ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం


ప్రతి లక్ష జనాభాలో కోవిడ్ మరణాలు ప్రపంచంలో భారత్ లోనే అత్యల్పం

Posted On: 23 JUN 2020 1:50PM by PIB Hyderabad

జూన్ 22న ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి లక్షమంది జనాభాకూ నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య బాగా తక్కువగా ఉంది. ప్రతి లక్ష మంది జనాభాలో భారత్ లో మరణాలు1.00 గా నమోదు కాగా ప్రపంచ సగటు దానికి ఆరు రెట్లు ఎక్కువగా  6.04 గా నమోదైంది. యుకె లో లక్ష జనాభాకు 63.13 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. స్పెయిన్ లో 60.60, ఇటలీలో 57.19, అమెరికాలో 36.30 చొప్పున నమోదయ్యాయి.


ఇలా భారత్ లో కోవిడ్ మరణాలు తక్కువగా ఉండటానికి కారణం ఇక్కడ తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు, గుర్తించటానికి పరీక్షలు జరపటం, చికిత్స చేయటం, నివారించటంలో  కేంద్ర ప్రభుత్వంతోబాటు రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించిన సానుకూల విధానమే కారణం. 
కోవిడ్-19  నుంచి కోలుకుంటున్నవారి శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది.  బాధితులలో కోలుకున్నవారి శాతం 56.38% % కు చేరింది.  ఇప్పటివరకు 2,48,189 మంది పూర్తిగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 10,994 మంది కోవిడ్-19  బాధితులు  కోలుకున్నారు.

ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,78,014. వీరందరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

 ప్రభుత్వ లేబరేటరీల సంఖ్య ఇప్పుడు  726 కి  చేరుకోగా ప్రైవేట్ లాబ్స్ సంఖ్య 266  కి పెరిగింది. దీంతో మొత్తం లాబ్స్ సంఖ్య 992 అయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్ : 553  (ప్రభుత్వ: 357  + ప్రైవేట్:  196)
ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 361 (ప్రభుత్వ: 341 + ప్రైవేట్: 20)
సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 78  (ప్రభుత్వ: 28 + ప్రైవేట్: 50)
గడిచిన  24 గంటల్లో 1,87,223 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తం పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 71,37,716 కు చేరింది
కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి.
కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు.


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf  చూడండి

 

****


(Release ID: 1633677) Visitor Counter : 222