సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జాతీయ వైద్య విద్యా బోధనా సంస్థల అధిపతులు మరియు ప్రతినిధుల వాస్తవిక సమావేశంలో ప్రసంగించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 22 JUN 2020 8:27PM by PIB Hyderabad

ప్రపంచ మహమ్మారి కోవిద్-19 శకం తరువాత అంటు వ్యాధుల అధ్యయనం మరియు  నిర్వహణపై దృష్టిని మారితే కేంద్రకరించడం జరుగుతుందని, తదనుగుణంగా వైద్య విద్య  పాఠ్యాంశాలను రూపాంతరించుకోవలసిన అవసరం ఉంటుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోమవారం ఇక్కడ చెప్పారు.  


 

అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) న్యూ ఢిల్లీ,  పి జి ఐ, చండీగఢ్,  రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) మణిపూర్,  నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (ఎన్ఈఐజిఆర్ఐహెచ్ఎంఎస్),  షిల్లాంగ్ మరియు  షేర్ - ఎ - కాశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్ కె ఐ ఎం ఎస్),  శ్రీనగర్ తదితర జాతీయ వైద్య విద్యా బోధనా సంస్థల అధిపతులు మరియు ప్రతినిధుల చాక్షుష సమావేశంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు.
  సమావేశంలో ప్రతిపాదనలు సమర్పించిన వారిలో పి జి ఐ, చండీగఢ్ నుంచి డాక్టర్ జగత్ రామ్,  ఎయిమ్స్ నుంచి డాక్టర్ శక్తి కపూర్,   షిల్లాంగ్ సంస్థ నుంచి డాక్టర్ పి.  భట్టాచార్య,  మణిపూర్ రిమ్స్ నుంచి డాక్టర్ ఎ.  శాంతా సింగ్,  ఎస్ కె ఐ ఎం ఎస్ నుంచి డాక్టర్ ఎ. జి. అహంగర్ మరియు  జమ్మూ జి ఎం సి నుంచి డాక్టర్ నసీబ్ చంద్ దిగ్రా  ఉన్నారు.  

స్వాతంత్య్రం రాక మునుపు  మరియు  స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిరోజుల్లో  ఇండియాలో వైద్య విద్యలో  రోగ చికిత్సా సంబంధ పాఠ్యాంశాలు  ప్రధానంగా  అంటువ్యాధులను గురించి ఉండేవని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  గతంలో  ఇండియా ఉష్ణమండల దేశం కావడం వల్ల పశ్చిమ దేశాలకు చెందిన వైద్య విద్యార్థులను ఉష్ణమండల ప్రాంత వ్యాధులపై మలిదశ శిక్షణ (ఇంటర్న్ షిప్) కోసం ఇక్కడికి పంపేవారు.   ఈ వ్యాధులు అక్కడ అరుదుగా వచ్చేవి.  క్షయ,  కుష్ఠు మరియు లైంగిక వ్యాధులను గురించి పరిశోధనకు    పాశ్చాత్య దేశాలకు చెందిన పరిశోధకులు  ఇండియాకు వచ్చేవారని ఆయన గుర్తుతెచ్చుకున్నారు.  

అయితే గడచిన మూడు  దశాబ్దాలలో  దేశంలో వ్యాధుల తీరు మారిపోయిందని,   అంటువ్యాధుల స్థానంలో ఇతర వ్యాధుల వ్యాప్తి పెరిగిందని,  తదనుగుణంగా వైద్య విద్యా బోధన కూడా ఎక్కువగా మధుమేహం, హృద్రోగం  మొదలైన  జీవన వ్యాపార సంబంధ వ్యాధులను గురించి చెప్పడంపై దృష్టిని కేంద్రీకరిస్తున్నారని,  దానికి తోడు మెరుగైన సూక్ష్మ జీవి నాశక మందుల తయారీ పెరగడంతో అంటు వ్యాధులు వెనకపట్టు పట్టాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.   ఇప్పుడు కోవిడ్ రాకతో మొత్తం ప్రపంచం ముఖ్యంగా వైద్య సమాజం అకస్మాత్తుగా మేల్కొందని,  అంటువ్యాధుల శకం ముగిసిపోలేదని గ్రహించారని ఆయన అన్నారు.  

పాశ్చాత్య దేశాలకు చెందిన వైద్యులతో పోల్చినప్పుడు మన వైద్యులు అనుకూలమైన స్థితిలో ఉన్నారని,  ఎందుకంటే మన దేశంలో  పరిశుభ్రత మరియు వ్యాధి సంక్రమణం ఆధారంగా ఔషధ నిర్ణయం జరుగుతుంది.   అందువల్ల కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సత్వర  చికిత్సను, నిర్వహణా విధానాలను  రూపొందించుకోవడంలో మన వైద్యులు ముందున్నారని ఆయన అన్నారు.  


 

వైద్య విద్య పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రత్యేక అంశాల గురించి నొక్కి చెప్పవలసిన బాధ్యత  దేశంలోని  అగ్రగామి విద్యా సంస్థలకు ఉందని,   ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 400 వైద్య కళాశాలల్లో బోధించే అధ్యాపకులకు శిక్షణ ఇచ్చే గౌరవం వాటికి దక్కుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.    మనం కరోనా వైరస్ నుంచి బయట పడవచ్చు.   అయితే  మనం ఎదుర్కోవలసిన చివరి వైరస్ ఇది కాకపోవచ్చునని ఆయన అన్నారు.  
 
న్యూ  ఢిల్లీకి చెందిన ఎయిమ్స్  మరియు చండీగఢ్ కు చెందిన పి జి ఐ సంస్థ ఈ విషయంలో ఆది నుంచి వైద్యుల  శిక్షణలో ముందున్నాయి.  ఇక ముందు కూడా వైద్య విద్యా బోధనలో కొత్త విధానాలు మరియు వైద్య చికిత్సా నిర్వహణలో కొత్త ఒడంబడికలు ఈ సంస్థల నుంచి ఉత్పన్నమవుతాయనే ఆశాభావాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యక్తం చేశారు.  



 

<><><><><>


(Release ID: 1633493) Visitor Counter : 230