శ‌లోకి జూన్ 1న అడుగుపెట్టింది. ఆర్థిక  వ్యవ‌స్థ అతితక్కువ న‌ష్టంతో తిరిగి పున‌రుజ్జీవ‌న పొందేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు స‌కాలంలో ,త‌గిన రీతిలో  స్వల్పకాలిక‌, దీర్ఘ‌కాలిక విధాన ప‌ర‌మైన చ‌ర్యలు తీసుకున్నాయి.

 

 భార‌త ఆర్ధిక వ్యవస్థకు ఇప్పటికీ వ్యవ‌సాయ‌రంగం పునాది వంటిది. సాధారణ వ‌ర్షపాతానికి సంబంధించిన వాతావ‌ర‌ణ సూచ‌న‌లు భార‌త ఆర్థిక‌వ్యవ‌స్థ తిరిగి పుంజుకునేందుకు మ‌ద్దతు నివ్వనున్నాయి. జిడిపి కి ఈ రంగం వాటా (ప‌రిశ్రమ‌లు,సేవ‌ల రంగాల‌తో పోల్చిన‌పుడు) భారీగా ఏమీ లేన‌ప్పటికీ ,  వ్య‌సాయం పై ఆధార‌ప‌డిన పెద్ద సంఖ్యలో  జ‌నాభాపై  ఈ రంగం వృద్ది ఎక్కువ సానుకూల ప్రభావం చూపుతుంది. ఇంకా, ఇటీవ‌ల ఈ రంగానికి సంబంధించి ప్రకటించిన సంస్కర‌ణ‌లు , స‌మ‌ర్ధమైన వాల్యూ చెయిన్ నిర్మించ‌డానికి, రైతుల‌కు మెరుగైన రాబడి వ‌చ్చేలా చేయ‌డానికి ఎంత‌గానో దోహ‌ద ప‌డ‌నున్నాయి. భార‌త‌దేశ త‌యారీ రంగం ప‌ట్టుమ‌ని రెండు నెల‌ల్లోనే , వ్యక్తిగత రక్షణ పరికరాల (పిపిఇ) త‌యారీ ప్రపంచంలో అట్టడుగు స్థాయి నుంచి ప్రపంచంలో రెండ‌వ అతిపెద్ద త‌యారీదారుగా అవ‌త‌రించ‌డాన్ని బ‌ట్టి చూస్తే భార‌త త‌యారీ రంగ శ‌క్తిసామ‌ర్ధ్యాలు ఏమిటో తెలుస్తాయి. మే, జూన్ నెల‌ల్లోనే  ఆర్థిక వ్యవ‌స్థ‌ తిరిగి కోలుకుని పుంజుకుంటున్న సూచ‌న‌లు స్పష్టంగా క‌నిపించాయి. వాస్తవ కార్యక‌లాపాల సూచిక‌లైన విద్యుత్తు, ఇంధ‌న వినియోగం, రాష్ట్రాల‌లో అంత‌ర్గతంగా, ఇత‌ర రాష్ట్రాల మ‌ధ్య స‌ర‌కు ర‌వాణా విష‌యంలో , రిటైల్ ఆర్థిక లావాదేవీలలో పురోగ‌మించ‌డం క‌నిపించింది.

 

ఆర్థిక సూచిక‌ల‌లో పురోగ‌తి

వ్యవ‌సాయం:

  • ప్రభుత్వ ఏజెన్సీలు , రైతుల నుంచి గోధుమ‌ల‌ను మున్నెన్నడూ లేనంత గ‌రిష్ఠ స్థాయిలో సేక‌రించాయి. 2020 జూన్ 16 వ తేదీ నాటికి గ‌రిష్ఠస్థాయిలో 382 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌ల‌ను రైతుల‌నుంచి ప్రభుత్వ ఏజెన్సీలు సేక‌రించాయి. 2012-13లో సేక‌రించిన 381.48 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల సేక‌ర‌ణ‌ను అధిగ‌మించి ఇది రికార్డు సృష్టించింది.  కోవిడ్ మ‌హ‌మ్మారి సంక్షోభ ప‌రీక్షా సమ‌యంలో , సామాజిక దూరం ఆంక్షల వంటి వాటి మ‌ధ్య కూడా ఈ రికార్డును సాధించ‌డం జ‌రిగింది. 42 ల‌క్షల మంది రైతులు దీనిద్వారా ప్రయోజ‌నం పొందారు. మొత్తం 73 వేలా 500 కోట్ల రూపాయ‌లను గోధుమ‌ల‌కు క‌నీస మ‌ద్దతు ధ‌ర‌కింద రైతులు పొందారు.

 

  • చిన్నత‌ర‌హా అట‌వీ ఉత్ప‌త్తుల‌(ఎంఎఫ్‌పి) ప్రోక్యూర్‌మెంట్‌కు సంబంధించి, ఎం.ఎఫ్‌.పికి క‌నీస మ‌ద్దతు ధ‌ర (ఎంఎస్‌పి)కింద 16 రాష్ట్రాల‌లో రికార్డు స్థాయిలో ప్రొక్యూర్ మెంట్ జ‌రిగి రూ 79.42 కోట్ల రూపాయ‌ల‌కు చేరుకుంది. కొవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల ఏర్పడిన సంక్షోభ స‌మ‌యంలో ఇది గిరిజ‌నుల‌కు అవ‌స‌ర‌మైన ఊర‌ట నిచ్చింది. కోవిడ్ -19 కార‌ణంగా గిరిజ‌నుల జీవనం, జీవ‌నోపాధి దెబ్బతిన్న ద‌శ‌లో ఇది వారిని ఆదుకుంది.

 

  • 2020 జూన్ 19 నాటికి రైతులు 13.3 మిలియ‌న్ హెక్టార్లలో ఖ‌రీప్ సాగుకు విత్త‌నాలు నాటారు. ఇది గ‌త ఏడాది కంటే 39 శాతం ఎక్కువ‌. అందులోనూ నూనెగింజ‌లు, తృణ‌ధాన్యాలు, ప‌ప్పుధాన్యాలు, ప‌త్తి నాట్లు  గ‌ణ‌నీయంగా పెరిగాయి. ఎరువుల అమ్మకాలు 2020 మేలో అంత‌కు ముందు సంవ‌త్సరంతో పోలిస్తే 98 శాతం (40.02 ల‌క్షల ట‌న్నులు) పెరిగాయి. ఇది వ్యవ‌సాయ‌రంగంలో అద్భుత ప్రగ‌తిని సూచిస్తోంది.

 

   త‌యారీ రంగం:

  • భార‌త‌దేశ‌పు పిఎంఐ త‌యారీ, సేవ‌లు  మే నెల‌లో వ‌రుస‌గా  30.8 ,12.6 శాతం  సంకోచాన్ని సూచించాయి. ఏప్రిల్ లో ఇది ఏప్రిల్ లో వ‌రుస‌గా 27.4,అలాగే 5.4గా ఉంది.

 

  • విద్యుత్ వినియోగం  వృద్ధి రేటులో త‌క్కువ సంకోచాన్ని సూచిస్తూ వ‌చ్చింది. ఏప్రిల్‌లో -24 శాతం ఉండ‌గా, మే నెల‌లో ఇది -15.2 శాతంగా ఉంది. జూన్‌నెల  21 వ తేదీ వ‌ర‌కు ఇది -12.5 శాతంగా ఉంది. జూన్ నెల‌లో విద్యుత్ వినియోగం క్రమంగా మెరుగుప‌డుతూ వ‌చ్చింది. తొలివారంలో సంకోచం -19.8 శాతం ఉండ‌గా రెండొ వారంలో -11.2 శాతం, మూడో వారానికి -6.2 శాతానికి చేరింది.

 

  • దేశంలో మెత్తం అసెస్ చేయ‌ద‌గిన ఈ - వే బిల్లుల విలువ 2020 మే లో 130 శాతం పెరిగి 8.98 ల‌క్షల కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ 2020 తో పోలిస్తే ఇది రూ 3.9 ల‌క్షల కోట్ల రూపాయ‌లు. గ‌త సంవ‌త్సరం కంటే, లాక్‌డౌన్ ముంద‌ర‌కంటే  త‌క్కువ అయిన‌ప్పటికీ ఈ వే బిల్లుల విలువ మే లో పెరిగాయి. జూన్ 1 నుంచి జూన్ 19 వ తేదీ మ‌ద్య త‌యారుచేసిన ఈ-వే బిల్లులు 7.7 ల‌క్షల కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల‌వి. ఇక ఈ నెల పూర్తి కావ‌డానికి  మ‌రో 11 రోజుల వ్యవధి ఉంది.
  • పెట్రోలియం ఉత్పత్తుల వినియోగాన్ని ప‌రిశీలించిన‌ట్టయితే, వినియోగం, త‌యారీ కార్యక‌లాపాల స్థితిగ‌తుల‌కు ప్రధాన సూచిక‌గా దీనిని చెప్పుకుంటారు. ఇది దేశంలో ఏప్రిల్‌లో 47 శాతం అంటే 99,37,000 మెట్రిక్ ట‌న్నులు పెరిగి  మే నెల‌లో  1,46, 46,000 మెట్రిక్ ట‌న్నుల‌కు చేరింది. ప‌లితంగా గ‌త ఏడాది తో పోల్చి చూసిన‌పుడు  పెట్రోలియం ఉత్పత్తుల వినియోగ వృద్ధిలో సంకోచం చాలా త‌క్కువ‌గా ఏప్రిల్ లో -45.7 శాతం ఉండ‌గా,  మే నెల‌లో  -23.2 శాతంగా ఉంది. జూన్ మాసంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో వృద్ది  అంటే అన్ లాక్ 1.0 అమ‌లులోకి వ‌చ్చిన త‌రువాత మ‌రింత ఎక్కువగా ఉండ‌నుంది.

 

 సేవ‌లు:

  • రైల్వే స‌ర‌కు ర‌వాణా  గ‌త ఏడాది స్థాయి కంటే త‌క్కువ‌గా ఉన్పప్పటికీ ,  ఏప్రిల్ లో 6.54 కోట్ల ట‌న్నుల నుంచి  మే నెల‌లో 26 శాతం పెరిగి  8.26 కోట్ల ట‌న్నుల‌కు చేరింది. ఈ పురోగ‌తి జూన్‌లో కూడా కొన‌సాగ‌నుంది. జాతీయ ర‌హ‌దారుల‌పై స‌ర‌కు ర‌వాణాలో వృద్దితోపాటు ఇది పెర‌గ‌నుంది.

 

  • రోజువారీ ఎల‌క్ట్రానిక్ టోల్ చార్జీ వ‌సూలు 2020 ఏప్రిల్‌లో 8.25 కోట్ల రూపాయ‌లు ఉండ‌గా మే నెల‌లో ఇది 36.84 కోట్ల రూపాయల‌కు పుంజుకుంది. జూన్ నెల మొద‌టి మూడు వారాల‌లో ఇది నాలుగురెట్లకు పైగా పెరిగింది. ఇది మ‌రింత పెరిగి రూ 49.8 కోట్లకు పెరిగింది.

 

  • మొత్తం డిజిట‌ల్ రిటైల్ ఫైనాన్షియ‌ల్ లావాదేవీలు ఎన్‌పిసిఐ ప్లాట్‌ఫారం ద్వారా గ‌ణ‌నీయంగా పెరిగాయి. ఇవి ఏప్రిల్ లో 6.71 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల నుంచి మే నెల‌లో 9.65 ల‌క్షల కోట్ల రూపాయ‌ల‌కు పెరిగాయి. ఈ ధోర‌ణి జూన్‌లో కూడా కొన‌సాగి వాస్తవ కార్యకాల‌పాలు మ‌రింత పుంజుకోనున్నాయి.

ద్రవ్యసూచిక‌లు:

  • త‌గినంత‌గా లిక్విడిటీ ఉండేలా చూసేందుకు ఆర్‌బిఐ చేస్తున్న కృషి ఫ‌లితంగా ప్రైవేట్ ప్లేస్‌మెంట్ కార్పొరేట్ బాండ్లు గ‌త ఏడాదితో పోల్చిన‌పుడు మేలో 94.1 శాతం గ‌ణ‌నీయ వృద్ధిని సాధించాయి (రూ0.84 ల‌క్షల కోట్లు) .ఏప్రిల్‌లో 22 శాతం కాంట్రాక్ష‌న్ తో ఇది  రూ 0.54 ల‌క్షల కోట్లు . జూన్‌ నెల‌లో వ్యవ‌స్థలో అధిక లిక్విడిటీ ఉండ‌నున్నందున ఇంకా ఎక్కువ ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌కు అవ‌కాశం ఉంది.

 

  • మ్యూచువ‌ల్ ఫండ్‌ల అసెట్స్ అండర్ మేనేజ్ మెంట్ (ఎయుఎం) స‌గ‌టు 3.2 శాతం పెరిగి మే నెల‌లో  రూ 24.2 ల‌క్షల కోట్లకు చేరింది.2020 ఏప్రిల్ లో ఇది 23.5 ల‌క్షల కోట్లు మాత్రమే ఉంది. గ‌త ఏడాది గ‌ణాంకాల‌తో పోల్చిన‌పుడు సూచిక‌లో సంకోచం ఏప్రిల్ లో  -6.9 శాతం నుంచి, మే నెల‌లో -4.5 శాతానికి ప‌డిపోయింది.

 

  • 2020 జూన్ 12 నాటికి దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 507.6 బిలియ‌న్ అమెరిక‌న్‌ డాల‌ర్లకు చేరుకున్నాయి. గ‌ణ‌నీయ‌మైన స్థాయిలో ఎఫ్‌డిఐలు పోర్టుఫోలియో స‌ర‌ఫ‌రా, త‌క్కువ చ‌మురు ధ‌ర‌ల వంటివి అంత‌ర్జాతీయ ఒడుదుడుకుల‌ను త‌ట్టుకోవ‌డానికి ఎంతో కీల‌క‌మైన‌వి.  2019-20 ఆర్ధిక సంవత్సరంలో త‌ర‌లి వ‌చ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబ‌డులు 73.45 బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లు. ఇది గ‌త ఆర్థిక సంవ‌త్సరం కంటే 18.5 శాతం పెరుగుద‌ల‌ను సూచించింది.

 

నిర్మాణాత్మక సంస్కర‌ణ‌ల‌కు, స‌హాయ సాంఘిక సంక్షేమ చ‌ర్యల ప‌ట్ల ప్రభుత్వ చిత్తశుధ్ది ఆర్థిక వ్యవ‌స్థ కోలుకుని వేగ‌వంతం కావ‌డానికి ఉప‌క‌రిస్తుంది. భాగ‌స్వాములంద‌రి స‌మ‌ష్టి కృషితో ఆత్మనిర్భ‌ర భార‌త్ సంక‌ల్పాన్నిబ‌లోపేతం చేయ‌డం జ‌రుగుతుంది. ఇది  బ‌ల‌మైన, శ‌క్తిమంత‌మైన ఆర్థిక వ్యవ‌స్థను పున‌ర్ నిర్మించేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.

*****


(Release ID: 1633717) Visitor Counter : 371